‘విజయ’కు సీఎం ఫాంహౌస్ పాలు
మర్కూక్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో ఉత్పత్తయ్యే పాలను తన దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో విజయ డెయిరీ కేంద్రంలో ఫాంహౌస్ సిబ్బంది పోస్తున్నారు. సీఎం ఫాంహౌస్‌లోని పాడి పశువుల పాలను స్వయంగా ఎర్రవల్లిలో పోయడంతో గ్రామ పాడి రైతులు కూడా తమ పాలను పోసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీఎం ఫాంహౌస్‌లోని 5 ఆవులు, 6 గేదెలు ఉన్నా యి. ప్రస్తుతం పాడి పశువులు పాలు ఇవ్వ డంతో ప్రతి నిత్యం ఎర్రవల్లి విజయకేం ద్రంలో పాలను విక్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం కలిపి రెండు పూటలు మొత్తం 55 లీటర్ల పాలను పోస్తున్నారని గ్రామ వీడీసీ, కేంద్రం నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గేదెలను పంపిణీ చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం 155 మంది గేదెలను కొనుగోలు చేశారు. వీరికి పశువైద్యాధి కారు లు చెక్కును కూడా అందించారు. వారు కూడా ప్రస్తుతం పాలను విజయ డెయిరీలోని పోస్తున్నారు. రోజూ 400 లీటర్ల వరకు పాలు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. గేదెల కొనుగోలు కోసం ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ, ఓసీలకు 80 శాతం సబ్సిడీపై పాడి పశువులను అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి గేదెను, లేదా ఆవు కొనుగోలు కు రూ.45 వేల చెక్కును అంది స్తున్నారు. మిగతా మరో పశువు కోసం జూన్, జూలైలో మరో చెక్కును అందించనున్న ట్లు గ్రామ వీడీసీ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఎర్రవల్లి పాలవెల్లిగా మారుతుందని స్థానికు లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.