Dairy farmer
-
మేయని ఆవుకు హోమియో చికిత్స
ఈ ఆవు కడపలోని ఒక హోటల్ యజమానిది. ఆ యజమాని ప్రతి రోజూపోషక విలువలు గల మేతతో పాటు కూరగాయలు, దాణా కూడా మేపే వారు. అయితే, ఒక రోజు ఆవు మేత తినటం మానేసింది. నీళ్లు కూడా తక్కువగా తాగుతున్నదని పశువుల ఆసుపత్రికి తోలుకొచ్చారు. మేం రోగ నిర్ధారణ పరీక్షలు చేశాం. లోపల పెద్దపొట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నది? పొట్టలోని ద్రావణం పి.హెచ్. ఏ స్థాయిలో ఉంది? పొట్టలో సూక్ష్మజీవులు ఉత్తేజిత స్థాయిలో ఉన్నాయా లేవా? ఈ పరీక్షలు చేశాం. పొట్ట కదలికలు, పిహెచ్, సూక్ష్మజీవులు అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో కాలేయ సంబంధిత టానిక్‌లు, ఇంజెక్షన్లు, ఆయుర్వేదిక్ పొడులతో పొట్టకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేశాం. పది రోజులైనా మార్పులేదు. ఆ పది రోజులు కేవలం నార్మల్ సెలైన్ బాటిల్‌తోనే బతికిందని చెప్పవచ్చు. అల్లోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేసినా మార్పు లేదు కదా.. హోమియోపతి మందులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని ఆలోచన వచ్చింది. నక్స్ వామికా 200, రూస్టాక్స్ 200 గుళికల మందులు రోజుకు 3 సార్లు చొప్పున మూడు రోజులు ఇచ్చాం. వీటిని దాణాలో కలిపి పెట్టొచ్చు లేదా నేరుగా పశువు పెదానికి, దంతాలకు మధ్యలో హోమియో గుళికలు వేస్తే చాలు. ఈ మందులు వేసిన రెండో రోజే ఆవు మేత మేయటం మొదలు పెట్టిందని ఆవు యజమాని ఆశ్చర్యపడుతూ ఆసుపత్రికి వచ్చి మాతో చెప్పారు. పది రోజులు దాదాపుగా రూ. 2 వేలు ఖర్చు చేసినా రాని ఫలితం రూ. 30ల హోమియోపతి మందులతో రావటం సంతృప్తిని కలిగించింది. పశువైద్యంలో అల్లోపతి, ఆయుర్వేదిక్ ఔషధాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. తక్కువ ఖర్చుతో పశువులకు మంచి చికిత్స, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, అందించవచ్చని మాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. పాడి రైతులకు తెలియజేస్తున్న విషయమేమిటంటే ప్రథమ చికిత్సగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద, హోమియోపతి చికిత్సలు చేయటం నేర్చుకోవటం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా పశువైద్యులను సంప్రదించి అల్లోపతి చికిత్సలు తీసుకోవచ్చు. – డాక్టర్. జి.రాంబాబు (94945 88885),పశువైధ్యాధికారి, కడప -
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
‘పాల వెల్లువ’కు కేంద్రం ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ(జేవీపీ) పథకానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. జేవీపీ ప్రాజెక్టు ఆలోచన అద్భుతమని కేంద్రం ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఏపీలో పాడి రైతులకు దేశంలోనే అత్యధిక పాలసేకరణ ధరలు దక్కుతున్నాయని పేర్కొంది. ఏపీని బెంచ్ మార్క్‌గా తీసుకొని పాడి రైతులకు గరిష్ట ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించింది. పశు సంవర్ధక, డెయిరీ రంగాలపై కేరళలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సదస్సులో జేవీపీ ప్రాజెక్టుపై ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు, పశుసంవర్ధక శాఖ డైరక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్‌తో కలసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. – సాక్షి, అమరావతి పాడి రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం: అహ్మద్ బాబు సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడం, పాడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 డిసెంబర్లో జగనన్న పాలవెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. గ్రామస్థాయిలో మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా లీటర్‌కు రూ.10 నుంచి 20 వరకు పాడి రైతులకు అదనపు లబ్ధి చేకూరుతోంది. మూడు జిల్లాలతో ప్రారంభమై ప్రస్తుతం 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలతో మొదలై 3,775 గ్రామాలకు విస్తరించింది. 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమంలో నేడు 3.61లక్షల మంది భాగస్వాములయ్యారు. రోజూ 85 వేల మంది సగటున 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. మూడేళ్లలో పాల సేకరణ ధరలను ఎనిమిది సార్లు పెంచారు. గేదె పాల ధర లీటర్‌కు రూ.71.74 నుంచి రూ.89.76కు, ఆవుపాల ధర లీటర్‌కు రూ.34.20 నుంచి రూ.43.69కు పెంచారు. ఫ్యాట్ శాతాన్ని బట్టి లీటర్ గేదెపాలకు రూ.103, లీటర్ ఆవుపాలకు రూ.54కు పైగా పాడి రైతులకు ధర లభిస్తోంది. 10 రోజులకు నేరుగా వారి ఖాతాలకు చెల్లింపులు చేస్తున్నాం. ఇప్పటి వరకు జేవీపీ కింద 9.98 కోట్ల లీటర్ల పాలు సేకరించగా రూ.446.93 కోట్లు చెల్లించాం. ప్రైవేటు డెయిరీలు అమూల్‌తో పోటీపడి పాలసేకరణ ధరలు పెంచాల్సి రావడంతో పాడి రైతులు రూ.4,283 కోట్లకు పైగా ప్రయోజనం పొందారు. క్రమం తప్పకుండా 180 రోజుల పాటు పాలుపోసే రైతులకు బోనస్, సొసైటీలకు ఇన్సెంటివ్ ఇస్తున్నాం. వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.30 వేల వరకు ఆర్థిక చేయూత ఇవ్వడమే కాకుండా పాడి గేదెల కొనుగోలుకు రూ.90 వేలకు పైగా రుణాలు ఇప్పిస్తున్నాం. ఏపీ ఆదర్శం : అల్కా ఉపాధ్యాయ, కేంద్ర పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో పాడి రైతులకు చాలా తక్కువ ధరలు చెల్లిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఏపీలో జేపీవీ ప్రాజెక్టు ద్వారా పాడి రైతులకు గరిష్టంగా లీటర్ గేదె పాలపై రూ.100 అంతకంటే ఎక్కువ ధర లభిస్తుండడం ప్రశంసనీయం. దేశంలో పాడి ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి జేవీపీ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించాలి. ఏపీని రోల్ మోడల్‌గా తీసుకుని తమ రాష్ట్రాల్లో పాడి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. -
ఇక పాలు, బాలామృతం మనవే
సాక్షి, అమరావతి: సహకార డెయిరీ రంగంలో అంతర్జాతీయ కీర్తినార్జించిన ‘అమూల్’ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇకపై ఏపీలోనే తయారైన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నేడు (శుక్రవారం) అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోంది. అనంతపురం జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకానికీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిద్వారా ఆర్నెల్ల నుంచి మూడేళ్ల్లలోపు ఉన్న చిన్నారులు 22.50 లక్షల మంది.. గర్భిణీ స్త్రీలు 7.50 లక్షల మంది ఉన్నారు. వీరికి పౌష్టికాహారం రూపంలో గర్భిణీలకు 200 గ్రా. పాలతో పాటు పిల్లలకు రోజూ 100 గ్రా. పాలు, నెలకు 2.5 కేజీల చొప్పున బాలామృతం కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజే స్తోంది. ఇప్పటివరకు వీటిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ«ధ్వర్యంలో బెంగళూరు నుంచి నెలకోసారి టెట్రా ప్యాకింగ్ రూపంలో 1.07 కోట్ల లీటర్ల చొప్పున ఏటా 12.84 కోట్ల లీటర్ల పాలు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సొసైటీ నుంచి ఏటా 48,692 మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు. పాలు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. రాష్ట్రంలో మన పాడి నుంచి ఉత్పత్తి అయ్యే తాజా పాలతో పాటు రాష్ట్ర పరిధిలోనే ప్రొసెస్ చేసిన బాలామృతాన్ని అంగన్వాడీలకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల మన పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోనుంది. -
‘పాల వెల్లువ’కు సర్కారు చేయూత
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు చెందిన మహిళా పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద రుణాలిస్తూ ఉపాధి కల్పన, సాంఘిక భద్రత కల్పిస్తోంది. సహకార పాడి రంగానికి జవసత్వాలు కల్పించేందుకు అమూల్ సంస్థతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా గుర్తించిన పాల ఉత్పత్తిదారుల సంఘాలకు ఆప్కాబ్, ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ఎలాంటి హామీ లేకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు మేలు జాతి పశువుల కొనుగోలుకు సైతం రుణాలు ఇస్తున్నారు. ఇప్పటికే 8,064 మంది మహిళా పాడి రైతులకు రూ.45.74 కోట్ల రుణాలు అందించారు. వీరిలో 5,010 మంది 5,283 పాడి పశువులను కొనుగోలు చేశారు. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుల స్వీకరణ గేదె కొనుగోలుకు రూ.93 వేలు, ఆవు కొనుగోలుకు రూ.76 వేల వరకు ప్రభుత్వం రుణం ఇప్పిస్తోంది. అంతేకాకుండా మహిళా రైతులు ప్రస్తుతం పెంచుతున్న పాడి పశువులపై వర్కింగ్ క్యాపిటల్ కింద గేదెల కోసం రూ.30 వేలు, ఆవుల కోసం రూ.25 వేల చొప్పున అందిస్తున్నారు. దీర్ఘకాలిక రుణాన్ని 60 నెలల్లో తీర్చాల్సి ఉండగా, వర్కింగ్ క్యాపిటల్ అప్పును 12 నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్‌ను అర్హతను బట్టి రెన్యువల్ కూడా చేస్తారు. ఎస్టీలకు మాత్రం వడ్డీ అగ్రి ఇన్ఫ్రా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద వడ్డీ మినహాయింపు కూడా లభిస్తుంది. రుణాలు పొందగోరే మహిళలు ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరో గేదె కొనుక్కున్నాం మాకు రెండు గేదెలున్నాయి. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ కేంద్రానికి పాలు పోస్తున్నాం. వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.50 నుంచి రూ.60 చెల్లిస్తున్నారు. రూ.81 వేలు రుణం రావడంతో మరో గేదె కొనుక్కున్నాం. – ఎం.మంజుల, పార్నపల్లి, పులివెందుల జగనన్న పాల వెల్లువ పథకంలో రిజిస్టర్ అయ్యా అమూల్ కేంద్రానికి పాలు పోసేలా జగనన్న పాల వెల్లువ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న పాడి ద్వారా వచ్చే పాలను ప్రతి రోజు క్రమం తప్పకుండా పోస్తున్నాం. ఇప్పుడు రూ.81 వేల రుణం రావడంతో మరో పాడి గేదె కొనుక్కున్నా. – మొక్కపాటి వెంకాయమ్మ, ఇక్కూరు, గుంటూరు జిల్లా సద్వినియోగం చేసుకోవాలి జగనన్న పాల వెల్లువ కింద అమూల్ కేంద్రాలకు పాలు పోసే మహిళా సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్, దీర్ఘకాలిక రుణ పథకం కింద డీసీసీబీల ద్వారా ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – ఎ.బాబు, ఎండీ, ఏపీడీడీసీఎఫ్ -
గేదెపై వచ్చి మరీ అభ్యర్థి నామినేషన్.. ఎందుకంటే?
పాట్నా: పంచాయతీ ఎన్నికలతో బిహార్ రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. ఇప్పటికే ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతున్న వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ అభ్యర్థి పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్ కఠియార్ జిల్లా హసన్‌గంజ్ పంచాయతీలోని రామ్‌పూర్ గ్రామస్తుడు మహ్మద్ ఆజాద్ ఆలం. ఓ పాడి రైతు. పాడి పశువులను పెంచి పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం నామినేషన్ వేసేందుకు గేదెపై వెళ్లాడు. అలా ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తే.. ‘పెట్రోల్ ధరల పెరుగుదల’ కారణంగా చెప్పాడు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ ‘పెరుగుతున్న పెట్రోల్ ధరలు నేను భరించలేకపోతున్నా. నేను పాడి రైతును. నేను గేదెపై మాత్రమే ప్రయాణించగలను’ అని అభ్యర్థి ఆలం మీడియాకు తెలిపాడు. అయితే పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలిస్తే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. గెలిస్తే తాను వైద్య రంగంపై దృష్టి సారిస్తానని ఆలం చెప్పాడు. కాగా బిహార్‌లో 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 12న చివరి దశ జరగనుంది. #WATCH | Bihar Panchayat Polls 2021: Azad Alam, a candidate from Katihar district's Rampur panchayat arrived to file his nomination on a buffalo yesterday pic.twitter.com/CBIF0bbqPl — ANI (@ANI) September 13, 2021 -
పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు!
ఎడపల్లి (బోధన్): నెలల తరబడి పని చేసినందుకు జీతం అడిగితే.. ఓ యువకుడిపై సంబంధిత అధికారులు పోలీసు కేసు నమోదు చేయించారు. వివరాలను బాధితుడు బోధన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన కె.శివకుమార్ అనే విద్యార్థి గ్రామంలో ఉన్న విజయ డెయిరీ పాల కేంద్రంలో గత 20 నెలలుగా పనిచేశాడు. కొన్ని నెలలు సక్రమంగా జీతం చెల్లించిన అధికారులు ఆ తర్వాత వేతనాలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేగాక తాను పనిచేసిన కాలంలో ప్రతి రోజు తాను డెయిరీకి పంపించిన పాలలో వెన్న శాతంలో కోత, పాల తూకంలో కోతలు విధిస్తూ ప్రతి నెల సుమారు రూ.ఐదువేల నష్టం చేకూర్చారని శివకుమార్ ఆరోపించారు. చదవండి: వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి డెయిరీ నుంచి వచ్చిన నష్టం నిజమేనని డెయిరీ సూపర్వైజర్లు కూడా ధృవీకరించారు. 11 నెలల కాలంలో వచ్చిన 55 వేల రూపాయలు నష్టం, 11 నెలల నెలసరి జీతం 55 వేల రూపాయలు తనకు డెయిరీ వారు చెల్లించాల్సి ఉందని శివకుమార్ తెలిపారు. దీంతో తాను రైతులకు రూ.37 వేలు బకాయి పడ్డానని ఆయన తెలిపారు. డెయిరీ అధికారులు తాను రైతులకు రూ.89 వేలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం లేదన్నారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని శివకుమార్ ఆరోపించారు. ఈ విషయమై డీడీ నందకుమారి వైఖరిపై విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు శివకుమార్ తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం -
ఎంగిలి చేసిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు
-
ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా
సాక్షి, హైదరాబాద్ : మీరు రోజు పాలు తాగుతారా.. అయితే ఈ వార్త చదవకపోవడమే మంచిది. సాధారణంగా పాలలో నీళ్లు కలుపుతారన్న మాట నిజమే.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పనికి మాత్రం పాలు తాగాలనిపించదు. డబీర్‌పురకు చెందిన మహ్మద్ సోహైల్ డైరీ ఫాం నడుపుతున్నాడు. తాజాగా మహ్మద్ సోహైల్ గేదెల నుంచి పాలు పిండాడు. తర్వాత ఆ పాలను ఒక గ్లాస్లో పోసుకొని సగం తాగాడు. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు. అనంతరం గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.(చదవండి : కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం, వ్యక్తి ఆరెస్ట్) మహ్మద్ సోహైల్ చేసిన పనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు ప్రజలు తాగే పాలను ఇలా అపరిశుభ్రం చేస్తున్న వ్యక్తికి అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డబీర్‌పుర పోలీసులు డైరీ ఫామ్ యజమాని సోహైల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
