Department of Veterinary Affairs
-
పశుసంవర్థక శాఖతో వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక, మత్స్య, డెయిరీ అనుబంధ రంగాల్లో రాష్ట్రం అంతకంతకు అభివృద్ధి చెందుతూ వేల కోట్ల సంపద సృష్టిస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఐదేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మాక మార్పులు, అభివృద్ధిపై 2018–19 వార్షిక నివేదికను శుక్రవారం ఆయన విడుదల చేశారు. గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు, ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై పాడి పశువుల పంపిణీ.. ఇలా కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రతి తెలంగాణ బిడ్డను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలన్నదే మా లక్ష్యమని అన్నారు. వేసవి పూర్తవగానే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలవుతుందని చెప్పారు. విజయ డెయిరీ నెయ్యి అన్ని దేవాలయాలకు సరఫరా చేస్తామని, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ విజయ డెయిరీ వాటర్ బాటిళ్లను వాడేలా ఆదేశాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్ద ఉందన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి నీల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు ఆచరించేలా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు మంజువాణీ, లక్ష్మారెడ్డి, రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. వార్షిక నివేదికలోని కొన్ని అంశాలు.. - గొర్రెల అభివృద్ధి పథకం కోసం 84 లక్షల గొర్రెలను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పథకం కింద 3.65 లక్షల మంది లబ్ధిదారులకు 3.65 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. వాటికి పుట్టిన గొర్రె పిల్లల (70.88 లక్షలు) ద్వారా రూ.3,189.60 కోట్ల ఆదాయం చేకూరింది. అలాగే ఈ జీవాల ద్వారా 38,182 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. - పశు గణ రంగం 2018–19లో రాష్ట్ర స్థూల ఆదాయానికి రు.55,394 కోట్లతో రాష్ట్ర స్థూలఉత్పత్తికి 7% సమకూర్చింది. - 100 సంచార పశు వైద్య శాల ద్వారా రైతు ఇంటి ముంగిటనే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం. దేశంలో గాలి కుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తొలిసారి ప్రకటించారు. - రాష్ట్రంలో గోపాలమిత్రలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రస్తుత జీవనోపాధి భత్యాన్ని ప్రతినెల రూ.3,500 నుంచి రూ.8,500లకు పెంచింది. - రాష్ట్రంలో పశువులు, గొర్రెలు, కోళ్ల సంఖ్య అధికంగా ఉంది. దేశంలోని పశు సంపదలో తెలంగాణ వాటా 6.51 శాతంగా ఉంది. దేశ గణాంకాలతో పోలిస్తే, తెలంగాణ కోడిగుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, చేపల ఉత్పత్తిలో 8వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. - రాష్ట్రంలో రోజూ 12,170 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. తలసరి నెలవారీ వాడకం 4.6 లీటర్లతోను, తలసరి లభ్యత రోజుకు 300 గ్రాములతోను, జాతీయ సగటు లభ్యతతో పోలిస్తే రోజుకు 355 గ్రాములతో కాస్త వెనుకంజలో ఉంది. - తెలంగాణ విజయ డెయిరీ రోజుకు 3.92 లక్షల లీటర్ల పాలసేకరణ, 3.20 లీటర్ల పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తోంది. - రాష్ట్రంలో 2.13 లక్షల పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.1,677.11 కోట్లు అంచనా ప్రాజెక్టు వ్యయంతో సహకార డెయిరీల ద్వారా పాడి పశువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2018–19లో ఈ పథకం కింద 57,538 పశువులను పంపిణీ చేశారు. విజయ తెలంగాణ ప్యాక్డ్ తాగునీరును అందుబాటులోకి తీసుకువచ్చారు. - మత్స్యకారుల సమగ్రాభివృద్ధికై రూ.1,000 కోట్లతో ప్రభుత్వము సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. ఈ పథకం కింద 2018–19లో 2,46,648 మత్స్యకారులు లబ్ధి పొందారు. - వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ పథకం కింద గతేడాది 49.15 కోట్ల చేప పిల్లలను 10,776 జల వనరులలో, 3.19 కోట్ల రొయ్య పిల్లలను 24 జలాశయాలలో విడుదల చేశారు. ఫలితంగా గతంతో పోలిస్తే 13% ఉత్పత్తి పెరిగింది. - రాష్ట్రంలో 27.14 లక్షల మంది మొత్తం మత్స్యకారుల జనాభా వుండగా అందులో 3.04 లక్షల మంది క్రియాశీలక మత్స్యకారులు నమోదయ్యారు. -
చేప పిల్లల పంపిణీపై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 21,189 జల వనరులలో 80.69 కోట్ల చేప పిల్లల విడుదలకు ఆమోదం తెలిపే ఫైలుపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టా రు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ఇతర మంత్రుల సమక్షంలో కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. కృత్రిమ పద్ధతి ద్వారా వీర్య సరఫరా చేసి లేగదూడలను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రూ.47.50 కోట్లతో కరీంనగర్లో ఏర్పా టు చేయనున్న ప్రాజెక్టు అనుమతుల ఫైలుపై రెండో సంతకం చేశారు. ఇక రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో ఆధునీకరణ, పరికరాలను సమకూర్చేందుకు సంబంధించి రూ. 12.18 కోట్ల ప్రతి పాదనలకు ఆమోదం తెలిపే ఫైలుపై మూడో సంతకం చేశారు. కాగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో మంత్రికి సచివాలయంలో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం 10.52కి మంత్రి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా తలసానికి హోంమం త్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు అభినందనలు తెలిపారు. విజయ డ్రింకింగ్ వాటర్‌కు శ్రీకారం విజయ డెయిరీ నూతన ఉత్పత్తులు, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్, దూద్ పేడ నూతన ప్యాకింగ్, పెట్ జార్లలో నెయ్యి ప్యాకింగ్‌లను తలసాని ఆవిష్కరించారు. పశు ఆరోగ్య కార్డులను విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక, మత్స్య శాఖల కు రూ. వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు తలసాని తెలిపారు. రానున్న రోజుల్లో విజయ డెయిరీ నంబర్‌వన్ స్థానంలో నిలవడం ఖాయ మన్నారు. అనంతరం విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయదారులు నలుగురికి బెస్ట్ వెండర్ అవార్డులను మంత్రి అందజేశారు. -
‘ఫిబ్రవరి 15లోగా పశుగణన పూర్తి చేయండి’
సాక్షి, హైదరాబాద్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 20వ పశుగణనను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పశుసంవర్థక శాఖ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 శాతం పశుగణన పూర్తి అయిందని తెలిపారు. రాష్ట్రంలోని పశువైద్యశాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గొర్రెల నట్టల నివారణ మూడో విడత కార్యక్రమం ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ సంచాలకులు డా.వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి డా.మంజువాణి తదితరులు పాల్గొన్నారు. -
పది రోజుల్లో 459 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: పది రోజుల్లో 459 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. పశువైద్యశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పన కోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాల ని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో సంచార పశువైద్యశాలల నిర్వహణపై పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జీవీకే ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంచార పశువైద్యశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.83 లక్షల తో కొత్తగా 20 మంది ఆపరేటర్లను నియమిస్తున్నా మన్నారు. 1962 టోల్‌ఫ్రీ నంబర్‌తో సంచార పశు వైద్యశాలల ద్వారా జీవాల వైద్యసేవల కోసం 10 మంది ఆపరేటర్లను నియమించుకున్నామని, దీని ద్వారా ప్రతిరోజూ 1,400 కాల్స్ వస్తున్నాయని, ఇందులో 500 ఫిర్యాదులపై స్పందించి అవసరమైన జీవాలకు వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ సేవలు పెంపు 20 మంది ఆపరేటర్ల సేవలను వచ్చే నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సామర్థ్యం పెంపుతో నిత్యం 5 వేల కాల్స్‌ను తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం 1962 సేవలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అందిస్తున్నామని, వీటిని ఉదయం 7కి ప్రారంభించి సాయం త్రం 5 వరకు కొనసాగించాలని ఆదేశించినట్టు తెలిపారు. 1962 వ్యవస్థను నిత్యం పర్యవేక్షించేందుకు తమ కార్యాలయంతో పాటు పశుసంవర్థకశాఖ కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నలుగురు సిబ్బందిని నియమించి ఒక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించానన్నారు. 100 సంచార పశువైద్యశాలలకు అదనంగా మరో 100 వాహనాల కొనుగోలుకు బడ్జెట్ కేటా యించాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. -
నో స్టాక్!
►అధికార యంత్రాంగానికి గొర్రెల కష్టం ►దావణగిరె, చిత్రదుర్గలోనూ చుక్కెదురు ►ఇప్పటివరకు పంపిణీ చేసింది 72 యూనిట్లే ►జీవాల ధరలకు రెక్కలు.. పెంపకందార్ల అనాసక్తి ►గొర్రెల పరిణామంపైనా పెదవివిరుపు కర్ణాటకబాట పట్టినా గొర్రెల జాడ మాత్రం కనిపించడంలేదు. ప్రతి రోజు సగటున 101 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యంత్రాంగం జీవాల లభ్యత లేక చేతులెత్తేసింది. ఇప్పటివరకు కేవలం 72 యూనిట్లను మాత్రమే పంపిణీ చేయగలిగింది. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అధికార యంత్రాంగానికి గుదిబండగా పరిణమించింది. ఇబ్బడిముబ్బడిగా నమోదైన సభ్యులకు.. లభిస్తున్న గొర్రెల సంఖ్యకు పొంతన కుదరకపోవడం ఈ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత నెల 20వ తేదీన గొర్రెల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు 150 యూనిట్లను మాత్రమే సేకరించగలిగింది. జిల్లాకు కేటాయించిన గొర్రెలను కర్ణాటక రాష్ట్రం దావణగిరె, చిత్రదుర్గ జిల్లాల్లో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. స్థానికంగా కొంటే అక్రమాలు జరిగే ఆస్కారముందని భావించిన సర్కారు ఈ ఆలోచన చేసింది.ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించిన పశుసంవర్థకశాఖ.. గొర్రెల లభ్యతను అధ్యయనం చేసింది. ఇందుకనుగుణంగా గొర్రెల కొనేందుకు ఆయా జిల్లాల్లోని సంతలకు వెలుతున్న అధికారులకు నిరాశే మిగులుతోంది. ఇక్కడితో పోలిస్తే ధరలు రెట్టింపు కావడం.. నిర్దేశిత షీప్ల పరిణామంలో తేడా ఉండడంలో గొర్రెల పెంపకందారులు ఆసక్తి చూపడంలేదు. దీంతో సుదూర ప్రాంతంలో గొర్రెల కోసం గాలించినా ఫలితం కనిపించడంలేదు. మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి జీవాలు కొనుగోలు చేయడం కన్నా.. సమీప ప్రాంతాల్లోనే కొనడం మంచిదనే అభిప్రాయం గొల్ల, కుర్మ, యాదవ సామాజికవర్గం నుంచి వ్యక్తమవుతోంది. కష్టమే సుమా! జిల్లావ్యాప్తంగా 368 సొసైటీలు రిజిష్టర్ కాగా, ఇందులో 45,163 మంది సభ్యులుగా నమోదయ్యారు. వీరిలో ఈ ఏడాది 22,581 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సివుంది. అంటే సగటున రోజుకు 101 మంది చొప్పున ఆరు నెలలపాటు పంపిణీక్రతువు కొనసాగాలి. ఈ పథకం ప్రారంభించి పదిరోజులు కావస్తున్నా పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 72 మందికే యూనిట్లను పంపిణీ చేశారు. మరో 24 యూనిట్లు జిల్లాకు చేరుకోగా.. మరో 54 యూనిట్లు మార్గమధ్యంలో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. -
మత్స్య సమాఖ్యకు రూ.వెయ్యి కోట్లు
అంగీకారం తెలిపిన ఎన్సీడీసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్యకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) రూ.వెయ్యి కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేర కు రాష్ట్ర పశుసంవర్థక శాఖకు లేఖ రాసింది. దీంతో రుణం విడుదలకు అవసరమయ్యే గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో రూ.600 కోట్లు ఎన్సీడీసీ రుణం కాగా, రూ.200కోట్లు కేంద్ర సబ్సిడీ, రూ. 200 కోట్లు లబ్ధిదారుల వాటా. అయితే సబ్సిడీ రూ.200 కోట్లు రాకుంటే దీనిని కూడా రుణ రూపంలోనే తీసుకోవాల ని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్సీడీసీ నుంచి మంజూరైన రుణం నుంచి చేపల విక్రయానికి సొసైటీ సభ్యత్వం కలిగిన మత్స్యకారులకు మోపెడ్లు, ఆటోట్రాలీలు, హైజెనిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను 75శాతం సబ్సిడీ పై ఇవ్వనున్నారు. ఇందుకు రూ.320 కోట్లు కేటాయించనున్నట్లు ఎన్సీడీసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఉంది. అలాగే మత్స్య సంపద పెం చేందుకు నీటి వనరుల అభివృద్ధి, చేప విత్తన క్షేత్రాలు, చేపల ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్సీడీసీ రుణంలో కేటాయింపులు చేశా రు. ముఖ్యంగా మత్స్య సంఘాలకు రాష్ట్రవ్యాప్తంగా 250 రిటైల్ చేపల మార్కెట్ల నిర్మాణానికి రూ.25కోట్లు, 30 జిల్లాల్లో హోల్‌సేల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.60 కోట్లు ఇవ్వనున్నారు. 10 చేపవిత్తన క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు వెచ్చిస్తారు. వంద శాతం సబ్సిడీపై సొసైటీల ఆధ్వర్యంలో చేప విత్తనాలకు, రొయ్య పిల్లల పెంపకానికి రూ.98 కోట్లు, జిల్లా యూనియన్ల ద్వారా 30 రిజర్వాయర్ల సమగ్ర అభివృద్ధికి రూ. 60 కోట్లు ఇవ్వనున్నారు. చేపలు పట్టేందుకు అవసరమైన తెప్పలు, వలల కోసం రూ.82 కోట్లు, 50 ఐస్ ప్లాంట్లకు రూ.12.50 కోట్లు కేటాయిస్తారు.