పాడి రైతులకు శుభవార్త | The good news for dairy farmers | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు శుభవార్త

Published Tue, Dec 31 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

The good news for dairy farmers

= లీటరుకు రూ.2 ప్రోత్సాహకాన్ని పెంచిన సమాఖ్య
 = రేపటి నుంచి అమల్లోకి

 
సాక్షి,బెంగళూరు : బెంగళూరు పాల ఉత్పత్తిదారుల సంఘంలోని సభ్యులకు లీటరు పాలు ఉత్పత్తి పై రూ.2 ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నట్లు సంఘం అధ్యక్షుడు హుల్లూరు సి. మంజునాథ్ వెళ్లడించారు. బెంగళూరులో మీడియాతో ఆయన సోమవారం మాట్లాడారు. సంఘంలోని సభ్యులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వడమే కాకుండా సంఘంలోని సిబ్బందికి ప్రతి లీటరు కొనుగోలు పై 15 పైసల కమిషన్ ఇవ్వమనున్నామన్నారు.

అంతేకాకుండా ప్రతి లీటరు క్రయవిక్రయాల పై వచ్చే లాభంలో 2 పైసలును సంఘం నిర్వహనకు కేటాయించనున్నామని వివరించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు.  రైతులకు చెల్లించే మొత్తం పెరగడం వల్ల పాల విక్రయధర పెంపు జరగదన్నారు. దీని వల్ల వినియోగదారుల పై భారం పడబోదని ఆయన స్పష్టం చేశారు.

తాజా నిర్ణయం వల్ల సమాఖ్య పై మార్చి 14 వరకూ రూ. 21.62 కోట్ల భారం పడనుందన్నారు. అటు పై తదుపరి విషయాల పై నిర్ణయం తీసుకోనున్నామన్నారు. గాలికుంటు వ్యాధి వల్ల సంఘంలోని చాల మంది సభ్యుల పాడి పశువులు మృతి చెందాయని గుర్తుచేశాయి. తాజా నిర్ణయం వల్ల వారికి బాధిత రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని మంజునాథ్ అభిప్రాయపడ్డారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement