పాడి రైతులకు డెబిట్ కార్డులు
• ‘విజయ డెయిరీ’కి పాలు పోసే రైతులకు వెసులుబాటు
• పశు సంవర్థక శాఖ నిర్ణయం... త్వరలో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ డెబిట్‌కార్డులు ఇప్పిం చాలని పశు సంవర్థక శాఖ నిర్ణరుుంచింది. సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చించి త్వరలో కార్డులను రైతులకు అందజేస్తారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ రైతులకు చెల్లించే సొమ్మును ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాల్లో జమ చేయాలని డెరుురీ ఇటీ వలే నిర్ణరుుంచి ఏర్పాట్లు కూడా చేసింది. పాడి రైతులందరికీ ‘జీరో బ్యాలెన్‌స’ కింద బ్యాంకు ఖాతాలున్నా వారికి డెబిట్ కార్డులు ఇవ్వలేదు. ప్రత్యేక అంశంగా పరిగణించి జీరో బ్యాలెన్‌సలోనే డెబిట్‌కార్డులు ఇవ్వాలని బ్యాంకులను పశు సంవర్థక శాఖ కోరనుంది.
తెలంగాణలో విజయడెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు దాదాపు 5 లక్షల లీటర్ల పాలు పోస్తుంటాన్నారు. అందుకోసం డెరుురీ ఏడాదికి రూ.350 కోట్లు రైతులకు చెల్లిస్తోంది. లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తోంది. దాని ప్రకారం ఏడాదికి రూ.72 కోట్లు ఇస్తున్నారు. 15 రోజులకోసారి పాడి రైతు ఖాతాలకు సొమ్ము ను విడుదల చేస్తారు. సొమ్మును రైతులు డెబిట్‌కార్డుల ద్వారా ఏటీఎం నుంచి తెచ్చు కోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ సరుకులు కొనుక్కోవచ్చు.
చేపల మార్కెట్లకు స్వైపింగ్ మిషన్లు
హైదరాబాద్‌లో చేపల మార్కెట్లపై పెద్ద నోట్ల ప్రభావం పడింది. దీంతో ఆయా మార్కెట్లు వ్యాపారం లేక కుదేలయ్యారుు. 4 సహకార చేపల కేంద్రాలు, ఆరు మొబైల్ చేపల మార్కెట్లలో విక్రయాలు పెద్దఎత్తున నిలిచిపోయారుు. చిల్లర సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ స్వైపింగ్ మిషన్లు ఇవ్వాలని నిర్ణరుుంచినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు పేర్కొన్నారుు. స్వైపింగ్ మిషన్లకు ఆర్డర్ ఇచ్చామని, రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొంటున్నారు.