3లక్షల మందికి..రూ.75కోట్లు బకాయి..!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకపు సొమ్ముకు బ్రేక్ పడింది. ఎనిమిది నెలలుగా సొమ్ము అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు అంటే ఎనిమిది నెలలుగా సొమ్ము చెల్లించకపోవడంతో పాడి రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు రోజువారీ పాలకు ఇచ్చే బిల్లుల సొమ్ము కూడా నిలిచిపోయింది. ఒకవైపు ప్రోత్సాహకపు సొమ్ము రాకపోవడం, రోజువారీ పాల బిల్లు కూడా ఇవ్వకపోవడంతో సంక్రాంతికి పస్తులుండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మొత్తం సొమ్ము రూ. 145 కోట్లు... విజయ , ముల్కనూరు , రంగారెడ్డి–నల్లగొండ, కరీంనగర్ డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 వంతున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తోంది. దాదాపు 3 లక్షల మందికి ఇది అందుతోంది.మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడింటికీ వర్తింప చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు రూ. 75 కోట్లు నిలిచి పోయాయని విజయ డెయిరీకి చెందిన అధికారులు అంటున్నారు.మరోవైపు విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు గత నెల (డిసెంబర్) ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ పాల బిల్లు నిలిపివేశారు. ఈ డైయిరీకి సుమారు రెండు లక్షల మంది రైతులు నిత్యం పాలు పోస్తారు. వీరికి చెందిన రూ. 70 కోట్లు రాకపోవడంతో ఆ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక రైతులకు పండుగ లోపు బిల్లు చెల్లించకపోతే పాల కేంద్రాల నిర్వహణ చేయలేమని అక్కడి అధికారులు,యూనిట్ మేనేజర్లు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ డెయిరీకి ప్రతిరోజు నాలుగు లక్షల లీటర్లకు పైగా పాలు వస్తోంది. రైతులకు పది రోజులకోమారు ఈ బిల్లు చెల్లిస్తారు. డెయిరీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి చెల్లించలేని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. రుణానికి వెనుకంజ... గతంలో పాల బిల్లులు ఆలస్యమయ్యే క్రమంలో బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని సర్దుబాటు చేసేవారు. కానీ ప్రస్తుతం విజయ డెయిరీ అధికారులు అందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పాల అమ్మకాల నుంచి బిల్లులు చెల్లించాలని భావిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకు రుణం తీసుకోకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులు అంటున్నారు. నిధుల కొరత కారణంగా ఈనెల ఉద్యోగుల వేతనాలు కూడా వారం రోజుల తర్వాత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆవు పాల మిక్సింగ్‌తో ఆసక్తి చూపని వినియోగదారులు... విజయ డెయిరీకి 90 శాతం ఆవు పాలు, 10 శాతం మాత్రమే బర్రె పాలు వస్తుండటంతో పాలలో పసుపు శాతం అధికంగా కనిపిస్తుండటంతో వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది గమనించిన పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఇటీవల సమీక్ష జరిపి బర్రె పాల సేకరణ పెంచాలని కోరినా పురోగతి లేదు. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే బర్రె పాలకు గాను రైతులకు ఇచ్చే రేటు తక్కువ ఉండటంతో ఆ పాలు రావడంలేదని ఒక అధికారి అన్నారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. -
టీడీపీ సమావేశం.. పాడిరైతుల పాలిట శాపం
సాక్షి, అనంతపురం అర్బన్: టీడీపీ కార్యకర్తల సమావేశం పాడి రైతుల పాలిట శాపంగా మారింది. కార్యకర్తలు తినగా మిగిలిన అన్నం అక్కడే గుట్టగా వదిలేసి వెళ్లారు. పాడైపోయిన ఆ అన్నాన్ని తిని ఐదు పాడి ఆవులు మృతి చెందాయి. ఈ ఘటన కళ్యాణదుర్గం రోడ్డులోని జొన్నా ఐరెన్ మార్ట్ వెనుక వైపు చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు ఈ నెల 23న వచ్చారు. 24న బళ్లారి రోడ్డులోని వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో టీపీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హాల్‌కు కొద్ది దూరంలో కార్యకర్తల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు చేసిన తరువాత మిగిలిన అన్నంను అక్కడే వదిలేసి వెళ్లారు. చెడిపోయిన అన్నం తిని ఐదు ఆవులు చనిపోయాయి. ఇందుకు సంబంధించి వివరాలను బాధితులు నరసింహులు తిరుపతయ్య తెలిపారు. ఫంక్షన్‌హాల్‌కు సమీపంలోని ఒక ఎస్టేట్‌లో నరసింహులు వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండు ఒంగోలు, రెండు జెర్సీ అవులను మేపుతున్నాడు. అదే విధంగా తిరుపతయ్య అనే పాడి రైతు ఒక జెర్సీ ఆవును మేపుతున్నాడు. అవి ఈనెల 25న అటుగా వెళ్లి అక్కడున్న అన్నం తిన్నాయి. అక్కడిక్కడే రెండు ఆవులు చనిపోగా మరో మూడు ఆవులు కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాయి. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆవుల కోసం వెళ్లిన రైతులు వాటిని చూసి వెంటనే ట్రాక్టర్లో వాటిని వేసుకొచ్చి తమకు దగ్గరలోని పశువైద్యాధికారి సురేశ్‌కు చెప్పడంతో ఆయన తన కాంపౌండర్ గురుముర్తితో పాటు హుటాహుటిన చేరుకుని చికిత్స అందించారు. అయినా ఆవులు బతకలేదు. రూ.3.50 లక్షలు నష్టపోయాం టీడీపీ సమావేశం కోసం భోజనాలను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు తినగా మిగిలిన అన్నం అక్కడే వదిలేసి వెళ్లారు. మా ఆవులు గడ్డిమేస్తూ ఆ ప్రాంతానికి వెళ్లి చెడిపోయిన అన్నం తిన్నాయి. పాడైపోయిన అన్నం తినడంతో ఆవులు చనిపోయాయని వైద్యాధికారి చెప్పారు. ఒక్కొక్క ఆవు రూ.70 వేలు విలువ చేస్తుంది. ఐదు ఆవుల విలువ రూ.3.50 లక్షలు. పేదలమైన మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. – బాధితులు నరసింహులు, తిరుపతయ్య -
పాడి రైతుకు ప్రోత్సాహకమేది?
తొమ్మిది నెలలుగా అందని డబ్బులు 14 వేల రైతులకు రూ. 5 కోట్లపైగా బకాయిలు నాగిరెడ్డిపేట : పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రతి లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తామన్న సర్కారు.. నెలల తరబడి ఆ మొత్తాన్ని అందించడం లేదు. తొమ్మిది నెలల తర్వాత ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన బకాయిలను మంజూరు చేసినా.. అవి ఇప్పటికీ రైతుల ఖాతాల్లో చేరలేదు. ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో 14వేల మంది పాడిరైతులు విజయడెయిరీ కేంద్రాల్లో పాలు పోస్తున్నారు. రైతులు రోజూ 70 వేల లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నారు. పాలను విక్రయించే రైతులకు వెన్నశాతం ఆధారంగా ధర చెల్లిస్తారు. విజయ డెయిరీ కనీసం 5 శాతం వెన్న ఉంటేనే పాలను కొనుగోలు చేస్తుంది. వెన్న శాతం ఆధారంగా ఒక్కో రైతుకు లీటర్ పాలకు రూ. 27 నుంచి రూ. 55 వరకు ధర చెల్లిస్తోంది. పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాల ధరకు అదనంగా లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. దీనివల్ల చాలామంది పాలను ప్రైవేట్ డెయిరీలలో కాకుండా విజయ డెయిరీలోనే విక్రయిస్తున్నారు. అయితే రైతులకు గతేడాది ఏప్రిల్‌నుంచి ఈ ప్రోత్సాహకం అందడం లేదు. ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన ప్రోత్సాహకాన్ని మంజూరైందని డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 2.31 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఇంకా సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రూ. 3 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. ప్రోత్సాహకాన్ని వెంటనే మంజూరు చేయాలని పాడి రైతులు కోరుతున్నారు. నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా బిల్లులతో కలిపి ప్రోత్సాహకాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ చేస్తాం విజయ డెయిరీలో పాలను విక్రయించే రైతులకు ప్రభుత్వం లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రోత్సాహకం మంజూరైంది. వీటిని రెండు, మూడురోజుల్లో పాడిరైతుల ఖాతాల్లో జమ చేస్తాం. మిగిలిన నిధులు ప్రభుత్వం నుంచి రాగానే రైతుల ఖాతాల్లో వేస్తాం. – ప్రదీప్, మేనేజర్, విజయ డెయిరీ, కామారెడ్డి -
పాడి రైతులకు డెబిట్ కార్డులు
-
పాడి రైతులకు డెబిట్ కార్డులు
• ‘విజయ డెయిరీ’కి పాలు పోసే రైతులకు వెసులుబాటు • పశు సంవర్థక శాఖ నిర్ణయం... త్వరలో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ డెబిట్‌కార్డులు ఇప్పిం చాలని పశు సంవర్థక శాఖ నిర్ణరుుంచింది. సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చించి త్వరలో కార్డులను రైతులకు అందజేస్తారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ రైతులకు చెల్లించే సొమ్మును ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లో జమ చేయాలని డెరుురీ ఇటీ వలే నిర్ణరుుంచి ఏర్పాట్లు కూడా చేసింది. పాడి రైతులందరికీ ‘జీరో బ్యాలెన్స’ కింద బ్యాంకు ఖాతాలున్నా వారికి డెబిట్ కార్డులు ఇవ్వలేదు. ప్రత్యేక అంశంగా పరిగణించి జీరో బ్యాలెన్‌సలోనే డెబిట్‌కార్డులు ఇవ్వాలని బ్యాంకులను పశు సంవర్థక శాఖ కోరనుంది. తెలంగాణలో విజయడెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు దాదాపు 5 లక్షల లీటర్ల పాలు పోస్తుంటాన్నారు. అందుకోసం డెరుురీ ఏడాదికి రూ.350 కోట్లు రైతులకు చెల్లిస్తోంది. లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తోంది. దాని ప్రకారం ఏడాదికి రూ.72 కోట్లు ఇస్తున్నారు. 15 రోజులకోసారి పాడి రైతు ఖాతాలకు సొమ్ము ను విడుదల చేస్తారు. సొమ్మును రైతులు డెబిట్‌కార్డుల ద్వారా ఏటీఎం నుంచి తెచ్చు కోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ సరుకులు కొనుక్కోవచ్చు. చేపల మార్కెట్లకు స్వైపింగ్ మిషన్లు హైదరాబాద్‌లో చేపల మార్కెట్లపై పెద్ద నోట్ల ప్రభావం పడింది. దీంతో ఆయా మార్కెట్లు వ్యాపారం లేక కుదేలయ్యారుు. 4 సహకార చేపల కేంద్రాలు, ఆరు మొబైల్ చేపల మార్కెట్లలో విక్రయాలు పెద్దఎత్తున నిలిచిపోయారుు. చిల్లర సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ స్వైపింగ్ మిషన్లు ఇవ్వాలని నిర్ణరుుంచినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు పేర్కొన్నారుు. స్వైపింగ్ మిషన్లకు ఆర్డర్ ఇచ్చామని, రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
పాల ప్రోత్సాహకం నిలుపుదల
♦ రెండు నెలలుగా రైతులకు రూ.7 కోట్ల బకాయిలు ♦ నిధులు లేక తాత్కాలికంగా నిలిపేసిన విజయ డెయిరీ? ♦ ‘ప్రోత్సాహక’ నిధులపై స్పష్టతనివ్వని ప్రభుత్వం ♦ రాష్ట్ర బడ్జెట్లో ఆ ఊసే లేని పరిస్థితి సాక్షి, హైదరాబాద్: కరువులో రైతును అన్ని విధాలా ఆదుకుంటున్నామని... పాడి రైతుకు ప్రోత్సాహకం ఇస్తున్నామని ఇంటా బయట ఊదరగొడుతోన్న ప్రభుత్వం... ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తోన్న రూ. 4 ప్రోత్సాహకంపై నీళ్లు చల్లుతోంది. ఫిబ్రవరి 10 వరకు ప్రభుత్వం ప్రోత్సాహక బకాయిలు చెల్లించిందని... ఆ తర్వాత ఇప్పటివరకు రెండు నెలలపాటు రైతులకు చెల్లించాల్సిన రూ. 7 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని విజయ డెయిరీ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రోత్సాహక పథకాన్ని విజయ డెయిరీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో కరువులో పాడిపై ఆధారపడిన రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. సర్కారు మద్దతేదీ? విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 నగదు ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం 2014 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీచేసింది. వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు నేపథ్యంలో రైతులు పాడిని ప్రత్యామ్నాయ జీవనంగా మలుచుకుంటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంది. ఆ ప్రకారం 2014 నవంబర్ నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ రూ. 4 లీటరుకు అదనంగా ఇస్తున్నారు. ఒక్కో లీటరుకు రూ. 28 చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలుకాకముందు విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించగా.. ఉత్తర్వు తరువాత పాల సేకరణ అమాంతం 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. అయితే గత ఏడాది అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును సక్రమంగానే చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి రైతుల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం ప్రారంభించింది. అలా ఫిబ్రవరి 10 వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో విజయ డెయిరీ తన వద్ద ఉన్న కోట్ల రూపాయల డిపాజిట్లను రైతులకు చెల్లిస్తూ వస్తోంది. ఆ తర్వాత ఇవ్వని పరిస్థితిలోకి డెయిరీ వెళ్లిపోయింది. ఏంచేయాలో అర్థంకాక బకాయిలు వచ్చే వరకు ప్రోత్సాహకాన్ని ఇవ్వలేమని రైతులకు చెబుతున్నట్లు తెలిసింది. బడ్జెట్లో నిధులపై అస్పష్టత... 2015-16 బడ్జెట్లో పాల ప్రోత్సాహకానికి రూ. 12 కోట్లు కేటాయించిన ప్రభుత్వం... 2016-17 బడ్జెట్లో మాత్రం ప్రత్యేకంగా కేటాయించినట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఇతర పద్దుల్లో కేటాయించామని చెబుతున్నా అది కూడా రూ. 16 కోట్లకు మించి లేదని అంటున్నారు. దీనిపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకే కాకుండా కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ సహా పలు ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు కూడా ప్రోత్సాహకం ఇవ్వాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ దీనిపై ఉప సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ విజయ డెయిరీతోపాటు పైన పేర్కొన్న ప్రైవేటు డెయిరీలకు ప్రోత్సాహకం ఇచ్చేట్లయితే రూ. 110 కోట్ల మేరకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రస్తుతం కొద్దిపాటి నిధులే ఇవ్వని సర్కారు ఇంత పెద్ద మొత్తం నిధులు కేటాయిస్తుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. కరువులో పాడి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉపసంఘం పేరుతో ప్రోత్సాహకపు సొమ్ము విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పాలకుండలో నష్టాల పొంగు
పాడి రైతుల కష్టంతో డెయిరీలకు లాభాలు పాల సేకరణ ధర పెంచని యాజమాన్యాలు ఏటా రెండుసార్లు పాల పదార్థాల ధర పెంపు తరచూ దాణా ధరల పెంపుతో రైతుల ఆందోళన పంట కలిసి రాకపోతేనేం... పాడి ఆదుకుంటుందని ఆశపడ్డారు. అష్టకష్టాలు పడి పశువులను పెంచుతున్నారు. ఎంత శ్రమించినా గిట్టుబాటు కాక విలవిల్లాడుతున్నారు. రైతుల కష్టంతో డెయిరీలు లాభాలార్జిస్తున్నాయి. పాల సేకరణ ధరను పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పశుగ్రాసం దొరక్క రైతాంగం అవస్థలు పడుతోంది. డెయిరీలు దాణా ధరను తరచూ పెంచుతుండటంతో నష్టాల బాట పడుతోంది. యలమంచిలి/యలమంచిలి రూరల్: జిల్లాలో పాడి పరిశ్రమకు కష్టకాలం దాపురించింది. పాడిపశువుల ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. పెరుగుతున్న దాణా ధరలు, అందుబాటులో లేని పశుగ్రాసంతో అన్నదాతలు పశువుల పెంపకంలో అష్టకష్టాలు పడుతున్నారు. దాణా ధరలు పెంచడంలో డెయిరీలు బహిరంగ మార్కెట్‌తో పోటీ పడుతున్నాయి. విశాఖ డెయిరీతోపాటు హెరిటేజ్, సుప్రజ, తిరుమల తదితర ప్రయివేట్ డెయిరీల ద్వారా పాలసేకరణ కేంద్రాల్లో పాలకు సరైన ధర లభించడం లేదు. మినీ డెయిరీలు, పాడిపశువుల పెంపకంపై అందరు ఆసక్తి చూపించేవారు. నిరుద్యోగులకు పాడి పరిశ్రమ ఉపాధి అవకాశంగా ఉండేది. ప్రస్తుతం పాల డెయిరీలు చెల్లిస్తున్న ధరలతో మినీ డెయిరీలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా డెయిరీల ద్వారా ఉత్పత్తి చేస్తున్న పాల పదార్థాల ధరలను ఏడాదికి రెండుమూడు సార్లు పెంచేస్తున్న యాజమాన్యాలు రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు ధర పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డెయిరీ యాజమాన్యాలు పాలకు గిట్టుబాటు ధరను చెల్లించడం లేదని రైతులు యాజమాన్యాలను కూడా నిలదీస్తున్నారు. పాల ఉత్పత్తి వ్యయం బోలెడు పూటకు 2 లీటర్ల పాలిచ్చే పశువుకు రోజుకు సుమారు 2 కేజీల దాణా పెట్టాలి. పచ్చగడ్డి లేదంటే అందుబాటులో ఉన్నట్టయితే ఎండు గడ్డిని పెట్టాలి. రోజుకు 4 లీటర్ల పాలకు 8.0 వెన్న శాతం వస్తే లీటరుకు రూ.37 వరకు డెయిరీలు చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన 4 లీటర్లకు రూ.148 వస్తే దాణాకు సుమారుగా రూ.60 ఖర్చవుతుంది. రైతుకు రోజు కూలీ ద్వారా వచ్చే ఆదాయం రూ.200 నుంచి రు.250లు. దీంతో పాడిపశువులను మేపుతున్న రైతులు రోజుకు రూ.100 నుంచి రూ.150ల వరకు నష్టపోవలసి వస్తోంది. క్షీణిస్తున్న వెన్న శాతం ప్రస్తుతం దాణా, పశుగ్రాసం కొరత వల్ల వెన్నశాతం కూడా తక్కువగానే ఉంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పాలసేకరణ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలలో వెన్నశాతం 6 నుంచి 8 శాతం వరకు మాత్రమే ఉంటోంది. పది శాతం వెన్న ఉన్నట్టయితే డెయిరీలు లీటరు గేదె పాలకు రూ.43 చెల్లిస్తున్నాయి. వెన్నశాతం లేకపోవడంతో రైతులు నష్టాలు చవిచూడవలసి వస్తోంది. గిట్టుబాటు చెల్లిస్తేనే జిల్లాలో చాలా కుటుంబాలు పాడిపశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. విశాఖ డెయిరీతోపాటు ప్రయివేటు డెయిరీల ద్వారా రోజుకు 8 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోంది. విశాఖ డెయిరీ మాత్రం గుడ్డిలో మెల్లగా (ప్రయివేటు డెయిరీలతో పోటీ ఉన్న గ్రామాల్లో) రూ.2 నుంచి రూ.3 వరకు అదనంగా చెల్లిస్తోంది. ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోవడంతో లీటరు గేదె పాలకు రూ.70, ఆవుపాలకు రూ.40 చెల్లిస్తేనే గిట్టుబాటువుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దంపతుల రోజు ఆదాయం రూ.50 అచ్యుతాపురం మండలం, తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లపు వెంకట ఆదిబాబుకు రెండు ఆవులున్నాయి. ఏడాది పొడవున సరాసరి రోజుకు 8 లీటర్ల పాలు పోస్తున్నాడు. ఏడాదిలో ఈయనకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. దాణా, మందులు, గడ్డికి 30 శాతం ఖర్చవుతుంది. రైతుకు మిగిలింది ఏటా రూ.30 వేలే. నెలకు రూ.1500 గిట్టుబాటవుతుంది. అంటే రోజుకు రూ.50 ఆదాయం వస్తుందన్నమాట. ఉదయం నుంచి రాత్రివరకూ రెండు ఆవులతో ఆదిబాబు, ఆయన భార్య పనిచేస్తారు. కూలి గిట్టుబాటు కాలేదని ఆదిబాబు వాపోతున్నాడు. దడ పుట్టిస్తున్న దాణా ధర మార్కెట్లో పెరుగుతున్న దాణా ధరలతో పాడిరైతులు మరింత నష్టపోవలసి వస్తోంది. విశాఖ డెయిరీ ద్వారా 50 కేజీల దాణాను రూ.550కి సరఫరా చేస్తున్నారు. అయిదు నెలల క్రితం దాణా ధర రూ.500 ఉండేది. ఇక మార్కెట్లో ఏడాది క్రితం వరకు రూ.350 ఉన్న తౌడు బస్తా ధర రూ.450కు చేరింది. వరిగడ్డి అందుబాటులో లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా నుంచి ట్రాక్టరు ఎండుగడ్డిని రూ.6 వేల నుంచి రూ.7వేల వరకు కొలుగోలు చేస్తున్నారు. నీళ్ల ధర భేష్ మార్కెట్లో లీటర్ మంచినీళ్ల సీసా ధర రూ.20లు, మంచినీళ్ల ప్యాకెట్ ధర రూ.2. నీరు ఉచితంగా వచ్చేదే. నీటిని శుద్ధి చేసేందుకు, బాటిల్, ప్యాకింగ్ తదితర ఖర్చు రూ.5 నుంచి రూ.6. రిటైల్ వ్యాపారులు లీటరు సీసాను రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని రూ.20కి వినియోగదారులకు అమ్ముతున్నారు. కూలికెళ్తే రూ.250...పాలు పోస్తే రూ.40 అచ్యుతాపురం మండలం, తిమ్మరాజుపేటకు చెందిన జగన్నాథరావుకు ఆవు, గేదెలున్నాయి. జగన్నాథరావు డెయిరీకి ఏడాది పొడవున సరాసరి లెక్కవేస్తే 4 లీటర్ల పాలు పోస్తున్నాడు. ఏడాదికి జగన్నాథరావుకి రూ.25 వేలు చెల్లిస్తారు. దాణా, ఇతర ఖర్చులకు రూ.10 వేలు అవుతుంది. జగన్నాథరావుకు మిగిలేది రూ.15 వేలే. నెలకు రూ.1250 మిగులుతుంది. అంటే రోజుకు రూ.40 గిట్టుబాటవుతుంది. రాత్రింబవళ్లు పశువులను కనిపెట్టుకుని ఉండాలి. కూలికి పోతే రోజుకు రూ.250 ఇస్తున్నారు. పాడి గిట్టుబాటు కావడం లేదని జగన్నాథరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
కరువు కోరల్లో ‘పాడి’
ఉదయగిరి, న్యూస్‌లైన్: జిల్లాలోని మెట్ట ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. పంటలు పూర్తిగా ఎండిపోవడంతో కనీసం పాడితోనైనా జీవనం సాగిద్దామనుకున్న రైతుకు కష్టాలు తప్పడం లేదు. నీటి చుక్క నేలరాలక, పశువులకు పచ్చిగడ్డి కరువైంది. తినడానికి మేత లేక, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు ఐదు లీటర్ల పాలిచ్చే గేదె..రెండు లీటర్లు ఇవ్వడం కష్టంగా మారింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని పాడిరైతు ఎదుర్కొంటున్నాడు. కళ్ల ముందే గేదెలు నీళ్లు లేక, తిండిలేక శుష్కించిపోతుంటే చూడలేక అందినకాడికి కబేళాలకు అమ్ముకుంటున్నారు. ఎక్కువ ధర పెట్టి కొన్న గేదెల్ని కూడా కాలం కలిసిరాక దళారులు అడిగిన రేటుకు తెగనమ్ముతున్నారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక, పాడిగేదెల ద్వారానే భృతి కొనసాగిస్తున్నారు. గత ఏడాది పాలవెల్లువ రావడంతో కొనే వారు లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు. కనీసం పశువులు, జీవాలకు కూడా మేత, నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. వాగులు, వంకలు,చెరువులు బోసిపోయాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు ఇబ్బందులు తప్పలేదు. గణనీయంగా తగ్గిన దిగుబడి జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకుపైగా లీటర్ల పాలను విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు సేకరిస్తాయి. రెండు మూడునెలల నుంచి సేకరణ పడిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో లక్ష లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. కరువు కారణంగా రెండు నెలలుగా విజయ డెయిరీకి వచ్చే పాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 25 వేల లీటర్ల స్థాయికి పడిపోయింది. మార్చి, ఏప్రిల్‌లో మరింత దిగజారి పది వేల స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. పాల రంగంలో చక్రం తిప్పుతున్న తిరుమల, దొడ్ల, హెరిటేజ్, విష్ణుప్రియ తదితర ప్రైవేటు డెయిరీలకూ కరువు పోటు తప్పలేదు. వీటికీ పాలసేకరణ తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పాడి రైతుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన ప్రైవేటు, ప్రభుత్వ డెయిరీ యాజమాన్యాలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. -
పాడి రైతులకు శుభవార్త
= లీటరుకు రూ.2 ప్రోత్సాహకాన్ని పెంచిన సమాఖ్య = రేపటి నుంచి అమల్లోకి సాక్షి,బెంగళూరు : బెంగళూరు పాల ఉత్పత్తిదారుల సంఘంలోని సభ్యులకు లీటరు పాలు ఉత్పత్తి పై రూ.2 ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నట్లు సంఘం అధ్యక్షుడు హుల్లూరు సి. మంజునాథ్ వెళ్లడించారు. బెంగళూరులో మీడియాతో ఆయన సోమవారం మాట్లాడారు. సంఘంలోని సభ్యులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వడమే కాకుండా సంఘంలోని సిబ్బందికి ప్రతి లీటరు కొనుగోలు పై 15 పైసల కమిషన్ ఇవ్వమనున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి లీటరు క్రయవిక్రయాల పై వచ్చే లాభంలో 2 పైసలును సంఘం నిర్వహనకు కేటాయించనున్నామని వివరించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. రైతులకు చెల్లించే మొత్తం పెరగడం వల్ల పాల విక్రయధర పెంపు జరగదన్నారు. దీని వల్ల వినియోగదారుల పై భారం పడబోదని ఆయన స్పష్టం చేశారు. తాజా నిర్ణయం వల్ల సమాఖ్య పై మార్చి 14 వరకూ రూ. 21.62 కోట్ల భారం పడనుందన్నారు. అటు పై తదుపరి విషయాల పై నిర్ణయం తీసుకోనున్నామన్నారు. గాలికుంటు వ్యాధి వల్ల సంఘంలోని చాల మంది సభ్యుల పాడి పశువులు మృతి చెందాయని గుర్తుచేశాయి. తాజా నిర్ణయం వల్ల వారికి బాధిత రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని మంజునాథ్ అభిప్రాయపడ్డారు.