లెక్కల్లేవ్.. టెండర్లూ లేవ్ ! | no problems ...no tenders | Sakshi
Sakshi News home page

లెక్కల్లేవ్.. టెండర్లూ లేవ్ !

Published Wed, Sep 4 2013 6:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

విజయ డెరుురీ... అసలే అంతంతమాత్రంగా నడుస్తోంది. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకోలేక రోజురోజుకూ చతికిలపడుతోంది. ఇది చాలదన్నట్లు డెరుురీ కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న బినామీ దందా... దాన్ని అధఃపాతాళంలోకి పడిపోయేలా చేస్తోంది.

హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విజయ డెరుురీ... అసలే అంతంతమాత్రంగా నడుస్తోంది. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకోలేక రోజురోజుకూ చతికిలపడుతోంది. ఇది చాలదన్నట్లు డెరుురీ కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న బినామీ దందా... దాన్ని అధఃపాతాళంలోకి పడిపోయేలా చేస్తోంది. నెలకు లక్షల రూపాయల మేర ఆదాయూనికి గండిపడుతున్నా... ఉన్నతాధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ డెరుురీ కదా.. అభివృద్ధి దిశ గా నడిపించాలన్న మాటేమో గానీ, అందినకాడికి దండుకునేందుకే కొందరు ఉద్యోగులు ప్రయత్నిస్తుండడంతో దాని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది.
 
 ఇదీ కథ...
 విజయ డెరుురీలో ఏడాది క్రితం వరకు పాల నాణ్యతను గుర్తించే విభాగంలో కీలక విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి బినామీ దందాకు తెరలేపాడు. 2006లో మొదటిసారిగా డెరుురీ ప్రధాన ద్వారం వద్ద విజయ పాల ఉత్పత్తులను అమ్మేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటుందని సర్వసాధారణంగా అందరూ భావిస్తారు. కానీ... ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల్లో ఏ పనినైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటే టెండర్లు ఆహ్వానించాలి. అరుుతే డెరుురీలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి తన కూతురుకు ఈ కౌంటర్‌ను అప్పగించాలని అప్పటి ఉన్నతాధికారిని కోరారు. మనోడే కదా అని కరుణించిన అయ్యగారు ఎలాంటి టెండర్లు లేకుండానే ఉద్యోగి కూతురు పేరిట చేసుకున్న దరఖాస్తుపై సంతకం చేశారు. అంతేకాకుండా... కాంట్రాక్ట్ అప్పగించే సమయంలో ఎలాంటి కాలపరిమితి విధించకుండా ప్రొసీడింగ్స్ జారీ చేయడం గమనార్హం. ఇంకేముంది... ఆ తర్వాత సదరు ఉద్యోగి క్రమక్రమంగా దందాకు తెరలేపాడు. కౌంటర్ నిర్వహణ పేరుకే కూతురిది కాగా... అంతా నడిపించేది మాత్రం సదరు ఉద్యోగే.
 
 మాయూజాలం ఇలా...
 విజయ పాలు, పాల ఉత్పత్తులకు జిల్లాలోనే కాదు... కరీంనగర్ జిల్లాలో సైతం మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ప్రతి రోజూ 50 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి విక్రరుుస్తున్నారు. ఈ అవకాశాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు ఉద్యోగి. ఆరేళ్లుగా కాంట్రాక్ట్ పొడిగించుకుంటుండడమే కాకుండా యథేచ్ఛగా దండుకుంటున్నాడు.  పాల ఉత్పత్తులను కౌంటర్ వద్ద అమ్మడమే కాదు... కౌంటర్ కాంట్రాక్ట్‌ను చూపెడుతూ ప్రతి రోజూ సుమారు వంద నుంచి రెండు వందల లీటర్ల వరకు పాలను బయటికి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. పాల నాణ్యతను ఇట్టే పసిగట్టే సదరు ఉద్యోగి... పాల దిగుమతిలో తన మాయాజాలంతో సృష్టించిన వాటిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా పాలను సరఫరా చేస్తూ డెరుురీ ఆదాయూనికి * లక్షల మేర గండికొడుతున్నాడు. ప్రతి నెలా లక్ష రూపాయల వరకు డెరుురీ ఆదాయానికి గండి పడుతుండగా... పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు సైతం లేకపోవడం గమనార్హం. అంతేకాదు... ఉన్నతాధికారులు మారిన ప్రతీసారి కొంత ముట్టజెప్పి కాంట్రాక్ట్ పొడిగించుకుంటున్నట్లు సహచర ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. అదేవిధంగా బయటి వ్యక్తులకు అప్పగిస్తే అక్రమాలు బయటపడతాయనే నెపంతో కౌంటర్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నాడన్నది వారి ప్రధాన ఆరోపణ.
 
 
 ఈ నెలలో టెండర్లు పిలుస్తాం
 ప్రధాన ద్వారం వద్ద పాల ఉత్పత్తులను అమ్మే కౌంటర్‌కు కొత్తగా టెండర్లను పిలవాలని నిర్ణయించాం. ఈ నెలలోనే కొత్త వారికి అప్పగిస్తాం. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో కౌంటర్ విషయంపై దృష్టి సారించలేదు. త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం.
 - పీఆర్ కృష్ణస్వామి, విజయ డెరుురీ, డిప్యూటీ డెరైక్టర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement