Dairy farmers
-
పాడి రైతుకు దగా
సాక్షి, అమరావతి/నెట్వర్క్ పాడి రైతు చితికిపోతున్నాడు. ఓ వైపు దాణా ధరలు చుక్కలనంటుతుంటే మరోవైపు పశుగ్రాసం దొరకని దుస్థితి. పశు పోషణ భారంగా తయారైన ప్రస్తుత తరుణంలో పాల సేకరణ ధరలు పెంచాల్సింది పోయి ప్రైవేటు డెయిరీలు తగ్గించేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో తమకు నచ్చిన ధర చెల్లిస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర.. చెల్లించిందే రొక్కం.. అన్నట్టుగా తయారైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గేదె పాల సేకరణపై ప్రైవేటు డెయిరీలు విధిస్తోన్న ఆంక్షలు పాడి రైతులకు శాపంగా మారాయి. అరకొరగా సేకరించడంతోపాటు ఆవు పాల ధరలే ఇస్తున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా సరే తాము చెప్పిన ధరకు ఇస్తామంటేనే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో చేసేది లేక అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పాడి రైతులు జీవనాధారమైన పశు సంపదను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. నాడు అమూల్‌తో పాల విప్లవం.. వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో 2020 అక్టోబర్‌లో జగనన్న పాల వెల్లువ (అమూల్) కేంద్రాలను ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాలసేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున గరిష్టంగా 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేసేది. ప్రారంభంలో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) లీటర్‌కు రూ.71.47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు ధర పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లించేది. 40 నెలల్లో ఏడుసార్లు పాల సేకరణ ధరలు పెంచడంతో లీటర్ గేదె పాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ఫలితంగా జేపీవీ (జగనన్న పాల వెల్లువ) ప్రాజెక్టు కింద అమూల్‌కు పాలుపోసే రైతులకు రూ.97.86 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. అమూల్‌తో పోటీని తట్టుకోలేక పాల సేకరణ ధరలు పెంచడం వల్ల ప్రెవేటు డెయిరీలకు పాలుపోసే రైతులకు రూ.4,911 కోట్ల మేర అదనంగా లబ్ధి కలిగింది. మరో వైపు వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి అణాపైసలతో సహా లెక్కగట్టి పది రోజులకోసారి నేరుగా వారి ఖాతాలకు డబ్బు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున గరిష్టంగా ధర లభించింది. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనమనే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. అయినప్పటికీ ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10–20 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది. నేడు పాడి రైతుల నిలువు దోపిడీ ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాలసేకరణ నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే 14 జిల్లాల్లో పాలసేకరణ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అన్నమయ్య జిల్లాల్లో కేవలం ఐదారు వందల గ్రామాల్లో నామమాత్రంగా పాలసేకరణ చేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రోజుకు 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా, ఈ ఏడాది కేవలం 50–60 వేల లీటర్లకు మించి సేకరించలేని దుస్థితి ఏర్పడింది. గతంలో మంచి ధర లభించడంతో అమూల్‌కు పాలు పోసే ప్రతి ముగ్గురిలో ఒక పాడి రైతు 2–3 ఆవులను కొనుగోలు చేశారు. ఇప్పుడు పాల సేకరణ ధరలు పడిపోవడంతో రైతులు ఆవులను అమ్ముకుంటున్నారు. ఇదేసాకుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు లీటర్‌కు రూ.15–40 మేర తగ్గించేయడంతో పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–300 వరకు నష్టపోతున్నాడు. రాయలసీమ, ఇటీవల ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీ వారు రోజు10 లీటర్లు పాలు పొసే రైతు నుంచి ఒక లీటర్, ఐదు లీటర్లు పాలు పొసే రైతుకు అరలీటర్ వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతులు ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం లేదు. గోశాలల పేరిట హంగామా చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో పాడి రైతులకు ఒక్కటంటే ఒక్క పాడి గేదె ఇచ్చిన పాపాన పోలేదు. రైతుల వద్ద ఉన్న పాడిలో 25 శాతం తగ్గిపోయిందని లైవ్ స్టాక్ సెన్సెస్ స్పష్టం చేస్తోంది. జీడీపీ, జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలేస్తూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో తగ్గిపోతున్న పాడి, పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం లేదు. మరొక వైపు రిటైల్ మార్కెట్లో పాల విక్రయ ధరలు ప్రైవేటు డెయిరీలు ఇష్టమొచ్చినట్టుగా పెంచేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. అర లీటర్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్‌తో రూ.32–37, రిచ్ గోల్డ్ పాలు రూ.30–32, గోల్డ్ పాలు రూ.28–30 చొప్పున విక్రయిస్తూ దోపిడీకి గురిచేస్తున్నాయి. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు తయారైంది పాల ధర. దీనివల్ల అటు పాడి రైతూ లాభ పడటం లేదు. ఇటు ప్రజలకూ మేలు జరగడం లేదు. మధ్యలో ప్రైవేట్ డెయిరీలు మాత్రం ఇష్టానుసారం దండుకుంటున్నాయి. ఇష్టానుసారం ధర నిర్ణయిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పైగా రైతులకు అండగా నిలిచిన అమూల్ డెయిరీని తరిమేస్తూ ప్రైవేట్ డెయిరీ దందాను ప్రోత్సహిస్తోంది. పాలకు ధర లేదు అమూల్ డెయిరీ పాల సేకరణను ఆపేయించడంతో ధరలు లేకుండా పోయాయి. దీంతో మాకున్న ఆవుల్లో సగానికిపైగా అమ్ముకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పాల ధర లీటర్‌పై రూ.15 నుంచి 20 వరకు తగ్గించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోయండి.. లేదంటే మానుకోండి.. అంటున్నారు. చేసేదీ ఏమీ లేకు ఆవులను అమ్ముకుంటున్నాం. – విమల, కురవపల్లి, చిత్తూరు జిల్లారైతుల పొట్ట కొడుతున్నారు అమూల్ డెయిరీ ఉన్నప్పుడు ప్రైవేటు డెయిరీలన్నీ గిట్టుబాటు ధర చెల్లించేవి. కూటమి ప్రభుత్వం రావడంతో కక్ష కట్టి అమూల్ కేంద్రాలను సాగనంపుతోంది. సహాయ నిరాకరణ చేస్తోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పోటీ లేకపోవడంతో ప్రైవేటు డెయిరీలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అమూల్ డెయిరీకి పాలు పోసేటప్పుడు లీటర్ ఆవు పాలకు రూ.40–45 వచ్చింది. కానీ విధి లేని పరిస్థితిలో ప్రైవేటు డెయిరీలకు తక్కువ ధరకు పాలు పోయాల్సి వస్తోంది. – అచ్చమ్మ, అంగళ్లు,, అన్నమయ్య జిల్లా ఇష్టానుసారం కొనుగోలుప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తూ పాలు కొనుగోలు చేస్తున్నాయి. 2024 ఏప్రిల్ వరకు లీటరు ధర రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.70–75తో కొనుగోలు చేస్తున్నారు. హెరిటేజ్, శ్రీనివాస డెయిరీలు వారి ఇష్టం కొద్దీ ధరలు నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతు ధర నిర్ణయించి అమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. – శ్రీనివాసులు, రైతు నగరం, నంద్యాల బయటి వాళ్లకు విక్రయిస్తున్నా నాకు మూడు పాడి గేదెలున్నాయి. రెండు పూటలా 16 లీటర్ల పాలిస్తాయి. పాలలో వెన్నశాతం తక్కువగా వస్తోందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధర తగ్గించేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలకు 5 లీటర్లు, బయటి వారికి 10 లీటర్ల పాలను విక్రయిస్తున్నాను. బయటి వారు లీటర్‌కు రూ.50 ఇస్తుంటే ప్రైవేటు డెయిరీలు మాత్రం రూ.32–34 ఇస్తున్నారు. – వావిలపల్లి హరిబాబు, ధవుమంతపురం, మన్యం జిల్లా గతంలో లీటర్‌కు రూ.69..ఆవు పాల ధర తగ్గించారు. గతంలో లీటర్‌కు రూ.69 వరకు ఇచ్చేవారు. విశాఖ డెయిరీ లీటర్‌కు రూ.3–5 తగ్గించేసింది. పాడి రైతులకు పెద్దగా గిట్టుబాటు రాక బయటి వాళ్లకు అమ్ముకుంటున్నాం. – పి.వెంకటరావు, యలమంచలి, అనకాపల్లి జిల్లా -
‘విజయ’ పాల ధరల సవరణ!
సాక్షి, హైదరాబాద్: పాడిరైతును ప్రోత్సహించేందుకు విజయ డెయిరీ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ధరలను సవరించాలని నిర్ణయించింది. ఒక్కో లీటరు పాలపై రూ.3 వరకు పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పాల ధరలను సవరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో లీటరు ఆవుపాల ధర ఇతర ప్రైవేట్, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీ దాదాపు రూ.8 నుంచి రూ.9 ఎక్కువగా చెల్లిస్తోంది. రైతులను మరింత ప్రోత్సహించే దిశగా ఆవు పాలు లీటరుపై గరిష్టంగా రూ.3 వరకు పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లీటరు ఆవు పాల ధర రూ.42.24, గేదె పాలధర కూడా రూ.51.00 ఉండేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం ఈ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు చేరినట్టు సమాచారం. రోజుకు 2.8 లక్షల లీటర్లు... పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరకు పాలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ డెయిరీలు, కోఆపరేటివ్ రంగంలోని డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి లీటర్‌కు రూ. 27 నుంచి రూ.32 చొప్పున ఆవుపాలను సేకరించి, మార్కెటింగ్ కమీషన్లను పెంచి మన రాష్ట్రంలో అమ్మకాలను పెంచుకుంటున్నాయి. దీని ప్రభావం విజయ డెయిరీ అమ్మకాలపై పడుతోంది. వీటితోపాటు విజయ పేరుతో కొన్ని డెయిరీలు అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నాయి. ఈ సిబ్లింగ్ విజయ బ్రాండ్ల ద్వారా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రోజుకు విజయ బ్రాండ్ పాలు 2.8లక్షల లీటర్లు అమ్ముడు పోతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలు పెంచే దిశగా కసరత్తు చేస్తున్న విజయ డెయిరీ.. పాడి రైతులందరికీ పాల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయడంతో పాటు ప్రోత్సహించే దిశగా ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా విజయ డెయిరీ యంత్రాంగం సమావేశమై మూడు ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. దాదాపు రూ.50 కోట్ల పాత బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా 5 నుంచి 20వ తేదీ మధ్య పాల బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్‌కు మిల్క్‌షేక్'!
రోజుకు రూ.326 నష్టంఅనంతపురం జిల్లా రోటరీపురానికి చెందిన ఎర్రి స్వామి రోజూ 14 లీటర్ల పాలు అమూల్ కేంద్రానికి పోసేవారు. లీటర్ ఆవు పాలకు రూ.43 చొప్పున ఆరు లీటర్లకు రూ.258, గేదె పాలకు లీటర్ రూ.83 చొప్పున ఎనిమిది లీటర్లకు రూ.664 కలిపి.. మొత్తం రూ.922 ఆదాయం లభించేది. ఇప్పుడు ఈ కేంద్రం మూతపడింది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు ధర తగ్గించడంతో ఆవు పాలు లీటర్ రూ.30, గేదె పాలు రూ.52కి అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే ఆవు పాలు లీటర్‌కు రూ.13 నష్టం, గేదె పాలు లీటర్‌కు రూ.31 నష్టం. ఫలితంగా రోజూ రూ.326 చొప్పున నష్టపోతున్నట్లు స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఒక్క గ్రామంలోనే రూ.1.34 లక్షలు నష్టం..అనంతపురం జిల్లా రోటరీపురంలో నిత్యం 16 మంది రైతులు 160 లీటర్ల ఆవు పాలు, 80 లీటర్ల గేదె పాలు జగనన్న పాలవెల్లువ కేంద్రానికి పోసేవారు. గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.84, ఆవు పాలకు రూ.43 చొప్పున దక్కేది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ కేంద్రం మూతపడింది. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులకు పాలు పోస్తుండటంతో లీటర్ ఆవు పాలకు రూ.30, గేదె పాలకు రూ.54 చొప్పున ఇస్తున్నారు. ఫలితంగా లీటర్‌పై ఆవుపాలకు రూ.13 చొప్పున రూ.2,080, గేదె పాలకు రూ.30 చొప్పున రూ.2,400లను ఈ గ్రామ పాడిరైతులు రోజూ నష్టపోతున్నారు. ఒక్క ఈ గ్రామంలోనే రోజుకు రూ.4,480 చొప్పున నెలకు రూ.1.34 లక్షలకు పైగా ఆదాయాన్ని పాడి రైతులు కోల్పోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అమూల్ పాల కేంద్రాలతో ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నష్టపోతున్నారు. పాలసేకరణ ధరలు దారుణంగా తగ్గిపోవడం వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలుపోసేవారు మరో రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టపోతున్నారు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ డెయిరీల దోపిడీ మళ్లీ మొదలైంది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో పాల సేకరణ ధరలు గణనీయంగా తగ్గిపోయి పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఒకపక్క పాడి పశువుల ధర రూ.లక్షల్లో ఉంది. మరోపక్క పెరుగుతున్న దాణా ఖర్చులతో పోషణ భారంగా మారింది. ఇలాంటి సమయంలో పాడి రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వ పెద్దలు వారి పొట్టగొడుతున్నారు. తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో గతంలో ఆవు పాలకు లీటర్‌కు రూ.30 నుంచి రూ.38 మధ్య చెల్లించిన హెరిటేజ్ డెయిరీ ప్రస్తుతం రూ.23 నుంచి రూ.31కి మించి చెల్లించడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక గేదె పాలకు గతంలో రూ.40–రూ.50 వరకు చెల్లించిన హెరిటేజ్... తాజాగా రూ.35 నుంచి రూ.40కి మించి ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అదే సమయంలో కాకినాడ జిల్లాలో సోమవారం అమూల్‌కు పాలుపోసిన రైతులకు గేదెపాలకు లీటరుకు గరిష్టంగా రూ.92–93, ఆవు పాలకు రూ.39–40 చెల్లించింది. ఇలా జగనన్న పాలవెల్లువ కేంద్రాల (అమూల్) ద్వారా దాదాపు నాలుగేళ్లపాటు లాభాలతో పొంగిపోయిన రాష్ట్రంలోని పాడి రైతులు కూటమి సర్కారు కక్షపూరిత చర్యలతో ఇప్పుడు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 11 జిల్లాల్లో ఈ కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన జిల్లాల్లో కూడా సేకరణ అంతంత మాత్రంగానే పాక్షికంగా సాగుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ డెయిరీల దోపిడీతో పాలకు గిట్టుబాటు ధర లభించక, బ్యాంకు రుణాలు తీర్చే దారి కానరాక రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల పాడి రైతు కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయాయి. గతంలో చంద్రబాబు హయాంలో పులివెందుల, చిత్తూరుతో సహా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర, ప్రైవేట్ డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం సహకార రంగంలో దేశంలోనే నెం.1గా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులను ఆదుకుంది.అమూల్ రాకతో పాల విప్లవం.. ఎనిమిది సార్లు సేకరణ ధర పెంపుఅమూల్ తొలుత మూడు జిల్లాల్లో ప్రారంభమై 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాల నుంచి 4,798 పల్లెలకు చేరుకుంది. 2020 అక్టోబర్‌లో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే 11 శాతం వెన్న, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్)తో గేదె పాలకు లీటర్ రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా 8 సార్లు పాలసేకరణ ధరలను పెంచి గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లించింది. ఇలా 40 నెలల్లో గేదెపాలకు లీటర్‌పై రూ.18.29, ఆవుపాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూరుస్తామన్న హామీ కంటే మిన్నగా గేదె పాలపై రూ.15–20, ఆవు పాలపై రూ.10–15 వరకు అదనంగా లబ్ధి చేకూర్చింది.రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధర..గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వెన్న శాతాన్ని బట్టి కాకినాడ జిల్లాలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున అమూల్‌కు పాలుపోసిన రైతులకు దక్కిన దాఖలాలున్నాయి. వెన్న శాతాన్ని బట్టి లెక్కగట్టి అణా పైసలతో సహా ప్రతి 10 రోజులకోసారి రైతుల ఖాతాలో జమ చేసేవారు. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనంగా ఉండే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది.80 శాతం కేంద్రాలు మూతగతంలో 19 జిల్లాలకు విస్తరించిన అమూల్ పాలసేకరణ కూటమి సర్కారు సహాయ నిరాకరణతో ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకే అది కూడా పాక్షిక సేకరణకు పరిమితమైంది. 4,798 కేంద్రాల్లో జరిగిన పాల సేకరణ వెయ్యి కేంద్రాలకు తగ్గిపోయింది. ఐదు నెలల క్రితం అమూల్‌కు పాలు పోసే వారి సంఖ్య రోజుకు సగటున 1.25 లక్షలు ఉండగా నేడు 20 వేలకు క్షీణించింది. ఇదే సమయంలో పాల సేకరణ 3.95 లక్షల లీటర్ల నుంచి 1.30 లక్షల లీటర్లకు తగ్గిపోయింది.కుటుంబ సంస్థకు మేలు చేసేందుకే..సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టింది మొదలు సొంత డెయిరీకి మేలు చేస్తూ అమూల్‌ను నీరుగార్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. నాలుగు దశాబ్దాల క్రితం సహకార సమాఖ్యగా ఏర్పడిన విజయ డెయిరీ నిలదొక్కుకునేందుకు ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) దాదాపు దశాబ్దం పాటు చేయూతనిచ్చింది. పాలసేకరణ, రైతుకు మద్దతు ధర, పాల ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చారు. అదే రీతిలో అమూల్‌కు చేయూత నిచ్చేందుకు నియమించిన సిబ్బందిని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రెండో రోజే వెనక్కి రప్పించింది. అంగన్వాడీ కేంద్రాలకు రోజూ 50 వేల లీటర్ల పాల సరఫరా బాధ్యతల నుంచి సైతం అమూల్‌ను తప్పించింది. దీంతో సేకరణ కేంద్రాలను మూసివేసే దిశగా అమూల్ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత అనంతపురం, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో కేంద్రాలను నిలిపి వేసిన అమూల్ అనంతరం గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల సహా 11 జిల్లాల్లో పాలసేకరణను నిలిపి వేసింది. మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా సేకరణ జరుగుతోంది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలను తగ్గించేయడంతో గ్రామీణ మహిళా పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. హెరిటేజ్ సహా ప్రధాన ప్రైవేటు డెయిరీలన్నీ పాల సేకరణ ధరలను లీటర్‌పై సగటున ఆవు పాలకు రూ.10–20, గేదె పాలకు రూ.15 నుంచి రూ.30 వరకు తగ్గించేశాయి. తాము చెప్పిందే ధర, ఇచ్చిందే తీసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నాయి. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–500 వరకు నష్టపోతున్నారు.గత ప్రభుత్వం పాడి రైతులను ఆదుకుందిలా..180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేల చొప్పున, కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున ఆర్ధిక చేయూతనిచ్చారు. ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనా వ్యయంతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ), ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూతపడిన మదనపల్లి డెయిరీని అమూల్ సహకారంతో పునరుద్ధరించారు. చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌కు లీజుకిచ్చారు. రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.ప్రతి నెలా బోనస్ వచ్చేదిఅమూల్ కేంద్రానికి రోజూ 9 లీటర్లు పాలు పోశాం. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి గరిష్టంగా లీటర్‌కు రూ.85–95 వరకు ఇచ్చేవారు. ప్రతి నెలా బోనస్ వచ్చేది. పది రోజులకోసారి బ్యాంక్ ఖాతాలో సొమ్ములు జమ చేసేవారు. అమూల్ కేంద్రం మూతపడడంతో ప్రెవేట్ డెయిరీకి పోయాల్సి వస్తోంది. ఎస్ఎన్ఎఫ్ శాతం ఎంత ఉన్నా లీటరుకి రూ.75కి మించి రావడం లేదు. సగటున రోజుకి రూ.100కిపైగా నష్టపోతున్నా. – ఎనుముల పవనకుమారి, పోతవరం, ప్రకాశం జిల్లా.పట్టించుకోకపోవడం దారుణంఅమూల్ కేంద్రానికి పూటకు 4 లీటర్లు పాలు పోసేవాళ్లం. గేదె పాలు లీటర్‌కు రూ.70కు పైగా వచ్చేది. ఇప్పుడు అమూల్ కేంద్రం మూతపడటంతో ప్రైవేట్ డెయిరీలు రూ.30కి మించి ఇవ్వడం లేదు. బ్యాంక్ రుణాలు ఎలా చెల్లించాలో తెలియడం లేదు. అమూల్ కేంద్రాలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. – ఎం.భారతి, సముదాయం, తిరుపతి జిల్లామళ్లీ బెంగళూరు వలస వెళ్లాల్సిందే...రోజూ 32 లీటర్ల పాలు అమూల్‌కు పోసేవాళ్లం. లీటరుకు రూ.42 చొప్పున రోజుకు రూ.1,300కిపైగా వచ్చేవి. రెండు రోజులుగా శ్రీజ డెయిరీకి పోస్తున్నా. ఇప్పుడు రోజుకు రూ.900 కూడా రావడం లేదు. అమూల్ ద్వారా మహిళా సహకార సంఘంలో నాలుగు ఆవులను రూ.2 లక్షల లోన్‌పై తీసుకున్నా. రుణ వాయిదాలు ఎలా చెల్లించాలో దిక్కు తోచడం లేదు. ఇలాగైతే పాడిని అమ్ముకోవడం మినహా గత్యంతరం లేదు. పాడి రైతులంతా గతంలో మాదిరిగా బెంగళూరు వలస వెళ్లాల్సిందే. – శశికళ, కౌలేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాజగన్పై కోపాన్ని మాపై చూపిస్తున్నారు..రోజూ 20 లీటర్ల వరకు పాలు పోస్తాం. ఈ ఏడాది ఏప్రిల్, మే వరకు ఆవు పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.44, గేదె పాలకు గరిష్టంగా రూ.67 వరకు లభించింది. అత్తమీద కోపం దుత్తపై చూపినట్లు జగన్‌పై కోపాన్ని పాడి రైతులపై చూపిస్తున్నారు. ఇలాగైతే పాడి పశువులను అమ్ముకోవాల్సిందే. – పి.ఉమా, కురబాలకోట, అన్నమయ్య జిల్లాఇదే పరిస్థితి ఉంటే పాడిని వదిలేస్తాంవెన్న శాతాన్ని బట్టి గతంలో లీటరుకి రూ.82 వచ్చేది. ప్రస్తుతం వెన్న శాతం ఎంత ఉన్నా రూ.72కు మించి ఇవ్వడం లేదు. గతంలో రూ.80–100 ఉండే ఒక బొద్దు ఎండు గడ్డి ప్రస్తుతం రూ.120 చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. గేదెలకు ఎండు గడ్డి వేయకపోతే వెన్న శాతం పెరగదు. తవుడు కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. జగన్ హయాంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించింది. ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలను దారుణంగా తగ్గించేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పాడిని వదిలేస్తాం. – ఎం.బ్రహ్మయ్య, రాళ్లపాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లామేం రోడ్డున పడ్డాం..అమూల్ కోసం మహిళా పాల సహకార సంఘం ద్వారా రోజూ 480 లీటర్ల వరకు సేకరించేవాడ్ని. లీటర్‌కు రూ.1.25 చొప్పున నెలకు రూ.18 వేలు కమిషన్ వచ్చేది. ఆ డెయిరీ మూత పడడంతో రోడ్డున పడ్డాం. ఆవులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అమూల్ కేంద్రాలు మూతపడకుండా చూడాలని వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. – చంద్రమోహన్, కొండకమర్ల, శ్రీసత్యసాయి జిల్లా -
పాలు అందరికీ అందుతున్నాయా?
అధికారిక డేటా ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. భారతదేశపు పాల ఉత్పత్తి మెజా రిటీ బర్రెల నుండి లభిస్తుండగా, ఆవు పాల వాటా పెరుగుతోంది. 2021 నాటికి ఆవు పాల వాటా 48.2%. 2019లో విడుదల చేసిన 20వ పశుగణన ప్రకారం, ఆవులు బర్రెలు, పాలు ఇచ్చేవి వట్టి పోయినవి కలిపి, దేశంలో మొత్తం పాడి పశువులు 12.57 కోట్లు. మునుపటి గణనమీద ఇది 6% పెరుగు దల. పాలు ఇచ్చే పశువుల సంఖ్య వేరుగా లేదు. వట్టి పోయిన పశువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? పశువుల సంఖ్యలో పెరుగుదల ఎట్లా సాధ్యం? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకూ, క్షేత్ర పరిస్థితికీ మధ్య తేడా ఉన్నది. పలుచనవుతున్న పాలుదేశంలోని 110 బిలియన్ డాలర్ల పాడి పరిశ్రమలో డెయిరీ సహకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, ‘అమూల్’, ‘మదర్ డెయిరీ’ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన సంఘటిత రంగం వాటా కేవలం 30 బిలియన్ డాలర్లు. ఇది 30 శాతం కంటే తక్కువ. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో సగానికి పైగా ప్రాసెస్ అవుతున్నది. అంటే నెయ్యి వగైరా వాటికి లేదా ఇతర ఉత్పత్తులలో ఒక ముడి పదార్థంగా వాడతారు. మిగిలిన 48% పాలుగా అమ్ముతున్నారు. నిత్యం పాలు వాడే హోటళ్ళు, స్వీట్ దుకాణాలలో పన్నీర్ కొరకు కూడా డిమాండ్ పెరుగుతోంది. పెద్ద హోటళ్ళు వాళ్ళకు అవసరమైన పాలను అధిక ధరకు కొని, వినియోగ దారుల నుంచి వసూలు చేయగలవు. దరిమిలా చిన్న హోటళ్ళు, చాయ్ దుకాణాలకు అంతగా పాలు దొరక కపోవచ్చు. లేదా ఆ ధర వాళ్ళు పెట్టలేరు. ముడి పాల కొరకు ఉన్న ఇటువంటి పోటీ గురించి, అంతర్గత డిమాండ్ గురించి, ఆ యా వినియోగ వర్గాలు చెల్లిస్తున్న ధరల గురించి విశ్లేషణలు లేవు. పోటీ పడలేని వ్యక్తులు, రంగాలు అసంఘటిత రంగంలోనే ఎక్కువ. పర్యవసానంగా, చాయ్ దుకాణాల చాయ్‌లో పాల ‘శాతం’ తగ్గుతున్నది. కొన్ని ఉత్పత్తులలో పాలు పలుచన అవుతున్నాయి.చిన్న పిల్లల ఎదుగుదలకు ముడి పాలు అవస రమని వైద్యులు, పోషకాహార నిపుణులు నిత్యం వల్లెవేస్తున్న తరుణంలో ‘అందరికీ పాలు’ దొరకక పోవడం అన్యాయమే. పేద వాడికి పాలు అందక పోవడం మన ఆహార వ్యవస్థలో ఉన్న తీవ్ర లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రభుత్వ చర్యలు కావాలి. ఒక ఊర్లో ఉత్పత్తి అవుతున్న పాలు, ఇతర ఉత్పత్తులు అక్కడే, లేదా ఆ ప్రాంతంలోనే వినియోగం అయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి.దిగుమతులతో దెబ్బతినే జీవనోపాధిఅమెరికా సహా వివిధ దేశాల నుంచి ఏటా రూ. 200–300 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. 2020లో భారత ప్రభుత్వం 10,000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. 2023 జన వరిలో, దేశంలోకి పాలు, క్రీమ్ దిగుమతులు మునుపటి సంవత్సరం కంటే వెయ్యి శాతం పైగా పెరిగి 4.87 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.పాల ఉత్పత్తుల దిగుమతులను సరళీకృతం చేయా లని భారత్ మీద ఐరోపా కమ్యూనిటీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నది. డెయిరీ ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాలు తగ్గించాలని వాణిజ్య ఒప్పందాలలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశం నుండి డెయిరీ దిగుమతులకు నిబంధనలు పెట్టి రష్యా, యూరప్, మెక్సికో, చైనా అనుమతించడం లేదు. డెయిరీ దిగుమతులపై 60–70% సుంకం విధిస్తున్న అమెరికా, భారతదేశం విధించే 30–60% సుంకాలను తగ్గించాలని కోరుతున్నది. ఇంకొక వైపు అమెరికా తన డెయిరీ రంగానికి సంవత్సరానికి 28 బిలియన్ డాలర్ల సబ్సి డీలను ఇస్తుంది. పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే లక్షలాది మంది భారత చిన్న, సూక్ష్మ పాడి రైతుల జీవనోపాధి ఆగమైపోతుంది అనే ఆందోళన నెలకొంది.విధానాలు అనుకూలమేనా?ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 5%. దాదాపు 7 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ జీవనోపాధులను, వాతావరణ మార్పులను, కులం, మతాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు వివిధ రకాలగా పాలకు ధర చెల్లిస్తున్నారు. పంటల మాదిరే పాడి రైతుకు ఆ వినియోగం నుంచి వస్తున్న డబ్బులో ఎంత శాతం చేరుతున్నది అనే ప్రశ్న ఉన్నది. బర్రె మీద, ఆవుల మీద పెట్టాల్సిన ఖర్చుకు తగినట్టు ముడి పాలకు ధర లేదనీ, ఇంకా ఆదాయం సంగతి దేవుడెరుగు అనీ పాడి రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అనేకం ఉన్నాయి. అందులో అనేకం చిన్న పాడి రైతులు అందుకోలేరు. భారత పాడిపరిశ్రమలో సరళీకృత విధానం చిన్న రైతులకు ముప్పు కలిగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పాడి రైతులకు భూమి దొరికే అవకాశం తగ్గిపోతున్నది. పట్టణాలలో, పట్టణ శివార్లలో భూమి ధరలకు రియల్ ఎస్టేట్ వలన రెక్కలు రావడం వల్ల చిన్న పాడి రైతు మనగలిగే పరి స్థితులు లేవు.సగటు రైతు ఆదాయం రూ. 7,000 అని ప్రభుత్వం అంటున్నది. పశుపోషణ ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. దేశంలోని రైతులు తమ మొత్తం పశుపోషణ ఆదాయంలో దాదాపు 67% పాడి ద్వారా సంపా దిస్తున్నారు. ఇంకా అనేక రకాల ఉపయోగం పాడి పశువులతో ఉంది. పర్యావరణం వినాశనం అవుతున్న తరుణంలో పశువుల వైవిధ్యం, ఆహారం, సుస్థిర జీవనం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. పుడమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషణ ఇంకా సమస్యాత్మకంగా మారుతున్నది. హైబ్రిడ్ జాతులతో, పాశ్చాత్య పశు పోషణ పద్ధతుల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. అనారోగ్య పశువుల సంఖ్య పెరుగు తున్నది. శుభ్రత పాటించని ఆధునిక డెయిరీల వల్ల పశువుల వ్యాధులు మానవులకు సంక్రమిస్తున్నాయి. పశువులకు సరైన ఆహారం, జీవనం లేని కారణంగా వాటి పాలలో కూడా పోషకాలు ఉండటం లేదు. విషాలు, రసాయనాలు, యాంటీ బయాటిక్స్ వాటికి ఇవ్వడం వలన, వాటి పాల ద్వారా అవి మనుషులకు చేరుతున్నాయి.పశుపోషణలో సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యానికి చాలా విలువ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పశువులను ప్రకృతి వనరుగా పరిగణించాలి. ఈ సూత్రం ఆధారంగా విధానం తీసుకురావాలి. పథకాలు వాటి సుస్థిరతకు, విస్తృతికి ఉపయోగపడే విధంగా రూప కల్పన చెయ్యాలి. స్థానిక పాడి రైతులను స్థానిక మార్కె ట్లతో అనుసంధానం చెయ్యాలి. పాలు, పాల ఉత్పత్తులు గ్రామాలలో ప్రథమంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పాడి రైతులకు ప్రతి ఏటా చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను ప్రకటించి, అమలు చెయ్యాలి. పాల సహకార సంఘాల సంఖ్యను పెంచాలి. కేంద్రీకృత పాల మార్కెటింగ్ వ్యవస్థకు ఇచ్చే సబ్సిడీలు స్థానిక సహకార సంస్థలకు ఇవ్వాలి. భూమి వినియోగ విధానం రూపొందించి అందులో గడ్డి మైదానాలకు స్థానం కల్పించాలి. పశుగ్రాసానికి, దాణాకు సంబంధించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలి. పాడి రైతులకు భూమి ఇవ్వాలి. లేదా భూమి ఉన్న రైతుకు పాడి పశువులను అందజెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డివ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ నెయ్యి
లాలాపేట (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన నెయ్యిని విజయ డెయిరీ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) నూతన చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్‌కు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేయాలని ఆయన సూచించారు.పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో పెండింగ్ పాల బిల్లులను త్వరలో చెల్లించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం లాలాపేటలోని విజయ భవన్లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను ఆదరించి తెలంగాణ రాష్ట్ర పాడి రైతులను, పాడిపరిశ్రమను బలపరచాలనీ కోరారు. పాల సేకరణ ధరను మూడు పర్యాయాలు పెంచాం రాష్ట్రంలోని 32 జిల్లాలోని 40,445 పాడి రైతుల నుంచి 6,148 పాల సేకరణ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెపె్టంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడాలేని విధంగా 3 పర్యాయాలు రూ. 12.48 పైసలు పెంచామన్నారు. దీంతో పాల సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు.అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను తక్కువ ధరకు రూ. 26 నుంచి రూ. 34లకే కొని ఇక్కడ తక్కువ ధరకు అమ్మకాలు చేపట్టాయని, దీంతో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. అందుకే పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. -
పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష
సాక్షి, అమరావతి: పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర పొందుతున్న రైతుల పొట్టకొడుతోంది. పాలు సేకరించే క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉపసంహరించడంతో పాటు అమూల్‌కు సహాయ నిరాకరణ చేస్తూ ప్రైవేటు డెయిరీల దోపిడికీ తెర తీస్తోంది. ముఖ్యంగా సొంత డెయిరీకి మేలు చేయడమే లక్ష్యంగా రాయలసీమ జిల్లాల్లో అమూల్‌కు మోకాలడ్డుతోంది. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక అమూల్ కూడా పాల సేకరణ నిలిపివేస్తోంది. తిరుపతిలో ఈ నెల 21 నుంచి, అనంతపురం జిల్లాలో 11వ తేదీ నుంచి పాల సేకరణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ సెప్టెంబర్ 1 నుంచి పాల సేకరణ నిలిపివేసేందుక చర్యలు చేపడుతోంది. బాబు చర్యలు రాష్ట్రంలోని లక్షలాది పాడి రైతులకు శరాఘాతంగా మారాయి. రాష్ట్రంలో పాడి రైతుల్లో అధిక శాతం మహిళలే. వారే ఇప్పుడు అమూల్ పాల సేకరణ కేంద్రాలు కొనసాగించాలంటూ ఆందోళన బాట పట్టారు. తిరుపతి, అనంతపురం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద వందలాది మహిళలు, రైతులు నిరసన వ్యక్తంచేశారు. అమూల్ రాకతో గడిచిన మూడేళ్లుగా లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి పొందుతున్నామని, బ్యాంకుల నుంచి రకు రుణాలు తీసుకుని కొత్త పశువులను కొన్నామని రైతులు చెబుతున్నారు. అమూల్ కేంద్రాలు మూసివేస్తే, ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలు తగ్గించేస్తాయని, అప్పుడు తమ బతుకులు అంధకారంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పొమ్మనకుండా పొగబాబు కూటమి అధికార పగ్గాలు చేపట్టింది మొదలు అమూల్ విషయంలో పొమ్మనకండా పొగపెట్టాలా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమూల్ ప్రాజెక్టు విస్తరణ కోసం జిల్లాకో డెయిరీ డెవలప్మెంట్ అధికారిని నియమించారు. గ్రామ సచివాలయాల్లోని డిజిటల్, వెల్ఫేర్, యానిమల్ అసిస్టెంట్స్ పర్యవేక్షణలో పాలసేకరణ జరిగే ప్రతి 15–20 గ్రామాలకో మెంటార్‌నూ, ప్రతి 3–4 సచివాలయాల పరిధిలో ఒక రూట్ ఇన్చార్జిని నియమించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జేడీ, డీఆర్డీఎ పీడీ, జిల్లా సహకార శాఖాధికారులు పర్యవేక్షించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 4వ రోజూనే వీరందర్ని వెనక్కి పంపేసింది. అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా బాధ్యతల నుంచి అమూల్‌ను తప్పించింది. అమూల్ ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని 8.3 శాతానికి పెంచడం, పాలసేకరణ ధరను రూ.4 వరకు తగ్గించడం ప్రభుత్వ ఒత్తిళ్ల ఫలితమేనని చెబుతున్నారు. 4,798 గ్రామాల్లో జరగాల్సిన పాల సేకరణ ఇప్పుడు 2 వేల గ్రామాలకు పరిమితమైంది. పాలుపోసే వారి సంఖ్య 1.20 లక్షల నుంచి 30వేల మందికి తగ్గిపోయింది. ఇప్పటికే పాల ఉత్పత్తి పెరిగిందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించేశాయి. అమూల్ పాలసేకరణ నిలిపివేస్తే, ఇక ప్రైవేటు డెయిరీలదే రాజ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రైవేటు డెయిరీల దోపిడికీ వైఎస్ జగన్ కళ్లెంప్రైవేటు డెయిరీల దోపిడికీ కళ్లెం వేసి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా సహకార డెయిరీలకు పూర్వ వైభవం తేవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 డిసెంబర్లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహకార డెయిరీ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న అమూల్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. ప్రతి పాడి రైతుకు లీటర్‌పై రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా రూ.10 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూర్చింది.వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యమంలా విస్తరణ3 జిల్లలు (వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం)తో మొదలై 19 జిల్లాలకు జగనన్న పాల వెల్లువ విస్తరణ 401 గ్రామాలు, 24,277 మంది రైతులతో మొదలై నేడు 4,798 గ్రామాలు 4.50 లక్షల మంది రైతుల భాగస్వామ్యం రోజూ పాలు పోసే వారి సంఖ్య 800తో మొదలై 1.25 లక్షలకు చేరిక పాల సేకరణ రోజుకు సగటున 1,800 లీటర్ల నుంచి 3.75 లక్షల లీటర్లకు చేరిక అమూల్ ద్వారా 3.5 ఏళ్లలో 20 కోట్ల లీటర్ల పాలసేకరణ రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బు రూ.925 కోట్లు అందించిన ప్రయోజనాలు– 180 రోజులు పాలు పోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి– లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ– వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేలు సాయం– కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు సాయం– 9,899 గ్రామాల పరిధిలో ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనాతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఎఎంసీయూ) ఏర్పాటు– ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి శ్రీకారం– ఎఎంసీయూల్లో రూ.1.50 లక్షల, బీఎంసీయూల్లో రూ.15 లక్షల విలువైన పరికరాల ఏర్పాటు– అమూల్ ద్వారా మూతపడిన మదనపల్లి డెయిరీ పునరుద్ధరణ– చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌కు లీజుకు. ఇప్పటికే రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభంరైతులకు మరింత లబ్ధిఅమూల్ డెయిరీ 7 సార్లు పాలసేకరణ ధరలు పెంచడంతో 3.5 ఏళ్లలో లీటర్‌కు గేదెపాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు లీటర్‌కు రూ.43.69 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్‌తో పోటీపడి ప్రైవేటు డెయిరీలు కూడా పాల సేకరణ ధరలు పెంచాల్సివచ్చింది. దీంతో వాటికి పాలు పోసే రైతులకు రూ.5 వేల కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. అమూల్ సంస్త ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పక్కాగా లెక్క గట్టి అణాపైసలతో సహా చెల్లిస్తుండడంతో గరిష్టంగా గేదె పాలకు లీటర్‌కు రూ.100, ఆవు పాలకు రూ.50కు పైగా ధర పొందగలిగారు. పాలుపోసిన 10 రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ చేయడంతో పాడి రైతుల్లో అమూల్ పట్ల నమ్మకం పెరిగింది. పక్కాగా లెక్కగట్టి ఇచ్చేవారుప్రైవేటు డెయిరీలు 15 రోజులకోసారి పాల డబ్బులు చెల్లిస్తే అమూల్ 10 రోజులకే మా ఖాతాల్లో వేస్తోంది. పైగా ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.32 నుంచి రూ.42 వరకు వరకు చెల్లిస్తున్నారు. ఇతర డెయిరీలు పాల శాతాన్ని కచ్చితంగా లెక్కించడంలేదు. రూ.25 నుంచి రూ.30 వరకు మాత్రమే ఇస్తున్నారు. 10 రోజుల్లో 35 లీటర్ల వరకు పాలు పోస్తాం. రూ.1500 వరకు జమవుతోంది. అమూల్ కేంద్రాలను కొనసాగించాల్సిందే..– వెంకటశివారెడ్డి, రంగన్నగారిగడ్డ, తిరుపతి జిల్లామూతపడితే మా బతుకులు అగమ్యగోచరంప్రైవేటు డెయిరీలు 15 రోజుల సరాసరి పాల శాతాన్ని గణించి రేటు నిర్ణయిస్తాయి. అమూల్ ఏ రోజుకారోజే పాల శాతాన్ని లెక్కిస్తుంది. దీంతో గిట్టుబాటు ధర వస్తోంది. పాడి కొనుగోలుకు అమూల్ రుణాలు కూడా ఇప్పించింది. ఇతర డెయిరీల్లో ఈ సౌకర్యం లేదు. 10 రోజుల్లో 30 లీటర్లు పాలు పోస్తా. రూ.1,400 వరకు జమవుతుంది. అమూల్ కేంద్రాలు మూతపడితే మా బతుకులు అగమ్య గోచరంగా మారతాయి.– స్వామిదాస్, తిరుపట్టం, తిరుపతి జిల్లాకలెక్టరేట్ల వద్ద రైతుల ఆందోళనఅనంతపురం అర్బన్/తిరుపతి అర్బన్: అమూల్ పాల సేకరణ రద్దు చేస్తే పాడి రైతులు నష్టపోతారని, పాల వెల్లువ పథకాన్ని కొనసాగించాల్సిందేనంటూ మహిళా పాడి రైతులు అనంతపురం, తిరుపతి కలెక్టరేట్ల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారలకు వినతిపత్రాలు అందజేశారు. తిరుపతిలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అమూల్ పాల సేకరణ కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరికరాలతో పాల తూకం, వెన్న శాతం, ఎన్ఎన్ఎఫ్ శాతం ఆటోమేటిక్‌గా నమోదవుతూ ప్రతి రైతుకూ వారి ఖాతాల్లోకి పది రోజుల్లో కచ్చితంగా డబ్బు జమయ్యేదని రైతు సంఘం నేతలు చెప్పారు. అమూల్ ద్వారానే రైతులకు మేలు జరిగేదన్నారు. ఎంతో పారదర్శకంగా సాగుతున్న ఈ మొత్తం ప్రక్రియను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని మండిపడ్డారు. -
దిగుబడులు పెంచుతున్న రైతు‘బడులు’
సాక్షి, అమరావతి: నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు పొలం బడులు.. పట్టు దిగుబడులు పెంచేందుకు పట్టుబడులు, ఉద్యాన రైతుల కోసం తోట బడులు, ఆక్వా రైతుల కోసం మత్స్య సాగు బడులు, పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తోంది. ‘ఈ–ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్’ ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు ఉత్పత్తుల్లో నాణ్యతతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన విషపూరిత రసాయనాలు (యాంటీìబయోటిక్స్) వినియోగానికి బ్రేకులు పడ్డాయి. పాల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో సుమారు 10 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వగలిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో.. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు క్షేత్ర ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సమగ్ర సస్యరక్షణ, పోషక, నీటి, కలుపు యాజమాన్య పద్ధతులతోపాటు కూలీల ఖర్చును తగ్గించుకునేలా అవగాహన కలి్పస్తున్నారు. సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా కాగా.. 9 నుంచి 20 శాతం మేర దిగుబడులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎకరాకు వరిలో 275 కేజీలు, మొక్కజొన్నలో 300 కేజీలు, పత్తిలో 45 కేజీలు, వేరుశనగలో 169 కేజీలు, అపరాల్లో 100 కేజీల అదనపు దిగుబడులు సాధించారు. అలాగే పట్టు సాగుబడుల ద్వారా పట్టుగూళ్ల ఉత్పాదకత ప్రతి వంద గుడ్లకు 60 కేజీల నుంచి 77 కేజీలకు పెరిగింది. ఆక్వా ఉత్పత్తుల్లో తగ్గిన యాంటీబయోటిక్స్ వినియోగం సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో అప్సడా, సీడ్, పీడ్ యాక్టుల్ని తీసుకురావడంతోపాటు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచి్చంది. నాణ్యమైన ఆక్వా దిగుబడులు సాధించడం ద్వారా యాంటీబయోటిక్స్ వినియోగాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలిస్తున్నాయి.మితిమీరిన యాంటీబయోటిక్స్ వినియోగం వల్ల అమెరికా, చైనా సహా యూరప్, మధ్య ఆసియా దేశాలు గతంలో మన ఆక్వా ఉత్పత్తులను తిరస్కరించేవి. మత్స్య సాగుబడుల ద్వారా ఇస్తున్న శిక్షణ ఫలితంగా యాంటీబయోటిక్స్ శాతం గణనీయంగా తగ్గించగలిగారు. గతంలో 37.5 శాతం నమోదైన యాంటీబయోటిక్స్ అవశేషాలు ప్రస్తుతం 5–10 శాతం లోపే ఉంటున్నాయని చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడంతోపాటు దిగుబడులు సైతం 10–15 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు. గడచిన ఐదేళ్లలో ఏపీ నుంచి రొయ్యల కన్సైన్మెంట్లను తిప్పిపంపిన ఘటనలు చోటుచేసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. పశువుల్లో తగ్గిన వ్యాధులు మరోపక్క ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పశు విజ్ఞాన బడుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనలో మూగ, సన్న జీవాలకు సీజన్లో వచ్చే వ్యాధులు 20–30 శాతం మేర తగ్గాయని గుర్తించారు. ఈనిన 3 నెలలకే ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించడం వల్ల ఏడాదికో దూడను పొంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతున్నారు. దూడలు పుట్టుక మధ్య కాలం తగ్గడంతో లీటరున్నరకు పైగా పాల దిగుబడి (15–20 శాతం) పెరిగిందని, ఆ మేరకు రైతుల ఆదాయం పెరిగిందని గుర్తించారు. దూడ పుట్టిన నాటినుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని వాటిని అవలంబించడం ద్వారా దూడల్లో మరణాల రేటు 15 శాతం, సకాలంలో పశు వైద్య సేవలందించడం వల్ల 10 శాతం మేర పశువుల మరణాలు ‡తగ్గినట్టు గుర్తించారు. హెక్టార్‌కు 4 టన్నుల దిగుబడి నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్ వేశా. మత్స్య సాగుబడుల్లో చెప్పిన సాగు విధానాలు పాటించా. సిఫార్సు చేసిన ప్రోబయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు పెడితే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు మించి ఖర్చవలేదు. గతంలో హెక్టార్‌కు 3నుంచి 3.2 టన్నుల దిగుబడి రాగా.. ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనపు ఆదాయం వచి్చంది. –పి.లక్ష్మీపతిరాజు, కరప, తూర్పు గోదావరి జిల్లాపశువిజ్ఞాన బడులతో ఎంతో మేలు మా గ్రామంలో 26 మంది రైతులు 3,600 గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రోగాలొస్తే తప్ప పశువైద్యుల దగ్గరకు వాటిని తీసుకెళ్లే వాళ్లం కాదు. తరచూ వ్యాధుల బారిన పడుతూ మృత్యువు పాలయ్యేవి. తగిన బరువు తూగక ఆరి్థకంగా నష్టపోయే వాళ్లం. పశువిజ్ఞాన బడుల వల్ల క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తుండటంతో వ్యాధులు, మరణాల రేటు తగ్గింది. సబ్సిడీపై ఇస్తున్న పచి్చమేత, సమీకృత దాణాను తీసుకోగలుగుతున్నాం. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక బరువును పొంది అధిక లాభాలను ఆర్జిస్తున్నాం. – బమ్మిడి అప్పలరాజు, తొడగువానిపాలెం, విశాఖ జిల్లా -
పశుపోషకులకు బాసటగా..
సాక్షి, అమరావతి: ఎవరైనా ఊహించారా మూగజీవాల కోసం అంబులెన్స్‌లు వస్తాయని, పాడి రైతు ఇంటి వద్దే ఆ మూగజీవాలకు వైద్యం అందుతుందని.. అయితే ఈ ఊహాతీతమైన విషయాన్ని నిజం చేసింది వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచింది. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో తీసుకొచ్చిన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ పశుపోషకులకు వరంగా మారాయి. 108 తరహాలోనే ఫోన్ చేసిన అరగంటలోనే పాడిరైతుల ఇంటి వద్దకు చేరుకుని వైద్యసేవలు అందిçస్తున్నాయి. పాడి రైతుల జీవనా«దారాన్ని నిలబెడుతున్నాయి. ఈ వాహనాలు రోడ్డెక్కి రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే 8.81 లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగాయి. ఏపీలోని సంచార పశు వైద్య సేవలపై కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్ బృందాలు అధ్యయనం చేశాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. ఏపీలో సేవలను సమర్థంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థకే ఆ రెండు రాష్ట్రాలు వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏపీ మోడల్లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో వైద్యసేవలందించడమే లక్ష్యం..గతంలో పశువులకు అనారోగ్య సమస్య తలెత్తితే సుమారు 5 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పశు వైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పాడి పశువులకు రైతుల ఇంటి ముంగిటే వైద్యసేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20వ తేదీన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి 2 చొప్పున రూ. 210 కోట్లతో 340 అంబులెన్స్‌లను, ప్రత్యేకంగా 1962 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమో సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో సహా 33 రకాల పరికరాలతో కూడిన చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు. ప్రథమ చికిత్సతో పాటు చిన్న తరహా శస్త్రచికిత్సలు, కృత్రిమ గర్భధారణ లాంటి సేవలకు ప్రతీ వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వాహనాల ద్వారా 295 పశువైద్యులు, 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. పశువులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వాహనంలో హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్య సేవల అనంతరం తిరిగి ఇంటి వద్దకే తీసుకొచ్చి అప్పగించేలా ఏర్పాటు చేయడంతో రైతులకు వ్యయ ప్రయాసలు, రవాణా భారం తొలగిపోయాయి. 1962 కాల్ సెంటర్‌కు నిత్యం సగటున 1778 ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఈ వాహనాలు మండలానికి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 11,987 మారుమూల గ్రామాలకు చేరుకుని వైద్య సేవలందించాయి. సుమారు రెండేళ్లలో రూ. 24.48 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 7,55,326 మంది పశుపోషకులకు జీవనోపాధిని కాపాడగలిగారు.⇒ బాపట్ల జిల్లా రామకృష్ణ నగర్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లుకు ఆరు పాడి గేదెలున్నాయి. ఓ పశువు కొమ్ము విరిగిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో కదల్లేని స్థితిలో కూలబడిపోయింది. ఉదయం 9.40 గంటలకు 1962కి కాల్ చేయగా 10.30 నిమిషాలకు అంబులెన్స్ ఇంటికే వచ్చింది. నొప్పి నివారణకు డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపట్లోనే కోలుకుని లేచి నిలబడగలిగింది. ఇప్పటివరకు మనుషుల కోసమే అంబులెన్స్ వస్తుందనుకున్నాం. మూగ జీవాలను సైతం సంరక్షిస్తూ ఉచితంగా మందులు కూడా అందించే సౌకర్యం కల్పించిన సీఎం జగన్‌కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.నిజంగా గొప్ప ఆలోచన..నాకు ఐదు పాడి ఆవులున్నాయి. పశువులు కొట్లాడుకోవడంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. 1962కి ఫోన్ చేయగా గంటలో అంబులెన్స్ ఇంటికే వచ్చింది. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి వైద్యం చేశారు. ఉచితంగా మందులిచ్చారు. గతంలో పశువైద్యశాలకు తరలించేందుకు ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. ఇంటి వద్దే జీవాలకు సేవలందించడం నిజంగా గొప్పఆలోచన. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. –కాటి విద్యాసాగర్, కోతపేట, బాపట్ల జిల్లాఅరగంటలోనే అంబులెన్స్..మాకు రెండు పాడి గేదెలు, నాలుగు సన్న జీవాలున్నాయి. మేతకు వెళ్లిన ఓ గేదెకు కాలు చీరుకుపోవడంతో నడవలేక పోయింది. 1962కు కాల్చేస్తే అరగంటలో అంబులెన్స్ వచ్చింది. పశువు కాలుకు డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ కట్టారు. నొప్పికి ఇంజక్షన్ ఇచ్చారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పశువుని తరలించే విధానం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం.– ఎం.అసిరిరెడ్డి, దళ్లిపేట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లామాబోటి రైతులకు ఎంతో మేలు..నాకు 12 ఆవులున్నాయి. ఓ ఆవు కడుపునొప్పితో చాలా ఇబ్బందిపడింది. 1962కి కాల్ చేశా. వెంటనే అంబులెన్స్ వచ్చింది. డాక్టర్ చికిత్స అందించారు. ఆవు కోలుకొని నిలబడేలా చేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల ఏర్పాటు ఆలోచన చాలా బాగుంది. మాబోటి పేద రైతులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. – పర్రి ఉమా మహేశ్వరరావు, పర్రిపుత్రుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా -
రైతుకు ‘వినియోగ’ ఆసరా!
‘రైతు లేనిదే తిండి లేదు’ అనేది పసలేని నినాదం కాదు. అందుకే వ్యవసాయాన్ని సజీవంగా ఉంచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వినియోగదారుల నిబద్ధత చాలా అవసరం. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, వినియోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకు ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగదారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో రైతుకూ, వినియోగదారుకూ మధ్య సంబంధం ఇద్దరికీ లాభదాయకం అవుతుంది. తద్వారా అది ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. 2016లో ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ‘ఎవరు బాస్?’ అనే ఆలోచన వచ్చింది. ఫ్రెంచ్ డెయిరీ రైతులు కష్టాలను అధిగమించడంలో సహాయపడటానికి ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నమే ‘ఎవరు బాస్?’. తర్వాత ఇది తనకుతానుగా ఒక ప్రత్యేకమైన వినియోగదారుల ఉద్యమంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా దాని రెక్కలను విస్తరించింది. స్థిరమైన, పునరుత్పత్తి వ్యవసాయ వ్యవస్థలకు దారితీసే ఆరో గ్యకరమైన పరివర్తన దిశగా వ్యవసాయ ఆహార పరిశ్రమ పని చేస్తుందని నిర్ధారిస్తూ, ఫ్రెంచ్ ఆహార సహకార బ్రాండ్‌గా ‘ఎవరు బాస్’ అనే అవగాహనోద్యమం రైతులకు జీవనాధారంగా ఉద్భవించింది. రైతులకు అధిక ధర ఇవ్వడం మార్కెట్లను కుప్పకూలుస్తుంది అని నమ్మే వారందరికీ, ఇక్కడ నేర్చుకోవడానికి గొప్ప అభ్యాసం ఉంది. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, విని యోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. మరింతగా క్రమాంకనం చేస్తే, ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహా రాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగ దారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో, ఈ క్విడ్ ప్రోకో (నీకిది, నాకది) సంబంధం మరింత పెరిగింది. ఇది ఆ ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. సగటున 31 శాతం పైగా పెరిగింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ భారతీయ రైతులు నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుందని భయపడే ప్రధాన ఆర్థికవేత్తలు, మీడియా, మధ్యతరగతి వారు ఆగ్రహించిన తరుణంలో ఈ క్విడ్ ప్రో కో భావన ప్రాముఖ్య తను సంతరించుకుంది. ఫ్రాన్స్, ఇతర ప్రాంతాలలో వినియోగ దారులు స్వచ్ఛందంగా ఎక్కువ చెల్లిస్తున్నప్పుడు భయాందోళనలను సృష్టించే బదులు, భారత ఆర్థికవేత్తలు పంటలకు సరసమైన ధరను నిరాకరించడం వ్యవసాయ జీవనోపాధిని ఎలా చంపుతుందో గ్రహించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఈ ప్రయత్నం ఎంత కీలకమో వినియోగదారులకు అవగాహన కల్పించాలి. మొత్తానికి, వినియోగదారులు రైతుల కష్టాల పట్ల సున్నితంగా ఉంటారు. సరైన అవగాహనతో, వారు వినియోగ ప్రవర్తనను సులభంగా మార్చ గలరు. అది మార్కెట్ శక్తులను సైతం మార్చేలా చేస్తుంది. మిగులు ఉత్పత్తి కారణంగా ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ఆ పరిణామం ఫ్రెంచ్ పాడి పరిశ్రమ పతనానికి దాదాపుగా దారి తీసింది. పాడి రైతులు షట్టర్లు మూసివేయడం ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు పెరి గాయి. ఆ కష్ట సమయాల్లో నికోలస్ చబన్నే. ఒక పాడి రైతు అయిన మార్షల్ డార్బన్ ను కలుసుకున్నాడు. చబన్నే స్థానిక పాడి పరిశ్రమ సహకార సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. వారు రైతు సంఘం దుఃస్థితిని, చుట్టుపక్కల ఉన్న రైతుల బాధలను చర్చించినప్పుడు, రైతులను ఆదుకోవడానికి వినియోగదారులను ఒకచోట చేర్చే ఆలో చన రూపుదిద్దుకుంది. ‘‘ఇది కష్టమని నాకు తెలుసు, కానీ ప్రయత్నించడం విలువైనదే’’ అని నికోలస్ నాతో అన్నారు. ఇలా ‘ఎవరు బాస్?’ అనేది రూపొందింది. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ఆదుకోవడమే దీని లక్ష్యం. ‘‘మనకు ఆహారం అందించే ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి ఇది అవసరం’’ అని చబన్నే అన్నారు. 2016 అక్టోబర్‌లో, ఆపదలో ఉన్న 80 కుటుంబాలకు సహాయం చేస్తూ 7 మిలియన్ లీటర్ల పాలను విక్రయించే లక్ష్యంతో పాల కోసం బ్లూ కార్టన్ డిజైన్ ప్యాక్ ప్రారంభమైంది. సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడటానికి సోషల్ మీడియాను ఉపయో గించారు. రైతు చేయాల్సిందల్లా ఒక యూరో నమోదు రుసుము చెల్లించి, మంచి పద్ధతుల పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడమే! ఇది ప్రారంభమైన ఏడేళ్లలో, ’హూ ఈజ్ ది బాస్’ సంఘీభావ బ్రాండ్ 424 మిలియన్ లీటర్ల పాలను లీటరుకు 0.54 యూరోల హామీతో కూడిన సరసమైన ధరకు విక్రయించింది. అయితే అది మార్కెట్ ధర కంటే 25 శాతం ఎక్కువ. అయినప్పటికీ ఇది నేడు ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పాల బ్రాండ్‌గా ఉద్భవించింది. పైగా దాదాపు 300 వ్యవసాయ కుటుంబాలకు (వివిధ ఉత్ప త్తుల కోసం సుమారు 3,000 మందికి) ఇది అండనిస్తోంది. మార్కె ట్లో పనిచేసే ధరల వ్యత్యాసాల లాగా కాకుండా, మార్కెట్ ధోరణు లతో హెచ్చుతగ్గులు లేని స్థిరమైన ధరను రైతులు పొందుతారు. ఫ్రాన్స్‌లో 38 శాతం రైతులు కనీస వేతనం కంటే తక్కువ సంపా దిస్తారనీ, పైగా 26 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవించి ఉన్నారని లెక్క. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే ప్రకారం 75 శాతం మంది ప్రజలు తమ కొనుగోలుకు మరికొన్ని సెంట్లు జోడించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించడం హర్షించదగినది. ఇది ఉత్పత్తిదారులకు సరస మైన ధరకు హామీ ఇస్తుంది. ఇది పాలతో ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ సంఘీభావ బ్రాండ్ సేంద్రియ వెన్న, సేంద్రియ కాటేజ్ చీజ్, ఫ్రీ–రేంజ్ గుడ్లు, పెరుగు, ఆపిల్ రసం, ఆపిల్ పురీ, బంగాళాదుంపలు, పిండిచేసిన టమోటాలు, గోధుమ పిండి, చాక్లెట్, తేనె, ఘనీభవించిన గొడ్డు మాంసం(గ్రౌండ్ స్టీక్)తో సహా దాదాపు 18 ఉత్పత్తులకు విస్తరించింది. సహకార సంఘం సాగుదారులకు సరసమైన ధరను అందజేస్తున్నప్పటికీ, వారు ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. అవేమిటంటే వంటకాల్లో లేదా పశువుల దాణాలో పామా యిల్ ఉపయోగించకపోవడం, జన్యుపరంగా మార్పు చెందిన పదార్థాలను వాడకపోవటం. సంవత్సరంలో కనీసం 4 నెలల పాటు జంతు వులను మేపడం వంటివి. ఈ భావన ఇప్పుడు జర్మనీ, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మొరాకో, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలోని 9 దేశాల వినియోగ దారులకు చేరువవుతోంది. ఇక్కడ ఫ్రెంచ్ మాతృ సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందంతో వినియోగదారుల వ్యవస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. ఫ్రాన్ ్స తన పండ్లు, కూరగాయల అవసరాలలో 71 శాతం దిగుమతి చేసుకుంటుందని, ఇది స్థానిక ఉత్పత్తిదారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని గ్రహించిన నికోలస్ దేశీయ రైతులకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ‘‘మేము సుదూర ప్రపంచం నుండి రవాణా చేయకూడదనుకుంటున్నాము. మన స్థానిక ఉత్పత్తిదారులను, వారు ప్రతిరోజూ మన ఇంటి ముంగిట ఉత్పత్తి చేసే ఆహారాన్ని మనం రక్షించుకోవాలి’’ అని ఆయన అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులకు సహాయం చేయడానికి, సహకార బ్రాండ్ ఇటీవల తన ఆహార బాస్కెట్లో స్ట్రాబెర్రీ, తోటకూర, కివీ పళ్లను పరిచయం చేసింది. మార్కెట్లు పోటీని తట్టుకునేందుకు అట్టడుగు స్థాయికి దూసు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ‘ఎవరు బాస్’ అనే ఆలోచన వారికి కలిసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, వ్యవసాయ ఆదాయాలను పెంపొందించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైన సాగుదారు లను మార్కెట్లు కలిగి ఉన్నందున, రైతులకు వినియోగదారుల మద్దతుపై చాలావరకు ఈ ‘ఎవరు బాస్’ ఆధారపడి ఉంటుంది. ఫ్రాన్స్‌లోని 16 మిలియన్ల మంది ప్రజలు సాపేక్షంగా ఎక్కువ ధరలకు కొనుగోళ్లు చేయడం ద్వారా రైతులను ఆదుకోవడానికి ముందుకు వస్తే, నికోలస్ ప్రారంభించిన సంస్థ కచ్చితంగా చాలా ముందుకు వచ్చినట్లే అవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
పొంగిన సిరులు!
సాక్షి, అమరావతి: నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పుడు రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ పాడి రైతన్నల ఇళ్లలో సిరులను పొంగిస్తోంది. మూడు జిల్లాలతో మొదలైన అమూల్ ప్రస్థానం ఇప్పటికే 19 జిల్లాలకు విస్తరించి గ్రామగ్రామాన క్షీరాభిషేకం చేస్తోంది. మూతపడ్డ డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో సహకార రంగంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం 2023 తీసుకొచ్చింది. అమూల్ వచ్చిన తర్వాత ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తుండడంతో అమూల్‌కు పాలు పోసే వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. దీనివల్ల పాడి రైతులకు అదనంగా మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషి ఫలితంగా మూతపడిన చిత్తూరు డెయిరీతో సహా సహకార సంఘాలు జీవం పోసుకుంటున్నాయి. 33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల సేకరణ మూడు జిల్లాలలో 2020 డిసెంబర్లో ప్రారంభమైన జగనన్న పాలవెల్లువ (జేపీవీ) నేడు 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమంలో నేడు 4,114 గ్రామాలలో 3,79,850 మంది భాగస్వాములయ్యారు. 33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.512.83 కోట్లు చెల్లించారు. అమూల్‌కు ప్రస్తుతం రోజుకు సగటున 2,84,755 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీలు రోజుకు సగటున 6 లక్షల లీటర్ల చొప్పున పాలను సేకరిస్తున్నారు. నిండా 33 నెలలు కూడా నిండని అమూల్ సంస్థ ఇప్పటికే రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందంటే పాడి రైతులకు ఎంతో మేలు చేస్తోందో ఊహించవచ్చు. పాలు పోసే రైతులకు ప్రతి 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల అదనపు లబ్ధి అమూల్ ప్రారంభంలో లీటర్‌కు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించగా 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. అయితే రైతుకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్‌ను బట్టి గేదెపాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. 18 నెలల్లో పాల సేకరణ ధరను అమూల్ ఏడు దఫాలు పెంచింది. లీటర్ గేదె పాలకు రూ.16.09, ఆవుపాలకు రూ.8.36 చొప్పున అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గతంలో రెండేళ్లకోసారి పాల సేకరణ ధరలు పెంచే ప్రైవేట్ డెయిరీలు అమూల్ రాకతో ఏటా అనివార్యంగా కనీసం రెండుసార్లు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధర తప్పనిసరిగా పెంచాల్సి రావడంతో పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల మేర అదనంగా ప్రయోజనం చేకూరడం గమనార్హం. అమూల్ ప్రతి సంవత్సరం చివరిలో పోసిన ప్రతి లీటరు పాలకు రూ.0.50 చొప్పున లాయల్టీ బోనస్ పాడి రైతులకు చెల్లిస్తోంది. మరోవైపు గత 18 నెలల్లో అమూల్ 2,235.45 మెట్రిక్ టన్నుల నాణ్యమైన ఫీడ్‌ను లాభాపేక్ష లేకుండా పంపిణీ చేసింది. గేదెలకు రూ.30 వేలు, ఆవులకు రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తున్న ప్రభుత్వం కొత్తగా పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఏఎంసీయూ, బీఎంసీయూలు.. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి దశలో రూ.680 కోట్ల ఉపాధి నిధులతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలను నిర్మిస్తున్నారు. చేయూత లబ్ధిదారులకు వారి ఇష్ట ప్రకారం పాడి పశువుల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉంటే అమూల్‌కు మేలు చేసేందుకు ప్రభుత్వం రూ.పది వేల కోట్లు ఖర్చు చేసిందని, విలువైన సహకార డెయిరీలను అప్పనంగా అప్పగిస్తోందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడింది. హెరిటేజ్ కోసం.. సహకార డెయిరీల రంగం నిర్వీర్యమైంది చంద్రబాబు హయాంలోనే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే ‘మాక్స్’ (మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలు)లోకి మార్చుకుని తర్వాత సొంత కంపెనీలుగా ప్రకటించుకున్నారు. ఇలా చంద్రబాబు హయాంలో విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా మిల్క్ యూనియన్లు కంపెనీలుగా మారిపోయాయి. పులివెందుల, చిత్తూరుతో సహా 8 డెయిరీలు మూతపడ్డాయి. అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. హెరిటేజ్ కోసం సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారు. హెరిటేజ్ సేకరణ ధరలు పెంచాల్సి వస్తుందనే భయంతో పాడి రైతులకు ఎక్కడా ధరలు పెరగకుండా కట్టడి చేశారు. హెరిటేజ్ బాగుంటే చాలు పాడి రైతులు ఎలా పోయిన ఫర్వాలేదని చంద్రబాబు భావించారు. ‘చిత్తూరు’లో క్షీరధారలు.. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని పునరుద్ధరించగా 2021 నుంచి అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం ఆ డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఇలా ఒకపక్క సహకార రంగాన్ని బలోపేతం చేస్తుంటే ఒంగోలు డెయిరీని ఆమూల్‌కు అప్పగిస్తే వదిలేసిందని, విలువైన ఆస్తులు కట్టబెడుతున్నారంటూ ఎల్లో మీడియా బురద చల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పాడి రైతులకు మేలు జరిగే చర్యలను సైతం అడ్డుకునే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పునరుద్ధరణ దిశగా ప్రకాశం డెయిరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో సహకార డెయిరీ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణకు జూలై 4న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజాగా ప్రకాశం డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమూల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నవంబర్‌లో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తోంది. అమూల్ రూ.400 కోట్ల పెట్టుబడి ప్రకాశం డెయిరీకి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 95.42 ఎకరాల భూములతోపాటు కోట్లాది రూపాయల విలువైన యంత్ర పరికరాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 13న టీడీపీ హయాంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇండియన్ కంపెనీస్ యాక్టు–1956 కింద పీడీసీఎంపీయూ లిమిటెడ్ పేరిట కంపెనీగా మార్చిన ఈ డెయిరీని ఆ తర్వాత దశల వారీగా నిర్వీర్యం చేశారు. ఈ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. డెయిరీకి చెందిన పాత బకాయిలు రూ.108.32 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కాగా, ఇక్కడ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమూల్ సుముఖత వ్యక్తం చేసింది. పాల ఫ్యాక్టరీతో పాటు వెన్న తయారీ యూనిట్, నెయ్యి ప్లాంట్, మిల్క్ పౌడర్ ప్లాంట్, యూహెచ్‌టీ ప్లాంట్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. అప్పట్లో పథకం ప్రకారం నిర్వీర్యం సహకార డెయిరీ రంగాన్ని పథకం ప్రకారం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ సొసైటీలుగా.. ఆ తర్వాత కంపెనీలుగా మార్చుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద మార్చేశారు. 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కంకిపాడు మినీ డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీ ఇలా వరుసగా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పునరుద్ధరణను వేగవంతం చేసింది. ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 నుంచి దీనిని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చిన ప్రభుత్వం అమూల్ సహకారంతో పూర్వవైభవం తెచ్చేందుకు జూలై 4న సీఎం భూమి పూజ చేశారు. ఇక్కడ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌తో పాటు పాల కర్మాగారం, బటర్, పాల పొడి, చీజ్, పన్నీర్, యాగర్ట్ స్వీట్స్, యూహెచ్‌టీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. 10 నెలల్లో లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది. -
రోడ్డెక్కిన పాడి రైతులు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాడి రైతులు మంగళవారం రోడ్డెక్కా రు. పాడి రైతులకు లీటరు పాలకు అదనంగా రూ.4 చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌కు చేరుకుని సిరిసిల్ల–వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 2019 జనవరి నుంచి 56 నెలలుగా పాడి రైతులకు లీటరుకు రూ.4 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో 4 కి.మీ. మేర రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్, ఎస్సై మల్లేశ్‌గౌడ్, ట్రాఫిక్ ఎస్సై రాజు ఎంత సముదాయించినా వినకుండా రాస్తారోకో చేశారు. పాడి రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్, రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. కాగా, రాస్తారోకోతో కరీంనగర్‌కు పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రికి వెళ్లే రోగులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షలకు సమయం దాటిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి స్కూల్ బస్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు తరలించారు. 4 ఏళ్లుగా పాడి రైతులకు మోసం: జీవన్ రెడ్డి నాలుగేళ్లుగా తెలంగాణ పాడి రైతులను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో ఫోన్ లో మాట్లాడారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని పాడిరైతులు సిరిసిల్లలో ఆందోళనకు దిగి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అమూల్’.. ఆర్గానిక్
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ సంస్థ తాజాగా రైతన్నలు పండించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు చేయూత అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, రైతు సాధికారత సంస్థ అధికారులతో అమూల్ ప్రతినిధులు బుధవారం సమావేశం కానున్నారు. విస్తృత మార్కెటింగ్ రాష్ట్రంలో ప్రస్తుతం 8.82 లక్షల ఎకరాల్లో 8 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. రైతుబజార్లలో ప్రత్యేకంగా స్టాల్స్ కేటాయించడంతోపాటు కలెక్టరేట్ ప్రాంగణాలు.. సచివాలయాలు, ఆర్బీకేలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో వీక్లీ మార్కెట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చిన అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి అయ్యే పంట దిగుబడుల్లో 30 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మరో రూ.1,100 కోట్ల విలువైన 1.42 లక్షల టన్నుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యను అధిగమించేందుకు మంత్ర, సహజ ఆహారం, రిలయన్స్ రిటైల్, బిగ్ బాస్కెట్ ఇతర కంపెనీల భాగస్వామ్యంతో రైతు సాధికార సంస్థ ముందుకెళ్తోంది. మరోవైపు టీటీడీ దేవస్థానానికి 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో కనీసం రూ.5 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 10 – 15 శాతం ప్రీమియం ధరకు సేకరణ ఈ ఏడాది 1,29,169 ఎకరాల్లో వరి, వేరుశనగ, జీడిమామిడి, మొక్కజొన్న, బెల్లం, కాఫీ, పసుపు సహా 12 రకాల ఉత్పత్తులు సాగవుతుండగా 2,03,640 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. రైతు సాధికార సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎమ్మెస్పీకి మించి మార్కెట్లో పలికిన ధరలకు అదనంగా 15 శాతం, ఒకవేళ మార్కెట్ ధరలు ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉంటే ఎమ్మెస్పీకి అదనంగా 10 శాతం ప్రీమియం ధరతో రైతుల నుంచి టీటీడీ సేకరిస్తోంది. అదే రీతిలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన రైతులు ఉత్పత్తి చేసిన పంట ఉత్పత్తులను అమూల్ సంస్థ సేకరించి మార్కెటింగ్ చేయనుంది. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మా, శనగపిండి లాంటి వాటిని రైతుల నుంచి ప్రీమియం ధరలకు సేకరించి ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకురానుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అమూల్ ఆర్గానిక్స్ అధ్యయనం చేస్తోంది. గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ బిజినెస్ హెడ్ దోషి, బ్రాండ్ మేనేజర్ స్నేహ కమ్లాని నేతృత్వంలోని అమూల్ ఆర్గానిక్స్ ప్రతినిధి బృందం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించింది. ప్రకృతి సాగు చేసే మహిళా రైతులతో సమావేశమైంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాల్మిల్ కమ్ బల్క్ స్టోరేజ్ పాయింట్, ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది. ప్రకృతి, సేంద్రీయ సాగుకు ఊతం ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ అదే రీతిలో ప్రకృతి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ముందుకు రావడం శుభ పరిణామం. ఇది రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ సాగుకు మరింత ఊతమిస్తుంది. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ మార్కెటింగ్‌కు తోడ్పాటు అందిస్తాం తెనాలి: పాడి పరిశ్రమ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉన్న అమూల్ తాజాగా ఆర్గానిక్ రంగంలోకి ప్రవేశించిందని సంస్థ ఆర్గానిక్ హెడ్ నిమిత్ దోషి చెప్పారు. ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు తోడ్పాటునందిస్తామని తెలిపారు. అమూల్ సంస్థ మేనేజర్ స్నేహతో కలిసి మంగళవారం గుంటూరు జిల్లా కొల్లిపరలోని శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని నిమిత్ సందర్శించారు. కంపెనీ ఆధ్వర్యంలో పండించిన పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పరిశీలించారు. 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు శ్రేష్ట డైరెక్టర్ ఉయ్యూరు సాంబిరెడ్డి తెలిపారు. ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలసి భూమి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిమిత వ్యయంతో సాగు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ రాజకుమారి, శ్రేష్ట డైరెక్టర్లు నెర్ల కుటుంబరెడ్డి, బొంతు గోపాలరెడ్డి, రైతు సాధికార సంస్థ రీజినల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట్రావు, విజయ్, ప్రవల్లిక, భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
‘పాడి’కి మేలి మలుపు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన కరమూడి శైలజకు రెండు పాడి గేదెలున్నాయి. ఇది వరకు ప్రైవేట్ డెయిరీకి రోజూ పాలు పోసేది. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) శాతం ఎంత ఉన్నప్పటికీ లీటర్‌కు గరిష్టంగా రూ.80కి మించి చెల్లించే వారు కాదు. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజుకు 3 లీటర్ల పాలు పోస్తే ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 13 శాతం రావడంతో లీటర్‌కు రూ.103 చొప్పున చెల్లించారు. ఏకంగా లీటర్‌కు రూ.23 అదనంగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన రోజుకు రూ.69 చొప్పున నెలకు రూ.2,100 వరకు అదనంగా ఆదాయం వస్తుండడం పట్ల ఆమె ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా వేమవరానికి చెందిన యాదాల వరలక్ష్మికి రెండు ఆవులున్నాయి. ప్రైవేటు కేంద్రానికి ప్రతీ రోజూ పాలు పోసేది. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా.. లీటర్‌కు గరిష్టంగా రూ.35కు మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇటీవలే ప్రారంభించిన జగనన్న పాల కేంద్రంలో ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 6.6 శాతంతో తొలి రోజు 2.58 లీటర్ల పాలు పోస్తే లీటర్‌కు రూ.53.86 చొప్పున రూ.138.96 వచ్చింది. ఈమె రెండు పూటలా పాలు పోస్తోంది. ఈ లెక్కన రోజుకు 5 లీటర్లు పోస్తే.. రోజుకు అదనంగా రూ.94.30 చొప్పన నెలకు రూ.2,829 అదనపు ఆదాయం వస్తోందని ఆమె ఆనందంతో చెబుతోంది. ‘అన్నా.. ఇది పాల బాటిల్.. నీళ్ల బాటిల్ కంటే తక్కువ ఖరీదు.. నీళ్ల కంటే పాలే చవకగా దొరుకుతున్నాయి. ఇలాగైతే ఎలా బతికేదన్నా.. అని పాడి రైతులు నాతో చెప్పుకుని బాధపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని కచ్చితంగా మారుస్తాం’ అని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పిన మాటలివి. ఆ మాట మేరకు అక్షరాలా పరిస్థితిని మార్చేశారనేందుకు ఇప్పుడు ఊరూరా కళకళలాడుతున్న జేపీవీ కేంద్రాలే నిదర్శనం. పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతులు నేడు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం కింద పాలు పోస్తూ కోట్లాది రూపాయలు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు, దళారీలు వారిస్తున్నా, ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. తాము మాత్రం జగనన్న కేంద్రంలోనే పాలు పోస్తామంటూ ముందుకొస్తున్నారు. పాలవెల్లువ పథకం ఇటీవలే ప్రారంభమైన కాకినాడ జిల్లానే తీసుకుంటే.. హెరిటేజ్, వల్లభ, శ్రీ చక్ర, తిరుమల, జెర్సీ, దొడ్ల, విశాఖ డెయిరీలు పాలు సేకరిస్తుంటాయి. ఇప్పటి వరకు ఇవి గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.80, ఆవు పాలకు రూ.35కు మించి ఇస్తున్న దాఖలాలు లేవు. అలాంటిది పాల వెల్లువ పథకం ద్వారా నేడు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.103, ఆవు పాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లోని పాడి రైతులు చెబుతున్నారు. ప్రైవేటు కేంద్రాల కంటే కనీసం లీటర్‌కు రూ.10–30 వరకు అదనంగా వస్తుందని హర్హం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల వల్ల ఏళ్ల తరబడి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జేపీవీ కేంద్రానికే పాలు పోస్తామని స్పష్టం చేస్తున్నారు. పక్కాగా వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం పాలల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ (ఘన పదార్థాలు) శాతం ఎంత ఉందో లెక్కించేందుకు ప్రైవేట్ డెయిరీలు ఒక శాస్త్రీయ పద్దతి అంటూ పాటించే వారు కాదు. పాడి రైతుల్లో నూటికి 90 శాతం పెద్దగా చదువుకోని వారే. వారు కేంద్రానికి పాలు తీసుకురాగానే, వాటిని పూర్తిగా మిక్స్ చేయకుండా, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ఫ్యాట్ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించి ఖాతా పుస్తకాల్లో రాసుకునే వారు. అడిగితే ఓ కాగితం ముక్క మీద రాసిచ్చేవారు. దాణా, ఇతర అవసరాల కోసం తీసుకున్న అప్పును మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని 15 రోజులకో, నెలకో ఇచ్చేవారు. పాలు ఎక్కువ పోసే వారికి ఒక ధర, తక్కువ పోసే వారికి మరో ధర, సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర ఉండేది. కొందరు కొలతల్లోనూ మోసానికి పాల్పడే వారు. ‘జగనన్న పాల వెల్లువ’ మొదలైన తర్వాత ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కొంతమేర కళ్లెం పడింది. రైతుకు పాల ధర పెరగడమే కాదు.. పాలల్లో నాణ్యత, చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. ప్రైవేటు కేంద్రాల్లో టెస్టింగ్ మిషన్ ఒకటే ఉంటుంది. అదే జేవీపీ కేంద్రంలో మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిల్క్ ఎనలైజర్ (వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం, ప్రొటీన్, వాటర్ శాతాన్ని లెక్కించేందుకు), ్రస్ట్రిరర్ (పాలు మిక్స్ చేయడానికి) సాప్ట్వేర్ సిస్టమ్ ద్వారా పాల సేకరణ జరిగేందుకు వీలుగా ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ స్కేల్ వంటి పరికరాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి పాలు రాగానే మిక్స్ చేసిన పాలను ్రస్ట్రిరర్పై పెట్టి, ఆ శాంపిల్‌ను మళ్లీ ఎనలైజర్‌లో ఉంచి వెన్న, ఘన పదార్థాల శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి.. తూకం వేసి తీసుకొని ధరను నిర్ధారిస్తారు. వెన్న శాతం లెక్కింపు లేదా ధర నిర్ణయంలో ఎలాంటి దళారీ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా సా‹ఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమూల్‌కు, హెరిటేజ్‌కు మధ్య ఎంత తేడా! 2020 డిసెంబర్లో 3 జిల్లాలతో ప్రారంభమైన జేపీవీ పథకం నేడు 18 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమం నేడు 3,691 గ్రామాలకు విస్తరించగా, 3.18 లక్షల మంది భాగస్వాములయ్యారు. 31 నెలల్లో 9.58 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. ప్రస్తుతం 85 వేల మంది పాడి రైతులు ప్రతి రోజూ 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. 2020 అక్టోబర్ వరకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటర్‌కు హెరిటేజ్ కంపెనీ గేదె పాలకు రూ.58.43, ఆవు పాలకు రూ.31.58 చెల్లించింది. సంగం డెయిరీ గేదె పాలకు రూ.58.90, ఆవు పాలకు రూ.32.87 చొప్పున చెల్లించేవారు. అమూల్ ప్రారంభంలోనే లీటర్ గేదె పాలకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.71.47, ఆవు పాలకు 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.34.20 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత గడిచిన 31 నెలల్లో అమూల్ ఎనిమిదిసార్లు పాల సేకరణ ధరలు పెంచగా, ప్రైవేటు డెయిరీలు కేవలం మూడు సార్లు మాత్రమే పెంచాయి. హెరిటేజ్ ప్రస్తుతం గేదె పాలకు లీటర్ రూ.77కు పెంచామని చెబుతున్నప్పటికీ, రైతులకు వివిధ కారణాలు చెబుతూ వాస్తవంగా చెల్లిస్తున్నది రూ.66.50 మాత్రమే. అదే సంగం డెయిరీ లీటర్‌కు రూ.80.30కు పెంచామని చెబుతున్నా, వాస్తవంగా రైతులకు చెల్లిస్తున్నది మాత్రం రూ.69.35 మాత్రమే. అమూల్ మాత్రం ఖచ్చితంగా 11 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎ¯Œన్ఎఫ్తో గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. ప్రైవేటు డెయిరీలు గరిష్టంగా గేదె పాలకు 11 శాతం, ఆవు పాలకు 5 శాతం ఫ్యాట్‌కు లాక్ చేసి ఆ తర్వాత ఎంత ఫ్యాట్ ఉన్నా సరే 11 శాతం కిందే పరిగణించి సొమ్ములు చెల్లిస్తున్నాయి. అమూల్ మాత్రం ఎలాంటి లాక్ సిస్టమ్ లేకుండా పాలల్లో ఉండే ఫ్యాట్ శాతం లెక్కగట్టి అణాపైసలతో సహా చెల్లిస్తోంది. ఫలితంగా గేదె పాలకు గరిష్ట ధర 103, ఆవు పాలకు రూ.53.86 ధర రైతులకు లభిస్తోంది. పాడి రైతులకు అన్ని విధాలా భరోసా గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం ఎనిమిది నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. అమూల్ మాత్రం 20–22 శాతం ప్రోటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. పైగా ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వార్షిక ఆదాయాన్ని బట్టి ఏటా లీటర్‌కు 5 శాతం చొప్పున బోనస్ చెల్లిస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు కమిషన్ ఇస్తాయే తప్ప పాలుపోసే రైతులకు ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వవు. మరొక పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 321 పాడి రైతులకు గేదెల కొనుగోలుకు రూ.3.69 కోట్ల రుణాలిచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ కింద 7,517 మందికి రూ.36.61 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చింది. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే వారికీ రూ.4,283 కోట్ల లబ్ధి కల్తీకి అడ్డుకట్ట వేసి, నాణ్యత పెంచేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టాయి. ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేపీవి అమలు కాని ప్రాంతాల్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఆదాయం పెరిగింది. ఫలితంగా రూ.4,283 కోట్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు లబ్ధి పొందారు. అదనపు ఆదాయం నిజం మా ఊళ్లో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెల్లువ కేంద్రంలో శుక్రవారం 1.32 లీటర్ల పాలు పోశాను. వెన్న 14 శాతం, ఎస్ఎన్ఎఫ్ 10.1 శాతం ఉందని లెక్కించారు. ఆ మేరకు లీటర్‌కు రూ.97.92 చొప్పున రూ.129.25 చెల్లించారు. అదే ప్రైవేటు డెయిరీకి పోస్తే రూ.80కి మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ పాలు పోయడం వల్ల రూ.30కి పైగా అదనంగా ఆదాయం వచ్చింది. – కాళ్ల మంగ, చిత్రాడ–2, కాకినాడ జిల్లా నెలకు రూ.3,600 అదనపు ఆదాయం మాకు మూడు గేదెలున్నాయి. ప్రైవేటు కేంద్రానికి రోజుకు 6–8 లీటర్ల పాలు పోసేవాళ్లం.ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా లీటర్‌కు రూ.70–80 మధ్య వచ్చేది. మా గ్రామంలో ఏర్పాటు చేసిన జేపీవి కేంద్రంలో ఎస్ఎన్ఏఫ్ 9.2 శాతం, ఫ్యాట్ 12.3 శాతంతో పాలు పోస్తే లీటర్‌కు ఏకంగా రూ.97.92 వచ్చింది. లీటర్‌పై సగటున రూ.20కి పైగా అదనంగా వచ్చింది. ఈ లెక్కన ఐదు లీటర్లకు రూ.120 చొప్పున నెలకు రూ.3,600కు పైగా అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ప్రైవేటు డెయిరీల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో ధర రాలేదు. – పరసా వెంకటసుధ, విరవాడ, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా గతంలో రూ.30కి మించి వచ్చేది కాదు మాకు రెండు ఆవులున్నాయి. ప్రతి రోజూ 8 లీటర్ల పాలు కేంద్రానికి పోసేవాళ్లం. లీటర్‌కు రూ.30 రావడం గగనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అమూల్ కేంద్రంలో పోస్తే ఎస్ఎన్ఏఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.1 శాతంతో లీటర్‌కు 39.33 వచ్చింది. ఈ లెక్కన లీటర్‌కు అదనంగా రూ.9.33 చొప్పున నెలకు రూ.2,239కు పైగా ఆదనపు ఆదాయం వస్తోంది. ఇక నుంచి ఈ కేంద్రానికే పాలు పోస్తాం. – చిట్నీడి వెంకటలక్ష్మి, విరవాడ, పిఠాపురం మండలం కాకినాడ జిల్లా రైతుల నుంచి మంచి స్పందన జగనన్న పాల వెల్లువ పథకాన్ని కాకినాడ జిల్లాలో ఈ నెల 3వ తేదీన ప్రారంభించాం. పాడి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయినా సరే 96 గ్రామాల్లో ప్రతి రోజూ 200 మందికి పైగా రైతులు 4,500 లీటర్ల పాలు పోస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక మంది పాడి రైతులకు లీటర్ గేదె పాలకు రూ.95, ఆవు పాలకు రూ.53 వరకు ఆదాయం లభిస్తోంది. – డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు, జాయింట్ డైరెక్టర్, పశు సంవర్థక శాఖ -
‘చిత్తూరు’కు క్షీరాభిషేకం!
ఇవాళ మనం తెరిపిస్తున్న చిత్తూరు డెయిరీ కథ ఎలాంటిదంటే.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ మనిషి తాను స్థాపించిన డెయిరీ కోసం, సొంత లాభం కోసం, సొంత జిల్లా రైతునైనా, పిల్లనిచ్చిన మామనైనా బలి పెట్టేస్తాడని చెప్పే మనిషి కథ ఇది! ఓ నీతిమాలిన రాజకీయ నాయకుడి కథ ఇదీ! ఒక గొప్ప మెడికల్ కాలేజీ మన చిత్తూరుకు వస్తుంటే అడ్డుకున్నది సాక్షాత్తూ ఈ చంద్రబాబునాయుడు, గజదొంగల ముఠా సభ్యుడైన ఈనాడు రామోజీరావు వియ్యంకుడే. స్థలాలివ్వకుండా ఈ గడ్డకు మంచి మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్న చరిత్ర వారిదే. వేలూరు మెడికల్ కాలేజీకి జరిగిన అన్యాయాలను పూర్తిగా సరిదిద్దుతూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తున్నా. – చిత్తూరు బహిరంగ సభలో సీఎం జగన్ సాక్షి, తిరుపతి: గత పాలకుల స్వార్థంతో రెండు దశాబ్దాలుగా మూతబడ్డ చిత్తూరు డెయిరీకి జీవం పోస్తూ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టబడితో చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం చిత్తూరులో భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు సమీపంలోని చీలాపల్లి సీఎంసీ మెడికల్ కళాశాల, 300 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, విడదల రజని, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ, ద్వారక నాథరెడ్డి, ఎంఎస్ బాబు, నవాజ్‌బాషా.. ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు మేయర్ అముద, ఆర్టీసీ వైస్‌చైర్మన్ విజయానందరెడ్డి, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డెమ్మ, అమూల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ.. రెండు మంచి కార్యక్రమాలకు నాంది ఈరోజు జరుగుతున్న రెండు మంచి కార్యక్రమాల్లో మొదటిది.. ఏనాడో మూతపడ్డ అతి పెద్దదైన చిత్తూరు డెయిరీని తెరిపించేందుకు నాంది పలుకుతున్నాం. ఇక రెండోది.. దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజీలలో ఒకటైన వేలూరు సీఎంసీ ఏర్పాటుకు పునాది రాయి వేస్తున్నాం. దివంగత వైఎస్సార్ ఏనాడో స్థలాన్ని కేటాయించి ఇక్కడ మెడికల్ కాలేజీని తీసుకొచ్చే కలగన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత నిర్లక్ష్యానికి గురైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 14 ఏళ్ల తరువాత ఆయన బిడ్డగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. చిత్తూరు డెయిరీ చరిత్ర.. పాడి రైతుల మొహాల్లో చిరునవ్వులు విరబూయించిన చిత్తూరు డెయిరీని 20 ఏళ్ల క్రితం కుట్ర పూర్వకంగా మూసివేశారని జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు ప్రజలు చెప్పిన మాటలు గుర్తున్నాయి. 1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పడిన చిత్తూరు డెయిరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ప్రాసెసింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపించేవి. 1988 – 1993 మధ్య రోజుకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో ఈ జిల్లా కర్మకొద్దీ చంద్రబాబు కళ్లు దానిపై పడ్డాయి. 1992లో తన సొంత డెయిరీ హెరిటేజ్ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి, పథకం ప్రకారం చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. సహకార రంగంలోని చిత్తూరు డెయిరీని 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మూత వేసే స్థాయికి తీసుకెళ్లారు. సరిగ్గా హెరిటేజ్ ఏర్పాటైన పదేళ్లకు అతిపెద్ద సహకార డెయిరీని చంద్రబాబు హయాంలో మూతవేసే కార్యక్రమం చేశారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు రూ.వందల కోట్ల బకాయిలు పెట్టి 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించేశారు. ఆర్నెళ్లకు ఒకసారి బోనస్.. ఆశ్చర్యమేమిటంటే.. సహకార రంగంలో అతి పెద్దదైన చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి వెళ్తుంటే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ డెయిరీ మాత్రం అదే సమయంలో లాభాల్లోకి పరుగెత్తుకుంటూ పోయింది. 20 ఏళ్లుగా మూతపడ్డ ఈ చిత్తూరు డెయిరీ దుస్థితి చూసి దానికి జీవం పోసి పాడి రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చా. మాట ప్రకారం రూ.182 కోట్ల బకాయిలు తీర్చి నేడు చిత్తూరు డెయిరీ తలుపులు తెరిచాం. ప్రపంచంలోనే అతిపెద్ద సహకార డెయిరీ అమూల్‌ను తేవటమే కాకుండా వారు ఇదే డెయిరీలో రూ.385 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని సంతోషంగా చెబుతున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి డెయిరీకి పాలు పోసే అక్కచెల్లెమ్మలకు లాభాలను బోనస్‌గా పంచిపెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.150 కోట్లతో తొలిదశ పనులు రూ.150 కోట్లతో చిత్తూరు డెయిరీ తొలిదశ పనులు మొదలవుతున్నాయి. దాదాపు లక్ష లీటర్లతో మరో 10 నెలల వ్యవధిలో పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది. రానున్న రోజుల్లో ఇక్కడే దశలవారీగా బటర్, పాలపొడి, యూహెచ్‌టీ పాల విభాగం, ఛీజ్, పనీర్, యోగర్ట్, స్వీట్ తయారవుతాయి. ఐదు నుంచి ఏడెనిమిదేళ్లలో 10 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి డెయిరీ చేరుకుంటుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి. మరో 2 లక్షల మందికి అమూల్ రాకతో అవుట్‌లెట్స్, డిస్ట్రిబ్యూషన్ చానెళ్ల ద్వారా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. చిత్తూరు జిల్లానే కాకుండా రాయలసీమకు చెందిన పాడి రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు మంచి పాల సేకరణ ధర లభిస్తుంది. ఇతర డెయిరీలూ పెంచక తప్పలేదు సహకార రంగాన్ని పునరుద్ధరిస్తూ దేశంలోని అతి పెద్ద కోఆపరేటివ్ డెయిరీ అమూల్‌తో కలిసి 2020 డిసెంబర్ 2న జగనన్న పాల వెల్లువను ప్రారంభించాం. పాడి రైతుల నుంచి 8,78,56,917 లీటర్ల పాలను సేకరించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి 10 రోజులకొకసారి నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అమూల్ రాక ముందు 2020 డిసెంబర్ 2న గేదె పాల రేటు లీటరు రూ.67 ఉండగా అమూల్ వచ్చాక ఎనిమిది సార్లు రేటు పెంచుకుంటూ వెళ్లింది. ఈరోజు గేదె పాలు లీటర్ రూ.89.76 ఉంది. అమూల్ రాక ముందు ఆవు పాలు లీటర్ రూ.32 కూడా సరిగా ఉండేవి కాదు. అమూల్ వచ్చిన తర్వాత 8 సార్లు రేటు పెంచుకుంటూ వెళ్లడంతో రూ.43.69కి చేరుకుంది. ఇతర ప్రైవేట్ డెయిరీలు కూడా సేకరణ ధర పెంచక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. పాల సేకరణలో మనం తీసుకున్న చర్యల వల్ల అక్కచెల్లెమ్మలు, పాడి రైతన్నలకు రూ.4,243 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. నాన్ రెసిడెంట్ నాయకులు.. చంద్రబాబు, దత్తపుత్రుడు నా¯న్ రెసిడెంట్ నాయకులు. ఇద్దరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లద్దరి కోసం హైదరాబాద్ పోవాల్సిందే. ఇద్దరికీ సామాజిక న్యాయం అసలే తెలియదు. పేదలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తామంటే అడ్డుకుంటారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే దాన్నీ అడ్డుకుంటారు. సంక్షేమ పథకాలు ఇస్తామంటే దాన్నీ అడ్డుకొనే కార్యక్రమం చేస్తారు. వీరికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు... దోపిడీ కోసమే! ఈరోజు యుద్ధం జరుగుతోంది జగన్‌తో కాదు. పేదవాడితో పెత్తందార్లకు యుద్ధం జరుగుతోంది. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా. చిత్తూరుకు శుభవార్తలు ‘చిత్తూరు మున్సిపాల్టీకి సంబంధించి రూ.75 కోట్ల పనులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు. ఆర్వోబీ, లిల్లీ బ్రిడ్జి కావాలని అడిగారు. ఇవన్నీ చేస్తాం. చిత్తూరులో ఎన్ని సచివాలయాలుంటే అన్నింటికీ రూ.50 లక్షలు చొప్పున వెంటనే మంజూరు చేస్తాం. ప్రతిపాదనలు అందించిన వెంటనే మంజూరవుతాయి. బీసీ భవనన్ నిర్మాణం జరుగుతుంది. కాపు భవ¯నాన్ని కూడా మంజూరు చేస్తున్నా. 37 కి.మీ. రోడ్ల ప్రతిపాదనలు రూపొందించి పనులు చేపడతాం. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చిత్తూరు చక్కెర కర్మాగారం ఉద్యోగులకు శుభవార్త చెబుతూ వారికి సంబంధించిన రూ.32 కోట్ల బకాయిలు క్లియర్ చేశాం. వారి మొహల్లో చిరునవ్వులు చూసేందుకు బకాయిలు క్లియర్ చేసిన తర్వాతే ఇక్కడకి వచ్చా. చిత్తూరులో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అడిగారు. దీనిపై ప్రతిపాదనల కోసం కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాం. మరికొన్ని విద్యాసంస్ధల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం’ పాడి రైతన్నలకు లాభం: జైన్ మెహతా, అమూల్ ఎండీ చిత్తూరులో డెయిరీ స్థాపనకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. పాడి రైతులకు మరింత మేలు చేసే విధంగా అధిక ధరకు పాల సేకరణ చేస్తాం. గుజరాత్, మరో 16 రాష్ట్రాల్లో అమూల్ డెయిరీలున్నాయి. ఏటా 36 లక్షల మంది పాడి రైతుల నుంచి దాదాపు 10 బిలియన్ లీటర్ల పాలను సేకరిస్తున్నాం. రూ.7,200 కోట్ల టర్నోవర్‌తో అమూల్ సంస్థ అంతర్జాతీయంగా ఉత్తమ స్థానంలో ఉంది. వెన్నుపోటు వీరుడు.. ప్యాకేజీ శూరుడు! ‘‘ఇవాళ వీళ్ల పరిస్థితి ఏమిటంటే.. చక్రాలు లేని సైకిల్ ఎక్కలేనాయన ఓ నాయకుడు! ఎవరైనా తైలం పోస్తే కానీ గ్లాసు నిండని వ్యక్తి మరో నాయకుడు! ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ శూరుడు! వీరిద్దరికీ పేదల బతుకుల గురించి, ప్రజల కష్టాల గురించి, మాటిస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి, ఒక మాటకున్న విలువ గురించిగానీ ఏమాత్రం తెలియదు. అలా బతకాలన్న ఆలోచనా లేదు. ఇద్దరూ కలసి ప్రజల్ని మోసం చేస్తూ 2014 – 19 మధ్య రాష్ట్రాన్ని ఏలారు. ఇద్దరూ కలసి రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్న పిల్లలు, సామాజిక వర్గాలకు వెన్నుపోటు పొడిచారు’’ -
పాడి రైతులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా మరోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున.. కనిష్టంగా గేదె పాలపై రూ.2.26, ఆవు పాలపై రూ.0.11 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.32, ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. ఈ పెంపు రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాలకు ఆదివారం నుంచి వర్తించనుంది. తద్వారా 65 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ తరఫున రాయలసీమలో కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇటీవలే సబర్కాంత్ యూనియన్ పాల సేకరణ ధరలను పెంచింది. తాజాగా కైరా యూనియన్ పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా.. తాజా పెంపుతో కలిపి ఏడు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. కైరా యూనియన్ ప్రస్తుతం లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.84.26, ఆవు పాలకు రూ.42.27 చొప్పున చెల్లిస్తోంది. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ.42.38 చొప్పున రాయసీమ జిల్లాల పరిధిలోని పాడి రైతులకు కైరా యూనియన్ చెల్లించనుంది. 30 నెలల్లో 8.50 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.96 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,549 గ్రామాలకు విస్తరించింది. 2116 ఆర్బీకేల పరిధిలోని 76వేల మంది నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తోంది. 8.50 కోట్ల లీటర్ల పాలను సేకరించగా.. పాడి రైతులకు రూ.378.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా.. అంతకు మించి ప్రస్తుతం లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవు పాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.3,395.18 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. -
సహకార డెయిరీ రంగాన్ని చంపేసింది చంద్రబాబే
చంద్రబాబు ప్రభుత్వం హయాం.. రాష్ట్రంలో సహకార డెయిరీలను ప్రభుత్వమే చిదిమేసింది. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ ఎదుగుదల కోసం గ్రామ గ్రామాన వేళ్లూనుకొన్న సహకార డెయిరీలను ఆయన ప్రభుత్వమే నాశనం చేసేసింది. కొన్నింటిని తనకు అనుంగులుగా ఉండే వ్యక్తులకు అప్పజెప్పింది. చివరకు రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. పాలకు కనీస ధర కూడా అందక అల్లాడిపోయారు. ‘ఈనాడు’ విషం.. విషపు రాతల ‘ఈనాడు’కు ఈ వాస్తవాలు పట్టవు. ప్రజల సంక్షేమం అసలే పట్టదు. ఎంతసేపూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యం. అందులో భాగంగానే ‘అమూల్ మాకొద్ద’ంటున్నారంటూ విషపు రాతలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మూతపడ్డ సహకార పాల డెయిరీలు పునరుద్ధరించి, పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ గ్రామాన మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి సహకార రంగాన్ని బలోపేతం చేసింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. లీటర్‌కు రూ. 4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం కింద లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూరుస్తోంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గిట్టుబాటు ధర వస్తోంది. అమూల్‌కు పాలు పోసే వారే కాదు.. అమూల్ రాకతో పాల సేకరణ ధరలు పెంచడం వలన ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్న పాడి రైతులూ లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీల రైతులకూ లబ్ధి అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకూ లబ్ధి చేకూరింది. అమూల్ పాల సేకరణ ధర పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ ధరలు పెంచాయి. అమూల్ ఇచ్చే ధరతో పోలిస్తే తక్కువే అయినా, వాటికి పాలు పోసే పాడి రైతులకు ఈ 30 నెలల్లో రూ.3,312.46 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార డెయిరీలకు చంద్రబాబు కాటు హెరిటేజ్ డెయిరీ కోసం రాష్ట్రంలో సహకార డెయిరీ రంగాన్ని ఓ పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని కంపెనీలుగా ప్రకటించుకున్నారు. విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా ప్రకటించుకున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు లాభాల్లో ఉన్న ప్రభుత్వ డెయిరీలన్నీ బాబు హయాంలో మూతపడ్డాయి. 2017 జనవరి 23న కడప జిల్లాలోని పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణాలోని మినీ డెయిరీ–కంకిపాడు, 2019 మార్చి 15న చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లి డెయిరీ, మరో 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మిల్క్ చిల్లింగ్ సెంటర్ (ఎంసీసీ)తో పాటు 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూలు) మూతపడ్డాయి. రాష్ట్రంలోని పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. పాల సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. కోట్లాది రూపాయల విలువైన మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిల్లింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటిపై ఈనాడు పత్రిక ఏనాడూ చిన్న వార్తా రాయలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి పాలను సేకరించడమే నిలిపివేసింది. రూ.45 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టారు. అయినా బాబు సర్కారు నోరు మెదపలేదు. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాల సహకార సంఘాల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు (ఎండీఎస్) ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాలు సేకరిస్తున్నారు. మూడు జిల్లాలతో మొదలైన పాల సేకరణ ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించింది. 20 – 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న ప్రైవేటు డెయిరీలు ప్రస్తుతం రోజుకు 5 – 6 లక్షల లీటర్లు సేకరిస్తుంటే, కేవలం 30 నెలల్లోనే అమూల్ సంస్థ రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలు రెండేళ్లకోసారి పాలసేకరణ ధరలు పెంచేవి. అమూల్ మూడు నెలలకోసారి పాల సేకరణ ధరలను సవరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఇలా 30 నెలల్లో ఏడు రెట్లు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.88, ఆవు పాలకు రూ.43.69 చెల్లిస్తున్నారు. 30 నెలల్లో గేదె పాలపై రూ.16.53, ఆవు పాలపై రూ. 9.49 మేర ధరలు పెంచారు. ఒక్క రూపాయి తక్కువ కాకుండా 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు ఆర్బీకేల ద్వారా ఇన్పుట్స్ అందిస్తున్నారు. మధ్యవర్తులు, వాటాదారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా ప్రోత్సాహకం, బోనస్ పంపిణీ చేస్తున్నారు. ఏటా 2 సార్లు లీటరుకు అర్ధ రూపాయి లాయల్టీ బోనస్ కూడా వస్తోంది. పాడి రైతుల సంరక్షణ, నిర్వహణ కోసం రూ.40 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా స్వల్పకాలిక రుణాలందిస్తున్నారు. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలు నిర్మిస్తున్నారు. – సాక్షి, అమరావతి -
పాడి రైతుకు తోడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు పాడి రైతన్నలకు బాసటగా నిలుస్తూ పశువులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. ఆర్బీకేల రాకతో తమ కష్టాలకు తెర పడిందని పాడి రైతులు చెబుతున్నారు. ప్రాథమిక వైద్యం కోసం మండల కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో పశువైద్య సేవలందించడమే కాకుండా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, మినరల్ మిక్చర్, చాప్ కట్టర్స్.. ఏది కావాలన్నా గుమ్మం వద్దకే తెచ్చి ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్‌ల తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.240.69 కోట్ల వ్యయంతో రెండు విడతల్లో 340 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. వీటిని నియోజక వర్గానికి రెండు చొప్పన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్ లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువున్న జీవాలను ఎత్తగలిగేలా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు రైతుల నుంచి రోజుకు సగటున 1500 కాల్స్ చొప్పున 3.90 లక్షల కాల్స్ రాగా మారుమూల పల్లెల్లో 1.30 లక్షల ట్రిప్పులు తిరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఏపీ తరహాలో పంజాబ్, కేరళ, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలు వెటర్నరీ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పశు వైద్యసేవలపై ‘సాక్షి బృందం’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించింది. మూగ జీవులపై మమకారం.. వైఎస్సార్ పశు సంరక్షణ పథకం కింద పశువులకు హెల్త్‌కార్డులు జారీ చేయడమే కాకుండా పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో ఆర్ధిక చేయూతనిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ, పునరుత్పత్తి, దూడల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా 3వ శనివారం పాడి రైతులకు, 2, 4వ బుధవారాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు వైఎస్సార్ పశువిజ్ఞానబడులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్బీకేల్లో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాడి, మూగజీవాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 155251, 1962 టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్లలో సేవలిలా.. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా పాడి సంపద ఎక్కువగా ఉన్న 8,330 ఆర్బీకేల్లో ట్రైవిస్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ.4 వేల విలువైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా గత 32 నెలల్లో 4,468 టన్నుల గడ్డి విత్తనాలు, 62,435 టన్నుల సంపూర్ణ మిశ్రమం, 60 వేల కిలోల నూట్రిషనల్ సప్లిమెంట్స్, 350 టన్నుల పశువుల మేతతో పాటు 3,909 చాప్ కట్టర్స్ పంపిణీ చేశారు. ఆర్బీకేల ద్వారా 2 కోట్ల పశువులకు టీకాలిచ్చారు. 33.08 లక్షల పశువులకు హెల్త్ కార్డులు జారీ చేశారు. 14.73 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ జరిగింది. 1.61 కోట్ల పశువులకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. పశువిజ్ఞాన బడుల్లో 13.99 లక్షల మంది రైతులకు శిక్షణ నిచ్చారు. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 42 వేల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులందించి రుణ పరపతి కల్పిస్తున్నారు. 75 శాతం రాయితీపై విత్తనాలు గతంలో నాణ్యమైన పచ్చగడ్డి దొరక్క పశువులు సకాలంలో ఎదకు వచ్చేవి కావు. పాల దిగుబడి సరిగా ఉండేది కాదు. ఆర్బీకేల ద్వారా రాయితీపై నాణ్యమైన మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ గడ్డి రకం) విత్తనాలను 75 శాతం రాయితీపై తీసుకొని సాగు చేశా. 60 రోజుల్లో 9 అడుగులు పెరిగి ఎకరానికి 5–6 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు మేత ఇష్టంగా తింటున్నాయి. సకాలంలో ఎదకు రావటమే కాకుండా పాల దిగుబడి రోజుకి 2–3 లీటర్లు పెరిగింది. సీఎం జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – అంకంరెడ్డి రవికుమార్, ఓఈపేట, అనకాపల్లి జిల్లా ఆరోగ్యంగా పశువులు.. అదనంగా లాభం నాకు 8 పశువులున్నాయి. గడ్డి కత్తిరించే యంత్రాల ద్వారా మేత వృథా కాకుండా ఎలా నివారించవచ్చో పశువిజ్ఞాన బడి కార్యక్రమాల ద్వారా తెలుసుకున్నా. 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాన్ని ఆర్బీకేలో తీసుకున్నా. మొక్కజొన్న గడ్డిని ముక్కలుగా చేసి అందిస్తున్నా. గేదెలు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి. గతంలో 62 లీటర్ల పాల దిగుబడి రాగా ప్రస్తుతం 70 లీటర్లు వస్తున్నాయి. అదనంగా రూ.320 లాభం వస్తోంది. ప్రభుత్వానికి నిజంగా రుణపడి ఉంటాం. – చిలంకూరి తిరుపతయ్య, లింగారెడ్డిపల్లి, ప్రకాశం జిల్లా మేతకు ఇబ్బంది లేదు.. గతంలో పశుగ్రాసం కోసం చాలా ఇబ్బందిపడే వాళ్లం. ఇటీవలే ఆర్బీకేలో సీఎస్హెచ్–24 గడ్డిజాతి విత్తనాలను రాయితీపై తీసుకున్నా. ఎకరం పొలంలో 15 కిలోలు చల్లా. 60 రోజుల్లో ఆరడుగులు పెరిగింది. కత్తిరించి పశువులకు మేతగా వేస్తున్నాం. సకాలంలో ఎదకు వస్తున్నాయి. పాల దిగుబడి కూడా పెరిగింది. –శ్రీరాం లక్ష్మీనారాయణ, చిల్లకల్లు, ఎన్టీఆర్ జిల్లా ఆర్బీకేల ద్వారా పశువైద్య సేవలు ఆర్బీకేల ద్వారా పాడిరైతుల గడప వద్దకే పశు వైద్య సేవలందిస్తున్నాం. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పాడిరైతుకు ఏది కావాలన్నా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. రూ.4 వేల విలువైన మందులతో పాటు నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, గడ్డికోసే యంత్రాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నాం. –డాక్టర్ అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ వెన్న శాతం, దిగుబడి పెరిగింది వైఎస్సార్ జిల్లా వెలమవారిపల్లెకు చెందిన జే.గుర్రప్ప జీవనాధారం పాడిపోషణే. తనకున్న 15 పశువులకు మేతగా ఎండుగడ్డి, శనగ కట్టెతో పాటు ఆరు బయట లభ్యమయ్యే పచ్చగడ్డి అందించినప్పుడు ఆశించిన పాల దిగుబడి వచ్చేది కాదు. పశువులు తరచూ అనారోగ్యాల బారిన పడేవి. ఆర్నెళ్ల క్రితం ఆర్బీకే ద్వారా 50 కిలోల గడ్డి విత్తనాలు తీసుకొని సాగు చేశాడు. గడ్డిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పశువులు ఇష్టంగా మేత మేశాయి. పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రోజుకు 4–4.5 లీటర్ల పాలు ఇచ్చే ఈ పశువులు ప్రస్తుతం 5–6.5 లీటర్లు ఇస్తున్నాయి. పాలల్లో వెన్న శాతం 5–6 నుంచి 7–8 శాతానికి పెరిగింది. లీటర్‌పై రూ.10 అదనంగా పొందగలుగుతున్నట్లు గుర్రప్ప ఆనందంగా చెబుతున్నాడు. -
పాడి రైతుల ఆదాయం పెంపుపై దృష్టి సారించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. వ్యవసాయానికి అనుబంధంగా అభివృద్ధి చెందుతున్న పాడి రంగాన్ని కచ్చితమైన ఆదాయ వనరుగా మలచుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర అధికారులతో కలసి మంత్రి తలసాని గురువారం పాడిరంగం అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు, చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. తలసాని మాట్లాడుతూ...పాడి పశువుల కొనుగోలు, పశువుల కొట్టాల నిర్మాణం, బీమా వంటి వాటి కోసం రుణ మార్గాలను కూడా అన్వేషించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పాల ఉత్పత్తి దారుల సహకార సంఘా లు, బ్యాంకులు, పాల ఉత్పత్తి దారుల మధ్య ఒప్పందం కు దుర్చుకునేలా మార్గం సుగమం చేయాలని సూచించారు. -
‘అమూల్’ రైతులకు అదనపు లాభం
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలసేకరణ ధరను అమూల్ సంస్థ తాజాగా మరోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.3.30, ఆవు పాలపై రూ.1.58 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. నాలుగోసారి పెంపు వర్తింపు ‘జగనన్న పాల వెల్లువ’ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా ప్రస్తుతం 16 జిల్లాలకు విస్తరించారు. గత 23 నెలల్లో మూడుసార్లు సేకరణ ధరలను పెంచారు. ఉత్తరాంధ్ర పరిధిలో గత నెలలో పెంచగా, తాజాగా కోస్తాంధ్రలో 10 జిల్లాల పరిధిలో పాలసేకరణ ధరలను నాలుగోసారి పెంచారు. 1.12 లక్షల మందికి అదనపు లబ్ధి కోస్తాంధ్ర పరిధిలో ఇప్పటికే లీటర్ గేదె పాలకు రూ.79.20, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.1.58 పెంచారు. దీంతో గరిష్టంగా గేదె పాలు రూ.82.50, ఆవు పాలు రూ.39.48 చొప్పున సేకరణ ధరలు చేరాయి. వెన్నపై కిలోకు రూ.30, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.11 చొప్పున పెంచడంతో వెన్న ధర రూ.750, ఘన పదార్థాల ధర రూ.280కి చేరుకుంది. గత నెలలో అమలులోకి వచ్చిన పెంపు వల్ల ఉత్తరాంధ్రలో 233 గ్రామాల పరిధిలోని 33,327 మంది రైతులు లబ్ధి పొందగా తాజా పెంపుతో కోస్తాంధ్రలోని బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 890 గ్రామాలకు చెందిన 1,12,313 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. రూ.208.23 కోట్లు చెల్లింపు రాష్ట్రంలో ప్రస్తుతం 16 జిల్లాల పరిధిలో 2,833 గ్రామాలకు చెందిన 2,44,069 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 30 వేల మంది పాల ఉత్పత్తిదారులు ప్రతిరోజూ సగటున లక్ష లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. ఇప్పటివరకు 4.86 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.208.23 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.25 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా ప్రతి పది రోజులకోసారి పాలుపోసే రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. డిసెంబర్ లోగా రాష్ట్రమంతా విస్తరణ జగనన్న పాల వెల్లువ కింద పాలసేకరణ ధరను అమూల్ నాలుగోసారి పెంచింది. ఇప్పటికే 16 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రమంతా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
పాడి రైతులకు శుభవార్త.. విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ పాడి రైతులకు ప్రభుత్వం వినాయక చవితికి ముందే శుభవార్త చెప్పింది. ఈ డెయిరీకి పాలు పోసే రైతులకు చెల్లిస్తున్న పాల సేకరణ ధరను పెంచుతున్నట్టు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. గేదె పాలు లీటర్‌కు రూ.46.69 నుంచి రూ.49.40కు, ఆవుపాల ధరను లీటర్‌కు రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతామని, పెరిగిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తలసాని మాట్లాడుతూ, పాలసేకరణ ధరతో పాటు డెయిరీ సొసైటీ నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా పెంచుతామని, ఈ పెంపు వల్ల ప్రతి నెలా డెయిరీపై రూ.1.42 కోట్ల మేరకు భారం పడుతుందని చెప్పారు. అయినా పాడిరైతుల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ ఇప్పుడు ఏటా రూ.800 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం కింద అనేకమంది పాడి గేదెలను కొనుగోలు చేశారని, వారంతా విజయ డెయిరీకి పాలుపోసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సదస్సులో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విజయ డెయిరీ ఇన్చార్జి అధర్‌సిన్హా, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రమంతటా ‘జగనన్న పాలవెల్లువ’
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ రాష్ట్రమంతా విస్తరించనుంది. మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహకార రంగంలో పాల డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అంతర్జాతీయంగా పేరొందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో జగనన్న పాలవెల్లువకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత రెండు ఉమ్మడి జిల్లాలతో ప్రారంభమై దశలవారీగా ఏడు జిల్లాలకు విస్తరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం 16 జిల్లాల్లో అమలవుతోంది. మిగిలిన పది జిల్లాలకుగానూ కాకినాడ, కోనసీమలో జూలై నాలుగో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిత్యం లక్ష లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 2,651 గ్రామాల్లో పాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 2.27 లక్షల మంది పాడిరైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 45,456 మంది రోజూ పాలు పోస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ లక్ష లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. అమూల్ తరపున రాయలసీమ జిల్లాల్లో కేరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇప్పటి వరకు అమూల్ కేంద్రాల ద్వారా 1,53,92,363 లీటర్ల ఆవుపాలు, 1,93,74,139 లీటర్ల గేదె పాలు సేకరించారు. పాడి రైతులకు రూ.149.29 కోట్లు చెల్లించారు. ఇటీవలే పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు గేదె పాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 మేర రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. 11 శాతం కొవ్వు, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.79.20 చెల్లిస్తున్నారు. 5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన ఆవుపాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.35.78 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్ రాకముందు లీటర్‌కు రూ.30–31కి మించి లభించేది కాదు. ప్రస్తుతం సగటున లీటర్‌కు గేదె పాలకు రూ.53.50, ఆవుపాలకు రూ.30.24 వరకు ధర లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు రైతులకు అదనంగా లబ్ధి చేకూరుతోంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు గత్యంతరం లేక పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్లలో లీటర్‌కు పాలసేకరణ ధరలను రూ.10–12 వరకు పెంచాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, అవుట్‌లెట్స్ రెండు జిల్లాల్లో 100 గ్రామాల్లో మొదలైన పాల సేకరణ దశలవారీగా ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో 2,651 గ్రామాలకు విస్తరించింది. పునర్విభజన తర్వాత రాజమహేంద్రవరం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాలకు విస్తరించింది. కర్నూలు, నంద్యాలతో పాటు కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభించాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా అన్ని జిల్లాలకు విస్తరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి సేకరించే పాలను ప్రాసెస్ చేసేందుకు మదనపల్లి, విజయవాడ, విశాఖలో అమూల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో కంటైనర్ తరహాలో అమూల్ అవుట్‌లెట్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వచ్చే 3 నెలల్లో విస్తరణ జగనన్న పాల వెల్లువ పథకాన్ని మరో మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జూలై నెలాఖరులోగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చేపడతాం. మిగిలిన జిల్లాల్లో కూడా సెప్టెంబర్ కల్లా విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దశలవారీగా పాల సేకరణ గ్రామాలను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
పాడి రైతుకు లాభాల పంట
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా ఇప్పటికే ఏడు ఉమ్మడి జిల్లాల్లో పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా పాలసేకరణ ధరను మూడోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.4.42, ఆవు పాలపై రూ.2.12 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన సేకరణ ధరలు అమూల్ ప్రస్తుతం పాలను సేకరిస్తున్న పది జిల్లాల్లో ఆదివారం నుంచే అమలులోకి రాగా మరో నాలుగు జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో వర్తించనున్నాయి. ప్రైవేట్ డెయిరీల ఇష్టారాజ్యంతో ఇన్నేళ్లూ తీవ్రంగా నష్టపోయిన పాడి రైతులకు ‘అమూల్’ రాకతో సాంత్వన లభిస్తోంది. 14 జిల్లాల్లో అమూల్.. ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి 2020 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం ఏడు జిల్లాలకు (పునర్విభజన అనంతరం 14 జిల్లాలు) విస్తరించింది. దీని ద్వారా అమూల్ సంస్థ ప్రారంభంలో పాల సేకరణకు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్ కలిగిన ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతులకు చెల్లించింది. అయితే గత 17 నెలల్లో రెండుసార్లు సేకరణ ధరలను అమూల్ పెంచడంతో రైతులకు లాభం చేకూరింది. తాజాగా మూడోసారి సేకరణ ధరలను పెంచింది. తాజాగా మరోసారి.. ఇప్పటివరకు లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవుపాలకు రూ.35.78 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరపున జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తోన్న సబర్కంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు గరిష్టంగా గేదెపాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా గేదె పాలకు రూ.79.20, ఆవు పాలపై రూ.37.90 చొప్పున పాడి రైతులకు సేకరణ ధర లభిస్తోంది. వెన్నపై కిలోకు రూ.40, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.15 చొప్పున పెంచడంతో వెన్న రూ.720, ఘన పదార్థాలపై రూ.269 చొప్పున పాడిరైతులకు చెల్లిస్తున్నారు. దళారులు లేకుండా నేరుగా డబ్బులు.. తాజాగా సేకరణ ధరల పెంపుతో 1,94,377 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 28,763 మంది పాల ఉత్పత్తిదారులు రోజూ 96 వేల లీటర్ల చొప్పున అమూల్’కు పాలు పోస్తున్నారు. ఇప్పటి వరకు 2.91 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.124.48 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.21.13 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా రైతుల నుంచి నేరుగా పాలు సేకరించడమే కాకుండా పది రోజులకోసారి వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు పాలు పోసిన పాడి రైతులకు ప్రోత్సాహకంగా లీటర్ పాలకు అర్ధ రూపాయి చొప్పున లాయల్టీ ఇన్సెంటివ్ చెల్లిస్తుండటంతో పాల వెల్లువపై ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ఎంతో లాభం.. నాకు మూడు పాడి గేదెలున్నాయి. రోజూ ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నా. గతంలో లీటర్‌కు రూ.40–50కి మించి ఇచ్చేవారు కాదు. ఈ రోజు 8.8 శాతం వెన్న, 9.2 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో 10.7 లీటర్లు పాలు పోస్తే లీటర్‌కు రూ.63.36 చొప్పున ఏకంగా రూ.677.95 ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కుసుం నాగమల్లేశ్వరి, నంబూరు, గుంటూరు పాల వెల్లువతో మంచి రోజులు నాకు రెండు పాడిగేదెలున్నాయి. ఈరోజు (ఆదివారం) ఉదయం 6.50 లీటర్లు, సాయంత్రం 5.38 లీటర్లు పాలు పోశా. 8.8 వెన్న శాతం, 8.7 ఎస్ఎన్ఎఫ్ ఆధారంగా లీటర్‌కు రూ.59.86 చొప్పున ఇచ్చారు. నిన్నటితో పోలిస్తే లీటర్‌కు రూ.3.53 చొప్పున అదనంగా లాభం వచ్చింది. జగనన్న పాల వెల్లువతో మంచి రోజులు వచ్చాయి. – బొంతు వరలక్ష్మి, కోటపాడు, ఏలూరు జిల్లా త్వరలో మరో ఐదు జిల్లాల్లో.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ సంస్థ సేకరణ ధరను మూడోసారి పెంచింది. తాజా పెంపుతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతోంది. త్వరలో విశాఖ, తూర్పు గోదావరిలో (పునర్విభజన అనంతరం ఐదు జిల్లాలు) కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
పశువిజ్ఞాన బడితో పాడి సిరులు
బుట్టాయగూడెం: అన్నదాతల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. రైతుల ముంగిటకు సేవలందించేందుకు ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఇక్కడ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేలా ఏర్పాటు చేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాల్లోనే పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిద్వారా పశు పోషణ, మెలకువలపై పశువైద్య సహాయకులు, గోపాల మిత్రలు రైతులకు పూర్తి అవగాహన కల్గిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి తమకు ఎంతగానో ఉపయోగ పడుతుందని పాడి రైతులు ఆనంద పడుతున్నారు. ఏలూరు జిల్లాలో 537 కేంద్రాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 911 రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు విజ్ఞాన బడి కార్యక్రమం అమలు జరిగేలా అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలో పాడి రైతులకు సలహాలు, పలు సూచనలు ఇచ్చేందుకు 373 మంది పశువైద్య సహాయకులు, 187 మంది గోపాల మిత్రల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని 28 మండలాల పరిధిలో ఉన్న 537 రైతు భరోసా కేంద్రాల్లో పశు విజ్ఞాన బడి కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా అధికారులు కృషి చేస్తున్నారు. పాడి పశువుల పెంపకంపై అవగాహన : ఆర్బీకేల్లో అమలు చేస్తున్న పశు విజ్ఞాన బడి కార్యక్రమం ద్వారా పాడి రైతులకు పాడి పెంపకంపై మెలకువలు, యాజమాన్య పద్ధతులు, పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగిస్తున్నారు. పశువుల్లో వచ్చే వ్యాధులైన గొంతువాపు, జబ్బ వాపు, సంచుల వ్యాధి, గొర్రెలు, మేకలకు వచ్చే ఇటిక వ్యాధి గురించి అవగాహన కలిగిస్తున్నారు. జీవాలకు టీకాలు వేసే సమయం తదితర అన్ని వివరాలను పశువైద్య సహాయకులు వివరిస్తున్నారు. దగ్గర ఉండి పశువులకు టీకాలు వేయిస్తున్నారు. పశువుల కృత్రిమ గర్భధారణ గురించి పాడి రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. పాడి రైతులకు రుణ సదుపాయం భవిష్యత్‌లో కిసాన్కార్డుల ద్వారా రైతులకు ఏ విధంగా రుణాలు ఇస్తారో అదేవిధంగా పాడి పెంపకం చేపట్టే రైతులకు కూడా కిసాన్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు కూడా పాడి రైతులకు అందిస్తున్నారు. ఇంతవరకూ ఏలూరు జిల్లాకు సంబంధించి 537 కేంద్రాల పరిధిలో 2142 మంది పాడి రైతులకు 705 టన్నుల దాణాను సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 3725 మంది రైతులకు 58.4 టన్నుల పశుగ్రాస విత్తనాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసా కేంద్రంలో విజ్ఞాన బడి ఆర్బీకేల్లోనూ పశు రైతుల కోసం పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. మేకల పెంపకం, గొర్రెలు, పోషకాలకు సంబంధించిన మెలకు వలు, పశువులకు వచ్చే వ్యాధుల నివారణ చర్యలను రైతులకు వివరిస్తున్నాం. – జి.నెహ్రూబాబు, పశు సంవర్ధక శాఖ జేడీ, ఏలూరు పశు విజ్ఞాన బడితో ప్రయోజనం రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తున్నారు. దీంతో సకా లంలో వైద్యం చేయించగలుగుతున్నాం. అలాగే పశు సంపద అభివృద్ధిపై మెలుకువలు కూడా చెబుతున్నారు. – కె.భూమయ్య, రైతు, బూరుగువాడ, బుట్టాయగూడెం మండలం పాడి రైతులకు ఎంతో మేలు రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయ పనులకే కాకుండా పాడి సంపదపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్బీకేల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే దాణాలు, మందులు, గడ్డి కోసే యంత్రాలు, పాలు పితికే యంత్రాలు మొదలైన వాటిని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. – డాక్టర్ ఎం.సాయి బుచ్చారావు, అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), జీలుగుమిల్లి -
ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్ రాకతో పాలకు మంచి ధర
3 లీటర్లకే రూ.200 వస్తోంది గతంలో పూటకు 8 లీటర్లు పోసేవాళ్లం. రూ.200 కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అమూల్ కేంద్రంలో 3 లీటర్లు పోస్తే రూ.200కు పైగా వస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటైన తర్వాతే మిగిలిన కేంద్రాల్లో కూడా రేటు పెంచారు. పాడి గేదెల కొనుగోలు కోసం లోన్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాం. – ఎస్కే.అసాబి, పెదకాకాని, గుంటూరు జిల్లా రైతులకు ఒక్క వ్యవసాయం ద్వారా మాత్రమే కాకుండా, ఇతరత్రా అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా సహకార డెయిరీ దిగ్గజం అమూల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రైవేట్ డెయిరీల దోపిడీకి ముకుతాడు వేస్తోంది. తద్వారా పాల సేకరణలో స్పష్టమైన మార్పు కళ్లెదుటే కనిపిస్తోంది. పాల ధర పెరిగింది. చెల్లింపుల్లో పారదర్శకత వచ్చింది. పాడి ఇక బరువు కానేకాదని, నాలుగు డబ్బులు కళ్లజూడొచ్చనే భరోసా కలిగింది. సాక్షి, అమరావతి : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుకు భద్రత, ఆర్థిక భరోసా లభిస్తోంది. ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కళ్లెం పడింది. ఇదివరకు పాలల్లో వెన్న శాతమెంతో.. ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్ – ఘన పదార్థాలు) శాతమెంతో రైతులకు తెలిసేది కాదు. కేంద్రంలో ఎంత చెబితే అంతే. ఆ లెక్కలే పుస్తకాల్లో రాసుకొని 15 రోజులకో నెలకో డబ్బులు ఇచ్చేవారు. ఎక్కువ పాలు పోసే వారికి ఒక ధర.. తక్కువ పాలు పోసే వారికి మరో ధర.. సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర చెల్లిస్తూ అందినకాడికి దోచుకునే వారు. వెన్న శాతాన్ని పరిగణనలోకి తీసుకొని పాలు సేకరించే ప్రైవేట్ డెయిరీలు నాణ్యతను గాలికొదిలేసేవి. దీంతో వెన్న శాతం పెంచి చూపేందుకు రైతుల నుంచి సేకరించే పాలల్లో నాసిరకం నూనెలు, హానికరమైన కొవ్వు పదార్థాలు కలిపి కృత్రిమంగా కల్తీ చేసిన పాలనమ్మి సొమ్ము చేసుకునే వారు. కొలతల్లో మోసాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో సహకార రంగంలోని డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. అనంతరం 2020 డిసెంబర్లో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత 3 జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించింది. ప్రతి రోజు సగటున లక్ష లీటర్ల చొప్పున ఇప్పటి వరకు 2.46 కోట్ల లీటర్ల పాలు సేకరించింది. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.104.89 కోట్లు జమ అయింది. ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్పు ఇలా.. ► 2020 అక్టోబర్ వరకు పది శాతం వెన్న కలిగిన లీటరు గేదె పాలకు సంగం డెయిరీ కేవలం రూ.56 ఇచ్చేది. ప్రారంభంలోనే అమూల్ లీటరుకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో సేకరించే గేదె పాలకు రూ.71.47.. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసింది. ► అమూల్.. సీజన్‌తో సంబంధం లేకుండా ఎస్ఎన్ఎఫ్, వెన్న శాతం ప్రామాణికంగా అన్ని సీజన్లలోనూ ఒకే రీతిలో చెల్లిస్తోంది. గతంలో ఏటా లీటరుపై రూ.2 – రూ.5కు మించి పెంచేవారు కాదు. అలాంటిది జగనన్న పాల వెల్లువ మొదలైన 15 నెలల్లోనే లీటరుపై రూ.12 పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అమూల్ వరుసగా రెండుసార్లు ధర పెంచింది. ► ప్రస్తుతం గరిష్టంగా లీటరు ఆవు పాలకు రూ.35.78, గేదె పాలకు రూ.74.78 చొప్పున చెల్లిస్తుంటే ఆ స్థాయిలో ప్రైవేట్ డెయిరీలు చెల్లించలేకపోతున్నాయి. గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం 8 నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. కానీ అమూల్ మాత్రం 20 – 22 శాతం ప్రొటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1,100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. ► ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. ► ఎలాంటి ఇన్సెంటివ్‌లు చెల్లించని హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేట్ డెయిరీలు సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు 50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాయి. మరో పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. కొలతల్లో మోసాలకు అడ్డుకట్ట ► కొలతల్లో మోసాలకు చెక్ పెట్టేందుకు తూనికలు – కొలతల శాఖకున్న అధికారాలతో పశు వైద్యులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో ప్రైవేటు డెయిరీలకు చెందిన పాల కేంద్రాల్లో జరిగే మోసాలు వెలుగు చూస్తున్నాయి. ► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ ప్రైవేటు డెయిరీకి పాలు పోస్తున్న అమ్మా డెయిరీ పాల కేంద్రంలో రోజుకు 1,200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. అయితే, కిలోకి 970 ఎంఎల్ చూపించాల్సిన మిషన్‌లో 930 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే ఒక్కో రైతు నుంచి 40 ఎంఎల్ చొప్పున రోజుకు 48 లీటర్ల పాలు అధికంగా కాజేస్తున్నట్టుగా గుర్తించారు. పలు కేంద్రాల్లో లైసెన్సుల్లేని వేయింగ్ మిషన్లు వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ బలోపేతం ► వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాల లభ్యతపై భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో సహకార పాల డెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలను ప్రభుత్వం బలోపేతం చేసింది. వీటి ద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఎస్ఎన్ఏఎఫ్ వంటి వాటితో పాటు 24 పారా మీటర్స్‌లో కల్తీ పదార్థాలను గుర్తించి సరిచేస్తుంది. ఆకస్మిక తనిఖీల్లో సేకరించిన మిల్క్‌ను ఎనలైజర్స్ ద్వారా పరిశీలించి, కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ► జగనన్న పాల కేంద్రాలు లేని చోట మాత్రం కొన్ని ప్రైవేటు డెయిరీలు పాల సేకరణలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నాయి. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను బట్టి జరిగే చెల్లింపులను పరిశీలిస్తే అమూల్ చెల్లిస్తున్న పాల ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్నట్లు అనంతపురం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో వెలుగు చూసింది. ► అమూల్ కేంద్రాల కంటే ప్రైవేట్ కేంద్రాల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ 0.2 నుంచి 0.5 శాతం తక్కువగా చూపి, అంటే లీటర్‌కు రూ.4 చొప్పున తక్కువ చెల్లించేందుకు యత్నిస్తుండగా, నిరంతర తనిఖీలతో అడ్డుకట్ట వేస్తున్నారు. కల్తీకి అడ్డుకట్ట వేసిన అమూల్ ► కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాలు సేకరిస్తున్నాయి. ► నాణ్యతకు పెద్ద పీట వేసేందుకు ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు తమ కేంద్రాల్లో కొద్దిపాటి యంత్ర పరికరాలైనా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమూల్ రాకతో పాల నాణ్యత విషయంలో పాడి రైతులకు అవగాహన పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట పడింది. జగనన్న పాలవెల్లువతో ఎంతో మేలు 15 ఏళ్లుగా పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాం. గతంలో లీటరుకు రూ.43 ఇచ్చేవారు. పాలలో వెన్న శాతాన్ని తక్కువ చేసి చూపించి, మాకు రావాల్సిన ఆదాయాన్ని వారి జేబుల్లో వేసుకునే వారు. జగనన్న పాల వెల్లువ ప్రారంభమైన తర్వాత లీటరు పాలకు రూ.66కు పైగా చెల్లిస్తున్నారు. కచ్చితమైన కొలత, వెన్న శాతం ఉంటోంది. పాలు పోసిన వెంటనే మా మొబైల్‌కు ఆ వివరాలతో కూడిన మెసేజ్ వస్తోంది. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి 10 రోజులకొకసారి పాల బిల్లు చెల్లిస్తోంది. – కుడుముల సుజాత, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల, వైఎస్సార్ జిల్లా -
బీర్ పీనా.. దూద్ దేనా !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్‌దాణా (బీర్ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు. ధర తక్కువ బీర్ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్‌దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్‌దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి. పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్ లిక్విడ్ డిమాండ్ ఎక్కువ కావడంతో.. పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్‌దాణాను వాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్‌దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్దాణాకు లీటర్‌కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. – డాక్టర్ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తలకొండపల్లి -
పాడి కోసం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: అన్నివేళలా అన్నదాతలకు అండగా నిలిచేందుకు గన్నవరంలోని ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’ మాదిరిగానే పాడి రైతుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మూగజీవాలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో రూ.7.53 కోట్లతో దేశంలోనే తొలిసారి ఏర్పాటవుతున్న ఈ కాల్‌సెంటర్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీచేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ ద్వారా పాడిరైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు టెలిమెడిసిన్ సేవలు కూడా అందిస్తారు. ఉదయం 9.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. -
పాడిరైతుకు మేలు జరిగేలా..
సాక్షి, అమరావతి: పాడి రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. పాల కొలతల్లో మోసాలకు పాల్పడి పాడి రైతులను దగా చేస్తున్న ప్రైవేటు డెయిరీల ఏజెంట్లు, దళారులపై ఉక్కుపాదం మోపింది. వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు వసూల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యను పాడి రైతులు హర్షిస్తున్నారు. మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలను సాధారణంగా లీటర్లలో కొలుస్తారు. గ్రాముల్లో చూస్తే 970 ఎంఎల్ పాలు వెయ్యి గ్రాములు (కేజీ)తో సమానం. కానీ క్షేత్రస్థాయిలో వెయింగ్ మిషన్లలో కిలోకి 900 నుంచి 930 ఎంఎల్ మాత్రమే వచ్చేలా మారుస్తున్నారు. దీనిద్వారా రైతు నుంచి 40 నుంచి 70 ఎంఎల్ పాలను అధికంగా సేకరిస్తున్నారు. లాక్టో అనలైజర్‌పై లెక్కగట్టే కొవ్వు, ఘన పదార్థాల శాతాన్ని బట్టి మొత్తం పాలకు సొమ్ములివ్వాలి. అధికంగా సేకరించిన 70 ఎంఎల్ పాలు, దానిలో ఉండే కొవ్వు, ఘన పదార్థాలకు రైతుకు చెల్లించాల్సిన మొత్తాన్ని దళారీలు జేబులో వేసుకుంటున్నారు. పాల కేంద్రాల్లో దళారులు, ఏజెంట్లు చేసే ఈ తరహా మోసాలను ఇప్పటివరకు అడ్డుకునే వారే లేరు. వీరి ఆగడాలకు చెక్‌పెడుతూ పాడిరైతులు పైసా కూడా నష్టపోకూడదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 27 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరి వద్దనున్న 21.47 లక్షల గేదెలు, 13.56 లక్షల ఆవుల ద్వారా ప్రతిరోజూ 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్‌కి వస్తుంటాయి. ప్రైవేటు వ్యక్తులు సైతం పెద్ద ఎత్తున పాలు సేకరిస్తుంటారు. పాల సేకరణకు నిర్దిష్ట నిబంధనలు లేవు. వాటిని కొలిచేందుకు ఉపయోగించే వెయింగ్ మిషన్, లాక్టో అనౖలైజర్కు లైసెన్సులు, సర్టిఫికెట్లు అవసరం. అయితే, పలు ప్రైవేటు డెయిరీల ఏజెంట్లు, దళారులు వెయింగ్ మిషన్ల సీళ్లను తొలగించి వారికి అనుకూలంగా మార్చి, రైతులను మోసం చేస్తున్నారు. 57 ఉల్లంఘనలు.. 37 మందిపై కేసులు ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో తొలిసారిగా తూనికలు– కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను పశు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తోంది. పలు చోట్ల ప్రైవేటు డెయిరీలు, ఏజెంట్లు, దళారులు చేస్తున్న మోసాలు తనిఖీల్లో బట్టబయలవుతున్నాయి. వారిపై కేసులు నమోదు చేసి, పెద్ద ఎత్తున జరిమానాలు వసూలు చేస్తున్నారు. రెండు విడతల్లో కొనసాగిన ఈ దాడుల్లో 86 బృందాలు వివిధ జిల్లాల్లో 286 చోట్ల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 57 ఉల్లంఘనలను గుర్తించారు. 37 మంది ఏజెంట్లు, దళారీలపై కేసులు నమోదు చేశారు. ఉల్లంఘనులపై కాంపౌండ్ ఫీజు రూపంలో రూ.1,000 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలి దశలో డెయిరీల్లో జరిగే మోసాలు, కల్తీలపై ఈ బృందాలు దృష్టి పెట్టబోతున్నాయి. లైసెన్సు లేకుండానే వినియోగం ధర్మవరం గ్రామంలో పాలు సేకరించే ఓ ప్రైవేటు వ్యక్తి ఎలాంటి లైసెన్సు, సర్టిఫికెట్లు లేని వెయింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా కిలోకి 940 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. రోజుకు 48 లీటర్లు పక్కదారి అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో గాయత్రి ప్రైవేటు డెయిరీకి పాలు పోస్తున్న అమ్మా డెయిరీ పాల కేంద్రంలో కిలోకి 970 ఎంఎల్ చూపించాల్సిన మిషన్‌లో 930 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే ఒక్కో రైతు నుంచి 40 ఎంఎల్ పాలు అధికంగా సేకరిస్తున్నారు. ఈ డెయిరీ ప్రతిరోజు 1200 లీటర్లకు పైగా పాలు సేకరిస్తుంది. ఆ లెక్కన రోజుకు కనీసం 48 లీటర్ల పాలు అధికంగా సేకరించి రైతులకు చెల్లించాల్సిన సొమ్ములను వారి జేబుల్లో వేసుకుంటున్నట్టుగా గుర్తించారు. -
Jagananna Pala Velluva: సాధికారతకు ఊతం
అమ్మే వారు అనేక మంది ఉన్నప్పుడు.. కొనేవాడు ఒక్కడే ఉంటే అతడు ఎంత ధర చెబితే అంతే. దాన్నే బయ్యర్స్ మోనోపలీ అంటారు. కొనేవాళ్లు ఇద్దరు ముగ్గురున్నా గ్రూపుగా ఏర్పడతారు. అప్పుడు అమ్మే వారంతా కట్టకట్టుకుని అదే రేటుకు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇలాగైతే అమ్మే వారికి అన్యాయమే జరుగుతుంది. మన రాష్ట్రంలో పాడి రైతుల విషయంలో ఈ పరిస్థితి చూస్తున్నాం. దీన్ని మార్చడానికి మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని ‘ఏపీ పాల వెల్లువ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తద్వారా పోటీ వాతావరణం కల్పించి పాలు విక్రయించే అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాడి రైతులకు ముఖ్యంగా పాలు పోసే అక్క చెల్లెమ్మలకు అదనపు ఆదాయం కల్పించడానికే అమూల్‌ను తీసుకువచ్చామని, వారి ఆర్థిక చైతన్యానికి ఈ పాలవెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందని చెప్పారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ కార్యక్రమం కింద పాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అమూల్‌ను ఎదుర్కోవడానికి మిగిలిన డెయిరీలు కూడా రేట్లు పెంచుతుండటం మంచి పరిణామం అని, కారణం ఏదైనా పాడి రైతులకు మేలు జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ కృష్ణా జిల్లాలో శ్రీకారం చుడుతున్న పాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సబర్ కాంత మిల్క్ యూనియన్ ఎండీ డాక్టర్ బీఎం పటేల్‌కు అభినందనలు తెలుపుతున్నానని, నేటి నుంచి కృష్ణా జిల్లా రైతులకు, అక్కచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ పాలవెల్లువ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పక్కన మంత్రులు సీదిరి అప్పలరాజు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబన ► మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. ఏపీ అమూల్ పాల వెల్లువ పథకం ద్వారా గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబనకు, ప్రత్యేకంగా మహిళా సాధికారతకు ఇది ఊతమిస్తుంది. కృష్ణా జిల్లాలో పాల సేకరణకు 264 గ్రామాలను ఈ దశలో ఎంపిక చేయగా, ఆయా గ్రామాల్లో 37,474 మంది పాడి రైతులను గుర్తించాం. ► కృష్ణా జిల్లాలో ఇటీవల లాంఛనంగా 51 కేంద్రాల్లో పాల సేకరణను ప్రారంభిస్తే.. వారం రోజుల్లోనే 18,414 లీటర్ల పాలు సేకరించాం. 941 మంది పాడి రైతులకు రూ.8.15 లక్షల బిల్లు కూడా చెల్లించాం. రైతులకు ప్రతి లీటరుకు అదనంగా రూ.20కి పైగా లాభం వచ్చింది. ► ఉదాహరణకు చాట్రాయి మండలం సోమవరానికి చెందిన పి.వెంకటనర్మమ్మ అనే సోదరి గతంలో కృష్ణా మిల్క్ యూనియన్‌కు పాలు పోయగా, లీటరుకు రూ.44.80 వచ్చింది. ఇప్పుడు అమూల్ పాల వెల్లువ కేంద్రంలో పాలు పోయగా, లీటరుకు రూ.74.78 వచ్చింది. అంటే లీటరు పాలపై ఆమె దాదాపు రూ.30 అదనంగా సంపాదించింది. సెప్టెంబర్‌కు 17,629 గ్రామాలు లక్ష్యం ► ప్రకాశం జిల్లాలో 245 గ్రామాల్లో, చిత్తూరులో 275 గ్రామాల్లో, వైఎస్సార్‌లో 149 గ్రామాల్లో, గుంటూరులో 203 గ్రామాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి.. మొత్తంగా 1,046 గ్రామాల నుంచి అమూల్ ఇప్పటికే పాల సేకరణ చేస్తోంది. 2022 సెప్టెంబర్ నాటికి 17,629 గ్రామాల నుంచి పాల సేకరణకు ప్రణాళికలు రచించాం. ► ఏడాది కాలంలో ఐదు జిల్లాల్లో అమూల్ పాల సేకరణ ప్రారంభమవ్వగా, ఇవాళ ఆరవ జిల్లాలో మొదలైంది. మిగిలిన ఏడు జిల్లాలకూ విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ► గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 30,951 మంది మహిళా పాడి రైతుల నుంచి అమూల్ 168.50 లక్షల లీటర్లు పాల సేకరణ చేసింది. దాదాపు రూ.71 కోట్లు చెల్లించాం. ఇది పెద్ద విషయం కాదు. ఇతర డెయిరీలకు పాల సరఫరా చేస్తే వచ్చే దానికంటే దాదాపు రూ.10 కోట్లు అదనంగా వచ్చిందన్నది మనం గమనించాలి. ఇదే అక్కచెల్లెమ్మలు గతంలో వాళ్లకే పాలు పోసి ఉంటే రూ.61 కోట్లే వచ్చేవి. పాలు పోసేవారే యజమానులు ► రైతులకు అత్యధిక రేటు ఇస్తారు. వాళ్ల దగ్గరున్న ప్రాసెసింగ్ మరెవ్వరి దగ్గరా లేదు. పాల నుంచి చాక్లెట్స్, ఇతర ఉత్పత్తులు తయారు చేసే స్థాయికి ఎదిగిన సంస్థ అమూల్. ► మిల్క్ ప్రాసెసింగ్‌లో దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. పాలు పోసే రైతులే అమూల్ యజమానులు. ► ఈ కంపెనీలో వాటాదారులు అంతా మీరే. లాభాపేక్ష అనేది అమూల్‌కు లేదు. సంస్థ గడించే లాభాలను ఏడాదికి ఒకసారి బోనస్ రూపంలో తిరిగి అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్‌లోనే ఉంది. ► పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మేలు జరుగుతుంది. అమూల్‌తో ఇబ్బంది పడే పరిస్థితి రాదు, ఉండదు. సంస్థ బాగే రైతుల బాగు ► ఇదొక సహకార రంగ సంస్థ. సంస్థ బాగుంటే రైతులు బాగుంటారు. సంవత్సరంలో కనీసం 182 రోజులు అంటే ఆరు నెలలు సొసైటీకి పాలు పోసిన మహిళా పాడి రైతులకు అమూల్ ద్వారా ఏడాది చివరిలో ప్రతి లీటరుపై 50 పైసలు బోనస్‌గా కూడా చెల్లిస్తున్నారు. ► ఈ సంస్థ నాణ్యమైన పశుదాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. ఎంసీయూ, ఏఎంసీయూలలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో డెయిరీలు ► సహకార రంగ డెయిరీలలో బాగున్న వాటిలో కొన్నింటిని.. దురదృష్టవశాత్తు కొంత మంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. అవి వాళ్ల ప్రైవేటు ఆస్తుల కింద మారిపోయాయి. ► ప్రభుత్వానికి ఇది ఒక సమస్య అయితే.. రెండోది ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో వాటాలు ఉండటం వల్ల, పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి ధర ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఉండేది కాదు. ఈ పరిస్థితి ఎందుకు? ► మన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అమూల్ వస్తే తప్ప మన రైతులకు, మన అక్కచెల్లెమ్మలకు మెరుగైన రేటు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపై అందరూ ఆలోచించాలి. ► నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో పాలుపోసే రైతులు, అక్కచెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి కలిసేవారు. ‘ఒక లీటరు మినరల్ వాటర్ ధర రూ.23 అయితే, ఒక లీటరు పాలు ధర కూడా రూ.23. ఇలాగైతే ఏ రకంగా బతకగలుగుతాం?’ అని ప్రతి జిల్లాలో బాధపడేవాళ్లు. నేను కూడా ఇదే ప్రస్తావించేవాడిని. ► అందుకే అధికారంలోకి రాగానే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని, పాల సేకరణ చేపట్టాం. అమూల్‌కు, మిగిలిన సంస్థలకు ఉన్న తేడా ఏంటన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. అమూల్ అనేది కంపెనీ కాదు.. మనలాంటి వాళ్లు కలిసికట్టుగా ఒక్కటైతే అమూల్ అవుతుంది. ఈ పరిస్థితిని మారుస్తున్నాం ► ఈ పరిస్థితిని మార్చాలని మన ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా కట్టుబడి రకరకాల కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4,796 గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ► ప్రతి మహిళా డెయిరీ సహకార సంఘానికి అనుబంధ గ్రామాల్లో కూడా పాల సేకరణ చేయడానికి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.979 కోట్లతో బీఎంసీయూలు, 12,883 ఏఎంసీయూల నిర్మాణం కోసం మరో రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► వీటి ద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా వస్తుంది. మోసం ఉండదు. ఎంత ఎస్ఎన్ఎఫ్ ఉందని వాళ్లే మీటర్ పెట్టి చూసుకోగలుగుతారు. ఎవరి ప్రమేయం లేకుండా బిల్లు వస్తుంది. ఇంత ధర వస్తుందనేది తెలుస్తుంది. ► ప్రభుత్వ చర్యలతో అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి దోచుకున్న డెయిరీలకు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారికి దిక్కుతోచడం లేదు. అమూల్ రావడంతో వాళ్లు కూడా రేట్లు పెంచుతున్నారు. మనకు కావల్సింది అదే. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అమూల్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీ ఎం పటేల్ హాజరయ్యారు. రైతులకు అండగా ప్రభుత్వం ► మన రైతులు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.. అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టే.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ప్రభుత్వమే మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ.. రైతులకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే దళారులను సవాల్ చేసింది. ► ఈ రేటు కంటే తక్కువకు అమ్మాల్సిన పనిలేదని, ఆ ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడంతో.. దళారులు అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండున్నరేళ్లుగా అనేక ఉత్పత్తులను ధరల స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడగలిగాం. ► ధాన్యం, కూరగాయలు, పండ్లతో పాటు పాడి రైతులకు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా అడుగులు వేశాం. -
జగనన్న పాల వెల్లువ ద్వారా ‘క్షీర’ సిరులు
పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సహకార పాల డెయిరీలను అమూల్‌తో భాగస్వామ్యం చేయడం ద్వారా పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తొలి విడతలో 120 గ్రామాల్లో పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజు 14 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా పాల వెల్లువ సృష్టించనున్నారు. కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లాలో క్షీర విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడి రైతుకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సహకార డెయిరీగా పేరొందిన అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గత ఏడాది నవంబర్ నెలాఖరు నుంచి జిల్లాలో కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, చక్రాయపేట మండలాల్లో పాల శీతలీకరణ కేంద్రాలను ప్రారంభించింది. వివిధ మండలాల్లోని 120 గ్రామాల నుంచి రోజుకు 14,000 లీటర్ల పాలను సేకరించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. త్వరలో మరో 27 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేందుకు కçసరత్తు చేస్తున్నారు. పాలలో వెన్న శాతం ఆధారంగా రైతులకు ధర చెల్లిస్తున్నారు. పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం.. పాలు పోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీఆర్డీఏ, ఏపీజీబీ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతోపాటు ఇతర మేలు రకం జాతి గేదెలను కొనుగోలుకు ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున రుణాలను మంజూరు చేసింది. పులివెందుల నియోజక వర్గంలోని ఆయా మండలాల్లో 1290 మంది మహిళలకు రుణాలు ఇచ్చారు. అన్ని గ్రామాల్లో ఏర్పాటుకు.. జగనన్న పాల వెల్లువ కేంద్రాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 88 టన్నుల పశుగ్రాస విత్తనాలు, 400 టన్నుల దాణామృతం(టీఎంఆర్) అందించారు. దీంతోపాటు ఉపాధిహామీ కింద బహు వార్షిక పశుగ్రాస సాగుకు 280 ఎకరాల మంజూరు చేశారు. దీపావళి బోనాంజా.. గత ఏడాదిలో పాలు పోసిన రైతులకు దీపావళి పండుగ కానుకగా అమూల్ డెయిరీ ప్రతి లీటర్‌కు 50 పైసలు చొప్పున బోనస్‌ను ప్రకటించింది. గత సంవత్సరం నవంబర్ నెలలో పాలసేకరణ ప్రారంభించిన రోజు నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు కనీసం 157 రోజులు పాలు పోసిన 2012 మంది పాడి రైతులను బోన‹స్కు అర్హులుగా గుర్తించారు. వీరి నుంచి సేకరించిన 19,96,775 లీటర్లకు గాను లీటర్‌కు రూ. 50 పైసలు చొప్పున రూ.9,96,346 బోనస్‌ను రైతులు బ్యాంకు అకౌంట్లో జమ చేశారు. వచ్చే ఏడాది నుంచి జిల్లావ్యాప్తంగా వచ్చే ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమూల్ పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో 120 గ్రామాలలో 2768 మంది రైతుల నుంచి రోజుకు 14000 లీటర్లను సేకరిస్తున్నాము. త్వరలో అన్ని గ్రామాల నుంచి పాల సేకరణ చేపడతాం. – వింజమూరి ఉదయకిరణ్, అమూల్ డెయిరీ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్. వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు ఎంత చిక్కనిపాలు పోసినా.. గతంలో ప్రైవేటు వ్యక్తులకు పాలు పోసేవాళ్లం. వాళ్లకు ఎంత చిక్కటిపాలు పోసినా లీటరుకు రూ. 35 ఇచ్చేవారు. దీంతో మేము బాగా నష్టపోయాం. ఇప్పుడు అలా కాదు. మేము పోసిన పాలకు వచ్చిన వెన్న శాతం బట్టి రేటు ఉంటుంది. లీటర్‌కు 48 నుంచి 65 రూపాయల వరకు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. – మేకల లక్ష్మిదేవి, చక్రాయపేట, మండలం బోనస్ కింద రూ.3366 వచ్చింది మేము అమూల్‌కు పోసిన పాలకు నెలనెల డబ్బులు రావడంతోపాటు బోనస్ కింద గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ. 3366 డబ్బు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పాల డబ్బులతోపాటు బోనస్ డబ్బులు కూడా రావడం మాకు ఆర్థికంగా వెసులుబాటు లభించింది. మేము సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. – పుష్పవతి, మల్లప్పగారిపల్లె మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. దీంతోపాటు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. పాల సేకరణలో కూడా దళారీ వ్యవస్థ లేకుండా మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. గతంలో లీటరు పాలు తక్కువ రేటుకు పోసేవారు. అమూల్ ద్వారా లీటరుకు రూ.45 నుంచి రూ.65 దాకా వస్తుంది. మహిళలంతా సంతోషంగా ఉన్నారు. – డాక్టర్ వీఎల్ సత్యప్రకాష్, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ, కడప -
‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో పుంజుకున్న పాడి పరిశ్రమ
ప్రకాశం జిల్లాలో గత పాలకుల నిర్లక్ష్యంతో ఒట్టిపోయిన పాలధారలు ‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో మళ్లీ పుంజుకున్నాయి. పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సహకార పాల డెయిరీలను అమూల్‌తో భాగస్వామ్యం చేయడం ద్వారా పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తొలి విడతగా 242 గ్రామాల్లో పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 10 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. తద్వారా పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా పాలవెల్లువ సృష్టించనున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. టీడీపీ హయాంలో నిలువునా మోసపోయిన పాడి రైతుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఉనికి కోల్పోయిన ఒంగోలు డెయిరీకి అమూల్ భాగస్వామ్యం కల్పించి డెయిరీ రంగానికి జవసత్వాలు అందిస్తోంది. టీడీపీ హయాంలోని డెయిరీ పాలక మండలి సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని కంపెనీ యాక్ట్‌లోకి మార్చింది. ఒక పథకం ప్రకారం అప్పుల ఊబిలోకి నెట్టి ఒట్టిపోయిన గేదెలా తయారు చేసింది. ఇదే అదునుగా హెరిటేజ్ డెయిరీతో పాటు ఇతర ప్రైవేట్ డెయిరీలు జిల్లా పాడి రైతులకు సరైన ధర ఇవ్వకుండా నిలువు దోపిడీ చేశాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు డెయిరీ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్‌ను రంగంలోకి దించి పాడి రైతులకు పూర్వ వైభవాన్ని సంతరించిపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్థిక పురోభివృద్ధి దిశగా.. జగనన్న పాల వెల్లువతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. 2020 నవంబరులో ఈ పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. తొలి విడతగా 201 గ్రామాల్లో పాలకేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మరో 41 కేంద్రాలను విస్తరింపజేశారు. 242 గ్రామాల్లోని పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 10 వేల లీటర్ల పాలు సేకరించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 37.12 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అందుకుగాను రూ.19.18 కోట్లు మహిళా పాడి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం పాలుపోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా చేయూతనిస్తున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతో పాటు ఇతర మేలు రకం జాతి గేదెల కొనుగోలు చేపట్టారు. వర్కింగ్ కాపిటల్ కింద ఒక్కొక్క గేదెకు ప్రధాన మంత్రి పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.30 వేలు చొప్పున, మరో రూ.70 వేలు బ్యాంకు ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 178 మంది మహిళా రైతులకు రూ.1.52 కోట్లు రుణాల రూపంలో ఇచ్చారు. సహకార బ్యాంకుతో పాటు కమర్షియల్ బ్యాంకుల ద్వారా 194 మంది మహిళా పాడి రైతులకు రూ.2.02 కోట్లు, అదేవిధంగా సెర్ప్ ద్వారా 792 మందికి రూ.7.33 కోట్లు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తంగా జిల్లాలో మహిళా పాడి రైతులు 1,164 మందికి రూ.10.53 కోట్లు ఇచ్చారు. వలంటీర్లతో సర్వే జగనన్న పాల వెల్లువ కేంద్రాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 210 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 201 మెట్రిక్ టన్నుల దాణామృతం (టీఎంఆర్) అందించనున్నారు. అలాగే 40 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసే ఛాప్ కట్టర్స్‌ను రైతులకు ఇస్తున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మేలుజాతి పశువుల ఉత్పత్తి కోసం 2020–21 సంవత్సరంలో 110 శాతం లక్ష్య సాధనతో జిల్లాలో 4.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో కనీసం 10 దేశీయ పశువులు కలిగి కృత్రిమ గర్భధారణ సౌకర్యంలేని రైతులకు జిల్లాలో 55 ఆబోతు దూడలను ఉచితంగా అందజేయనున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. ఎలాంటి షూరిటీలు లేకుండా మహిళా పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం. గ్రామాల్లో పాడి పరిశ్రమకు గత వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి రోజు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అమూల్ సంస్థ ద్వారా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రతి ఇంటిలో పాడి పరిశ్రమ ఉండేలా చూస్తున్నాం. – డాక్టర్ కొప్పరపు బేబీరాణి, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ -
AP: సహకారంతో పాడి పంట..
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార వ్యవస్థ తిరిగి బలోపేతం కావాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాలను అందిపుచ్చుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్లో భాగంగా చాలా మంది మహిళలు పాడి పశువులను కొనుగోలు చేశారని చెప్పారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించి సబ్సిడీలు వారికి నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సూచించారు. జగనన్న పాలవెల్లువ, మత్స్య శాఖలపై ముఖ్యమం‘త్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన పాలవెల్లువ మార్గదర్శకాలు, శిక్షణ కరదీపిక పుస్తకాలను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. ‘ఫిష్ ఆంధ్రా’ లోగోను విడుదల చేశారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. అమూల్ రాకతో పాడి రైతులకు ప్రయోజనం అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలు తప్పనిసరిగా సేకరణ ధరలు పెంచాల్సి వచ్చిందని, అమూల్ రాకతో పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకూ అదనపు ఆదాయం సమకూరుతోందని సీఎం పేర్కొన్నారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడి రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. బీఎంసీయూల కీలక పాత్ర మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పాడి పశువులను కొనుగోలు చేసిన మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు బీఎంసీయూలను (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) నిర్మిస్తున్నామని, పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. బీఎంసీయూల ఏర్పాటు ద్వారా మరింత పారదర్శకత వస్తుందన్నారు. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంపు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఆక్వాహబ్‌లు, మత్స్యసాగులో నూతన విధానాలు, రైతులకు మేలు చేకూర్చే అంశాలపైనా సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేలా ఆక్వాహబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తెస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్ అయి రేట్లు తగ్గిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్‌దారులు కుమ్మక్కవుతున్నట్లు పలు దఫాలు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనికి పరిష్కారంగా ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని తెలిపారు. ఎగుమతి మత్స్య ఉత్పత్తులపై అవగాహన ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించి రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేలా నాణ్యమైన ఫీడ్, సీడ్ అందించడంతోపాటు దోపిడీ వి«ధానాలను అడ్డుకునేందుకే కొత్త చట్టాన్ని తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి ఆక్వా హబ్‌లు, అనుబంధ రిటైల్ దుకాణాల ద్వారా దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. జనవరి 26 నాటికి 75 – 80 హబ్‌లు, 14 వేల రిటైల్ ఔట్లెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను సిద్ధం చేస్తామని వివరించారు. 10 ప్రాసెసింగ్ ప్లాంట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు అడ్డుకట్ట పడి రైతులకు మంచి ధరలు వస్తాయని తెలిపారు. పురోగతిలో ఫిషింగ్ హార్బర్ల పనులు రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పనులు మొదలైనట్లు అధికారులు తెలిపారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో తొలివిడతగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది జూన్ – జూలై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధమవుతాయని వెల్లడించారు. మిగిలిన ఐదు ఫిషింగ్ హార్బర్ల పనులు ఈ డిసెంబర్లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈవో కే.మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఏ.బాబు, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్రకుమార్, అమూల్ ప్రతినిధులు తదితరులు సమీక్షకు హాజరయ్యారు. జగనన్న పాలవెల్లువ ఇలా.. – 2020 నవంబర్‌లో పాడి రైతుల నుంచి 71,373 లీటర్ల పాలు అమూల్ ద్వారా కొనుగోలు –2021 ఆగస్టులో 14,46,979 లీటర్ల పాలు కొనుగోలు – ఇప్పటివరకూ మొత్తం 1,10,06,770 లీటర్ల పాలు కొనుగోలు – రోజూ సగటున అమూల్ కొనుగోలు చేస్తున్న పాలు 6,780 లీటర్ల నుంచి 51,502 లీటర్లకు పెంపు వ్యవస్థీకృతంగా ధ్వంసం.. ‘‘గత పాలకులు సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు. వారి కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఏ సహకార సంస్థనూ సరిగా నడవనివ్వని పరిస్థితులను సృష్టించారు. సహకార రంగ డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించడంతో పాటు ప్రైవేట్ సంస్థలుగా మార్చుకున్నారు’’ – సీఎం జగన్ -
పశుగ్రాసానికి 'ఉపాధి' ఊతం
సాక్షి, అమరావతి: పచ్చిమేత కొరతతో పాల దిగుబడి తక్కువగా వస్తున్న నేపథ్యంలో.. ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పశువులకు అవసరమైన మేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలు పచ్చిమేత సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశాయి. ఫలితంగా పచ్చిమేత సాగు చేసే రైతులు మూడేళ్ల పాటు రాయితీ పొందవచ్చు. పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.గంగునాయుడు పచ్చిమేత సాగుపై పలు విషయాలను వెల్లడించారు. ఖరీఫ్ సీజనే అనువు.. పచ్చిమేత సాగునకు ఖరీఫ్ సీజనే అనువైనది. పాడి రైతులు అధిక దిగుబడిని ఇచ్చే పచ్చిమేతల్లో సూపర్ నేపియర్‌తో పాటు అజొల్లా, హైడ్రోపోనిక్స్‌ను సాగు చేసుకోవచ్చు. వ్యవసాయ పంటల సాగుకు పనికిరాని భూమిని పచ్చిమేత కోసం ఉపయోగించుకోవచ్చు. పచ్చిమేత పుష్కలంగా ఉంటే ఐదు లీటర్ల పాలిచ్చే పశువుకు మరింకే దాణా వేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా పశు పోషణలో 70 శాతం ఖర్చు మేపుదే. అవిశ, సుబాబుల్ లాంటి చెట్లను నాటిన నాటి నుంచి 40, 50 రోజుల్లోపు పది కిలోల గడ్డి అందుబాటులోకి వస్తుంది. సూపర్ నేపియర్ అన్ని విధాలా మంచిది. ఎకరానికి సాలీనా వంద నుంచి 120 టన్నుల దిగుబడి సాధించవచ్చు. ఆరేడు కోతలు కోయవచ్చు. ఒకసారి నాటితే 6 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. పాడిరైతులు నేపియర్ గడ్డి కణుపుల కోసం కృష్ణా జిల్లా గన్నవరం, తిరుపతిలోని పశువైద్య కళాశాల ఫారాలను, గరివిడి వ్యవసాయ క్షేత్రం అధికారులను సంప్రదించవచ్చు. భూమి తక్కువగా ఉన్న రైతులు ధాన్యపు, పప్పుజాతి పశుగ్రాసాలను 2:1 నిష్పత్తిలో మిశ్రమ పంటగా సాగు చేయవచ్చు. జొన్న, అలసందలతో కలిపి పశుగ్రాసాలను పెంచవచ్చు. ప్రభుత్వ సాయం ఇలా.. పాడి రైతులు పచ్చిమేతను పెంచుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. పశుసంవర్థక శాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. లబ్ధిదారులు నిర్ణీత ప్రాంతంలో మూడేళ్లు పచ్చిమేతను పెంచాలి. ఈ కాలంలో ఉపాధి హామీ నిధుల నుంచి ఎకరానికి రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి విడతగా రూ.35,204, మిగతా రెండు విడతల్లో రూ.21 వేల చొప్పున లబ్ధిదారునికి ప్రభుత్వ సాయం అందుతుంది. -
‘అమూల్’పై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, అమరావతి: అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా పాల సేకరణ, మార్కెటింగ్ తదితరాలపై ఎలాంటి ఖర్చు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో తమ వాదనలు వినాలంటూ పాల రైతులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ కేసులో అమూల్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు దాఖలు చేసిన కౌంటర్లకు తిరుగు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ గడువు కోరారు. ఇందుకూ అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రి మండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు, అమూల్, ఏపీడీడీసీఎఫ్‌ల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం తాలూకు జీవో 25ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పల్లెల్లో పాల వెల్లువ
సాక్షి, అమరావతి: పల్లెల్లో పాల వెల్లువ పరిఢవిల్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల(ఏఎంసీయూ)ను ఏర్పాటు చేస్తోంది. ఇదే సందర్భంలో డివిజన్ స్థాయిలో ఉన్న మిల్క్ చిల్లింగ్ సెంటర్ల (ఎంసీసీ)లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటోంది. గత పాలకుల నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ (ఏపీ డీడీసీఎఫ్) అధీనంలో రోజుకు 2.5 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే ఆరు డెయిరీలతో పాటు 5.49 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటైన 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. మూతపడిన డెయిరీలను పునరుద్ధరించడంతోపాటు పాల లభ్యత అధికంగా ఉండే గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా సహకార రంగానికి పూర్వ వైభవం తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నిర్మాణాలు, పరికరాలకు రూ.4,189.75 కోట్లు ఇందులో భాగంగా నాణ్యమైన పాల సేకరణ కోసం 8,051 ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క యూనిట్‌ను 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందుకోసం రూ.942.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మహిళా మిల్క్ డెయిరీలు నిర్వహించే వీటిద్వారా నాణ్యమైన పాలను సేకరిస్తారు. ఇలా సేకరించిన పాలను చెడిపోకుండా భద్రపరిచేలా 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాలను ఎక్కడికక్కడే కూలింగ్ చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. వీటి నిర్మాణానికి రూ.1,885.76 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆయా యూనిట్లలో పరికరాల కోసం రూ.1,361.22 కోట్లు వెచ్చిస్తున్నారు. మొత్తంగా ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల కోసం రూ.4,189.75 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. వీటి నిర్మాణాలను సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దశల వారీగా వచ్చే మార్చి నెలాఖరులోగా పరికరాలను ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొస్తారు. రోజుకు 1.16 కోట్ల లీటర్ల పాల సేకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఏ ఒక్క పాడి రైతు దళారులు, ప్రైవేట్ డెయిరీల దోపిడీకి గురికాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాం. డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 6.60 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బీఎంసీయూల వల్ల రోజుకు పాల సేకరణ సామర్థ్యం 1.16 కోట్ల లీటర్లకు పెరుగుతుంది. – ఎ.బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ -
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జోష్
సాక్షి, అమరావతి: ‘వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతులకు, అక్కచెల్లెమ్మలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరుగెత్తగలుగుతుందని నమ్మాను. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోకి అమూల్‌ని తీసుకు వచ్చాం. పాల సేకరణ ద్వారా అక్కచెల్లెమ్మలందరికీ మరింత ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. తద్వారా వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జగనన్న పాల వెల్లువలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ–అమూల్ పాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆమూల్ పాల సేకరణను విస్తరించనున్నామని చెప్పారు. తద్వారా పాడి రైతులైన అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలోపేతం కానున్నారని పేర్కొన్నారు. ‘పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులు ఇప్పటికీ గుర్తున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఒక లీటరు పాలు తీసుకుని వచ్చి నాకు చూపించేవారు. ఒక లీటరు పాల రేటు రూ.23 ఉంది. ఒక లీటరు మినరల్ వాటర్ రేటు ఇంత కన్నా ఎక్కువుంది.. ఇదీ మా పరిస్థితి అని అక్కచెల్లెమ్మలు, పాడి రైతులు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలని, వ్యవసాయ ఆధారిత రంగాల ద్వారా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలని వెంటనే రాష్ట్రంలోకి అమూల్‌ని తీసుకొచ్చాం’ అన్నారు. అమూల్‌కు లాభాపేక్ష లేదని, లాభాలన్నీ ఏడాదికి ఒకసారి తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తూ గొప్ప పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అమూల్ దేశంలో నంబర్ వన్ సహకార సంస్థ ► అమూల్ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అనసరంలేదు. దేశంలోనే నంబర్ వన్ సహకార రంగ సంస్థ. దాదాపుగా రూ.50 వేల కోట్లు టర్నోవర్ చేస్తున్న ఈ సంస్థలో వాటాదారులు ప్రైవేటు వ్యక్తులు కాదు. వాటాదారులు అందరూ కూడా పాలుపోసే అక్కచెల్లమ్మలే. మిగిలిన వాళ్లతో పోలిస్తే పాల సేకరణ ధరను అక్కచెల్లెమ్మలకు అమూల్ అధికంగా ఇస్తోంది. ► అమూల్ సంస్థ ప్రపంచంతో పోటీ పడుతుంది. ఈ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్‌కు మిగతా సంస్థలకు తేడాను కూడా గమనించాలి. అమూల్ సంస్థలో పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారే చేసే విధంగా వారి ప్రాసెసింగ్ ఉంది. ► సహకార సంస్థను బాగా నడిపితే, ప్రైవేటు వ్యక్తులు ఆ సంస్థను ఆక్రమించకపోతే, రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి అమూల్ సజీవ ఉదాహరణ. ఇలాంటి అమూల్ సంస్థతో 2020 జూలై 21న ఒప్పందం కుదుర్చుకున్నాం. అదే సంవత్సరం డిసెంబర్ 2న అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభించాం. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పాల సేకరణ ► చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాల్లో విజయవంతంగా పాలసేకరణ జరుగుతోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ అడుగు పెడుతోంది. 153 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ► రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 2,600 గ్రామాల్లో, రెండేళ్లు పూర్తయ్యేలోగా మొత్తంగా 9,899 గ్రామాల్లో అమూల్‌ను విస్తరించి, అక్క చెల్లెమ్మలకు ప్రతి లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 వరకు ఎక్కువ రేటు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాం. ► మిగతా డెయిరీలతో పోల్చితే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ‘ప్రైవేట్’ స్వార్థంతో సహకార డెయిరీలు మూత ► సహకార రంగంలోని డెయిరీలు నష్టాలలో కూరుకుపోయాయి. ప్రైవేటు డెయిరీలు అటు పాడి రైతులను, ఇటు వినియోగదారులను దోపిడీ చేయగలిగే పరిస్థితి నెలకొంది. ఇలా ఎందుకు జరిగిందంటే సహకార రంగంలో ఉన్న డెయిరీలకు అమూల్ మాదిరిగా పూర్తి స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాల్సిన పరిస్ధితిలో లేకపోవడమే. ► మార్కెట్‌ను పెంచుకోవడంలో సహకార డెయిరీలు ఆ స్థాయికి ఎదగలేదు. కొన్ని మంచి డెయిరీలను ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా ఆక్రమించేసుకుని, వాటిని ప్రైవేట్ ఆస్తుల కింద మార్చుకున్నారు. ► ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో ప్రయోజనాలు ఉన్నందు వల్ల వాళ్ల ఆదాయాలు పెంచుకునేందుకు, రాష్ట్రంలో సహకార వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిన పరిస్ధితులు మన కళ్లెదుటే కనిపించాయి. ఈ పరిస్థితిని మార్చి.. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్న అన్న తపన, తాపత్రయం, ఆరాటంతో ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. కళ్లెదుటే పాలల్లో నాణ్యత పరీక్ష ► 2,600 గ్రామాల్లో మనం బీఎంసీలు అంటే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్(ఏఎంసీ) తీసుకొస్తున్నాం. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. గతంలో పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటన్నది అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ తెలిసేది కాదు. ► ఇప్పుడు బీఎంసీలు, ఏఎంసీల వల్ల మన కళ్ల ఎదుటే మనం పోసే పాల నాణ్యత తెలిసిపోతుంది. అలా తెలిసిన వెంటనే ఒక స్లిప్ కూడా ఇస్తారు. దీనివల్ల అక్కచెల్లెమ్మలు ఏ ఒక్కరూ కూడా దోపిడీకి గురికారు. ఆ నాణ్యతకు తగ్గట్టుగా అక్కచెల్లెమ్మలకు అమూల్ మంచి రేటు ఇవ్వగలుగుతుంది. ► ఇంతకు ముందు కూడా అక్కచెల్లెమ్మలు అదే నాణ్యత పాలు పోసినా, మోసపోయేవాళ్లు. మంచి రేటు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు అమూల్ మోసం చేయడం లేదు కాబట్టి, నాణ్యత అక్కడికక్కడే బయటపడుతోంది. ప్రతి లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు ప్రతి అక్కచెల్లెమ్మకు అదనంగా లబ్ధి కలుగుతోంది. అక్కచెల్లెమ్మల మేలు కోసం రూ.4 వేల కోట్ల పెట్టుబడి ► అక్కచెల్లెమ్మలకు ఈ మేలు ప్రతి గ్రామంలో జరగాలన్న తపన, తాపత్రయంతో దాదాపుగా 9,899 గ్రామాలను గుర్తించాం. ఈ గ్రామాల్లో రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. బీఎంసీ, ఏఎంసీల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. ► అక్కచెల్లెమ్మల మహిళా సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలు మీకందరికీ తెలిసినవే. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, వడ్డీలేని రుణాలు, సంపూర్ణ పోషణ.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవి కాకుండా దిశ బిల్లు కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్‌లతో పాటు మద్య నియంత్రణ దిశగా మనమంతా అడుగులు వేస్తున్నాం. పనులు, పోస్టుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే ► వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగ నియామకాల్లో 50 శాతం పై చిలుకు అక్కచెల్లెమ్మలను తీసుకొచ్చాం. నామినేటెడ్ పోస్టులతో పాటు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి 50 శాతం వారికే కేటాయించాం. ► కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, బీసీ కార్పొరేషన్లు.. ఇలా ఎక్కడ చూసినా కచ్చితంగా సగం అక్కచెల్లెమ్మలకు వచ్చే విధంగా చట్టాలు తీసుకొచ్చినందువల్ల ఈ రోజు మహిళా సాధికారత అనేది ఏ స్థాయిలో ఉందనేది కనిపిస్తోంది. మనందరి ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధికి ‘చేయూత’ ► చేయూత పథకం కింద అక్కచెల్లెమ్మలకు ఇచ్చే డబ్బులు మరింత మెరుగ్గా ఉపయోగపడే విధంగా ఉపాధి అవకాశాలను వాళ్ల ఇంటి ముందుకే తీసుకొస్తున్నాం. వారు పెట్టిన పెట్టుబడి నష్టపోకూడదనే ఉద్దేశంతో పెద్ద, పెద్ద సంస్థలతో టై అప్ చేశాం. ► ఐటీసీ, అమూల్, రిలయన్స్, ప్రొక్టర్ అండ్ గాంబిల్, హిందుస్థాన్ లీవర్ వంటి పెద్ద పెద్ద సంస్థలతో టై అప్ చేసి ఆ అక్కచెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నాం. లక్షా 12 వేల యూనిట్ల ఆవులు, గేదెలు కొనుగోలు చేయించి, రూ.75 వేల మొత్తాన్ని ‘చేయూత’కు టై అప్ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ అందరికీ మరింతగా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమూల్ ఎండీ ఆర్ ఎస్ సోధి, సబర్ డెయిరీ ఎండీ డాక్టర్ బీఎం పటేల్ హాజరయ్యారు. అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో 13,739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52,93,000 లీటర్ల పాలు సేకరించింది. అందుకు రూ.24 కోట్ల 54 లక్షల చెల్లింపు జరిగింది. తద్వారా ఇంతకు ముందు ఆ అక్కచెల్లెమ్మలు అమ్ముతున్న ధర కంటే ప్రతి లీటరు మీద రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అమూల్ సంస్థ చెల్లించింది. ఈ లెక్కన రూ.4 కోట్ల 6 లక్షలు ఆ అక్కచెల్లెమ్మలకు అదనంగా ఆదాయం వచ్చిందని ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు గతంలో పాల కేంద్రం నిర్వహణ మహిళల వల్ల కాదు అన్నారు. మీ వల్ల నేడు మా గ్రామంలో మేమే దానిని నిర్వహించగలుగుతున్నాం. మీరు ఉన్నారనే ధైర్యం ఇప్పుడు మాకు వచ్చింది. అమూల్ పాల వెల్లువను ఇంకా ముందుకు తీసుకుపోతాం. అమూల్‌కు పాలు పోయడం వల్ల మా సభ్యుల్లో ఒకరికి లీటర్‌కు 75 రూపాయలు వచ్చాయి. గతంలో ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు. – సుజాత, కొమ్ముగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా -
ఆ లీజుల వెనుక దురుద్దేశాలేవీ లేవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ డీడీసీఎఫ్) ఆస్తులను గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్)కు లీజుకిస్తూ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళల సాధికారత, పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు నివేదించింది. పాల ఉత్పత్తిదారులకు సాధ్యమైనంత మంచి ధర రావాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామంది. దీనివల్ల దాదాపు 30 లక్షల మంది మహిళా పాడి రైతులు లబ్ధి పొందుతారని వివరించింది. ఈ విధాన నిర్ణయం వెనుక సామాజిక, సంక్షేమ కారణాలున్నాయని తెలిపింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తులను అమూల్ సంస్థకు వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకు ఇవ్వడం లేదని, పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను అమూల్ వాటాదారులకు పంచే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఆ లాభాలను మహిళా పాల సహకార సంఘాల (ఎండీఎస్‌ఎస్) సభ్యుల మధ్య పంపిణీ చేయడం జరుగుతుందని వివరించింది. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు ఏపీ డీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రి మండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి అమూల్, ఏపీ డీడీసీఎఫ్ మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందానికి సంబంధించిన జీవో 25ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పశు సంవర్థక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కౌంటర్ దాఖలు చేస్తూ.. అమూల్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న పిటిషనర్ రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ఈ పిల్ దాఖలు చేశానని చెబుతున్న రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో ఎక్కడా ఏపీ డీడీసీఎఫ్ ఆస్తులను అమూల్‌కు లీజుకిస్తే పాల రైతులు ఎలా ప్రభావితం అవుతారో చెప్పలేదని కౌంటర్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు సంగం డెయిరీ అక్రమాలు బహిర్గతమైన సమయంలోనే రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం చేశారని.. ఇది వ్యక్తిగత ప్రయోజన, రాజకీయ ప్రయోజన వ్యాజ్యమే తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎంత మాత్రం కాదని పూనం మాలకొండయ్య తన కౌంటర్లో పేర్కొన్నారు. అమూల్‌తో ఒప్పందం తరువాత మహిళా పాడి రైతులకు లీటరుకు రూ.4 నుంచి రూ.14 వరకు అదనంగా లభిస్తోందని తెలిపారు. ప్రైవేటు పాల కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ఈ పిల్ దాఖలు వెనుక ప్రధాన ఉద్దేశమని, ఈ ఒక్క కారణంతో ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. రఘురామ వాస్తవాలను తొక్కిపెట్టారు రూ.వెయ్యి కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన రఘురామకృష్ణరాజుపై సీబీఐ తీవ్ర అభియోగాలతో ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసిందని, వరా>్గల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు అతనిపై రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయని మాలకొండయ్య కోర్టుకు నివేదించారు. వీటి గురించి పిటిషనర్ ఎక్కడా కూడా వ్యాజ్యంలో ప్రస్తావించకుండా వాస్తవాలను తొక్కిపెట్టారని, ఇది హైకోర్టు పిల్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. -
డెయిరీలకు ఊతమివ్వడమే సర్కారు 'పాల'సీ
సహకార రంగంలోని మిల్క్ డెయిరీలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి. గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడిన సహకార డెయిరీలను తిరిగి తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాడి రైతులకు మంచి రోజులొస్తున్నాయి. పాడి రైతులకు గిట్టుబాటు ధర పెరిగేలా ఇప్పటికే చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలను సైతం తిరిగి తెరిపించడం ద్వారా రానున్న రోజుల్లో పాడి పరిశ్రమ సమర్థవంతంగా నిలదొక్కుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 27 లక్షల రైతు కుటుంబాల వద్ద 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలు ఉన్నాయి. వాటిద్వారా రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో సహకార డెయిరీలు 21.7 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా.. 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేట్ డెయిరీలు సేకరిస్తున్నారు. మరో 2.19 కోట్ల లీటర్లు అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్కెట్‌కు చేరుతున్నాయి. ‘అమూల్’ రాకతో.. సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్న ‘అమూల్’ సంస్థతో గత ఏడాది ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆమూల్ సంస్థ రైతుల నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల పాలను విక్రయించే రైతులకు లీటర్ ఆవు పాలకు రూ.4, గేదె పాలకు వెన్న శాతాన్ని బట్టి రూ.7 నుంచి రూ.20 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. 2022 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అమూల్ ద్వారా పాల సేకరణ జరిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇందులో భాగంగా గత పాలకుల నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా మూతపడిన సహకార డెయిరీలను లీజు ప్రాతిపదికన అప్పగించి.. వాటి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీ డీడీసీఎఫ్) పరిధిలో అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లి, పులివెందుల, జి.కొత్తపల్లి సహకార పాల డెయిరీలుండగా వాటిలో జి.కొత్తపల్లి డెయిరీ మినహా మిగిలిన డెయిరీలన్నీ గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడ్డాయి. ఈ ఆరు డెయిరీలకు పూర్వ వైభవం అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లి, పులివెందుల డెయిరీలను లీజు ప్రాతిపదికన అమూల్ సంస్థకు అప్పగించటం ద్వారా తిరిగి వాటిని తెరిపించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. గతంలో ఈ డెయిరీల పరిధిలో 60 వేల మంది పాల ఉత్పత్తిదారులు ఉండేవారు. వీరినుంచి రోజుకు 2.5 లక్షల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.851.5 కోట్ల టర్నోవర్ జరిగేది. వీటికి రూ.1,655 కోట్ల విలువైన 688.36 ఎకరాల భూములున్నాయి. తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో రూ.343.55 కోట్ల విలువైన 25.22 ఎకరాల భూములు ఉన్నాయి. గత పాలకులు సొంత డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలకు మేలు చేకూర్చే లక్ష్యంతో సహకార డెయిరీల ద్వారా సేకరించిన పాలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకుండా చేశారు. ఫలితంగా ఒక్కొక్కటిగా అవి మూతపడ్డాయి. వీటిలో ప్రస్తుతం రూ.12 కోట్ల విలువైన 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 మిల్క్ ప్రోసెసింగ్ ప్లాంట్లు, రెండు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మదనపల్లిలో యూహెచ్‌టీ ప్లాంట్, ఒంగోలులో పౌడర్ ప్లాంట్ ఉన్నాయి. రోజుకు 10.40 లక్షల లీటర్ల పాలను సేకరించి ప్రోసెస్ చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఏళ్ల తరబడి ఉపయోగించని మౌలిక సదుపాయాలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మూతపడిన డెయిరీలకు పూర్వవైభవం కల్పించనున్నారు. తద్వారా ఈ డెయిరీల పరిధిలోని పాడి రైతులకు అధిక పాల ధర లభించనుంది. ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం దశాబ్దాల క్రితం మూతపడిన సహకార డెయిరీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఇప్పటికే అమూల్ సంస్థకు పాలు పోసేందుకు పాడి రైతులు పోటీ పడుతున్నారు. సహకార పాడి రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. – ఎ.బాబు, ఎండీ, ఏపీ డీడీసీఎఫ్ పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా.. రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న డెయిరీలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూతపడిన డెయిరీల నిర్వహణ బాధ్యతలను అమూల్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడం చాలా మంచి ఆలోచన. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన డెయిరీలకు పూర్వ వైభవం వస్తే పాడి రైతులకు మంచి జరుగుతుంది. – వైవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ అగ్రి మిషన్ చాలా సంతోషంగా ఉంది మాకు రెండు గేదెలున్నాయి. ఒక్కో గేదె 5 లీటర్ల చొప్పున పాలిస్తుంది. గతంలో లీటర్‌కు రూ.40 నుంచి రూ.45 ఇచ్చేవారు. ప్రస్తుతం అమూల్ డెయిరీకి పాలు పోస్తున్నాం. ఇప్పుడు లీటర్‌కు రూ.65 నుంచి రూ.70 వరకు ఇస్తున్నారు. మా ఊళ్లో పాడి రైతులంతా అమూల్ డెయిరీకే పాలు పోస్తున్నారు. పులివెందుల డెయిరీని అమూల్‌కు అప్పగిస్తున్నారని తెలిసింది. సంతోషంగా ఉంది. – కొత్తపల్లి విమల, మహిళా రైతు, పులివెందుల -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం: సీఎం జగన్
అమ్మఒడి, 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాల పట్టాలు, దిశ చట్టం, సున్నా వడ్డీ రుణాలు, ఆసరా, చేయూత పథకాలతో పాటు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో మహిళలకు సగం ఇస్తున్నాం. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అందుకే ప్రతి పథకంలో వారికి ప్రాధాన్యం. ప్రతి అడుగులో ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని ప్రభుత్వం భావిస్తూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు అమూల్ వల్ల అక్క చెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పాడి మహిళా రైతుల సంక్షేమం కోసమే అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణను చేపట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల అక్కచెల్లెమ్మలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతీ లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా చెల్లిస్తారని తెలిపారు. రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం విప్లవాత్మక కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. అమూల్‌లో మహిళలే భాగస్వాములని, వారికే లాభాల పంపకం జరుగుతుందని, అందుకే ఆ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలు సేకరిస్తుండగా, కొత్తగా గుంటూరు జిల్లాకు ప్రాజెక్టును విస్తరించారు. గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతోపాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్వారా పాల సేకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య(జీసీఎంఎంఎఫ్–అమూల్) ఎండీ ఆర్ఎస్ సోధి, సబర్కాంత సహకార సంఘం ఎండీ డాక్టర్ బీఎం పటేల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అక్కచెల్లెమ్మల మేలు కోసమే.. ► ఈరోజు గుంటూరు జిల్లాలో అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. గతేడాది జూలై 21న అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పాడి రైతులైన అక్కచెల్లెమ్మలకు మేలు చేయడానికి ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ మేరకు గతేడాది డిసెంబర్ 2న రాష్ట్రంలో అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైంది. 400 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతుండగా.. వాటిలో ప్రకాశం జిల్లాలో 200 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 100, వైఎస్సార్ జిల్లాలో 100 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో 129 గ్రామాలు, చిత్తూరులో మరో 174 గ్రామాల నుంచి పాల సేకరణ మొదలవుతోంది. అమూల్ రాకతో 400 గ్రామాల్లో అక్క చెల్లెమ్మల జీవితాలు మారాయన్నది సుస్పష్టం. సీఎం వైఎస్ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మహిళలు లీటరుపై రూ.7 వరకు.. అమూల్ రాకతో ప్రతి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా వస్తోందని అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. పులివెందులలోనూ పాలు సేకరిస్తున్నారు. అమూల్ సంస్థ అక్కచెల్లెమ్మలకు అదనంగా రేటు ఇవ్వగలుగుతోంది అంటే.. అందుకు కారణం ఆ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అది ప్రైవేటు సంస్థ కాదు, ఓ సహకార సంస్థ. అందులో వాటాదారులు అక్కచెల్లెమ్మలే. ఆ సంస్థ అధిక ధరలకు పాలు కొనుగోలు చేయడమేగాక.. సంస్థకొచ్చే లాభాలను తిరిగి అక్కచెల్లెమ్మలకే ఇస్తుంది. అదీ నిజమైన సహకార సంస్థ స్పూర్తి.. ప్రత్యేకత. ► అమూల్ చేసే ప్రాసెసింగ్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ సంస్థ పాలనుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు కూడా తయారు చేస్తోంది. అందుకే పాలకు మంచి ధర ఇస్తోంది. అమూల్ ఉత్పత్తులు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అందుకే లాభాలు వస్తున్నాయి. అమూల్ మన రాష్ట్రానికి రావడం విప్లవాత్మక పరిణామమని చెప్పుకోవాలి. అదనంగా రూ.3.52 కోట్లు ఇచ్చింది.. గతేడాది డిసెంబర్ నుంచి ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఇప్పటివరకు 10,871 మంది మహిళా పాడి రైతుల నుంచి 41.44 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్ సంస్థ ఆ రైతులకు రూ.18.46 కోట్లు చెల్లించింది. ఇతర డెయిరీలు చెల్లించిన మొత్తం కంటే రూ.3.52 కోట్లు అదనంగా అమూల్ రైతులకు ఇచ్చింది. సహకార డెయిరీలకు పూర్తి ప్రోత్సాహం.. అమూల్‌ను మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చడానికి... మహిళా డెయిరీ సహకార సంఘాల(ఎండీఎస్‌ఎస్)కు పూర్తి ప్రోత్సాహం అందించేలా ఇప్పటికే 9,899 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాల్లో పాల సేకరణ కేంద్ర భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అందుకు దాదాపు రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఆ మేరకు పెద్ద ఎత్తున ‘ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు’(ఏఎంసీయూ), ‘బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల’(బీఎంసీయూ) నిర్మాణం మొదలుపెట్టింది. పదిరోజులకోసారి నగదు జమ.. గతంలో ఏనాడూ పాల నాణ్యత అనేది పాడి రైతుల సమక్షంలో జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఏఎంసీయూ, బీఎంసీయూల ఏర్పాటు ద్వారా ఆ ప్రక్రియ పాడి రైతుల సమక్షంలోనే జరుగుతుంది. అదేవిధంగా పాల సేకరణ తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి అమూల్ సంస్థ రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది. ► అమూల్ వల్ల రెండు మంచి పనులు. ఒకటి లీటరుకు రూ.7 వరకు ఎక్కువ ధర. రెండోది మోసం లేదు. ఏఎంసీయూ, బీఎంసీయూల ద్వారా రైతుల సమక్షంలోనే పాల నాణ్యత పరిశీలన. తద్వారా కూడా ఆ పాలకు మంచి ధర వస్తోంది. గతంలో రైతుల ముందు పాల నాణ్యత పరిశీలన ఉండేది కాదు కానీ ఇప్పుడు అంతా పారదర్శకం. ఆర్బీకేల ద్వారా దాణా: పాడి గేదెలు కావాలని మహిళా పాడి రైతులు కోరుతున్నారు. అయితే చేయూత పథకంలో దీన్ని చేర్చడం జరిగింది. ఆ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలు పాడి గేదెలు తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఏఎంసీయూ, బీఎంసీయూల రాకతో పాల సేకరణ చాలా బాగుంటుంది. అంతేగాక రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను అందిస్తాం. ► ఈ కార్యక్రమంలో మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జిల్లా నుంచి హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజని, ఇంకా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా పాడి రైతులు పాల్గొన్నారు. వారే మా సంస్థ యజమానులు రాష్ట్రంలో పాడి రైతులకు ప్రయోజనం కల్పించడంలో అమూల్‌ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని తెలిసింది. ఇది చాలా ఎక్కువ ఉత్పత్తి అని చెప్పొచ్చు. 36 లక్షల మహిళా పాడి రైతులు అమూల్‌లో భాగస్వాములే. వారే ఆ సంస్థ యజమానులు. ఇప్పుడు ఏపీలోనూ పాడి మహిళా రైతులకు మేలు చేసేలా అమూల్ పనిచేస్తుంది. వారికి అండగా నిలుస్తుంది. పాలసేకరణ కేంద్రాల్లో ఆటోమేటిక్ యంత్రాలుంటాయి. అవి పాడి రైతుల ముందే పాల నాణ్యతను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. ఆ పాలకు ఎంత ధర గిట్టుబాటు అవుతుందన్నదీ తెలుస్తుంది. ఇవన్నీ రాష్ట్రంలో మహిళా పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. –ఆర్ఎస్ సోధి(అమూల్ ఎండీ) -
20 వేల ఎకరాల్లో పచ్చిమేత
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను మరింతగా ప్రోత్సహించటంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పాడి రైతులు పచ్చిమేత (పశుగ్రాసం) పెంచడానికి ఉపాధిహామీ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం చేయనుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ, పశుసంవర్ధకశాఖ సంయుక్తంగా చేపడతాయి. పశుసంవర్ధకశాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తారు. లబ్ధిదారుడు నిర్ణీత పొలంలో మూడేళ్లు పచ్చిమేత పెంచాలి. ఈ మూడేళ్లలో ఉపాధిహామీ పథకం నిధుల నుంచి ఎకరాకు రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసే అవకాశం ఉంది. పొలంలో గడ్డి విత్తనాలు చల్లడానికి ముందు భూమిని తయారు చేయడం మొదలు, విత్తనాల కొను గోలు, విత్తడానికి అయ్యే ఖర్చు, ఎరువులు, ఏడాదికి 20 నీటితడులకు అయ్యే ఖర్చు, గడ్డి పెరిగిన తరువాత కోత ఖర్చులతో సహా అన్నింటికి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది. 18 సార్లు కోతకొచ్చే పచ్చిమేత ఒక విడత విత్తితే మూడేళ్ల పాటు పచ్చిగడ్డి వచ్చే విత్తనాలనే లబ్ధిదారుడు వినియోగించాలి. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి ఏడాది రూ.35,204, మిగిలిన రెండేళ్లు రూ.21 వేల చొప్పున లబ్ధిదారుడికి అందజేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి అనుమతి ఇవ్వాలన్నది పశుసంవర్ధకశాఖ నిర్ణయిస్తుంది. ఒక్కొక్కరు కనిష్టంగా 25 సెంట్ల నుంచి గరిష్టంగా 2.5 ఎకరాల వరకు పచ్చిమేత పెంపకం చేపట్టేందుకు అనుమతి ఇస్తారు. లబ్ధిదారుడు ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉండాలి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కూడా ఒక్కోచోట గరిష్టంగా 5 ఎకరాల వరకు ప్రభుత్వ భూముల్లో పచ్చిమేత పెంపకానికి ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు. గ్రామ సచివాలయంలోని పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న మహిళల్లో 4.21 లక్షలమంది పాడి పశువుల మీద పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో పెరిగే పశుసంపద అవసరాలకు తగినట్లు పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
స్పందన ‘అమూల్’యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్ సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. అదనపు ఆదాయంతో పాడి రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. పైలట్ జిల్లాల్లో రోజుకు సగటున 25 వేల లీటర్లను సేకరిస్తుండగా, లీటర్‌పై రూ.5 నుంచి రూ.20ల వరకు అదనంగా లబ్ధి చేకూరుతుండడంతో పాల ఉత్పత్తిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దీంతో రెండో విడతగా ఈ ప్రాజెక్టును గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి.. జాతీయ స్థాయిలో 15.04 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ.. మార్కెటింగ్‌లో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 27లక్షల రైతు కుటుంబాల వద్ద 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలున్నాయి. వాటిలో 21.47 లక్షల గేదెలు, 13.56 లక్షల ఆవుల ద్వారా రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గృహావసరాలకు 1.24 కోట్ల లీటర్ల వినియోగమవుతుంటే, మార్కెట్లోకి 2.88 కోట్ల లీటర్ల పాలొస్తున్నాయి. ‘అమూల్’ ప్రాజెక్టుతో ఏపీలో పాల విప్లవం వలసలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గ్రామీణ మహిళల్లో ఆర్థిక సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా గత నెల 2న వైఎస్సార్ కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు పైలెట్ జిల్లాల్లో 12,430 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో నాలుగు వేల మందికి పైగా రోజూ సగటున సుమారు 25వేల లీటర్ల చొప్పున రోజుకు 10లక్షల లీటర్ల పాలను అందిస్తున్నారు. వాటి నిమిత్తం రూ.4.68 కోట్లు చెల్లించారు. ఆవు పాలకు రూ.5–7, గేదె పాలకు రూ.7–20 వరకు అదనంగా లబ్ధిచేకూరడమే కాక పది రోజుల్లోనే డబ్బులు జమవుతుండడంతో అమూల్ ప్రాజెక్టులో చేరేందుకు రైతుల్లో ఆసక్తి పెరిగింది. అంతేకాక.. ఈ ప్రాజెక్టులో భాగంగా 9,899 రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రూ.1,250 కోట్లతో నిర్మిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల (బీఎంసీయూ) కోసం రూ.1,672 కోట్లతో సర్కారు భవనాలు నిర్మిస్తోంది. వీటికి అనుసంధానంగా 17,950 గ్రామాల్లో ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను (ఎఎంసీయూ) ఏర్పాటుచేస్తున్నారు. లీటర్‌కు అదనంగా రూ.20 వస్తోంది రోజుకు ఏడు లీటర్ల పాలను సాయిరాం డెయిరీకి పోసేవాళ్లం. లీటర్‌కు రూ.30–35మధ్య వచ్చేది. ప్రస్తుతం అమూల్ కేంద్రంలో పోస్తున్నాం. పాలలో 7 శాతం వెన్న ఉండడంతో బోనస్‌తో కలిపి సగటున ప్రస్తుతం లీటర్‌కు రూ.50ల నుంచి 55లు వస్తోంది. – పి. మాధురి, వేముల, వేంపల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా చాలా సంతోషంగా ఉంది నాకు మూడు జెర్సీ ఆవులున్నాయి. రోజుకు 18 లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలకు పోసేవాళ్లం. లీటరుకు రూ.25–26 వచ్చేది. ఇప్పుడు అమూల్ పాల కేంద్రానికి ఇస్తున్నాం. ప్రస్తుతం లీటర్‌కు రూ.30–31 వస్తోంది. గతంతో పోల్చుకుంటే మంచి రేటొస్తోంది. – ఎస్. కలవతమ్మ, వేంపల్లి, మదనపల్లి, చిత్తూరు జిల్లా రెండో విడతలో గుంటూరు, పశ్చిమగోదావరి ఏపీ–అమూల్ ప్రాజెక్టుకు పాల ఉత్పత్తిదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మూడు జిల్లాల్లో స్పందన బాగుంది. రెండో విడతలో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ నెలాఖరు నుంచి పాల సేకరణకు ఏర్పాట్లుచేస్తున్నాం. – ఎ. బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆర్థిక స్వావలంబనకు పునాది రాష్ట్రంలో పాల విప్లవం తీసుకురావడమే లక్ష్యం. పాల ఉత్పత్తిదారులకు మంచి ధర కల్పించడం, మార్కెట్లో పోటీని సృష్టించడం.. పాల సేకరణ, ఖర్చు, సరఫరా వ్యయం మధ్య అంతరాన్ని తగ్గించడం అమూల్ ప్రాజెక్టు లక్ష్యం. రానున్న 20–30 ఏళ్లలో గ్రామీణ ప్రాంత మహిళల్లో ఆర్థిక స్వావలంబనకు ఇది పునాది కానుంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్ ఏపీ అగ్రి మిషన్ -
పాడి రైతుల కోసం సీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు మాదిరిగానే, పాడి రైతులకు కూడా అవసరమైన యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేస్తూ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 45 డివిజన్ల పరిధిలో 328 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 1,500కు పైగా వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత డివిజన్ స్థాయిలో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత ఏరియా వెటర్నరీ ఆస్పత్రి, డిస్పెన్సరీ స్థాయికి విస్తరించాలని సంకల్పించారు. సీహెచ్‌సీల ఏర్పాటు కోసం జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే) చైర్మన్‌గా, పశుసంవర్ధక శాఖ జేడీ సభ్య కార్యదర్శిగా, నాబార్డు ఏజీఎం తదితరులు సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. సీహెచ్‌సీల నిర్వహణకు ఐదుగురికి తక్కువ కాకుండా పాడి రైతులతో గ్రూపులను (లబ్ధిదారులను) ఎంపిక చేసే బాధ్యతను జిల్లా స్థాయి కమిటీలకు అప్పగించారు. పాడిరైతులు ముందుకురాని చోట స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు), ఇతర గ్రూపులకు సీహెచ్‌సీల నిర్వహణా బాధ్యతలను అప్పగించనున్నారు. ఎంపికైన గ్రూపులకు వాణిజ్య బ్యాంకులు లేదా డీసీసీబీల ద్వారా అవసరమైన రుణ సహాయం అందించనున్నారు. పాడి రైతులతో ఏర్పడిన గ్రూపులు ఏపీ.ఏహెచ్డీఆన్లైన్.జీవోవీ.ఇన్ అనే పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సీహెచ్‌సీ పరిధిలో 8 రకాల పాడి రైతులకు ఉపయోగపడే యంత్రపరికరాలు అందుబాటులో ఉంచుతారు. వీటి కొనుగోలుకు గరిష్టంగా రూ.14.70 లక్షల రుణం ఇస్తారు. ఇందులో 50% బ్యాంకు రుణం కాగా, 40% రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక సాయం ఉంటుంది. 10% సంబంధిత గ్రూపు భరించాల్సి ఉంటుంది. ఒక్కో సీహెచ్‌సీలో ఉండేవి.. 1.గడ్డి కోసే యంత్రాలు –4 2.గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు –2 3.గడ్డిని పొడి చేసే యంత్రాలు –2 4.గడ్డిని కట్టలు కట్టే యంత్రాలు – 2 5.దాణా తయారు చేసే యంత్రాలు –2 6.పచ్చగడ్డిని మాగుడి గడ్డిగా తయారు చేసి కట్టలు కట్టే యంత్రాలు (మినీ) –2 7.పశు పేడతో ముద్దల తయారీ యంత్రాలు –4 8.దోమల నివారణ యంత్రాలు –4 -
మొసలి కన్నీరు కారుస్తున్న టీడీపీ
ఒంగోలు డెయిరీ ఓ బ్రాండ్. కేవలం సేకణలోనే కాదు.. పాలతోపాటు పాల ఉత్పత్తుల్లో కమ్మని రుచులు అందించేంది. అందుకే ఒకప్పుడు రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఒంగోలు డెయిరీ మారింది. అప్పట్లో రోజుకు 2.50 లక్షల లీటర్ల పాలు నిత్యం డెయిరీకి వస్తుండేవి. ఇలా గ్రామాల్లోని లోగిళ్లు పాడి, పంటలతో కళకళలాడాయి. అలాంటి డెయిరీని టీడీపీ నాయకులు నిలువునా నిర్వీర్యం చేశారు. కానీ నేటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డెయిరీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తుండటంతో పాల సేకరణదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకార రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయోగాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు. పాడి రైతులకు లాభాలు పెంచడంతో పాటు, ప్రైవేటు డెయిరీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్రంలో అమూల్ సంస్థను రంగంలోకి దించారు. దీంతో పాడి రైతుల్లో ఆనందం రెట్టింపైంది. గతంలో లీటరు పాలకు కనీసం రూ. 45 కూడా వచ్చే పరిస్థితి ఉండేదు కాదు. కానీ నేడు వెన్న శాతాన్ని బట్టి రూ. 55 నుంచి రూ. 70 వరకు ధర పలుకుతుందంటే అది కేవలం అమూల్ వల్లే అని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సీఎం చొరవతో నేడు పాడి రైతులు పాల కేంద్రాలకు పాలను తెచ్చి గుమ్మరించి మరీ వెళుతున్నారు. నాటి టీడీపీ పాల డెయిరీలను చేసిన హననాన్ని గుర్తు చేసుకొని మండి పడుతున్నారు. బాబు డైరెక్షన్.. ఒంగోలు డెయిరీ పెద్దల యాక్షన్ 2014కు ముందు ఒంగోలు డెయిరీ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వెలుగొందింది. కానీ ఆ తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పచ్చగా డెయిరీని నిర్వీర్యం చేయటానికి పథక రచన చేశారు. నాటి తెలుగుదేశం పార్టీ నాయకులే సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. నాడు అలా వెలగబెట్టిన నేతలు ప్రస్తుతం డెయిరీని ఆదుకోవాలంటూ గగ్గోలు పెడుతుండటంపై పాలసేకణదారులే నవ్వుకుంటున్నారు. రూ. 100 కోట్లకు పైగా దోపిడీ చల్లా శ్రీనివాసరావు చైర్మన్‌గా ఉన్నా హయాంలో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా దోచుకున్నారు. పాలతో పాటు పాలపొడినీ బొక్కి చివరకు డెయిరీని ఒట్టి పోయిన గేదెలా వదిలి వెళ్ళిపోయారు. ఆ సయంలో విసిగిపోయిన పాడి రైతులు, పశుపోషకులు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంపై ఆందోళనలకు దిగారు.. రహదారులు స్తంభింపజేశారు. ఎమ్మెల్యేలను గృహదిగ్భంధనం చేశారు. దీంతో దిగివచ్చిన నాటి సీఎం చంద్రబాబు డెయిరీని ఆదుకోవటానికి కొత్త ఎత్తు వేశారు. అప్పు రూపంలో ప్రభుత్వ తరఫున ఏపీడీడీసీఎఫ్ నుంచి రూ. 35 కోట్లు రుణం ఇప్పించారు. కానీ ఆ నిధులను కూడా డెయిరీ అభివద్ధికి వెచ్చించకుండా హారతి కర్పూరంలా కరిగించే పనిలో అధికారులతో కూడిన నూతన కమిటీ మునిగిపోయింది. అందుకుగాను రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ. 58.98 కోట్ల విలువగల 8.75 ఎకరాలను తనఖా పెట్టారు. దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయా సందర్భాలలో ప్రకటించిన రెపోరేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం ఆ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేవిధంగా మారటోరియం విధించారు. చివరకు అప్పులు తీరకపోగా సంస్థకు మరింత భారంగా మారింది. 17 సంవత్సరాల పాలనలో ధ్వంస రచన ఒంగోలు డెయిరీలో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ పాలకమండలి 17 సంవత్సరాల పాటు కొనసాగింది. 2002 నుంచి 2018 వరకు టీడీపీ నాయకుడు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓగూరు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరావు ఏకైక చైర్మన్‌గా చక్రం తిప్పారు. డెయిరీని నిలువునా దోచుకుంటున్నా అటు పార్టీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. చల్లా శ్రీనివాసరావును, అప్పటి ఎండీ మేడా శివరామయ్యను హైదరాబాద్ పిలిపించుకున్న డెయిరీని ఏవిధంగానైనా నాశనం చేయాలన్నదే లక్ష్యంగా 2014లోనే చంద్రబాబు వ్యూహం రచించారు. సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చారు. ఇక అప్పటి నుంచే డెయిరీని దోచుకోవటం టీడీపీ పాలకమండలి ప్రారంభించింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ డెయిరీని కాపాడటానికి ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. ఆ సంగత వదిలి నేడు టీడీపీ నేతలు ఇతర రాజకీయ పార్టీలను ఏకంచేసి పోరాటం చేయటానికి సిద్ధం అవుతుండటాన్ని చూసి దొంగే...దొంగ అన్న చందంగా ఉందని అంతా నవ్వుకుంటున్నారు. -
పాడిరైతుకు రూ.40కోట్లు
సాక్షి, నారాయణఖేడ్: విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, పాడి రైతులకు బకా యిలు ఉన్న రూ.40 కోట్ల ప్రోత్సాహక నిధులు వారం రోజుల్లో విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వ పంపిణీ ద్వారా పొందిన పశువులు మృతి చెందితే వాటి స్థానంలో జనవరి తొలివారంలో కొత్తవి కొని రైతులకు అందిస్తామని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాడి రైతులు సరఫరా చేసిన పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తోపాటు గేదె పాలకు మరో రూ.2 అదనంగా అందజేస్తామన్నారు. చదవండి: (స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?) రాష్ట్రం లోని రైతులకు యాసంగి సాగుకు రూ.5వేల చొప్పున రూ.7,250 కోట్ల రైతుబంధు సాయంను వచ్చే సోమవారంలోగా వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న రైతుబంధు, కల్యాణలక్ష్మి తదితర పథకాలను చూసి కర్ణాటక, మహారాష్ట్రల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు వచ్చి తమను తెలంగాణలో కలుపుకొమ్మని కోరుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ అభివృద్ధి తీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో ఖేడ్, ఆందోల్ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్ పాల్గొన్నారు. -
పాడి రైతులకు మేలు జరగాలి : సీఎం జగన్
సాక్షి, తాడేపలి : పాడి రైతులకు మేలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని.. ధరల విషయంలో రైతులకు న్యాయం జరగాలని అన్నారు. శుక్రవారం షుగర్ ఫ్యాక్టరీలు, మిల్క్ డెయిరీల అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖమంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటుగా అమూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి : రైతులు రూపాయి కడితే చాలు: సీఎం జగన్) అమూల్‌తో భాగస్వామ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. జూలై 15లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ దిశగా అడుగులు వేయాలన్నారు. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూదన్నారు. అంతకు ముందు పాడి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అలాగే అమూల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడి పరిశ్రమలపై ఆ కంపెనీ వెల్లడించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.(చదవండి : సీఎం జగన్‌ను ప్రశంసించిన యూకే డిప్యూటీ హై కమిషనర్) సహకార చక్కెర ఫ్యాక్టరీలపై సీఎం సమీక్ష సహకార చక్కెర కర్మాగారాల్లో పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రులు, అధికారులు కూర్చొని ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రణాళికపై ప్రతిపాదనలు తయారు అయ్యాక.. వాటిపై పూర్తి స్థాయిలో చర్చించి ఖరారు చేద్దామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. -
పాడి రైతులకు బంపర్ ఆఫర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు లక్షల మంది పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న రెండు నెలల్లోనే ఈ రుణాలు ఇవ్వడానికి పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖ సహాయకులు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అభ్యుదయ రైతులు.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలనే దృక్పథం కలిగిన వారిని గుర్తించి హామీ లేకుండా రూ.1.60 లక్షలు ఇవ్వడానికి సిఫారసు చేస్తున్నారు. కరోనా కారణంగా పాడి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో వీరిని ఆదుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే.. ► ఈ రుణాలతో రైతులు పశువులను కొనుగోలు చేయవచ్చు. ► పశువులున్న వారైతే పశుగ్రాస సాగుకు, యాంత్రిక పరికరాల కొనుగోలుకు వాడుకోవచ్చు. ► వారం రోజుల వ్యవధిలోనే ఆరు వేల దరఖాస్తులు తీసుకున్నారు. ► ఒక ప్రత్యేక కార్యక్రమంగా దీనిని తీసుకుని విజయవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. 1.50 కోట్ల మందికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇదిలా ఉంటే.. దేశంలో 1.50 కోట్ల మంది పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► ఈ కార్డు ద్వారా రైతులు రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు. ► భూమి లేని రైతులకైతే ఎటువంటి హామీలేకుండా రూ.1.60 లక్షల వరకు ఇస్తారు. ► ఈ రుణాలపై కేంద్రం 9 శాతం వడ్డీరేటును నిర్ణయించింది. సకాలంలో రుణం చెల్లించే రైతులకు 5 శాతం రాయితీ ఇవ్వనుంది. మిగిలిన 4 శాతం (పావలా వడ్డీ) వడ్డీని కొన్ని రాష్ట్రాలు రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ► రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాయితీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ► రెండో దశలో మేకలు, గొర్రెల పెంపకందారులకు ఈ రుణాలు ఇస్తారు. కాగా, కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఈ పథకానికి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తోందని ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
కరోనా కాలంలోనూ ‘క్షీర ధార’
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలోనూ పశు సంపదకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మేపు మొదలు పాల ఉత్పత్తుల వరకు వేటికీ కొరత ఏర్పడలేదు. పైగా ఈ సమయంలో పాడి పరిశ్రమ వ్యవస్థీకృతమైంది. మార్కెట్ స్థిరీకరణకు తోడ్పడింది’ అని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి తో మాట్లాడుతూ.. లాక్డౌన్ తొలి నాళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ కొంత ఇబ్బంది పడినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేద న్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ► గత ఏడాదితో పోలిస్తే పాల సేకరణ ధర పెరిగింది. గత ఏడాది 10 శాతం వెన్న ఉన్న గేదె పాలు లీటర్ రూ.56 ఉంటే.. ఇప్పడు రూ.63 అయ్యింది. పాల సేకరణ కూడా పెరిగింది. ► టీ స్టాల్స్ మూత పడటంతో పాల వినియోగం తగ్గిన మాట వాస్తవమే. కానీ.. గతంలో బయట టీ సేవించే వారంతా ఇప్పుడు ఇళ్లల్లోనే ఒకటికి రెండుసార్లు తాగుతు న్నారు. అందువల్లే ఇళ్లల్లో పాల వినియోగం పెరిగింది. ► ఎప్పటిలానే లాక్డౌన్ వేళ కూడా 48 లక్షల నుంచి 50 లక్షల లీటర్ల పాలను డెయి రీలు సేకరిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో డెయిరీలు రైతులకు బోనస్ చెల్లించాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్లు లేకపోవడంతో బల్క్ కర్డ్ (పెరుగు బకెట్లు) విని యో గం తగ్గినా.. రిటైల్ విని యోగం బాగా పెరిగింది. ► వేసవి కనుక సహజంగానే పచ్చిగడ్డి తక్కువగా ఉం టుంది. ఎండు మేతకు, దాణాకు కొరత లేదు. ఈ ఏడాది రబీలో వాతావరణం అనుకూలించి రికార్డు స్థాయిలో పంటలు సాగవటంతో ఎండుగడ్డికి ఇబ్బంది లేదు. ► లాక్డౌన్ సాకుతో పశువుల మేతను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంటే కాల్ సెంటర్ నంబర్ 1962కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ► డెయిరీలు, డెయిరీ సంబంధిత కర్మాగారాల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ నాయకత్వంలో కమిటీలు ప్రతి జిల్లాలో చురుగ్గా పని చేస్తున్నాయి. ► వేసవి తీవ్రమవుతున్నందున వడగాడ్పుల నుంచి పశువులను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలి. నీడ పట్టున ఉంచే మార్గాలు చూడాలి. ► ఎండ నుంచి వచ్చిన పశువుల్ని చన్నీటితో కడిగితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. -
పశువులూ దూరం దూరం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో పాడి రైతులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డెయిరీ ఫాంలలో పశువుల నిర్వహణ పకడ్బందీగా చేయాలని జాతీయ పశు పరిశోధన సంస్థ (ఈటానగర్) సూచించింది. కొత్త గా పశువులను కొనుగోలు చేస్తే వాటిని నేరుగా ఫాం షెడ్లలోకి తీసుకురావద్దని, 3 వారాల పాటు వాటిని క్వారంటై న్ చేసిన తర్వాతే ఇతర పశువులతో వాటిని కలపాలని పేర్కొంది. రోజూ పశువులు ఆహారం సరిగా తీసుకుంటున్నాయా లేదా అనేది జాగ్రత్తగా గమనించాలని సూచించింది. ఉదయం, సాయంత్రం మూత్రం క్రమం తప్పకుండా చేస్తున్నాయో లే దో చూసుకోవాలని వెల్లడించింది. వివిధ దేశాల్లో జంతువులకు కరోనా వైరస్ సోకుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో డెయిరీ ఫాంలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల పట్ల వ్యవహరించా ల్సిన తీరుపై సంస్థ పలు సూచనలు చేసింది. సూచనలు ఇవే.. ► డెయిరీ ఫాంలలోకి సాధ్యమైనంత వరకు కొత్త వ్యక్తులను రానీయకుండా ఉంటే మంచిది. ► ఫాంలలో పనిచేసే వారి సంఖ్య కూడా వీలున్నంత తగ్గించాలి. ► పనిచేసే వారంతా మాస్కులు ధరించాలి. వారికి థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే ఫాంలోకి అనుమతించాలి. ► షెడ్లు క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. సబ్బు, నీళ్ల బకెట్, హ్యాండ్ శానిటైజర్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ప్రతి గంట లేదంటే 2 గంటలకు ఒకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి. ► ఫాంలలోకి వెళ్లే వాళ్లు వాచ్‌లు, ఆభరణాలు ధరించొద్దు. మొబైల్ ఫోన్ వినియోగించకుండా ఉంటే మంచిది. ఫోన్ తీసుకెళ్లాలనుకుంటే శానిటైజ్ చేయాలి. ► పశువులకు అవసరమైన గడ్డి, దాణా, మందులు అందుబాటులో ఉంచుకోవాలి. ► పశువుల తీరును శ్రద్ధగా గమనించాలి. గడ్డి, ఇతర ఆహారం సరిగా తీసుకుంటున్నాయా, లేదా గమనించాలి. రోజూ ఉదయం, సాయంత్రం మూత్రం క్రమం తప్పకుండా పోస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి. ► ఏవైనా పశువులు అనారోగ్యం బారిన పడితే పడ్డ వాటిని ఐసోలేట్ చేయాలి. ► వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. ► గర్భంతో ఉన్న పశువుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అవి ఉండే ప్రదేశాల్లో వేడి ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ► రోజూ పశువులను కడగాలి. కొత్తగా పుట్టిన దూడలకు పాలు, ఎలక్ట్రోలైట్ నీళ్లు తగినంత తాపించాలి. ► పాల విక్రయం కోసం వినియోగదారుల వద్దకు పశువులను తరలించి అక్కడ పాలు పిండటాన్ని మానేయాలి. క్వారంటైన్ విషయంలో పాడి రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వం పాడి అభివృద్ధిలో భాగంగా జరిపే పరిశోధనలు, ఇతర విషయాల్లో క్వారంటైన్ తప్పకుండా పాటిస్తాం. 21 రోజులు కొత్త పశువును దూరంగా ఉంచిన తర్వాతే మందలో కలపాలి. రైతులు పూర్తిగా ఇది పాటిం చట్లేదు. జాతీయ పశు పరిశోధనా సం స్థ సూచనల నేపథ్యంలోనైనా పాడి రైతులు ‘క్వారంటైన్’ అలవాటు చేసుకో వాలి. అన్ని సూచనలను విధిగా పాటించాలి. – డాక్టర్ లాకావత్ రాంసింగ్,అసిస్టెంట్ ప్రొఫెసర్, పీవీ నరసింహారావు పశు విశ్వవిద్యాలయం -
పాడి ప్రోత్సాహకం వచ్చేదెన్నడు?
సాక్షి, హైదరాబాద్: పై ఫొటోలో కన్పిస్తోన్న పాడి రైతు పేరు పర్నె నర్సిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం. ఇతనికి రెండు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. గేదెల లో ఒకదానిని ప్రభుత్వం ఇచ్చిన 50% రాయితీతో కొనుగోలు చేశాడు. వీటి పోషణ కోసం తన పొలంలో లభించే ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తవుడుతోపాటు నెలకు ఒక బస్తా పచ్చిచెక్క (రూ.1800), అరబస్తా కొబ్బరిపిట్టు (రూ. 2100), బస్తా దాణా (రూ.710) అవసరమవుతుంది. తన వద్ద ఉన్న పాడి సంపదతో రోజుకు సరాసరి 10 లీటర్ల పాలను గ్రామంలోనే ఉన్న సెంటర్‌కు పోస్తాడు. నెలకు 300 లీటర్ల చొప్పున 18 నెలలకు సంబంధించి 5,400 లీటర్లకు గాను రూ.21,600 ఈ రైతుకు ప్రోత్సాహకంగా రావాల్సి ఉంది. ఆ డబ్బులు వస్తే తన వద్ద ఉన్న గేదెలు, ఆవుకు కావాల్సిన దాణా కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుందనే అభిప్రాయం ఆ రైతుది. కానీ, 18 నెలలు గా ఆ రైతుకు నిరీక్షణే మిగులుతోంది. ఇదే వెల్లంకి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంలో 120 మంది రైతులున్నారు. ఈ కేంద్రం ద్వారా ఆవు, గేదె పాలు కలిపి రోజుకు 350 లీటర్ల పాలు సేకరిస్తారు. వీటిని మదర్ డెయిరీకి పంపుతారు. ఈ సంఘానికి 2018 ఏప్రిల్ వరకు ప్రభుత్వం ప్రకటించిన లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం వచ్చింది. ఆ తర్వాత నిలిచిపోయింది. మే 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు 1.83 లక్షల లీటర్ల పాలను ఈ సంఘం సభ్యులు సేకరించారు. వీటికి గాను రూ.7.32 లక్షలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రావా ల్సి ఉంది. ఈ మొత్తం వస్తే పాడి రైతుకు ఊరట లభించనుంది. ఈ సమస్య ఒక్క పర్నె నర్సిరెడ్డి, వెల్లంకి పాల ఉత్పత్తిదారుల సంఘానిదే కాదు..రాష్ట్రంలోని 3 లక్షల మంది పాడిరైతులు ఈ ప్రోత్సాహకం కోసమే ఎదురుచూస్తున్నారు. 18 నెలలుగా రూ.120 కోట్లకు పైగా రావాల్సిన ప్రోత్సాహక బకాయిలు ఎప్పుడొస్తాయా అని నిరీక్షిస్తున్నారు. అసలీ ప్రోత్సాహకం ఎందుకు? విజయ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ డెయిరీ, కరీంనగర్ డెయిరీల పరిధిలోని పాడి రైతులకు, పాల సంఘాల సభ్యులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తోంది. ఈ ప్రోత్సా హకం వల్ల పాడి రైతులు ఆయా డెయిరీలకే పాలు పోస్తారన్న భావనతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడు డెయిరీలకూ వర్తింపజేసింది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 2018 మే నుంచి ప్రోత్సాహకం చెల్లింపులు జరగడం లేదు. ఈ ప్రోత్సాహక బకాయిలు వస్తే పశువుల దాణాకు, ఇతర కుటుంబ ఖర్చులకు అవసరం అవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. సగటున ఒక్కో రైతుకు కనీసం రూ. ఐదారువేలు వస్తే ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వ డెయిరీలకే పాలు పోయాలన్న భావన మెరుగవుతుందంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? నిధుల లేమితోనే ప్రభుత్వం ఈ ప్రోత్సాహక నిధులు ఇవ్వడం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిధుల విడుదల కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, ప్రభుత్వం కూడా ఈ నిధుల విడుదలకు అనుమతినిచ్చిందని నేడో, రేపో ప్రస్తుతమున్న బకాయిల్లో 40% డబ్బులు వచ్చే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గతేడాది డిసెంబర్ వరకు ఉన్న బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. 2018 ఏప్రిల్ నెలలో చివరిసారి ప్రోత్సాహకం చెల్లించగా, అప్పటికే బకాయి ఉన్న నాలుగు నెలల ప్రోత్సాహకాలు ఒకేసారి ఇచ్చారని, అప్పుడు కూడా రావాల్సిన మొత్తంలో కొంతమాత్రమే ఇచ్చారని పాడి రైతులంటున్నారు. 2018 జనవరి–ఏప్రిల్ వరకు ఒక్కో రైతుకు రావాల్సిన దాంట్లో ఇంకా పెండింగ్ ఉందని, ఇప్పుడు మళ్లీ 18 నెలల బకాయిలున్నాయని, వీలున్నంత ఎక్కువ నిధులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం పాల ప్రోత్సాహకాన్ని ఏం చేస్తుందో... ఎన్ని నిధులిస్తుందో నేడో, రేపో తేలనుంది. -
తొలకరి లేత గడ్డితో జాగ్రత్త!
వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో బ్యాక్టీరియా వ్యాధి గొంతు వాపు / గురక వ్యాధి (హిమరేజిక్ సెప్టిసీమియా) ముఖ్యమైనది. పాస్టురెల్లా మల్టొసై అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలకెత్తిన లేత గడ్డి మీద పేరుకుపోయిన ఈ బ్యాక్టీరియా, మేత ద్వారా పశువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాదాపుగా అన్ని పశువులు ఈ వ్యాధి బారిన పడతాయి. ఈ దిగువ తెలిపిన కారణాల వల్ల వ్యాధి తీవ్రమవుతుంది. ♦ పశువులకు పరాన్న జీవుల / వైరస్ / బ్యాక్టీరియా వ్యాధులు ముందుగానే ఉన్నట్లయితే.. ♦ దున్నపోతులు ఎక్కువగా పనిచేసి అలసిపోయినప్పుడు.. ♦ పశులు రవాణా సమయంలో.. ఉన్నట్లుండి మేత మార్పిడి వలన.. ♦ వాతావరణ మార్పులు – ఎక్కువగా వేడి, గాలిలో తేమ.. ♦ నీరసంగా ఉన్న పశువులు.. ♦ వ్యాధి సోకిన పశువులను వేరుగా ఉంచడం / ఉంచకపోవడం.. వ్యాధి లక్షణాలు ♦ వ్యాధి త్వరగా సంక్రమించడం ♦ ఎక్కువగా జ్వరం ♦ నోటిలో చొంగ కార్చడం ♦ కళ్ల కలక, కంటి వెంబడి నీరు కారడం ♦ నెమరు నిలిచిపోవడం ♦ రొప్పడం, వైద్యం అందకపోతే చనిపోవడం ఎక్యూట్ కేసులలో అయితే, ఆయాసపడడం, నొప్పిగా అరవడం, ఊపిరికి కష్టపడడం, మెడ క్రింద భాగాన, గంగడోలు ప్రాంతాల్లో నీరు చేరి ఉబ్బరింపుగా ఉండడం (బ్రిస్కట్ ఎడిమా) ముందర కాళ్లు కూడా నీరు పట్టినట్లు కనబడడం లాంటి లక్షణాలను కనబరుస్తుంది. పశువు గొంతులో ఈ సూక్ష్మక్రిములు ఒక్కోసారి తిష్ట వేసుకుంటాయి. పశువు నీరసించి పోయినప్పుడు లేదా పశువులో వైరల్ వ్యాధులు ఇతర పరాన్నజీవులు దాడి చేసినప్పుడు, ఈ గొంతులోని సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 30 గంటలకు వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 6 నెలలు – 3 సంవత్సరాల పెయ్య / పడ్డలకు సోకుతుంది. నివారణ ♦ పరిశుభ్రమైన పాకలు, మంచి యాజమాన్యపు పద్ధతులు, ముందుగా వ్యాధి నిరోధక టీకా వేయించడం, ఆరోగ్యవంతమైన పశువులను వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేయడం, చనిపోయిన పశువులను సక్రమంగా పాతిపెట్టడం చేయాలి. రైతులకు అవగాహన కలగజేయాలి. ♦ వ్యాధి సోకిన పశువులకు వైద్యం కోసం సల్పాడిమిడైన్ 50 కేజీల బరువుకు 30 మిల్లీ లీటర్లు చొప్పున కండకు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. 2 లేదా 3 రూపాయలతో నివారణ టీకా వేయించుకోవడం మేలు. ♦ ఏ టీకా అయినా పూర్తి స్థాయిలో పశువుకు పనిచేయాలంటే కనీసం 2 వారాల సమయం పడుతుంది. కాబట్టి రైతు సోదరులారా త్వరపడడండి. – డా. ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ ,(99485 90506), ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి -
2 ఎకరాల కన్నా 3 గేదెలు మిన్న!
కాడి–కవ్వం ఆడిన ఇంట్లో కరువుండదు... పాడి–పంటల ఆవశ్యకతను గుర్తించిన పెద్దల మాట ఇది. వివిధ కారణాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాని నేటి కాలంలో కూడా పాడి పశువులను నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు చాలా స్థిమితంగా ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మీద సమకూరే ఆదాయం కుటుంబ జీవనానికి సరిపోక పోయినా.. పాడి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటోంది. అయితే, పాడిలోనూ కష్టానికి తగిన ఆదాయం రావట్టేదు. అయినా పాడి అనుదినం నిరంతరాదాయాన్నిస్తుంది కాబట్టి గణేశ్‌బాబు వంటి చిన్న, సన్నకారు రైతులు పాడిపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నారు. పంట ఒక్కటే కాదు పాడి కూడా ఉంటేనే బడుగు రైతు బతుకు పచ్చగా ఉంటుంది. నల్లగొర్ల గణేష్‌బాబు, సరోజిని కుటుంబ గాథ ఈ వాస్తవాన్నే చెబుతోంది. గుంటూరు జిల్లా మండల కేంద్రం దుగ్గిరాల వీరి స్వగ్రామం. సొంతానికి రెండెకరాల పొలమే గణేష్‌బాబు కుటుంబానికి ఆధారం. ఎకరం మాగాణిలో ఖరీఫ్‌లో వరి, రబీలో మొక్కజొన్న/ జొన్న/ అపరాలు వేస్తుంటారు. మరో ఎకరం మెట్ట భూమిలో వాణిజ్య పంట సాగుచేస్తారు. ఎరువులు, పురుగుమందులు ఏటికేడాది పెరుగుతూ పెట్టుబడులు భారమవుతున్నాయి. మొదటి పంటకే అస్తుబిస్తుగా సాగునీరు అందుతున్నందున రెండో పంటకు డబ్బులు పెట్టి నీటితడులు ఇవ్వాల్సివస్తోంది. ఫలితంగా అదనంగా చేతి ఖర్చులు వొదులుతున్నాయి. ఇంతచేసినా, పంట చేతికొచ్చాక మార్కెట్లో ‘కనీస మద్దతు’ కరవవుతోంది. ఇలాంటి దిక్కుతోచని పరిణామాలతో పంటకు తోడుగా గతంలో వదిలేసిన పాడికేసి చూశారు గణేష్‌బాబు. తొలుత మూడు పాడి గేదెలను కొనుగోలు చేశాడు. గేదె పాలివ్వడం రోజులో ఒక్క పూటకే పరిమితమై పాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో మేపే వారికి అమ్మేయడం.. మరో పాడి గేదెను తోలుకొచ్చుకోవడం ఆయనకు అలవాటు. పాలు ఇస్తున్న గేదెలే ఆయన దగ్గర ఉంటాయన్నమాట. పాడి ఆదాయం తగ్గకుండా ఉండేలా చూసుకోవాలంటే ఇదే మార్గం. పాల కేంద్రం నిర్వాహకుడు పాల డబ్బుల్లో జమ వేసుకునే షరతుతో గేదెల కొనుగోలుకయ్యే సగం డబ్బు అడ్వాన్సుగా ఇస్తుండటం వెసులుబాటుగా ఉందంటారు గణేష్‌బాబు. ఇలా రెండేళ్లుగా ఏడాదిలో 365 రోజులు ఇంట్లో పాడి వుండేలా చూసుకున్నారు. రోజూ 20 లీటర్లు.. గేదెలకు పచ్చి మేత కోసం పంట పొలంలో 15 సెంట్లలో పశుగ్రాసం సాగు చేస్తున్నారు. ‘రోజూ పొలం వెళ్లి వచ్చేటపుడు పచ్చిమేత కోసుకుని వస్తాను.. వీటితోపాటు కొబ్బరి పిండి, తెలగ చెక్క, పట్టి చెక్క, మిక్చరు దాణా, తవుడు ఇస్తున్నాం.. పశువుల దగ్గర శుభ్రం చేయటం, పాలు పితకటం మా ఇంటావిడ సరోజిని చేస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు కూడా సాయం చేస్తుంటారు’ అని తమ ఇంట్లో శ్రమవిభజనను వివరించారు గణేష్‌బాబు. ఇంట్లో వాడకానికి పోను రోజూ 20 లీటర్లు తగ్గకుండా పాల కేంద్రానికి విక్రయిస్తున్నారు. వెన్న శాతం ఆధారంగా లీటరుకు రూ. 50 పైగా ధర పడుతుంటుంది. నెలకు రూ. 30 వేల ఆదాయం తీస్తున్నాను. గేదెల పోషణకయ్యే రూ. 10 వేలు పోగా మిగిలిన రూ. 20 వేలను బ్యాంకులో రుణానికి జమచేస్తున్నానని వివరించారు. పంటలతో ఆదాయం అంతంతే! పాడి గేదెల పోషణలో ఉన్న ఆదాయం సేద్యంలో లేదంటారు గణేష్‌బాబు. ‘‘ఎకరం మాగాణిలో ఖరీఫ్‌లో ధాన్యం 35 బస్తాలు వచ్చింది. యంత్రంతో ఒకేసారి కోత, నూర్పిడి చేసి కల్లంలోనే అమ్మేశాం. 77 కిలోల బస్తాకు రూ. 1,150 వచ్చాయి. ఎకరా సాగుకు పెట్టిన పెట్టుబడికి వచ్చిన దానికి సరిపోయింది. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు బెడద వస్తుందన్న భయంతో రెండో పంటగా పెసర వేశాను. నాలుగు బస్తాలైంది. మంగళగిరి మార్కెట్లో పేరు నమోదు చేసి వచ్చాను. రూ.28 వేలు వస్తాయనుకుంటున్నా... ఖర్చులు రూ.10 వేలు పోతే ఇందులో రూ.18 వేలు మిగలొచ్చు అనుకుంటున్నా’నని అన్నారు. ఎకరం మెట్ట భూమిలో పసుపు సాగు చేస్తే 23 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్న సంతోషమే లేకుండా పోయింది. మార్కెట్లో క్వింటాలు పసుపు ధర రూ.5,500–5,700కి మించి లేదు. విత్తనం ఖరీదుతో సహా ఎకరా పసుపు సాగుకు రూ.లక్ష పైగా ఖర్చవుతోంది. క్వింటాలు కనీసం రూ.7,000 ఉంటే మినహా నాలుగు డబ్బులు మిగిలే పరిస్థితి లేనపుడు ప్రస్తుతమున్న ధరతో లాభం ఆశించే అవకాశమే లేదు. రెండెకరాల భూమిలో మూడు పంటలు సాగుచేస్తే ఏడాదిలో వచ్చిన ఆదాయం రూ.20 వేల లోపుగానే లెక్కజెప్పారాయన. మూడు గేదెలు.. నెలకు రూ. 30 వేల ఆదాయంఅదే మూడు పాడి గేదెలతో నెలకు రూ. 20 వేలు బ్యాంకులో జమ చేస్తున్నానంటారు. ఇద్దరు కొడుకులు బీటెక్ చేశారు. ఏడాదిక్రితం బీటెక్ పూర్తయిన పెద్ద కొడుకు ఆంజనేయ ఆదిత్యసాయి రోడ్డుప్రమాదంలో గాయపడటంతో ఆసుపత్రి ఖర్చులు, వ్యవసాయ ఖర్చుల నిమిత్తం బ్యాంకులో రూ.10 లక్షల రుణం తీసుకున్నారు. వ్యవసాయంపై వచ్చే ఆదాయం ఇల్లు గడిచేందుకే సరిపోని పరిస్థితుల్లో, పాడిగేదెల పోషణ ద్వారా ఇంటిల్లిపాదికీ పాలు సమకూరటమే కాకుండా నెలనెలా స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని కళ్లచూస్తున్నారు గణేష్‌బాబు (97013 01880). గేదెలను శుభ్రంగా కడిగేటప్పుడు, వాటిని మాలిమిగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్లలో వాటి పట్ల కృతజ్ఞత ప్రస్ఫుటమవుతూ ఉంటుంది! – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి ఫోటోలు : బి.రాజు, తెనాలి -
పాడి రైతు నష్టాల‘పాలు’
సాక్షి, దర్శి (ప్రకాశం): ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసి ప్రకాశం జిల్లా పాడి రైతులను నష్టాల్లో ముంచింది. పాడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో హెరిటేజ్ డెయిరీలో 10 శాతం వెన్న ఉన్న పాల ధర రూ.54 ఉండగా ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసి నెల రోజుల్లో మూడు విడతలుగా రూ.3.50 ధరను తగ్గించారు. ఆ ఒక్క డెయిరీ మాత్రమే ధర తగ్గించడంతో ఇతర డెయిరీలకు పాలు పోసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో మిగతా డెయిరీలపై సామ, దాన, భేద, దండోపాయాలతో వారి చేత కూడా రేట్లు తగ్గించేలా అధికారాన్ని అడ్డంపెట్టి చంద్రబాబు అనుకున్నది సాధించారు. కరువుతో ఇబ్బందులు పడుతూ పాల ధరలు పెరుగుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్న పాడి రైతులకు ఇది గట్టి ఎదురు దెబ్బగా మారింది. జిల్లాలో సుమారు 90 డెయిరీలు ఉండగా ఆ డెయిరీలకు గ్రామాల నుంచి పాలుపోసే కేంద్రాలు 4500ల వరకు ఉన్నాయి. జిల్లాలో ప్రతి రోజు సుమారు 6 లక్షల లీటర్ల పాలు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. పథకం ప్రకారం ప్రభుత్వ డెయిరీ నిర్వీర్యం హెరిటేజ్ లాభం కోసం ఇక్కడ ప్రభుత్వ డెయిరీని నష్టాల బాట పట్టించారు. ప్రభుత్వ డెయిరీ సుమారు రూ.80 కోట్లు అప్పుల్లో ఉండగా...పాడి రైతులకు మరో రూ.35 కోట్లు బకాయిలు ఉన్న సమయంలో డెయిరీని మూసివేశారు. దీంతో పాడి రైతులు, ఉద్యోగులకు నెలల తరబడి రావాల్సిన బకాయిలు, జీతాలు నిలిచిపోయాయి. బకాయిలు, జీతాలు చెల్లించాలని కోరుతూ రైతులు, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో శిద్దా వెంకటేశ్వరరావు చైర్మన్‌గా నియమితులై పాడి రైతుల బకాయిలకు, ఉద్యోగుల జీతాలకు తాను కోట్లాది రూపాయలు చెల్లించి డెయిరీని మళ్లీ లాభాల బాటలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. మళ్లీ డెయిరీ ప్రారంభమైతే హెరిటేజ్, ఇతర ప్రైవేటు డెయిరీలకు ముప్పు కలుగుతుందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. కొన్ని నెలలు గడిచిన తరువాత గ్రామాల్లో పాడి రైతులు తమ బకాయిలు ప్రభుత్వం ఎగ్గొడితే సహించేది లేదని గ్రామాల్లో కూడా తిరగనివ్వమని టీడీపీ నేతలను నిలదీయడం మొదలు పెట్టారు. దీనికి తోడు ఎన్నికలు కూడా సమీపించడంలో పాడి రైతులు తమకు ఓట్లేయరన్న ఆలోచనలో టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. పాడి రైతులకైనా డబ్బు ఇస్తేనే గ్రామాల్లోకి వెళ్ల గలుగుతామని చెప్పడంతో సుమారు రూ.35 కోట్లు పాడి రైతులకు చెల్లించింది. ఈ లోపు ప్రభుత్వ డెయిరీకి సంబంధించిన ఖాతాలన్నీ హెరిటేజ్, ఇతర డెయిరీలు కైవసం చేసుకున్నాయి. ఆ తరువాత మళ్లీ డెయిరీని ప్రారంభించి పాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పాడి రైతులు మాత్రం ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తే డబ్బులు వస్తాయో లేదోనని ఆ డెయిరీకి పాలు పోసేందుకు మొగ్గు చూపలేదు. దీంతో తాము ఆడిందే ఆట పాడిందే పాటగా హెరిటేజ్, ఇతర ప్రైవేటు డెయిరీల వంతైంది. ప్రకాశం పాడి రైతులకు తీరని అన్యాయం దీన్ని సాకుగా పెట్టుకుని పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో లీటరు పాలకు రూ.57 చెల్లిస్తుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం రూ.52 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక లీటరుకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రూ.5లు తేడా ఉండగా గుంటూరు జిల్లాలో ఈ ధరకు గతంలో మరో రూ.4 బోనస్ కూడా ఇచ్చారు. ఆ బోనస్‌ను ప్రస్తుతం రూ.6.50 పెంచారు. అంటే ఈ లెక్క ప్రకారం ఒక పాడి రైతుకు గుంటూరు జిల్లాకు ప్రకాశం జిల్లాకు ఒక లీటరు పాలకు రూ.11.50 తేడా ఉంది. ఈ లెక్కన రోజూ జిల్లాలో 6 లక్షల లీటర్ల పాలకు రూ.69 లక్షలు, నెలకు రూ.20.70 కోట్లు ప్రకాశం జిల్లా పాడి రైతులను ప్రభుత్వం నష్టాల పాలు చేసింది. ప్రకాశం పాడి రైతులపైనే హెరిటేజ్ వివక్ష అయితే గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా శివారు ప్రాంతాల్లో రైతులు ప్రకాశం జిల్లాల్లో ఉన్న డెయిరీలకు పాలు సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు సరఫరా చేసే పాలకు మాత్రం గుంటూరు జిల్లాలో ఇచ్చే ఎక్కువ ధరలనే ఇక్కడ డెయిరీలు ఇవ్వడం గమనార్హం. దీంతో హెరిటేజ్ ఎక్కువ ధర చెల్లించడంతో ఇతర డెయిరీలు గుంటూరు జిల్లా వారికి ఆ ధరలు చెల్లించలేక అక్కడ ఖాతాలను వదిలేసుకుంటున్నారు. అటువంటి ఖాతాలను హెరిటేజ్ చేజిక్కించుకుని వారికి మాత్రం అధిక ధరలను ఇవ్వడమే కాక ఇక్కడ డెయిరీలను కూడా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నష్టాల బాటలో పాడి రైతు ఈ పాటికే పాడి రైతులు నష్టాల బాట పట్టారు. పాలు ధరలు గిట్టుబాటు కాక గేదెలను మండీకి తరలిస్తారు. ఇక్కడ వరిగడ్డి దొరక్క తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాకు వరిగడ్డి లారీల ద్వారా కొనుగోలు చేసి తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. లారీ ఎండు గడ్డి కొనాలంటే రూ.25 వేల వరకు ధర పలుకుతోంది. వర్షాలు లేక, బోర్లు అడుగంటి గ్రామాల్లో పచ్చిగడ్డి మొత్తం ఎండిపోయింది. అసలే నష్టాల్లో ఉన్న పాడి రైతుకు ధర తగ్గించడం మూలిగే నక్కపై తాటికాయ పడిన సామెతగా తయారైందని పాడి రైతులు వాపోతున్నారు. ఎన్నికలు ముగిస్తే డెయిరీ మూసేందుకు సిద్ధం ఎన్నికలు ఉన్నాయన్న నెపంతోనే కేవలం ప్రభుత్వ డెయిరీని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు పూర్తయితే డెయిరీని మూసివేసి మళ్లీ పాడి రైతులకు ధరలు తగ్గించి హెరిటేజ్ లాభాలు పొందేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డెయిరీ తెరిచిన తరువాత కూడా మూడు నెలల జీతాలు చెల్లించనట్లు సమాచారం. ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే పాడి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతులకు అండగా జగన్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే జిల్లా డెయిరీ అభివృద్ధి చెందుతుందని పాడి రైతులు అభిప్రాయపడుతున్నారు. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో 2017 డిసెంబర్ 30న లీటరు పాలకు రూ.4 రాయితీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో జిల్లాలోని పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరువు కోరల్లో చిక్కిన ప్రకాశం జిల్లా పాడి రైతులకు వైఎస్సార్ రైతు బరోసా ఆసరాగా నిలుస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
లీటర్‌కు రూ. 4 బోనస్!
‘ఇదిగో ఇటు చూడండి.. ఇది మంచి నీళ్ల సీసా. లీటర్ ధర అక్షరాల రూ. 20. ఇదిగో ఇది పాల సీసా.. లీటర్ పాలకు రైతుకు ఇచ్చే ధర రూ. 22, 23. నీళ్ల ధర, పాల సేకరణ ధర ఒకటే అయితే పాడి రైతు బతికేదెలా? ఆ కుటుంబం గడిచేదెలా?‘ అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన. పాడి ఉన్న ఇంట సిరులు విరజిల్లునంట అనే సామెత పాతబడింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో ఐదోస్థానం. 47 లక్షల పశువులు (ఆవులు, గొర్రెలు, మేకలు), 64.62 లక్షల గేదెలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అంచనా. లక్షలాది మంది రైతులు పాడి పశువుల పెంపకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం 133 లక్షల మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం పాల ఉత్పత్తిలో 69 శాతంతో ఆవు పాలు అగ్రస్థానంలో ఉండగా గేదె పాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ధరలో కూడా ఈ రెండింటికీ తేడా ఉంది. 2023 నాటికి పాల ఉత్పత్తి సుమారు 20 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. కరవొచ్చినా కాటకం వచ్చినా ఇబ్బంది పడకుండా పాడి కాపాడుతుంది. ఏడాది పొడవునా అంతో ఇంతో ఆదాయం వస్తుందని పెద్దలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబుకు కరవుకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది నానుడి. దానికి తగ్గట్టే నాలుగైదు ఏళ్లుగా మృగశిర కార్తె చిందేయడం మానేసింది. ముసలి ఎద్దు రంకె వేయడమూ ఆగింది. కరవు, పశుగ్రాసం కొరతతో పశువులు కబేళాలకు తరలుతున్నాయి. మరోపక్క పశువుల దాణా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తవుడు, చిట్టు, చెక్క ధరలు భారీగా పెరిగాయి. పాడి రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ స్థాయిలో పాల సేకరణ ధరలు మాత్రం పెరగలేదు. దీంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో రైతులు పాడిని వదిలేసుకుంటున్నారు. పశువు పోయాక పాడి బయటపడినట్టుగా– పాలు పోయించుకుంటున్న పాల సంఘాలు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం లేదు. బకాయిలు పేరుకుపోతున్నాయి. సహకార డైరీలకు ప్రభుత్వం మొండి చేయి చూపడంతో మూతపడుతున్నాయి. హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్థలకు ఇది వరంగా మారింది. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నాయి. 2015 మే నెలకు ముందు లీటర్ పాల ఉత్పత్తికి 26 రూపాయలు ఖర్చయ్యేది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఆ ధర రూ. 30 దాటి పోయింది. కానీ, పాల సేకరణ ధర మాత్రం రూ. 18 నుంచి 28 మధ్యే ఉంది. పాలలో వచ్చే వెన్న శాతాన్ని బట్టి ఈ ధర ఉంటుంది. 2015 మే నెలకు ముందు పాల సేకరణ ధర రూ.32, 35 మధ్య ఉండేది. ఉత్పత్తి పెరిగిందన్న సాకుతో ధరను తగ్గించి పాడి రైతుల నోట మట్టికొడుతున్నారు. లీటర్ నీళ్ల ధర రూ.20గా ఉంటే పాల సేకరణ ధర 23, 24 రూపాయలకు మించడం లేదు (గేదె పాల ధర రూ.28 నుంచి 34 మధ్య ఉంటుంది). అంతర్జాతీయ మార్కెట్లో మిగులు పేరిట పెద్ద కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. విధాన నిర్ణేతల లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, సన్నకారు పాడి రైతులు బడా కార్పొరేట్ సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికులుగా చేరాల్సి వస్తోంది. వ్యవసాయ సంక్షోభం, తీవ్ర కరవు పరిస్థితులను తట్టుకునేందుకు ఆసరా ఉంటుందని పాడి పశువుల్ని పెట్టుకుంటే ఇప్పుడు వాటినీ పోషించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా పాల ఉత్పత్తికి వెన్నుముకగా ఉన్న చిన్న రైతులు పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా పాడి రైతుల్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలి. పాల సేకరణ ధర పెంచడమో, లీటర్‌కు ఇంతని బోనస్ ఇవ్వడమో చేయాలి. పాడి రైతుల కష్టాలకు చలించిన చాలా రాష్ట్రాలు లీటర్‌కు నాలుగైదు రూపాయల బోనస్‌ను ప్రకటించాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ.4, కర్ణాటకలో రూ.5, మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.5 ల బోనస్ ఇస్తోంది. కర్ణాటకలో రైతులకు బోనస్ ఇవ్వడం వల్ల సహకార పాల సంఘాలు చాలా బలీయంగా తయారయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాడి రైతుల్ని గాలికి వదిలేశారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసాను ప్రకటించారు. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే ప్రతి రైతుకూ లీటర్‌కు 4 రూపాయల బోనస్ ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో దాదాపు 60, 65 లక్షల మంది కుటుంబాలకు మేలు జరుగుతుంది. జగన్ ఇచ్చే బోనస్‌తో కలుపుకుని పాల సేకరణ ధర లీటర్‌కు రూ. 30 దాటుతుంది. చంద్రబాబు హయాంలో మూతపడిన చిత్తూరు, ప్రకాశం, విశాఖ, కాళహస్తి కో ఆపరేటివ్ డైరీ వంటి వాటినన్నింటినీ తిరిగి తెరిపిస్తానని హామీ ఇవ్వడం పట్ల పాడి రైతులు సంబరపడుతున్నారు. బకాయిల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేకుండా పాల డైరీలన్నింటినీ సహకార రంగంలోకి తీసుకువస్తానని భరోసా ఇస్తున్నారు. డైరీలను సహకార రంగంలోకి తీసుకువచ్చి ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడు చచ్చినట్టు ప్రై వేటు డైరీలు కూడా పాల సేకరణ ధర పెంచకతప్పదు. సకాలంలో డబ్బులు ఇస్తాయి. విశ్వసనీయతా పెరుగుతుంది. పాల సంఘాలను కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ పర్యవేక్షణలో నడపగలిగితే ప్రైవేటు డైరీల ఆగడాలకు ముగుతాడు వేయడమే కాకుండా అటు పాడి రైతులకు ఇటు వినియోగదారులకు మేలు చేసినట్టవుతుంది. ఆ పని చేస్తానని జగన్ ఇచ్చిన హామీ పట్ల రాష్ట్ర పాడి రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. – ఆకుల అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
గోకులానికి మొండిచేయి
ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పాడిపరిశ్రమ అట్టడుగుస్థాయికి పడిపోతోంది. గతంలో, ప్రస్తుతం పాడి రైతులు సీఎం చంద్రబాబునాయుడు మోసాలకు బలవుతూనే ఉన్నారు. సొంత ప్రయోజనం కోసం గతంలో జిల్లాకే తలమానికమైన విజయా డెయిరీని మూయించి వేసి పాడి రైతులను అధోగతి పాలు చేశారు. అదే రీతిలో ప్రస్తుతం పాడి రైతులను ఆదుకుంటున్నామనే పేరుతో దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నారు. గోకులం పథకం పేరుతో ప్రతి పాడి రైతుకూ సబ్సిడీపై ఆవుల షెడ్డుకు నిధులు అందిస్తామని ప్రకటనలిచ్చారు. నిధుల లేమిని సాకుగా చూపి అర్ధంతరంగా నిలిపేశారు. షెడ్లు నిర్మించుకుని నిధులు మంజూరుకాకపోగా, కట్టిన డీడీలు కూడా వెనక్కి ఇస్తుండడంతో రైతులు అయోమయంలో పడ్డారు. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రైతాంగానికి పాడి పరిశ్రమే ప్రధాన జీవనాధారం. పంటలు లేకపోయినా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్న కుటుంబాలే అధికం. జిల్లావ్యాప్తంగా 6.67 లక్షల రైతు కుటుంబాలు ఉండగా పాడి పరిశ్రమపై ఆధారపడి దాదాపు 5 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 10.20 లక్షల పాడి ఆవులు, గేదెలను రైతులు పోషిస్తున్నారు. వాటి ద్వారా రోజుకు 32 లక్షల నుంచి 34 లక్షల లీటర్ల మేరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 21 లక్షల నుంచి 22 లక్షల లీటర్ల మేరకు పాలను విక్రయిస్తున్నారు. దీంతో వచ్చే ఆదాయంతో కుటుంబాలను, పశువులను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గోకులం పథకం ఇలా.. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు గాను ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటనలు గుప్పించారు. ఇందుకుగాను ప్రతి పాడి రైతుకూ పశువుల షెడ్డు నిర్మించుకునేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అందులో రెండు ఆవుల షెడ్డుకు గాను రూ.97 వేలు, నాలుగు ఆవుల షెడ్డుకు గాను రూ.1.47 లక్షలు, ఆరు ఆవుల షెడ్డుకు గాను రూ.1.75 లక్షల చొప్పున నిధులను 90 శాతం సబ్సిడీపై అందిస్తామని గత ఏడాది నవంబరులో ప్రకటించారు. నీరుగారిన పథకం.. గోకులం పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో డిసెంబరు నెలాఖరుకు 4,256 మంది రైతులు సబ్సిడీ పోగా మిగిలిన 10 శాతం నిధులకు డీడీలు కట్టారు. మరింత మంది రైతులు డీడీలు కట్టేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం గోకులం పథకాన్ని పెండింగ్‌లో పెట్టింది. జనవరిలో సబ్సిడీ మొత్తాన్ని 90 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. దీంతో అప్పటికే డీడీలు కట్టిన రైతులు మిగిలిన 20 శాతం మొత్తాలకు కూడా డీడీలు ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అప్పటికే సొంత డబ్బు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న రైతులు విధిలేక మిగిలిన 20 శాతం డబ్బులను కూడా 1,982 మంది రైతులు కట్టారు. అయినా వారికి ఇంతవరకు షెడ్డు నిర్మాణానికి అందించాల్సిన నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదు. డీడీలు చెల్లించిన 4,256 మంది రైతుల్లో ప్రభుత్వం 2,731 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన 1,525 మందిలో 20 శాతం డీడీలు కట్టని 749 మంది, 10 శాతం డీడీలు కట్టి పథకం మంజూరు కాని వారు ఉన్నారు. వీరు కట్టిన డీడీలను అధికారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. అదేగాక 30 శాతం డీడీలు కట్టిన వారికి కూడా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో డీడీలు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో గోకులం పథకం ద్వారా షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపినట్లయింది. -
ఎస్సీ పాడిరైతుల కోసం ‘మినీ డెయిరీలు’
సాక్షి, హైదరాబాద్: దళిత పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఔత్సాహిక పాడి రైతులకు ‘మినీ డెయిరీ’ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.4లక్షల వ్యయంతో ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 3 జిల్లాల్లో ప్రయోగ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సాగుకు యోగ్యమైన భూమి ఉన్న చిన్న రైతులకు ఈ యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ విలువలో 60% రాయితీ రూపంలో ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వనుండగా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణానికి అనుసంధానం చేస్తారు. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే బాధ్యత కూడా ఎస్సీ కార్పొరేషనే పర్యవేక్షిస్తుంది. మినీ డెయిరీ యూనిట్లను సూర్యాపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దాదాపు 830 మంది రైతులకు వివిధ దశల్లో రుణాలిచ్చి యూనిట్లు ఏర్పాటు చేయగా సత్పలితాలు వచ్చాయి. ఒక్కో రైతు ప్రతినెల కనిష్టంగా రూ.10వేలు సంపాదిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో మినీ డెయిరీ కార్యక్రమాన్ని మరో 5 జిల్లాలకు విస్తరింపజేయాలని తాజాగా ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. కొత్తగా జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ గ్రామీణం, మహబుబాబాద్ జిల్లాల్లో అర్హులైన ఎస్సీ చిన్నకారు రైతులను గుర్తించి దశల వారీగా పథకాన్ని అమలు చేస్తారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ మినీ డెయిరీల కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కేవలం యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్‌తోనే కాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. వారి ఆర్థిక స్థితిని అంచనా వేస్తుంది. ఆర్థికంగా నిలబడే వరకు సలహాలు సూచనలు చేస్తుంది. మినీ డెయిరీల నుంచి వచ్చే పాల సేకరణ బాధ్యతలను స్థానిక నిరుద్యోగ ఎస్సీ యువతకు అప్పగించనుంది. వీరికి ఆర్థిక సహకారం అందించనుంది. గ్రామంలో నిరుద్యోగ యువతతో బృందం ఏర్పడితే వారికి పాల ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుకు సైతం రాయితీ రుణాలు ఇచ్చేలా ఆ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో తెలిపారు. -
3లక్షల మందికి..రూ.75కోట్లు బకాయి..!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకపు సొమ్ముకు బ్రేక్ పడింది. ఎనిమిది నెలలుగా సొమ్ము అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు అంటే ఎనిమిది నెలలుగా సొమ్ము చెల్లించకపోవడంతో పాడి రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు రోజువారీ పాలకు ఇచ్చే బిల్లుల సొమ్ము కూడా నిలిచిపోయింది. ఒకవైపు ప్రోత్సాహకపు సొమ్ము రాకపోవడం, రోజువారీ పాల బిల్లు కూడా ఇవ్వకపోవడంతో సంక్రాంతికి పస్తులుండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మొత్తం సొమ్ము రూ. 145 కోట్లు... విజయ , ముల్కనూరు , రంగారెడ్డి–నల్లగొండ, కరీంనగర్ డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 వంతున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తోంది. దాదాపు 3 లక్షల మందికి ఇది అందుతోంది.మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడింటికీ వర్తింప చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు రూ. 75 కోట్లు నిలిచి పోయాయని విజయ డెయిరీకి చెందిన అధికారులు అంటున్నారు.మరోవైపు విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు గత నెల (డిసెంబర్) ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ పాల బిల్లు నిలిపివేశారు. ఈ డైయిరీకి సుమారు రెండు లక్షల మంది రైతులు నిత్యం పాలు పోస్తారు. వీరికి చెందిన రూ. 70 కోట్లు రాకపోవడంతో ఆ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక రైతులకు పండుగ లోపు బిల్లు చెల్లించకపోతే పాల కేంద్రాల నిర్వహణ చేయలేమని అక్కడి అధికారులు,యూనిట్ మేనేజర్లు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ డెయిరీకి ప్రతిరోజు నాలుగు లక్షల లీటర్లకు పైగా పాలు వస్తోంది. రైతులకు పది రోజులకోమారు ఈ బిల్లు చెల్లిస్తారు. డెయిరీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి చెల్లించలేని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. రుణానికి వెనుకంజ... గతంలో పాల బిల్లులు ఆలస్యమయ్యే క్రమంలో బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని సర్దుబాటు చేసేవారు. కానీ ప్రస్తుతం విజయ డెయిరీ అధికారులు అందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పాల అమ్మకాల నుంచి బిల్లులు చెల్లించాలని భావిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకు రుణం తీసుకోకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులు అంటున్నారు. నిధుల కొరత కారణంగా ఈనెల ఉద్యోగుల వేతనాలు కూడా వారం రోజుల తర్వాత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆవు పాల మిక్సింగ్‌తో ఆసక్తి చూపని వినియోగదారులు... విజయ డెయిరీకి 90 శాతం ఆవు పాలు, 10 శాతం మాత్రమే బర్రె పాలు వస్తుండటంతో పాలలో పసుపు శాతం అధికంగా కనిపిస్తుండటంతో వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది గమనించిన పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఇటీవల సమీక్ష జరిపి బర్రె పాల సేకరణ పెంచాలని కోరినా పురోగతి లేదు. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే బర్రె పాలకు గాను రైతులకు ఇచ్చే రేటు తక్కువ ఉండటంతో ఆ పాలు రావడంలేదని ఒక అధికారి అన్నారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. -
వైఎస్ జగన్‌ను కలిసిన పాడి రైతులు
-
నాలుగు డెయిరీలతో ‘విజయ బోర్డు’
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ ఫెడరేషన్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విజయ డెయిరీ ఆధ్వర్యంలో నల్లగొండ–రంగారెడ్డి సహకార డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల భాగస్వామ్యంతో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం సహకార డెయిరీల ప్రతినిధులు కొందరు ప్రభుత్వంలోని ఓ కీలక ఉన్నతాధికారితో సమావేశమై చర్చించారు. ప్రతిపాదనలు తయారు చేసుకుని తీసుకురావాలని, వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని ఆ ఉన్నతాధికారి చెప్పినట్లు ఓ సహకార డెయిరీ చైర్మన్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతిపాదనలు తయారు చేసే పనిలో తాము నిమగ్నమైనట్లు ఆయన వెల్లడించారు. ‘ఈ 4 డెయిరీలతో బోర్డు ఏర్పాటైతే, సహకార డెయిరీల చైర్మన్లంతా సభ్యులుగా ఉంటారు. ఆయా డెయిరీ సొసైటీలతో కలుపుకుని బోర్డుకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారే విజయ డెయి రీ భాగస్వామ్య బోర్డుకు చైర్మన్‌గా ఉంటారు’అని తెలిపారు. కొత్త మార్కెట్ కోసమే ఈ నాలుగు డెయిరీలకు 2.13 లక్షల మంది రైతులు పాలు పోస్తుంటారు. విజయ డెయిరీకి రోజుకు 3.5 లక్షల లీటర్ల నుంచి 4 లక్షల లీటర్ల వరకు పాలు వస్తుంటాయి. కానీ 2 లక్షల నుంచి 2.5 లక్షల లీటర్లే అమ్ముడవుతున్నాయి. నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ విక్రయాలు రోజుకు లక్ష లీటర్లు ఉండగా, 35 వేల లీటర్ల వరకు పాలు మిగులుతున్నాయి. కరీంనగర్ డెయిరీ విక్రయాలు లక్షన్నర లీటర్లు ఉండగా, కొంత వరకు మిగులుతున్నాయి. ముల్కనూరు డెయిరీ విక్రయాలు 60 వేల లీటర్లు ఉన్నాయి. ఇలా ఈ డెయిరీల్లోనూ పాలు మిగులుతున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం సబ్సిడీపై 2.13 లక్షల పాడి గేదెలను పంపిణీ చేస్తే మరో 15 లక్షల లీటర్ల వరకు అదనపు పాలు వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కొత్త మార్కెట్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ నాలుగు డెయిరీలు ఒకే గొడుగు కిందికి రావాలని ఈ ప్రతిపాదనలు తెస్తున్నట్లు చెబుతున్నారు. తాజా పాలు నినాదంతో.. ఇతర రాష్ట్రాల పాలు చౌకగా హైదరాబాద్ మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిపై సెస్ విధిం చేలా ప్రతిపాదనలు తయారు చేస్తారని సమా చారం. ‘అమూల్ పాలు గుజరాత్ నుంచి వస్తున్నాయి. సేకరించిన వారం రోజుల తర్వాత అవి రాష్ట్ర వినియోగదారులకు చేరుతుంది. కాబట్టి అవి తాజా పాలు కావు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వాటికి కూడా మూడు రోజులు తేడా ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పాలు 24 గంటల తేడాతో ఉంటాయి. కాబట్టి ‘తాజా పాలు’నినాదంతో ముందుకు వెళ్లాలి’అని యోచిస్తున్నట్లు తెలిసింది. మిగిలిపోయిన పాలతో పాలకోవ, వెన్న, నెయ్యి తదితర ఉత్పత్తులను తయారు చేసి విజయ డెయిరీ పేరుతోనే ప్యాకింగ్ చేస్తామని, విజయ డెయిరీ ఆధ్వర్యంలో అమ్మకాలు చేస్తామని ఆ సహకార డెయిరీ చైర్మన్ చెబుతున్నారు. విజయ డెయిరీ ఫెడరేషన్‌ను ‘విజయ డెయిరీ మార్కెటింగ్ ఫెడరేషన్’గా పేరు మార్చాలని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం విజయ డెయిరీలోని నిబం ధనలను మార్చాలని కోరుతున్నామన్నారు. ఎండీగా ఐఏఎస్ వద్దు కొత్తగా ఏర్పాటయ్యే విజయ డెయిరీ మార్కె టింగ్ ఫెడరేషన్ బోర్డుకు చైర్మన్‌ను డెయిరీల్లోని సొసైటీ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ ప్రకారం నాలుగు డెయిరీల్లోని వారిలో ఎవరో ఒకరు చైర్మన్ అవుతారు. ప్రస్తుతం ఉన్నట్లుగా ఐఏఎస్‌ను మాత్రం ఎండీగా నియమించకూడదని ప్రతిపాదనల్లో ఒక అంశంగా చేర్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. పాల ఉత్పత్తి రంగంలో అత్యంత అనుభవజ్ఞులైన జాతీయ స్థాయి వ్యక్తిని తీసుకోవాలనేది భావిస్తున్నట్లు తెలిసింది. పాల పొడి, వెన్న, నెయ్యి తదితరాలు తయారు చేసే ప్లాంటు రాష్ట్రంలో లేకపోవడంతో ఏపీకి వెళ్లాల్సి వస్తోందని, దీంతో ఇక్కడే ఒక ప్లాంటును నెలకొల్పాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఆ సహకార డెయిరీ చైర్మన్ చెబుతున్నారు. ప్రైవేటు దిశగా అడుగులా? ప్రసుత్తమున్న సహకార సొసైటీలకు తోడు పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్ల్లోని పాల సొసైటీలతో ఒక యూనియన్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో కలిపి మరో యూనియన్, మహబూబ్‌నగర్ జిల్లాతో కలిపి మరో యూనియన్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంటే విజయ డెయిరీ, మూడు సహకార డెయిరీలు, కొత్తగా మరో మూడు యూనియన్ల భాగస్వామ్యంతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది తాజా ప్రతిపాదనల్లో ఒక కీలక అంశం. విజయ డెయిరీ ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టాల్లో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అది నిర్వీర్యమైంది. ఇప్పుడు తాజాగా ఇతర సహకార డెయిరీలు తీసుకునే విధానాలు ఏ మేరకు దాన్ని బాగు చేస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ప్రైవేటు దిశగా విజయ డెయిరీలో అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. -
నేల‘పాలు’ చేస్తుంటే కొత్తవేల!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం రైతుల నుంచి సేకరిస్తున్న పాలనే విక్రయించే పరిస్థితి లేక కునారిల్లుతుంటే, మరోవైపు కొత్తగా సబ్సిడీపై పాడి పశువులు ఇస్తే వాటి పాలను ఏం చేయాలో అంతుబట్టక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నాణ్యమైన పాలు కావంటూ అనేకచోట్ల రోజూ వేలాది లీటర్లు పారబోస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే 2 లక్షల లీటర్ల పాలు పారబోయడంతో రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇలా వచ్చే పాలను అడ్డుకుంటుంటే, సబ్సిడీపై ఆవులు, గేదెలు ఇచ్చాక వచ్చే పాలను ఏం చేయాలన్న ఆందోళన విజయ డెయిరీలో నెలకొంది. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం కానీ, డెయిరీ అధికారులు కానీ ఎలాంటి ఆలోచనా చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విక్రయాలేవీ..? వినియోగదారుల్లో విజయ డెయిరీ పాలపై మంచి అభిప్రాయమే ఉంది. కానీ మార్కెటింగ్‌లో సంస్కరణలు చేయడంతో ఒక్కసారిగా విజయ పాల విక్రయాలు పడిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో దశాబ్దాలుగా కొనసాగిన 1,600 మంది ఏజెంట్లను, ఆ వ్యవస్థను రద్దు చేయడంతో డెయిరీ పతనం ప్రారంభమైంది. ఏజెంట్ల వ్యవస్థ స్థానంలో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడం, డిస్ట్రిబ్యూటర్లంతా రాజకీయ అండదండలున్న వారే కావడంతో అనుభవం లేక విజయ డెయిరీ వ్యవస్థ కుప్పకూలిందన్న ఆరోపణలున్నాయి. రోజూ లక్ష లీటర్ల మిగులు! విజయ డెయిరీకి రోజూ 65 వేల మంది పాడి రైతులు 3.6 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. ప్రస్తుతం డెయిరీ పాల విక్రయాలు రెండు లక్షల లీటర్లకు అటుఇటుగా ఉన్నాయి. 40 వేల లీటర్లను అంగన్వాడీలకు పోసేందుకు టెట్రాప్యాక్‌లను తయారు చేస్తున్నారు. దీంతో రోజూ దాదాపు లక్ష లీటర్ల వరకు పాలు మిగులుతున్నాయి. వాస్తవానికి మిగులు పాలను పొడి, వెన్న తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి వాడుతుంటారు. కానీ ఇప్పటికే తయారు చేసిన రూ.90 కోట్ల విలువైన పాల ఉత్పత్తులు అమ్ముడుపోక డెయిరీ నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో రోజూ లక్ష లీటర్ల పాలు మిగిలిపోతుంటే ఏంచేయాలో అధికారులకు అంతుబట్టడంలేదు. కొత్తగా మరో 6 లక్షల లీటర్లు! ప్రభుత్వం విజయ డెయిరీ సహా మరో మూడు డెయిరీలకు పాలు పోసే రైతులకు సబ్సిడీపై పాడి పశువులు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి గేదెలు లేదా ఆవులను సరఫరా చేస్తారు. 8 లీటర్లు ఇచ్చే గేదెలు, 10 లీటర్లు ఇచ్చే ఆవులను కొనుగోలు చేయాలని పశుసంవర్థక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు చాలామంది రైతులు ఆవులనే అధికంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 65 వేల మంది పాడి రైతుల నుంచి 65 వేల సబ్సిడీ గేదెలు లేదా ఆవుల ద్వారా మరో 6 లక్షల లీటర్ల వరకు పాలు అదనంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వస్తున్న 3.5 లక్షల లీటర్లనే విక్రయించే పరిస్థితి లేక విజయ డెయిరీ యాజమాన్యం పారబోస్తుంటే, అదనంగా వచ్చే మరో 6 లక్షల లీటర్ల పాలను ఏం చేయగలరన్నది అందరినీ వేధి స్తున్న ప్రశ్న. సబ్సిడీ పాడి పశువులు వచ్చాక మొత్తం 10 లక్షల లీటర్ల పాలు రోజూ విజయ డెయిరీకి రానున్నాయి. కానీ విక్రయాలు మాత్రం 2 లక్షల లీటర్లే. ఆ ప్రకారం మరో 8 లక్షల లీటర్లు రోజూ డెయిరీ వద్ద మిగిలిపోతాయనే చర్చ జరుగుతోంది. సెలవులపై వెళ్లే యోచనలో అధికారులు నెల రోజుల వ్యవధిలో రెండు లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ పారబోసింది. పారబోసిన పాల సేకరణ ధర, రైతు ప్రోత్సాహకాన్ని కూడా నిలిపివేసినట్లు సమాచారం. డెయిరీకి చెందిన చిల్లింగ్ కేంద్రాలు, బల్క్‌మిల్క్ యూనిట్లు, గ్రామా ల్లో ఉన్న సేకరణ కేంద్రాల నుంచే ఈ పాలన్నీ విజయ డెయిరీకి ట్యాంకుల ద్వారా వస్తుంటాయి. ఆయా కేంద్రాల నుంచి తెచ్చిన పాలను హైదరాబాద్‌లో పారబోశారు. ఇప్పటినుంచి ఆయా కేంద్రాల వద్దే నాణ్యత నిర్ణయించి తిరస్కరించాలని, రైతులకు చెల్లింపులు ఉండవన్న నిర్ణయం తీసుకునేందుకు డెయిరీ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఆయా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే రైతులకు ఇచ్చే సొమ్ముకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని, దీనివల్ల పాడి రైతులు తమపై దాడులు చేసే అవకాశముందన్న భయాందోళనతో ఉన్నారు. దీంతో ఓ కేంద్రంలో పనిచేసే అధికారి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. మరికొందరు కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
టెండర్లు వద్దు.. నేరుగా కొనండి!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలు, ఆవుల కొనుగోలుకు టెండర్లు పిలవకూడదని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటిని ఎలా కొనాలన్న దానిపై పశుసంవర్థకశాఖ అధికారులు రెండు రకాల పద్ధతులను ప్రభుత్వానికి నివేదించారు. ఒకటి టెండర్లు పిలవడం, మరొకటి నేరుగా లబ్ధిదారులతో వెళ్లి కొనుగోలు చేయడం. ఈ రెండింటిలో నేరుగా కొనుగోలు చేయడం వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. అంటే సబ్సిడీ గొర్రెల మాదిరిగానే బర్రెలను కూడా నేరుగా కొనుగోలు చేయనున్నారు. అలాగే ఈ బర్రెలను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై పశుసంవర్థకశాఖ మార్గదర్శకాలు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదించాక పథకం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. టెండర్ల ప్రక్రియ వైపే అధికారుల మొగ్గు సబ్సిడీ గొర్రెల కొనుగోలులో అనేక సమస్యలు వచ్చాయి. అనేక చోట్ల పేపర్ పైనే కొన్నట్లు, మరికొన్ని చోట్ల రీసైక్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చా యి. దీంతో ఈ బర్రెల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ద్వారా వెళితేనే మంచిదన్న అభిప్రాయాన్ని పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ద్వారా వెళితే ఆవు లేదా గేదె ప్రమాణాల ప్రకారం లేకుంటే కాంట్రాక్టర్‌దే బాధ్యత ఉంటుందన్నారు. పైగా పశు వైద్యులు వివిధ రాష్ట్రాలకు వెళ్లడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. ఆ నాలుగు డెయిరీల పాడి రైతులకే... ప్రభుత్వం సబ్సిడీపై బర్రెలు, ఆవులను పాడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతుల వాటా, ప్రభుత్వ వ్యయం కలిపి రూ.1,600 కోట్లతో ప్రణాళిక రచించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయనుంది. రాష్ట్రంలోని పాడి రైతులందరికీ కాకుండా కేవలం విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, నార్ముల్ డెయిరీలకు పాలు పోసే రైతులకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో పాడి రైతుకు ఒక గేదె లేదా ఒక ఆవు వారి కోరిక మేరకు ఏదో ఒకటి ఇస్తారు. బర్రెలు కావాలా.. ఆవులు కావాలా ఏదో ఒకటి చెప్పాలని ఆయా డెయిరీలకు పశుసంవర్థకశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. 2.13 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా 2.13 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులను పంపిణీ చేయనుంది. అందులో 31 వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులున్నారు. హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాడి పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పశు వైద్యులు ఆయా రాష్ట్రాలకు లబ్ధిదారులతో వెళ్లి పాడి పశువులను లారీల్లో తరలిస్తారు. ఒక్కో గేదె లేదా ఆవు యూనిట్ ధర రూ.62 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండే అవకాశముంది. పాడి పశువులను రెండేళ్లలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పథకం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుందని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కాదని వారంటున్నారు. ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు కాలేదని, వచ్చే నెలలో పథకం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. -
లక్షన్నర లీటర్లు నేల‘పాలు’!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులు తెచ్చే పాలను విజయ డెయిరీ నేలపాలు చేస్తోంది. నెల రోజుల్లో ఏకంగా లక్షన్నర లీటర్లకుపైగా పాలను మురుగు కాలువల్లో పారబోసింది. ఈ పాలకు సేకరణ ధర, రైతు ప్రోత్సాహకాన్ని డెయిరీ నిలిపివేసినట్లు సమాచారం. దీంతో పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిత్రమేంటంటే విజయ డెయిరీకి చెందిన చిల్లింగ్ కేంద్రాలు, బల్క్‌మిల్క్ యూనిట్లు, గ్రామాల్లోని సేకరణ కేంద్రాల నుంచే ఈ పాలు విజయ డెయిరీకి ట్యాంకుల ద్వారా వచ్చాయి. ఆయా కేంద్రాల నుంచి తెచ్చిన పాలను హైదరాబాద్ తీసుకొచ్చాక ‘నాణ్యత’పేరుతో నేలపాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలు బాగో లేకపోతే రైతుల వద్దే తిరస్కరించాల్సింది పోయి తీరా తెచ్చాక నాణ్యత లేదని పారబోయడంపై ఆరోపణలు వస్తున్నాయి. పారబోసిన పాలకు సేకరణ ధర, ప్రోత్సాహకం ఎవరిస్తారని రైతులు నిలదీస్తున్నారు. ఆయా కేంద్రాలకు చెందిన మేనేజర్లు మాత్రం డబ్బులు వస్తాయని, కంప్యూటర్లో మిస్ అయిందని నచ్చజెప్పుతున్నారు. నాణ్యత పేరుతో.. విజయ డెయిరీకి అనేక గ్రామాల్లో సేకరణ కేంద్రాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 165 బల్క్ మిల్క్ యూనిట్లు, 15 చిల్లింగ్ సెంటర్లు, 8 డెయిరీలు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు పాడి రైతులు పాలు పోస్తుంటారు. ఆ కేంద్రాల నుంచి ప్రతీ రోజూ 3.60 లక్షల లీటర్ల పాలు హైదరాబాద్ విజయ డెయిరీకి వస్తాయి. అయితే ప్రస్తుతం విజయ డెయిరీ పాల విక్రయాలు 2 లక్షల లీటర్లకు అటుఇటుగానే ఉన్నాయి. ఇక 40 వేల లీటర్లను అంగన్వాడీ కేంద్రాలకు పోసేందుకు టెట్రాప్యాక్‌లను తయారు చేస్తున్నారు. దీంతో ప్రతీరోజూ దాదాపు లక్ష లీటర్ల వరకు పాలు మిగిలిపోతున్నాయి. వాటిని పాలపొడి, వెన్న ఇతరత్రా అనుబంధ ఉత్పత్తులను తయారుచేయడానికి వినియోగించాలి. కానీ ఇప్పటికే కోట్ల విలువైన వెన్న, పాల పొడి చిత్తూరు జిల్లా పలమనేరులో వృథాగా పడి ఉంది. దీంతో ఏం చేయాలో విజయ డెయిరీ యాజమాన్యానికి అంతు బట్టడంలేదు. అదనంగా వచ్చే పాలను ఎలాగైనా వదిలించుకునేందుకు పారబోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేకుంటే ఆయా పాల నుంచి క్రీమ్ తీసి వెన్న, పన్నీర్ వంటివి తయారుచేసేవారు. అందుకు పాల సేకరణ ధరలో పావుశాతం చెల్లించేవారు. అది కూడా ఎప్పుడో ఒకసారి జరిగేది. కానీ ఇప్పుడలా కాదు. యాంటీ బయోటిక్స్ ఉన్నాయని, ఇతరత్రా కారణాలు చెబుతూ పారబోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిజంగా నాణ్యత లేకుంటే జిల్లాల్లోని విజయ డెయిరీ కేంద్రాల వద్దే తిరస్కరిస్తే రైతులు వాటిని వెనక్కి తీసుకెళ్లేవారు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత? గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో విజయ డెయిరీ మన్సాన్పల్లి కేంద్రానికి చెందిన 25 వేల లీటర్ల పాలను పారబోశారు. అలాగే కొత్తపేట కేంద్రానికి చెందిన 30 వేల లీటర్లు, కందుకూరుకు చెందిన 15 వేలు, బొమ్మలరామారానికి చెందిన 10 వేలు, వనపర్తి కేంద్రానికి చెందిన 10 వేలు, చేవెళ్ల కేంద్రానికి చెందిన 12 వేలు, ఇందుగులకు చెందిన 15 వేలు, జనగామకు చెందిన 18 వేలు, ఖమ్మంకు చెందిన 7 వేలు, చౌటుప్పల్ కేంద్రానికి చెందిన 6 వేల లీటర్లను పారబోసినట్లు విజయ డెయిరీకి చెందిన కొందరు అధికారులు తెలిపారు. ఇలాగైతే మూతే.. ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున పాల సేకరణ పెరిగింది. కానీ ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల విక్రయాలు పడిపోయాయి. పాల సేకరణ వద్దనుకుంటే ముందే రైతులకు చెప్పాలి కానీ నాణ్యత పేరుతో పారబోయడం సరికాదు. విజయ డెయిరీ ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లోనే మూతపడే ప్రమాదముంది. కె.యాదయ్య, ప్రధాన కార్యదర్శి, విజయ డెయిరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎందుకు పారబోస్తున్నారు? పాల సేకరణ అధికంగా ఉంది. విక్రయాలు పడిపోతున్నాయి. ఇదే విజయ డెయిరీ ఎదుర్కొనే ప్రధాన సమస్య. దీంతో మిగిలిన పాలను గతేడాది సెప్టెంబర్ నుంచి చిత్తూరు జిల్లా పలమనేరులోని పరాగ్ డెయిరీకి పంపి పాల పొడి, వెన్న తయారు చేయించారు. రూ.90 కోట్ల విలువైన 1300 టన్నుల వెన్న, 2 వేల టన్నుల పాల పొడి అక్కడ పేరుకుపోయి ఉన్నట్లు విజయ డెయిరీకి చెందిన ఒక అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇది ఈ ఏడాది అక్టోబర్ నాటికి గడువు తీరిపోనుంది. మరోవైపు వాటిని ఇప్పుడు విక్రయించాలనుకుంటున్నా అమ్ముడుపోవడం లేదు. పాలపొడి అక్కడ తయారు చేయడానికి ఒక కేజీకి రూ.250 అవుతోంది. కానీ బయటి మార్కెట్లో రూ.100 ధరే పలుకుతోంది. ఇలా ఎటు చూసినా నష్టమే కనిపిస్తుంది. ప్రస్తుతం మిగిలే పాలను మళ్లీ వెన్న, పొడి తయారు చేయించే పరిస్థితి లేదు. దీంతో నాణ్యత లేదంటూ పాలను పారబోస్తున్నట్లుగా తెలుస్తోంది. -
పాడి రైతుపై పిడుగు
సాక్షి, హైదరాబాద్ : విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు చేదువార్త. వారికిచ్చే సేకరణ ధరను తగ్గించాలని డెయిరీ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఆవు పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 తగ్గించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. డెయిరీలోని అనేక వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా యంత్రాంగం మాత్రం వెనక్కి తగ్గనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆవు పాల సేకరణ ధరను వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ. 29.26 నుంచి రూ. 33.43 వరకు ఇస్తున్నారు. ఇక నుంచి ఆయా కేటగిరీల్లోని వాటన్నింటికీ రూ. 4 తగ్గించే అవకాశముంది. డెయిరీకి రైతుల నుంచి వచ్చే 4 లక్షల లీటర్ల పాలలో 20 వేల లీటర్లే గేదె పాలు కాగా, మిగిలిన 3.80 లక్షల లీటర్లు ఆవు పాలే. కాబట్టి ఆవు పాలు పోసే రైతులందరికీ ఇది పిడుగులాంటి నిర్ణయమంటున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే డెయిరీ మరింత సంక్షోభంలోకి వెళ్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 4 లక్షల నుంచి 2 లక్షల లీటర్లకు.. విజయ డెయిరీ పాల విక్రయాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఏడాదిక్రితం రోజుకు 4 లక్షల లీటర్ల విక్రయాలు ఉండగా, ప్రస్తుతం 2 లక్షల లీటర్లకు పడిపోయాయి. కానీ రైతుల నుంచి సేకరణ మాత్రం అలాగే ఉంది. రూ. 4 ప్రోత్సాహకం ఇస్తుండటంతో దాదాపు 65 వేల మంది రైతులు విజయ డెయిరీకే పాలు పోస్తున్నారు. అయితే వినియోగదారులకు పాల విక్రయాలు పెరగకపోవడంతో అదనంగా వచ్చిన పాలను పొడి చేసి నిలువ ఉంచుతున్నారు. కానీ అవీ అమ్ముడుపోక గడువు తీరే దశకు చేరుతుండటంతో రూ.కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో అంతుబట్టక సేకరణ ధర తగ్గిస్తే పాలు పోయరనీ, దాంతో నష్టాలపాలవుకుండా చూసుకోవచ్చని యాజమాన్యం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విక్రయాలు పెంచుకోకుండా రైతుకిచ్చే ధరను తగ్గించడం డెయిరీ చరిత్రలో తొలిసారి అంటున్నారు. ఏజెంట్ల స్థానంలో డిస్ట్రిబ్యూటర్లు డెయిరీ నుంచి పాలను వినియోగదారులకు చేరవేసేది ఏజెంట్లే. 40 ఏళ్ల నుంచి ఏజెంట్ల ద్వారానే పాలు సరఫరా చేస్తున్నారు. వారే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసి డెయిరీకి చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో విజయకు పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లోనే విక్రయాలుంటాయి. ఆ ప్రకారం నగరంలో 1,650 మంది ఏజెంట్లు పాలు సరఫరా చేస్తుండేవారు. కానీ 40 ఏళ్లుగా డెయిరీతో పెనవేసుకుపోయిన ఏజెంట్ల వ్యవస్థను యంత్రాంగం రద్దు చేసింది. వారి స్థానంలో 112 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం కోసం నగరంలో 18 జోన్ కార్యాలయాలుండగా వాటినీ రద్దు చేశారని డెయిరీ వర్గాలు పేర్కొన్నాయి. కమీషన్ రూ.3.90కు పెంపు గతంలో ఏజెంటు కమీషన్ లీటరుకు రూ. 2.50 ఇచ్చేవారు. రవాణా ఖర్చుకు గాను 70 పైసలు డెయిరీ చెల్లించేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్‌ను రూ. 3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఏజెంట్లుగా పనిచేసినవారు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో పాల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో అధికారుల్లోనూ విభేదాలు పొడసూపాయి. చివరకు ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా డెయిరీని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా అధికారుల నిర్ణయాలు శాపాలుగా మారాయన్న చర్చ జరుగుతోంది. -
ఇక్కట్ల ‘పాలు’
ఒంగోలు డెయిరీ..పాడి పరిశ్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్రకాశం జిల్లా రైతులకు కొన్నేళ్ల పాటు ఆదరువుగా ఉన్న సహకార సంస్థ. రైతుల సంక్షేమానికి తోడ్పడుతూ లాభాల బాటలో పయనిస్తున్న డెయిరీని కో ఆపరేటివ్ సొసైటీ నుంచి కంపెనీ యాక్టులోకి మార్చి పథకం ప్రకారం క్రమంగా నిర్వీర్యం చేశారు. పాలకవర్గం, అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం వేలాది మంది రైతుల సంక్షేమాన్ని, ఉద్యోగుల జీవితాలను పణంగా పెట్టారు. డెయిరీ నిధులు పక్కదారి పట్టించి దుబారాగా ఖర్చు చేసి.. ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా నష్టాల ఊబిలోకి నెట్టారు. ఏడాదిగా పాలుపోసిన రైతులకు, ఆరు నెలలుగా ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వారిని ఇక్కట్లపాలు చేశారు. బకాయిల కోసం ఎన్ని ఆందోళనలు చేసినా పాలకవర్గానికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. అప్పుల బాధతో మనోవేదనకు గురై ఓ పాల ఏజెంట్ గుండెపోటుతో మృతిచెందగా.. పాడి రైతులు, ఉద్యోగుల కుటుంబాల వెతలు అయితే వర్ణనాతీతం. ఒంగోలు టూటౌన్/యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలో ఒంగోలు డెయిరీ పరిధిలో దాదాపు 450 వరకు పాల సొసైటీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 30 వేల మంది వరకు పాలరైతులు ఉన్నారు. వీరంతా పాడినే నమ్ముకుని డెయిరీకి గత కొన్నేళ్లుగా పాలు పోస్తూ వస్తున్నారు. పాడి మీద ఆధారిపడి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. వీరికి ఏడాది కాలంగా డెయిరీ రూ.12 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కసారిగా పాల బకాయిలు ఆగిపోవడంతో ఆయా రైతుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది. నేటికీ పాల రైతులు తమ బకాయిలు చెల్లించాలని ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. డెయిరీ చైర్మన్‌ను ముట్టడించారు. ఆయన గదికి, డెయిరీ ఎండీ గదికి తాళాలు వేసి మరీ నిరసన తెలిపారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆందోళనలు చేశారు. దీంతో సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లింది. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఒంగోలు డెయిరీపై మాట్లాడతారని అందరూ ఆశగా ఎదురు చూసినా నిరాశే మిగిలింది. నిలిచిన గేదెల కొనుగోలు రుణాలు పాలరైతులతో పాటు ఒంగోలు డెయిరీ ద్వారా పాడి గేదెల రుణాలు తీసుకున్న రైతులు నాలుగు విధాలుగా చెడాల్సి వచ్చింది. ఒంగోలు విజయ బ్యాంకు ద్వారా పాడిగేదేల రుణాలు పొందిన రైతులు తొలివిడతగా ఒక గేదె తీసుకున్నారు. డెయిరీకి మాత్రం క్రమం తప్పకుండా పాలు పోస్తూ వచ్చారు. అలా పోసిన పాలలో బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయి డబ్బులు డెయిరీ మినహాయించుకుని బ్యాంకుకు చెల్లించలేదు. దీంతో బ్యాంక్ రెండో గేదె ఇవ్వడం ఆపేసింది. దీనిపై కూడా రైతులు పలుమార్లు పాత చైర్మన్ చల్లా శ్రీనివాసరావును నిలదీయడంతో ‘‘రేపు, ఎల్లుండి, వచ్చే వారం చెల్లిస్తాం’’ అంటూ మభ్యపెడుతూ వచ్చారు. చివరకు నట్టేట ముంచారు. ప్రస్తుతం పాడి గేదెల రుణాలు తీసుకున్న రైతులు కుటుంబపోషణ కోసం ఉపాధి హామీ పథకం పనులకు పోతున్నారు. వీరికి వచ్చే కూలీ డబ్బులను బ్యాంకు మేనేజర్ అప్పు కింద జమ చేసుకుండటంతో చాలా మంది రైతులు ఖంగుతిన్నారు. చేసేదేమీ లేక అసలు ఉపాధి హామీ పనికే పోవడం మానుకున్నారని టంగుటూరు మండలం పొందూరు పాల కేంద్రం సొసైటీ అధ్యక్షడు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకుపోతున్న ఉద్యోగుల వేతన బకాయిలు ఉద్యోగుల వేతన బకాయిలు నెలనెలకూ కొండలా పేరుకుపోతున్నాయి. నెలకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున ఆరు నెలల వేతనం రూ.3 కోట్ల వరకు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ బకాయిలు, ట్రాన్స్‌పోర్టు బకాయిలు ఇలా అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. పరిస్థితి రోజురోజుకూ ఆందోళన కలిగిస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఉద్యోగులు కలవరపడుతున్నారు. పాత చైర్మన్, కొత్త చైర్మన్ ఇద్దరూ డెయిరీ గురించి పట్టించుకోవడం లేదు. అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రభుత్వం కూడా దీనిపై ఎక్కడా స్పందించడం లేదు. ఆది నుంచి టీడీపీ నాయకుల చేతుల్లోనే.. డెయిరీ స్థాపించినప్పటి నుంచి పాలకవర్గం ఎక్కువ కాలం టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. ప్రశ్నించే వారు లేకనే విలాసాలకు, విందులకు ఇష్టారాజ్యంగా డెయిరీ సొమ్మును ఖర్చు చేశారని పాల కేంద్రం సొసైటీ ప్రెసిడెంట్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. మొత్తం మీద డెయిరీ బకాయిలు 43 కోట్ల రూపాయలు ఉన్నట్లు గత డిసెంబర్లో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో తేల్చారు. కానీ వాస్తవంగా రూ.80 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ఉద్యోగులు, పాలరైతులు బల్లగుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం డెయిరీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఇప్పటి వరకు చేసిన అప్పులు చెల్లించకపోవడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు. అటు ఉద్యోగులు, ఇటు పాల రైతుల కుటుంబాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. పాల కేంద్రం మూత యర్రగొండపాలెంలోని ప్రభుత్వ పాల కేంద్రం మూతవేసి దాదాపు 7 నెలలు కావస్తున్నప్పటికీ జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో పాల ఉత్పత్తిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పాల ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన రూ.1.30 కోట్ల బకాయిల గురించి ఎవరూ నోరు మెదపడంలేదు. రెండు రోజుల్లో పాలకేంద్రాన్ని తెరుస్తామని, పశుపోషకుల నుంచి పాలను సేకరించే కార్యక్రమాన్ని చేపడతామని స్థానికంగా కేంద్రంలో ఉండే కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పాలకేంద్రం పరిధిలో 6 మండలాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారు. 2,500 మంది ఉత్పత్తిదారులు ఉండే ఈ కేంద్రంలో 100 మంది పాలసేకరణ కార్యదర్శులు పనిచేస్తున్నారు. రోజుకు 7 వేల లీటర్ల మేర పాలు సేకరించే సామర్థ్యం ఉన్న ఈ కేంద్రం గత ఏడాది జూన్ నుంచి 550 లీటర్లకు పడిపోయింది. పాలుపోసిన డబ్బులియ్యలా.. ఒంగోలు డెయిరీకి పాలు పోస్తున్నాం. ఆరు నెలలుగా రూ.8200 పాలబాకీ అందాల్సి ఉంది. అడిగినప్పుడల్లా అదిగో ఇస్తాం..ఇదిగో ఇస్తామని చెప్తున్నారేగానీ ఇచ్చింది లేదు. వర్షాలు లేక కరువుతో ఇబ్బంది పడుతున్నాం. గ్రాసం కొని మేపుకోవటానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. నాలాగే ఎంతో మంది పాడి రైతులు డెయిరీ నుంచి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. – పాశం రమ, జమ్ములపాలెం, టంగుటూరు మండలం డెయిరీ నుంచి బకాయి రూ.1.40 లక్షలు రావాలి ఒంగోలు డెయిరీకి 18 సంవత్సరాలుగా పాలు పట్టి పంపుతున్నా. రూ.1.40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఏజంట్లకు భారీగా డెయిరీ నుంచి డబ్బులు రావాలి. పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేక ఆందోళన చెందుతున్నారు. బిల్లులు వెంటనే అందించి రైతులను, ఏజంట్లను ఆదుకోవాలి. – గల్లా కుమార్, డెయిరీ ఏజంట్, విశ్వనాథపురం, త్రిపురాంతకం మండలం -
కష్టాల పాలు!
బైరెడ్డిపల్లె మండలంకూటాలవంకకు చెందినరెడ్డెమ్మకు రెండు పాడిఆవులు ఉన్నాయి. అందులో ఒకటి పాలు ఇస్తోంది. పూటకు ఐదు లీటర్ల చొప్పున రోజూ పది లీటర్ల పాలు డెయిరీకి పోస్తోంది. 15 రోజుల కోసారి లీటరు ధర రూ.25 చొప్పున రూ.3,750 బిల్లు వస్తోంది. అంటే నెలకు రూ.7,500 వస్తుంది. ఇందులోపశువుకు దాణా, మేత, వైద్యం తదితరాలకు నెలకు రూ.5000పోగా నెలకు మిగిలేదిరూ.2,500 మాత్రమే. దీంతోనే ఆమె కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక రెడ్డెమ్మ బాధేకాదు పడమటి కరువు మండలాల్లో 30వేల మంది పాడి రైతులుపడుతున్న కష్టమిదీ. పలమనేరు: పశుదాణా ధర పెరగడం, పాలకు ఆశించిన ధర లభించకపోవడంతో పాడి పశువుల పెంపకం రైతులకు భారంగా మారింది. వేసవిలో పాలకు డిమాండ్ ఉన్నా పాల ధర మాత్రం పెరగలేదు. వేసవిలో పాల డిగ్రీ 30, వెన్నశాతం 4.2 ఉంటే లీటరు ధర రూ. 25 ఉంటోంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో లీటరు పాలకు డిగ్రీని బట్టి రూ.30 దాకా ఇస్తుంటే ఇక్కడి డెయిరీలు మాత్రం లీటరు ధర సరాసరిగా రూ.25 ఇస్తున్నాయి. ఇక్కడి మార్కెట్లో ప్రైవేటు కంపెనీలు మాత్రం లీటరు పాలు రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నాయి. కొండెక్కిన పాడిఆవుల ధరలు జిల్లాలో ఎక్కువగా హెచ్ఎఫ్, జెర్సీ రకాల సీమజాతి ఆవులను రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని కర్ణాటక, తమి ళనాడు నుంచి కొనుగోలు చేయాల్సిందే. లీటరు పాలిస్తే రూ.5 వేలుగా 10 లీటర్ల పాలిచ్చే ఆవు రూ.50 వేలు ధరతో కొనేవారు. ప్రస్తుతం లీటరుకు రూ.8 వేలు చొప్పున పది లీటర్ల పాలిచ్చే ఆవును కొనాలంటే రూ.80 వేలకు పైగా వెచ్చించాలి. పాడిఆవు ధర, రవాణా, మూడేళ్ల ఇన్యూరెన్స్‌కు మరో రూ.6 వేలు పెట్టాల్సిందే. డెయిరీల సిండికేట్.. జిల్లాలోని మదనపల్లె డివిజన్లో 45 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయి. గతంలో ఈ డెయిరీలు రోజుకు 30 నుంచి 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. వేసవిలో మాత్రం పాల ఉత్పత్తి 25 లక్షల లీటర్లు దాకా ఉంటుంది. పాలు ఎక్కువగా ఉన్నప్పుడు సరఫరా ఎక్కువగా ఉందని ధరలను తగ్గించడం, డెయిరీల నుంచి అమ్మకాలు తగ్గితే ధరలు తగ్గించడం చేస్తున్నారు. రైతులకు డెయిరీలు లీటరు ధర రూ.25 నుంచి రూ.26 దాకా ఇస్తున్నాయి. కర్ణాటకలో డెయిరీలు రూ.30 నుంచి 32 దాకా ధర చెల్లిస్తున్నాయి. అక్కడ ప్రైవేటు పాల ఫ్యాక్టరీలున్నా ప్రభుత్వ డెయి రీ ఉన్నందున ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం సాగడంలేదు. ఇక్కడ ప్రభుత్వ పాల డెయిరీలను ప్రభుత్వం మూసేయడంతో ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం కొనసాగుతోంది. జిల్లాలోని రెండు పాల డెయిరీలు ధరను శాశిస్తున్నాయి. పెరిగిన దాణా ధరలు.. ఒక పాడి రైతు రోజుకు 10 లీటర్ల పాలు పితికే ఆవును ప్రస్తుతం కొనుగోలు చేయాలంటే సుమారు రూ.80వేలు పెట్టాల్సిందే. దాంతో పాటు పాడి ఆవు సంరక్షణకు ఉపయోగించే దాణా ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో బూసా (50 కేజీలు) రూ.1350 గానుగపిండి మూట రూ.2500, మొక్కజొన్నలు 50 కేజీలు రూ.1000, బుడ్డశెనగ పొట్టు 24 కేజీలు రూ.500లుగా ఉన్నాయి. తవుడు 50 కిలోలు రూ.850 గా ఉంది. దీనికి తోడు వరిగడ్డి ట్రాక్టరులోడ్డు రూ.13వేలుగా ఉంది. ఆలెక్కన మొత్తం రూ.19వేల దాకా ఖర్చు అవుతుంది. ఆవు ధర, పోషణలో తేడాలివీ.. ♦ పది లీటర్ల పాలిచ్చే హెచ్ఎఫ్ లేదా జెర్సీ ఆవు ధర కర్ణాటక, తమిళనాడులో రూ.80 వేలుదాకా పలుకుతోంది. ♦ జిల్లాలోని పడమటి మండలాల్లో అదే జాతి ఆవు ధర రూ. 60 వేలకు దొరికినా అక్కడి ఆవులు ఇచ్చినంత పాలు ఇక్కడి ఆవులు ఇవ్వడంలేదు. ♦ అందుకే రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి ఆవులను కొనుగోలు చేస్తున్నారు. ♦ కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఉండే ఉష్ణ్రోగ్రతలు సీమజాతి ఆవులకు సరిపడేలా ఉండడం. వారు ఎక్కువగా పచ్చిమేతను పెట్టడం, సరైన సంరక్షణ చర్యల కారణంగా బలిష్టంగా ఉంటున్నాయి. ♦ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల తగినంత పచ్చిగడ్డి లేదు. ఎక్కువగా ఎండుగడ్డి, బూసా వాడుతున్నారు. ♦ కర్ణాటక నుంచి కొన్న ఆవులు సైతం ఇక్కడికి తెచ్చిన తొలినాళ్లలో ఇచ్చినంత పాలు మరుసటి ఈతకు ఇవ్వడం లేదు. సరైన పోషణ లేకపోవడం, ఇక్కడి వాతావరణ పరిస్థితులే అందుకు కారణాలు. ఏమీ గిట్టడం లేదు ధరల విషయంలో పాల డెయిరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అసలే మేత లేక ఏడు లీటర్లు పాలిచ్చే ఆవు ఐదు లీటర్లే ఇస్తోంది. పొద్దస్తమానం ఆవులకు చాకిరీచేసి వాటికి మేత, గానుగపిండి పెట్టి పోషిస్తే కూలి కూడా మిగలడంలేదు. ఏదో చేయాలి కాబట్టి గత్యంతరం లేక పశువులను మేపుతున్నాం.– రెడ్డెమ్మ, కూటాలవంక, బైరెడ్డిపల్లె మండలం పాలధరలు మరీ మోసం ఇక్కడ ఉన్నవంతా ప్రైవేటు పాల డెయిరీలే. దానికి తోడు రైతులకు జరిగే అన్యాయంపై ప్రైవేటు డెయిరీలను ప్రశ్నించే అధికారం ఈ ప్రభుత్వానికి కూడా లేదు. ఇక ఐకేపీ వారి బీఎంసీయూలు ఉన్నప్పటికీ అవి ప్రైవేటు డెయిరీలను ఎదుర్కొనలేకపోతున్నాయి. పాల ధరలు ఇష్టారాజ్యంగా ఉంటున్నాయి. పాడి ఆవులను సంరక్షించడం కంటే అమ్ముకోవడం మేలుగా మారింది.-బాలయ్య, జంగాలపల్లె,పలమనేరు మండలం -
అప్పుడు గొప్పలు.. ఇప్పుడు తిప్పలు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. మార్చి 28న ఒంగోలు డెయిరీ కొత్త చైర్మన్ అంటూ ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శిద్దా.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చైర్మన్‌గిరి ముళ్ల కిరీటమంటూ డెయిరీ గేటు తొక్కడం మానుకున్నారు. 10 రోజులుగా పత్తా లేకుండాపోయారు. చైర్మన్‌గా ఎంపికైన నాడు శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. పాడి రైతులకు, డెయిరీ ఉద్యోగులకు రూ.20 కోట్లు సొంత డబ్బులు చెల్లిస్తున్నానంటూ ప్రకటించారు. డెయిరీని ముందుకు నడిపిస్తానంటూ గొప్పలు చెప్పారు. డెయిరీ లాభాల్లోకి వచ్చిన తర్వాతే తమ అప్పును జమ వేసుకుంటానని ప్రకటించారు. డెయిరీ ముందుకు నడిపించేవారు వచ్చారని పాడి రైతులు, ఉద్యోగులు ఒకింత సంబరపడ్డారు. నెల రోజులు గడవక ముందే ఆ ఆశలు ఆవిరయ్యాయి. వ్యాపారస్తుడైన శిద్దా యూటర్న్ తీసుకున్నారు. పైసా చెల్లించకపోగా డెయిరీ వైపు తొంగి చూడటం లేదు. ఏం చేయాలో పాలుపోక డెయిరీ ఉద్యోగులు, పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంగళవారం డెయిరీలో సమావేశమైన ఉద్యోగులు ఎండీకి అల్టిమేటం జారీ చేశారు. తక్షణం న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు డెయిరీ డైరెక్టర్లు బుధవారం సమావేశమవుతున్నారు. చివరిసారిగా డైరెక్టర్లు, జిల్లాకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పి ఆందోళన ప్రారంభిస్తామని డెయిరీ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు రూ.3 కోట్లు, కరెంట్ బిల్లు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టు బకాయిలు మరో రూ.2 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కొత్త చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజు శిద్దా ప్రకటించారు. ఇదే జరిగితే డెయిరీ తిరిగి రన్నింగ్‌లోకి వస్తుందని మిగిలిన అప్పుల సంగతి తర్వాత చూసుకోవచ్చునని అందరూ భావించారు. అయితే కొత్త చైర్మన్ శిద్దా నెల కావస్తున్నా పైసా చెల్లించలేదు. పైపెచ్చు తన సొంత డబ్బులిచ్చేది లేదని బ్యాంకు రుణం వస్తేనే చెల్లిస్తానంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఓకే అంటేనే తాను చైర్మన్‌గా డెయిరీకి వస్తానంటూ శిద్దా అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్‌తో ఒప్పందం చేసుకున్న శిద్దా వెంకటేశ్వరరావు రాత్రికి రాత్రే ఒంగోలు డెయిరీ చైర్మన్ అయ్యారు. ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకున్నారు. శిద్దా డెయిరీ చైర్మన్ ఎంపిక వ్యవహారం తమకు తెలియదంటూ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో పాటు పలువురు అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టారు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి ఏప్రిల్ 15న పాత, కొత్త చైర్మన్లను విజయవాడకు పిలిపించారు. జిల్లా మంత్రి, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు తెలియకుండా డెయిరీ చైర్మన్ ఎలా అవుతావు అంటూ చివాట్లు పెట్టారు. తర్వాత మాట్లాడదాం పో.. అంటూ పంపించివేశారు. రెండు రోజుల తర్వాత మరోమారు ముఖ్యమంత్రితో సమావేశం ఉంటుందని అన్ని చక్కబడతాయని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా సమావేశం ఊసే లేదు. దీంతో శిద్దా యూటర్న్ తీసుకున్నారు. సీఎం చెప్పిన తర్వాతే డెయిరీకి వస్తానంటూ పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు డెయిరీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. -
జింజుబా గడ్డి ఆవులకు భలే ఇష్టం!
తెలుగు రాష్ట్రాల్లో పాల కోసమో, బ్రీడ్ అభివృద్ధి కోసమో, ఆసక్తి కొద్దీనో ఆవులను పెంచేవారు కొందరు ఈ మధ్య జుంజుబా గడ్డి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ రకం గడ్డి పోచలు సన్నగా మెత్తగా ఉండడం, 14.5% ప్రొటీన్‌తో కూడి రుచిగా ఉండడం వల్ల ఆవులు ఈ గడ్డిని ఇష్టంగా తినడం ఒక కారణమైతే.. దీన్ని పెంచడానికి శ్రమ గానీ, ఖర్చుగానీ పెద్దగా లేకపోవడం మరొకటని చెబుతున్నారు. ఒకసారి నాటుకుంటే.. మొదట 45 రోజులకు.. తర్వాత ప్రతి 35 రోజులకోసారి గడ్డి కోతకు వస్తుంది. జుంజుబా గడ్డిని గుజరాత్ నుంచి తెచ్చి కొందరు దేశీ ఆవుల పోషకులు, పాడి రైతులు సాగు చేస్తున్నారు. వీరిలో ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్ ఒకరు. గత కొన్ని నెలలుగా జుంజుబా గడ్డిని పెంచి సత్ఫలితాలను గమనించిన ఆయన ఇతర రైతులకు ఈ గడ్డి విత్తనాన్ని ఆయన అందిస్తున్నారు. విజయరామ్ అందించిన సమాచారం ప్రకారం.. గుప్పెడు జుంజుబా గడ్డి పోచలు(సుమారు 100 పోచలు) ప్రతి రైతుకూ ఇస్తారు. దీన్ని ఆరు అంగుళాల పొడవున కత్తిరించి, ఒకటి లేదా రెండు గణుపులు మట్టిలోపలికి వెళ్లేలా.. ఎటు చూపినా అడుగున్నర దూరంలో.. నాటుకోవాలి. రెండు సెంట్లకు సరిపోతుంది. మొలక వచ్చిన 20 రోజులకోసారి, తర్వాత 15 రోజులకోసారి నీటితో కలిపి జీవామృతాన్ని అందిస్తే చాలు. అవకాశం ఉన్న రైతులు రెండు వారాలకోసారి జీవామృతాన్ని పారగట్టడం లేదా డ్రిప్ ద్వారా అందిస్తే మంచిది.35 రోజులకోసారి.. ఏళ్ల తరబడి గడ్డి దిగుబడి వస్తూనే ఉంటుంది. ఆవుకు రోజుకు ఎండుగడ్డి, దాణాతోపాటు 15 కిలోల పచ్చిగడ్డి వేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే 30 ఆవులకు ఏడాది పొడవునా పచ్చి మేతను అందించడానికి ఎకరం పొలం అవసరమవుతుంది. ఎకరాన్ని చిన్న మడులుగా విభజించుకొని నాటుకోవాలి. ఒక మడిలో గడ్డి కోత పూర్తయ్యాక ఘనజీవామృతం వేయడం అవసరమని విజయరామ్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని తమ వ్యవసాయ క్షేత్రంలో జూన్ నాటికి ఈ గడ్డి విత్తనం రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ గడ్డి పొలంలో నడిచే వారి కాళ్లకు కోసుకుపోవడం ఉండదని, గడ్డిపోచలు మెత్తగా ఉండటమే కారణమన్నారు.కృష్ణా జిల్లా గూడూరు మండలం (తరకటూరు చెక్‌పోస్ట్ దగ్గర) పినగూడూరు లంక గ్రామంలోని తమ సౌభాగ్య గోసదన్‌లో ఈ గడ్డి విత్తనం దేశీ ఆవులను పెంచే రైతులకు పంపీణీ చేయనున్నారు. వివరాలకు.. తిరుపతి– 90002 69724, ‘సేవ్’ ప్రతినిధి సురేంద్ర: 99491 90769 -
‘పాల’కూట విషం
పాడి రైతులు తమ గేదెలుఈనగానే దానికి జన్మించిన దూడకుముందుగా పాలు విడుస్తారు. ఆదూడ తాగగా.. మిగిలిన పాలనుమాత్రమే పితికి వాడుకుంటారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణం వల్ల దూడ చనిపోతే దాని చర్మాన్ని తీసి,అందులో గడ్డి దూర్చి తల్లి పొదుగువద్ద ఉంచుతారు. తన పొదుగు వద్దదూడే వచ్చి నిలబడిందని భ్రమించిగేదె పాలు విడుస్తుంది. ఇది 30 ఏళ్లక్రితం నాటి మాట. ఇప్పుడు పరిస్థితిమారిపోయింది. మందులురావడంతో కొందరు పాడి రైతుల్లోనిర్లక్ష్యం పెరిగింది. కర్నూలు (హాస్పిటల్) : గేదెను మచ్చిక చేసుకోవడం మాని, త్వరగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమాదకరమైన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ వేస్తున్నారు. వీటి పాలు తాగిన వారు వ్యాధుల బారిన పడుతున్నారు. గేదెలు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను నిషేధించింది. అయినా జిల్లాలో వ్యాపారులు వీటిని దొడ్డిదారిన తెచ్చి విక్రయిస్తున్నారు. కొందరు రైతులు త్వరగా పాలు పితకాలన్న ఆత్రుతతో గేదెలకు ఈ ఇంజెక్షన్లు వేస్తున్నారు. గతంలో దూడ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లోనే.. అదీ పశువైద్యాధికారి సూచన మేరకు మాత్రమే గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అయితే.. ఇరవై ఏళ్ల నుంచి వీటి వినియోగం క్రమేణా పెరుగుతూ వచ్చింది. జిల్లాలో 4,11,000 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 15 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. పాడి గేదెలు ఎక్కువగా ఉన్న కొందరు రైతులు, డెయిరీ కేంద్రాలు నిర్వహించే ప్రాంతాల్లో ఆక్సిటోసిన్ వినియోగం అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల, డోన్, బేతంచర్ల, ఓర్వకల్లు, బనగానపల్లి, చాగలమర్రి, ఆళ్లగడ్డ, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, శ్రీశైలం, దేవనకొండ, నందికొట్కూరు, రుద్రవరం, అవుకు, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో కొందరు పాడి రైతులు వీటిని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాలు తాగినవారు జీర్ణకోశ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌కు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రైతులను చైతన్యపరిచి ఇంజెక్షన్ల వాడకాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. నిషేధించినా ఆగని విక్రయాలు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్‌ను మనుషులకు, పశువులకు వేర్వేరుగా వాడతారు. గర్భిణులు సుఖప్రసవం అయ్యేందుకు గాను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని నిపుణుల సలహా మేరకు వాడుతుంటారు. దీనివల్ల ప్రసవ ద్వారంలోని కండరాలు వదులుగా మారి బిడ్డ బయటకు రావడానికి సులభమవుతుంది. అలాగే గేదెలకు సేపు కోసం, పాల దిగుబడి పెంచేందుకు, ఎక్కువ కాలం పాలు ఇచ్చేందుకు వీటిని వేస్తున్నారు.ఈ ఇంజెక్షన్ వేసిన కొన్ని సెకన్లకే పొదుగులోని కండరాల్లో కదలిక వచ్చి గేదె పాలు విడుస్తుంది. సాధార ణంగా ఈత తర్వాత గేదె ఆరు నెలల పాటు పాలిస్తుంది. అదే ఈ ఇంజెక్షన్ నిరంతరం వాడటం వల్ల ఆరు నెలల తర్వాత కూడా పాలు పితుక్కునే అవకాశం ఉంది. దూడను వదిలేస్తే అది ఎక్కువగా పాలు తాగుతుందని భయపడి కొందరు రైతులు ఇంజెక్షన్లపై ఆధారపడుతున్నారు. దీనిని వాడటం వల్ల అటు గేదెలకు, ఇటు మనుషులకు వ్యాధులు వస్తాయని భావించి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే నిషేధించింది. అయినా జిల్లాలోని వ్యాపారులు దొడ్డిదారిన వీటిని తెచ్చి విక్రయిస్తున్నారు. గేదెలు అధికంగా ఉండే ప్రాంతాల్లోని కిరాణాదుకాణాలు, దాణా విక్రయ అంగళ్లు, మెడికల్‌షాపుల్లో వీటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. పాతికేళ్ల క్రితం గేదెకు ఒక యాంపిల్ వేస్తే పాలు విడిచేది. కానీ ఇప్పుడు ఒకేసారి మూడు యాంపిల్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గేదెల పునరుత్పత్తి దెబ్బతింటుంది ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన గేదె పాలు తాగడం వల్ల మనుషులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందువల్లే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మెడికల్ స్టోర్లలో అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇంజెక్షన్ వాడటం వల్ల గేదె ఆ తర్వాత ఎదకు రాదు. గర్భం దాల్చకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. లాభం కంటే నష్టమే ఎక్కువ. – డాక్టర్ అచ్చెన్న, పశువైద్యాధికారి, డోన్ -
సేంద్రియ పాల విప్లవానికి బాటలు..!
‘అక్షయకల్ప’ వ్యవస్థాపకుడు డా. జి.ఎన్.ఎస్. రెడ్డితో ‘సాగుబడి’ ముఖాముఖి పాడి రైతులు మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కొత్త పోకడలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే, పాడిని నమ్ముకొని జీవిస్తున్న లేదా పాడి రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న చిన్న, సన్నకారు రైతులు ఎవరికి వారు తమంతట తాము అత్యాధునిక సాంకేతికతలను, కొత్త పోకడలను అందిపుచ్చుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం.ఒంటరిగా చేయలేనిది కలసికట్టుగా కదిలితే అసాధ్యం కాబోదు. ముఖ్యంగా.. ఉత్తమ ప్రమాణాలతో కూడిన సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టగలిగితే చిన్న, సన్నకారు పాడి రైతుల భవితకు ఎటువంటి ఢోకా ఉండబోదని నిపుణులు, కర్ణాటకకు చెందిన డాక్టర్ గుడ్డహట్టి నంజుండ శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. స్వావలంబనే ప్రాతిపదికగా సేంద్రియ ఆవు పాల ఉత్పత్తిని చేపట్టి స్థిరమైన అధిక నికరాదాయాన్నిచ్చే దిశగా చిన్న, సన్నకారు రైతులకు ఆయన మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతికతలను, నిర్వహణ సామర్ధ్యాన్ని, మార్కెటింగ్‌కు సంబంధించిన మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేశారు. డా. జి.ఎన్.ఎస్. రెడ్డి పశువైద్యంలో పట్టా పొందాక భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్(బి.ఎ.ఐ.ఎఫ్.)లో 30 ఏళ్లపాటు సేవలందించి ఉపాధ్యక్షుడి హోదాకు ఎదిగి.. 2010లో బయటకు వచ్చారు. ఆ తర్వాత తుమ్కూర్ జిల్లా తిప్తూరులో ‘అక్షయకల్ప’ సంస్థను నెలకొల్పారు. ఇప్పటికే 150 మంది గ్రామీణ సేంద్రియ పాడి రైతాంగానికి వెలుగుబాట చూపారు. వికేంద్రీకృత పద్ధతిలో చిన్న, సన్నకారు రైతుల చేత సేంద్రియ ఆవు పాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ సంస్థ దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఆయన విశేష కృషికి గుర్తింపుగా 2013లో ప్రతిష్టాత్మకమైన అశోక ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. సేంద్రియ పాల వినియోగంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో డా. జి.ఎన్.ఎస్. రెడ్డితో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ► సేంద్రియ పాల ప్రత్యేకత, ఆవశ్యకత ఏమిటి? పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలేమిటి? సేంద్రియ పాలే అసలైన పాలు. సేంద్రియ పద్ధతుల్లో పెరిగిన పశుగ్రాసాన్ని తింటూ.. స్వేచ్ఛగా తిరుగాడుతూ, వత్తిడి లేని వాతావరణంలో పెరిగే ఆవుల నుంచి పరిశుభ్రమైన పద్ధతుల్లో సేకరించే యాంటీబయోటిక్స్, హార్మోన్లు, రసాయనిక అవశేషాల్లేని స్వచ్ఛమైన పాలే సేంద్రియ పాలు. పాలల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. హార్మోన్ల వల్ల బాలికలు ముందుగానే రజస్వల అవుతున్నారు. పశువులకు మేపుతున్న కృత్రిమ దాణా ద్వారా అఫ్లోటాక్సిన్లు పాలలోకి చేరి వినియోగదారుల కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాల్లేకుండా.. సబ్బు, డిటర్జెంట్, ఆయిల్స్, సోడా తదితరాలతో కలుషితం కానివే అసలైన అర్థంలో సేంద్రియ పాలు. ► పరిమిత వనరులు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఈ ప్రమాణాలను అందిపుచ్చుకోగలుగుతారా? గ్రామీణ చిన్న, సన్నకారు రైతులు తమంతట తాము ఒంటరిగా సుస్థిరమైన సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టడం.. డెయిరీ నిర్వహణ నుంచి మార్కెటింగ్ వరకు అన్ని పనులూ ఒంటరిగా, సొంతంగా చక్కబెట్టుకొని నిలవగలగడం కష్టమే. ఈ అవరోధాలను అధిగమించడానికి దోహదపడే లక్ష్యంతోనే నేను బి.ఎ.ఐ.ఎఫ్.లో నుంచి బయటకు వచ్చి, 2010లో ‘అక్షయకల్ప’ను కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లాలో స్థాపించాను. గాంధీజీ స్వావలంబన భావాలకు అనుగుణంగా గ్రామీణ చిన్న, సన్నకారు రైతులకు గౌరవప్రదమైన, స్థిరమైన ఆదాయాన్ని అందించే సేంద్రియ డెయిరీపై వినూత్న నమూనాను రూపొందించాను. ఇప్పటికే కర్ణాటకలోని 150 మంది పాడి రైతులు మా నమూనా ప్రకారం సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టి, సుస్థిరమైన నికరాదాయం పొందుతున్నారు. 50 కిలోమీటర్ల పరిధిలో ఎంపికచేసిన రైతుల చేత బైబాక్ ఒప్పందం ద్వారా సేంద్రియ పాలను ఉత్పత్తి చేయించి.. లీటరు రూ. 35 చొప్పున రైతుకు చెల్లిస్తాం. పాలను మేమే సేకరించి.. బెంగళూరులో లీటరు రూ. 70కి విక్రయిస్తున్నాం. ► సేంద్రియ పాలను రైతుల నుంచి కొని మీరే మార్కెట్ చేస్తారా? అవును. చిన్న, సన్నకారు రైతు 25కు మించకుండా సంకరజాతి ఆవులతో సేంద్రియ డెయిరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రైతుకు కనీసం 5 ఎకరాల సొంత పొలం ఉండాలి. బోర్లలో 3 ఇంచుల నీరుండాలి. 50% దేశీ లక్షణాలున్న నాణ్యమైన సంకరజాతి ఆవులను అందిస్తాం. ఇవి కనీసం 10 లీటర్ల పాలు ఇస్తాయి. 15 రకాల పశుగ్రాసాలను, పశుగ్రాసానికి పనికొచ్చే చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆవుల పేడ, మూత్రం ద్వారా సాగు చేయిస్తాం. ఆవుకు రోజుకు 40 కిలోల పచ్చిమేత, కిలో ఎండుమేత వేస్తాం. కృత్రిమ దాణా వాడాల్సిన అవసరం లేదు.. రైతుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాలు పితికే యంత్రాలను, పాలను పితికిన వెంటనే నిల్వచేసే చిల్లింగ్ యంత్రాలను, బయోగ్యాస్ ఉత్పత్తి వ్యవస్థను ప్రతి రైతు క్షేత్రంలో ఏర్పాటు చేస్తాం. పరిశుభ్ర వాతావరణంలో యంత్రాలతో పితికినప్పుడు పాలను పాశ్చురైజ్ చేయనవసరం కూడా లేదు. అనుదిన కార్యక్రమాల నిర్వహణలోనూ మా నిపుణులు రైతులకు వెన్నుదన్నుగా ఉంటారు. రైతు స్వయంగా వ్యవసాయ క్షేత్రంతో మమేకమై ఉండి, ఆవులను ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధతో చూసుకోవాలన్నది ముఖ్యమైన నియమం. అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉండి పూర్తిగా పనివాళ్ల మీద ఆధారపడే రైతులను మేము ప్రోత్సహించం. ► రైతు ఎంత పెట్టుబడి పెట్టాలి? ప్రాజెక్టు వ్యయం రూ. 25 లక్షలు. రైతు తన సొంత డబ్బు రూ. 5 లక్షలు పెట్టుబడి ఉండాలి. మిగతా రూ. 20 లక్షలను బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాం. త్రైపాక్షిక ఒప్పందం మేరకు.. నెల నెలా రుణం కిస్తీని మేమే బ్యాంకుకు చెల్లిస్తాం. ∙ ► ఆవులపై వత్తిడి లేకుండా పెంచడం అంటే? పశువులను కిక్కిరిసిన షెడ్లలో, చిత్తడిగా అపరిశుభ్ర వాతావరణంలో రోజంతా కట్టేసి ఉంచడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అలాకాకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా షెడ్‌ను డిజైన్ చేశాం. స్వేచ్ఛగా తిరగడానికి కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తాం. 25కు మించి ఎక్కువ ఆవులు ఒక డెయిరీలో పెట్టనివ్వం. కాబట్టి, ఆవులు ఒత్తిడి లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యదాయకంగా పెరుగుతాయి. పాలను చేతితో పితకటం ఉండదు కాబట్టి శుద్ధంగా ఉంటాయి. ఆవులకు వచ్చే వ్యాధులు కూడా 5%కి తగ్గిపోతాయి. సాధ్యమైనంత వరకు మూలికా వైద్యం మా సంస్థే చేయిస్తుంది. ► మొలకగడ్డిని వాడరా? మొలక గడ్డి ఆవుకు రోజుకు ఒకటి, రెండు కిలోలకు మించి పెట్టకూడదు. విత్తనాలు మొలిపించిన వారం రోజుల్లో మేతగా వేస్తాం కాబట్టి అందులో నీరు ఎక్కువ ఉంటుంది. పీచు నాసిరకంగా ఉంటుంది. ఎక్కువ వేస్తే పశువుకు జీర్ణం కాదు. ► మీతో కలిసి పనిచేసే రైతులకు ఆదాయ భద్రత ఎలా ఉంటుంది? రైతు స్థిమితంగా ఆవుల బాగోగులను చూసుకుంటే చాలు. మార్కెటింగ్‌కు సంబంధించిన ఒత్తిడి ఉండదు. బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసుకుంటాం కాబట్టి విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. లీటరు సేంద్రియ పాల ఉత్పత్తి ఖర్చు రూ. 15కు దాటదు. రైతుకు మేం రూ. 35 చెల్లిస్తాం. సేంద్రియ డెయిరీ ప్రాంగణంలో పండ్ల చెట్లు, ఇతరత్రా మార్గాల ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నాం. 5 ఎకరాల భూమిలో 25 ఆవులు పెట్టుకున్న రైతుకు నెలకు అన్ని ఖర్చులూ పోను రూ. లక్ష నికరాదాయం స్థిరంగా ఏడాది పొడవునా వచ్చేలా ప్రణాళికలను అమలు చేస్తున్నాం. సాధారణంగా పాడి రైతులు కృత్రిమ దాణా కొనుగోళ్లకే ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు. అందువల్ల నిజానికి చిన్న, సన్నకారు పాడి రైతులకు చేకూరే ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ దుస్థితి నుంచి బయటపడి, స్థిరంగా గౌరవప్రదమైన నికరాదాయం పొందే అత్యుత్తమ మార్గాన్ని పాడి రైతులకు మేం చూపిస్తున్నాం. ► మీరు చెప్పేదాన్ని బట్టి.. దగ్గరి ప్రాంతాల్లో ఉండే రైతులే సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టి.. ఒకే సంస్థ ద్వారా మార్కెటింగ్ చేయాలి. విడిగా ఒక రైతు సేంద్రియ పాల ఉత్పత్తి చేపట్టాలంటే ఎలా? మేం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను రైతుల చేత అమలు చేయిస్తాం. ఆవుల ఎంపిక, పోషణ, యంత్రాల నిర్వహణ, పాల నాణ్యత.. తదితర అంశాలన్నిటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. ఒంటరిగా ఒకే రైతు ఇవన్నీ చూసుకోవడం కష్టం. అందుకే బెంగళూరు పరిసరాల్లోని 50 కిలోమీటర్ల పరిధిలోని పాడి రైతులతోనే మేం ఒప్పందం చేసుకొని, సేంద్రియ పాలు ఉత్పత్తి చేయిస్తున్నాం. పాలతోపాటు ఇతరత్రా పాల ఉత్పత్తులను కూడా అమ్ముతున్నాం. కాబట్టే, రైతుకు లీటరు పాలకు రూ. 35 చెల్లిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాలకు కూడా ‘కల్పసిరి’ పేరిట సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టబోతున్నాం. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ఎవరైనా ముందుకొస్తే వాళ్లతో కలిసి పనిచేస్తాం. ఈ నగరాల పరిధిలో ఇప్పటికే డెయిరీ ఫామ్స్ నిర్వహిస్తున్న రైతులకు మాతో కలవాలని ఆసక్తి ఉంటే.. వారికి కూడా సేంద్రియ పాల ఉత్పత్తి పద్ధతులను అలవాటు చేస్తాం. ► ఈ 3 నగరాలకు దూరంగా ఉన్న ఇతర ప్రాంతాల రైతులకు కూడా సేంద్రియ పాల ఉత్పత్తిలో శిక్షణ ఇస్తారా? మేం ఒప్పందం చేసుకున్న రైతులకు మాత్రమే తొలుత 8 రోజుల శిక్షణ ఇస్తాం. ఇతర రైతులు ఆసక్తి ఉంటే మా పరిధిలోని సేంద్రియ డెయిరీ ఫామ్స్‌ను సందర్శించి అవగాహన పెంచుకోవచ్చు. ఒత్తిడి లేని వాతావరణంలో ఆవుల పెంపకం, గ్రామీణ రైతుకు కూడా ఉద్యోగస్తుల మాదిరిగా స్థిరంగా గౌరవప్రదమైన నికరాదాయం పొందేందుకు సహాయపడటంతోపాటు.. అన్ని విధాలా ఆరోగ్యదాయకమైన సేంద్రియ పాలను చైతన్యవంతులైన వినియోగదారులకు అందించడమే మా అంతిమ లక్ష్యం. ∙ ► ఎ2 మిల్క్‌ను అందించే దేశీ ఆవులను మీరెందుకని ప్రోత్సహించడం లేదు..? దేశీ ఆవుల ద్వారా పాల దిగుబడి తక్కువగా ఉంటుంది. రైతుకు గిట్టుబాటు కాకపోవచ్చు. పాల దిగుబడి తగ్గినా పర్వాలేదని రైతు అనుకుంటే గిర్ వంటి దేశీ ఆవులను కూడా ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు. (డా. జి.ఎన్.ఎస్.రెడ్డిని 099000 92392 నంబరులో లేదా dr.gnsr@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. http://blog.akshayakalpa.org) ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
‘విజయ’కు సీఎం ఫాంహౌస్ పాలు
మర్కూక్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో ఉత్పత్తయ్యే పాలను తన దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో విజయ డెయిరీ కేంద్రంలో ఫాంహౌస్ సిబ్బంది పోస్తున్నారు. సీఎం ఫాంహౌస్‌లోని పాడి పశువుల పాలను స్వయంగా ఎర్రవల్లిలో పోయడంతో గ్రామ పాడి రైతులు కూడా తమ పాలను పోసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీఎం ఫాంహౌస్‌లోని 5 ఆవులు, 6 గేదెలు ఉన్నా యి. ప్రస్తుతం పాడి పశువులు పాలు ఇవ్వ డంతో ప్రతి నిత్యం ఎర్రవల్లి విజయకేం ద్రంలో పాలను విక్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం కలిపి రెండు పూటలు మొత్తం 55 లీటర్ల పాలను పోస్తున్నారని గ్రామ వీడీసీ, కేంద్రం నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గేదెలను పంపిణీ చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం 155 మంది గేదెలను కొనుగోలు చేశారు. వీరికి పశువైద్యాధి కారు లు చెక్కును కూడా అందించారు. వారు కూడా ప్రస్తుతం పాలను విజయ డెయిరీలోని పోస్తున్నారు. రోజూ 400 లీటర్ల వరకు పాలు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. గేదెల కొనుగోలు కోసం ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ, ఓసీలకు 80 శాతం సబ్సిడీపై పాడి పశువులను అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి గేదెను, లేదా ఆవు కొనుగోలు కు రూ.45 వేల చెక్కును అంది స్తున్నారు. మిగతా మరో పశువు కోసం జూన్, జూలైలో మరో చెక్కును అందించనున్న ట్లు గ్రామ వీడీసీ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఎర్రవల్లి పాలవెల్లిగా మారుతుందని స్థానికు లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
విజయ పాల ధర రూపాయి పెంపు
నేటి నుంచి అమల్లోకి కొత్త ధర సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు ఉగాది కానుకగా పాల సేకరణ ధరను లీటరుకు గరిష్టంగా రూ.2 చొప్పున పెంచిన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య అందులో రూపాయి భారాన్ని వినియోగదారులపై మోపింది. విజయ పాల ధరను లీటరుకు రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాల సేకరణ ధర పెంపు సైతం నేటి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. 2017 జనవరి వరకు రూ.4 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక ధర బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఫిబ్రవరి నుంచి పాల బిల్లులతోపాటే ప్రోత్సాహకం చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆరు శాతం వెన్న ఉన్న గేదె పాలకు లీటరుకు రూ. 35.80 రైతులకు చెల్లిస్తుండగా.. పెరిగిన ధర ప్రకారం రూ. 37.80 చెల్లిస్తామన్నారు. అలాగే 3.5 శాతం వెన్న ఉన్న ఆవు పాలకు ప్రస్తుతం లీటరుకు రూ. 28.36 చెల్లిస్తుండగా ఇకపై రూ. 30.36 చెల్లిస్తామని చెప్పారు. -
నోట్ల రద్దుతో పాడిరైతులకు కష్టాలు
-
పాల బిల్లుల కోసం రోడ్డెక్కిన పాడి రైతులు
- హిందూపురంలో భారీ ర్యాలీ, రాస్తారోకో -హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేస్తున్నారంటూ మండిపాటు హిందూపురం అర్బన్ పాల బిల్లులు చెల్లించడంతో పాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం పాడి రైతులు రోడ్డెక్కారు. హిందూపురం ప్రాంతంలోని 17 మండలాలకు చెందిన వేలాదిమంది రైతులు పాడిరైతుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర, ఏపీరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నాయకత్వంలో పాల టిన్నులు పట్టుకుని స్థానిక ఏపీ డెయిరీ కేంద్రం నుంచి సద్భావన సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వీరి ఆందోళనకు అఖిలపక్ష పార్టీలు, రైతుసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రాస్తారోకోను ఉద్దేశించి రైతుసంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, వైఎస్సార్సీపీ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేటీ శ్రీధర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీని అభివద్ధి చేసుకోవాలన్న తలంపుతో ఏపీ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పాడి రైతులకు కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించడం లేదని, లీటర్ ధరను కూడా రూ.26 నుంచి రూ.16కు తగ్గించి వేశారని తెలిపారు. గతంలో చిత్తూరు డెయిరీని ఇదేవిధంగా నాశనం చేసి..హెరిటేజ్‌ను అభివద్ధి చేసుకున్నారని గుర్తు చేశారు. -
పాల బిల్లు ఇవ్వలేదని ధర్నా
రాయచోటిటౌన్: సుమారు రెండు నెలలకుపైగా అంటే నాలుగు బిల్లులు ఇవ్వలేదని దీంతో తమ కాపురాలు నడవడం కష్టంగా మారిందని పాడి రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం రాయచోటి విజయా పాలడెయిరీకి పాలు పోసే రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విజయా పాల డెయిరీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి 15రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను అడిగినా వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు వస్తున్నాయని తెలిపారు. విజయా డెయిరీ యజమాన్యానికి వ్యతిరేకంగా పా లక్యాన్‌లు తెచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపై పారబోసి తమ నిరసను వ్యక్త పరిచారు. అలాగే గ్రామాల్లో పాలు కొలిచే ఏజెంట్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. నాలుగు బిల్లుల నుంచి డ బ్బులు చెల్లించడం లేదని,రైతులకుఏం సమాధానం చెప్పాలో తెలియక తాము తీవ్ర వత్తిడి గురవుతున్నామని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు సకాలంలో బిల్లులు వచ్చే విధంగా చేయాలని తహసీల్దార్ దా మోదర్‌రెడ్డికి రైతులు వినతిపత్రాని సమర్పించారు. -
రోడ్డెక్కిన పాడిరైతులు
► మదనపల్లె విజయా డెయిరీ వద్ద ధర్నా ► పెండింగ్ పాలబిల్లులపై ఆగ్రహం ► ధరల్లోనూ కోతలంటూ ఆరోపణ మదనపల్లె రూరల్: పాల బిల్లులు చెల్లింపులో విజయా డెయిరీ విఫల మైందని పాడిరైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రైతులు స్థానిక విజయా డెయిరీ ఎదుట ధర్నా నిర్వహించారు. మదనపల్లె డివిజన్ పరిధిలోని 17 బీఎంసీలకు సరఫరా చేసిన పాలకు సంబంధించి మూడు బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని తొలుత రైతులు డెయిరీ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందిని బయటకు పంపేశారు. తమకు న్యాయం జరిగేంతవరకూ కార్యాలయంలో పనులు జరగనీయమంటూ బెంగళూరు -మదనపల్లె ప్రధానరహదారిపై బైఠాయించారు. రైతుల ధర్నాకు ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మద్దతు ప్రకటించారు. రైతుల సమస్యపై అధికారులను నిలదీశారు. వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకటిన్నర నెలగా పాల బిల్లులు చెల్లించలేదని తెలిపారు. బిల్లుల విషయమై సూపర్వైజర్, మేనేజర్‌ను అడిగితే సమాధానం దాట వేస్తున్నారని చెప్పారు. నాణ్యమైన పాలను పంపిస్తున్నా తక్కువ ధరలు వేయడం, నాణ్యత లేదంటూ తిప్పిపంపడం చేస్తూ రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. విభజన సమస్య : డెయిరీ మేనేజర్ పాడిరైతుల ధర్నా వ ద్ద డెయిరీ మేనేజర్ నవీన్ మాట్లాడుతూ మదనపల్లె డివిజన్లో ప్రతి రోజూ 35,000 లీటర్ల పాలు సేకరిస్తున్నామని, 20,000 లీటర్లు హైదరాబాద్‌లోని విజయా డెయిరీకి 15,000 లీటర్లు, టెట్రా ప్యాకింగ్ కోసం కుప్పానికి పంపేవారమని చెప్పారు. విభజన కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య డెయిరీ విషయం తేలకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పాలు నిలిచిపోయాయన్నారు. అలాగే అక్కడి నుంచి బిల్లులు రాలేదని, ఈ కారణంగా చెల్లింపులు ఆలస్యమయ్యాయని వివరించారు. బిల్లుల విషయం ఏపీ డెయిరీ సమాఖ్య మేనేజింగ్ డెరైక్టర్ మురళీ దృష్టికి తీసుకువెళితే పాలను ప్రైవేటు డెయిరీలకు, ఇతర సంస్థలకు అమ్మి చెల్లింపులు జరపమన్నారని, అందులో భాగంగానే డీడీ రమేష్ కోలారు డెయిరీతో మాట్లాడేందుకు వెళ్లారని చెప్పారు. రోడ్డుపై స్తంభించిన రాకపోకలు రైతుల ధర్నాతో సుమారు గంటకుపైగా బెంగళూరు మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా, సీపీఐ నాయకులు కృష్ణప్ప పాల్గొన్నారు. డీడీ అందుబాటులో లేనందున ఆదివారం ఉదయం ఆయనతో బిల్లుల విషయమై చర్చిద్దామని, అప్పటివరకు ఆందోళన విరమించాలని కోరడంతో రైతులు శాంతించారు. -
కా‘పాడి’తేనే రైతుకు మేలు
* పాడి రైతులకు ఇంకా అందని ప్రోత్సాహకం * సర్కారు రూ.27 కోట్లు విడుదల చేసినా రైతులకు చెల్లించని తెలంగాణ విజయ డెయిరీ * రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నామంటూ సాకులు సాక్షి, హైదరాబాద్: పాలు పోసే రైతు నోట్లో మట్టి కొడుతోంది తెలంగాణ విజయ డెయిరీ. ప్రోత్సాహకం అందించకుండా నిరుత్సాహానికి గురిచేస్తోంది. సర్కార్ కరుణించినా విజయ డెయిరీ సాకులు వెతుకుతోంది. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకపు సొమ్ము బకాయిలను విజయ డెయిరీ ఇంకా చెల్లించనేలేదు. లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహం అందించాలి. నాలుగు నెలలుగా బకాయిలు పేరుకుపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల రూ.27 కోట్ల బకాయి సొమ్ము విడుదల చేసినా వాటిని రైతుకు అందించడంలో ఆలస్యమవుతోంది. ప్రోత్సాహకపు సొమ్ముతోపాటు రైతుకు ఇవ్వాల్సిన వాస్తవ పాల డబ్బులు కూడా సకాలంలో అందించడంలేదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ప్రోత్సాహకం, అసలు సొమ్మును వేర్వేరుగా రైతుల ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నామని విజయ డెయిరీ అధికారులు సాకులు చెబుతున్నారు. దానికోసం రైతు ఖాతాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం విజయడెయిరీని కోరిందని పశు సంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. ఈ తతంగమంతా పూర్తి అయి రైతులకు బకాయిలు చేరాలంటే మరో నెల రోజుల వరకు పట్టే అవకాశముంది. కరువులో రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని తెలంగాణ ఆదర్శ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. ఏడాదిపాటు సక్రమంగా నడిపి ఇప్పుడు చేతులెత్తేశారు... విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 నగదు ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం 2014 అక్టోబర్ 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఉత్తర్వును అమలు చేసింది. వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు ఛాయల నేపథ్యంలో రైతులు పాడిని ప్రత్యామ్నాయ జీవనవిధానంగా మలుచుకుంటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంది. అందులో భాగంగా విజయడెయిరీ పరిధిలోని రైతులకు లీటరుకు 4 రూపాయలను ప్రోత్సాహకం కింద అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో లీటరుకు రూ.28 చొప్పున చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలుకాకముందు విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వు అమలు ప్రారంభమైన 2014 నవంబర్ నుంచి 2015 అక్టోబర్ వరకు సరిగ్గా ఈ ఏడాది కాలంలో పాల సేకరణ 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. ఇది సర్కారు అంచనాలను మించింది. అయితే గత ఏడాది అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును విజయ డెయిరీ సక్రమంగానే అందించింది. నవంబర్ రెండోవారం నుంచి సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. దీంతో పాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తోన్న రైతులు రోడ్డున పడ్డారు. -
పాల ‘ప్రోత్సాహకం’పై సీలింగ్!
♦ ఆర్థికభారం తగ్గించుకునేందుకు సర్కారు కసరత్తు ♦ పాడి రైతుల వివరాలివ్వాలని విజయ డెయిరీకి ఆదేశం ♦ రైతులకే ప్రోత్సాహక సొమ్ము అందేలా త్వరలో మార్గదర్శకాలు ♦ మండిపడుతున్న డెయిరీ సంఘాలు ♦ భవిష్యత్తులో ప్రోత్సాహకాన్ని ఎత్తేసే కుట్రగా ఆరోపణ సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు అందిస్తున్న నగదు ప్రోత్సాహకంపై సీలింగ్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రోత్సాహక సొమ్ము చెల్లింపు వల్ల ఆర్థిక భారం పెరగడంతో దాన్ని తగ్గించుకునేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. విజయ డెయిరీకి పాలు పోసే రైతుల్లో ఎంతమంది ఎన్ని లీటర్లు పాలు పోస్తున్నారో కేటగిరీలవారీగా వివరాలు ఇవ్వాల్సిందిగా డెయిరీ అధికారులను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా సన్న, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు, డెయిరీ వ్యాపారుల్లో ఎందరు ప్రోత్సాహకం తీసుకుంటున్నారో తెలుసుకొని కేవలం రైతులకే ప్రోత్సాహకం అందేలా మళ్లీ మార్గదర్శకాలు రూపొందించనుంది. వ్యాపారుల నుంచి పాలు సేకరించినా వారికి ప్రోత్సాహకం ఇవ్వరాదని సర్కారు భావిస్తోంది. ప్రోత్సాహకం ఉంటుందా? విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీట రుకు అదనంగా రూ. 4 నగదు ప్రోత్సాహకం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీచేసింది. అదే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఉత్తర్వులను అమలు చేస్తూ ఒక్కో లీటరుకు రూ. 28 చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వులు అమల్లోకి రాక ముందు విజయ డెయిరీ గతేడాది అక్టోబర్‌లో 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించగా ఉత్తర్వుల అమలు ప్రారంభమైన గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పాల సేకరణ సర్కారు అంచనాలకు మించి 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. అయితే ప్రోత్సాహక సొమ్ము చెల్లింపులకు 2015-16 బడ్జెట్లో సర్కారు కేటాయించిన రూ. 12 కోట్లు అయిపోవడంతో అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును సక్రమంగానే అందించిన విజయ డెయిరీ....ఆర్థిక ఇబ్బందుల కారణంగా నవంబర్ రెండో వారం నుంచి ఇప్పటివరకు రైతులందరికీ బిల్లుల సొమ్మును నిలిపేసింది. అలాగే 10 ప్రైవేటు డెయిరీలకూ పూర్తిగా చెల్లింపులు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. బకాయిల చెల్లింపులకు రూ. 60 కోట్లు అదనంగా కావాలంటూ లేఖ రాసినా ఇప్పటివరకు సర్కారు నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు సీలింగ్ విధానంపై కసరత్తు మొదలుపెట్టింది. అయితే సీలింగ్ వల్ల నిజమైన రైతులు కూడా అర్హత కోల్పోయే ప్రమాదముందని, భవిష్యత్తులో పాల ప్రోత్సాహకాన్ని ఎత్తివేసేందుకే సర్కారు కుట్ర పన్నిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం డెయిరీ ఫారాలకు ప్రోత్సాహకాన్ని నిలిపివేయడం సమంజసం కాదని ఆదర్శ పాల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. పెద్ద ప్రైవేటు డెయిరీ సంస్థలను కాపాడటానికే అధికారులు సిద్ధపడుతున్నారని ఆయన ఆరోపించారు. -
ప్రోత్సాహం లేదు
ఉద్యమించిన పాడి రైతులు చిక్కబళ్లాపురం కలెక్టరేట్ ముట్టడి చిక్కబళ్లాపురం :నిబంధనల పేరుతో పాల సేకరణలో ఇక్కట్లకు గురి చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై పాడి రైతులు మండిపడ్డారు. బుధవారం చిక్కబళ్లాపురం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. అంతకు ముందు కెఎంఎఫ్ డెరైక్టర్ కె.వి.నాగరాజు నేతృత్వంలో వేలాది మంది పాడి రైతులు స్థానిక ఎపీఎంసీ యార్డు నుంచి శిడ్లఘట్ట సర్కిల్ చేరుకుని ఏడవ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఫ్యాట్ 8.5ఎస్ఎన్ఎఫ్ పాలు సరఫరా చేసే వారికి మాత్రమే రూ. 4 మద్దతు ధర అందజేస్తోందని తెలిపారు. ఈ విధానం వల్ల పాడి రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారని అన్నారు. కరువు జిల్లాలో ఉన్న కొద్ది పాటి నీటి వనరులతోనే పాడి పరిశ్రమ అభివృద్ధికి రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కర్ణాటకలో ప్రతి లీటరు పాలకు రూ. 29 చెల్లిస్తున్నారని, అదే ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఒక లీటరు పాలకు రూ. 36 ఇస్తున్నారని వివరించారు. కర్ణాటకలోనూ లీటరు పాలకు రూ. 36 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా నగరంలో పాడి రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తాలూకా విశ్వేశ్వర్య పాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పాడి రైతులు పాల్గొన్నారు. -
నేలపాలు
పాల సేకరణపై ఆవిన్ కోత పాడి రైతులకు తీరని వ్యథ 5 లక్షల లీటర్ల పాలు వృథా పాలసేకరణ పెంచాలని రైతుల డిమాండ్ పాల ఉత్పత్తి పెరిగినందుకు సంతోషించాల్సిన పాడి రైతు ఆవిన్ వైఖరితో ఉసూరుమంటున్నాడు. పాల సేకరణపై ఆవిన్ కోతలు పెట్టడంతో పాడిరైతుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. నిరసనగా పాలను నేలపాలు చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ప్రయివేటు డెయిరీలు పాలసేకరణ ధరను తగ్గించడంతో పాడి రైతులు ఆవిన్ వద్ద క్యూ కడుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాల వల్ల రైతులు పొలాన్ని వీడి పాడి పరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. ఆవిన్ సంస్థ సైతం పాల ఉత్పత్తిని పెంచేందుకు గతంలో అధికారులను రంగంలోకి దించింది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 30.20 లక్షల లీటర్లపాలు ఉత్పత్తి అవుతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సైతం పాల ఉత్పత్తి పెరిగింది. ఆయా రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చేరుకునే పాలశాతం కూడా పెరిగింది. దీంతో ఆవిన్ సంస్థ పాల సేకరణను 10 నుంచి 18 శాతం వరకు తగ్గించడం ప్రారంభించింది. ప్రతిరోజూ 25.12 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఆవిన్ సంస్థ కొనుగోలు చేస్తోంది. ఈ పరిణామంతో పాడిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆవిన్ తీరును ఖండిస్తూ సేలం, నామక్కల్, విళుపురం, వేలూరు జిల్లాల్లో పాడిరైతులు వేలాది లీటర్ల పాలను నడిరోడ్డులో పోసి నిరసన తెలియజేశారు. రాష్ట్రం మొత్తం మీద 30.20 లక్షల లీటర్లు ఉత్పత్తి అవుతుండగా 25.12 లక్షల లీటర్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. గత ఏడాది నవంబరు ఒకటో తేదీన పాల ధర లీటరుకు రూ.5 పెంచారు. పాల కొనుగోలును హెచ్చుశాతంలో చూపేందుకు ఉత్పత్తి దారులు ప్రయివేటు డెయిరీలకు సరఫరా చేసే పాలను అధికారుల ఒత్తిడి చేసి సేకరణ కేంద్రాలకు మళ్లించారు. దక్షిణాది జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పైరుతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. పాలతో ఇతర వస్తువులు తయారు చేయడం, నిల్వ చేసుకునేందుకు ఆవిన్ సంస్థలో సౌకర్యం లేదు. దీంతో పాల సేకరణను గణనీయంగా తగ్గించి వేస్తున్నారు. అనేక చోట్ల పాలసేకరణ వ్యాన్లను ఆవిన్ పంపడం మానేసింది. పాడి రైతులే తాముగా తెచ్చే పాలలో 15 శాతం వరకు తిరస్కరిస్తున్నారు. పాల నుంచి పాలపౌడర్, వెన్న తయారీతో ఆవిన్‌కు నష్టం వచ్చే అవకాశాలు అధికం కావడంతో ఆ దిశగా అధికారులు ఉత్సాహం చూపడం లేదు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పాలను మరింత కాలం భద్రం చేయగల సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఆయా రాష్ట్రాల పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటంలో సఫలీకృతులవుతున్నారు. తమిళనాడులో పాల ఉత్పత్తి 2011-12లో 21.40 లక్షల లీటర్లు కాగా, ప్రస్తుతం 30.20 లక్షల లీటర్లకు పెరిగింది. ఆ స్థాయిలో అమ్మకాలు పెరగలేదు. ఉత్పత్తి పెరిగిన నష్టాలు తప్పడం లేదు.. ఉత్పత్తి పెరిగిన ఆనందం ఒకవైపు ఉన్నా నష్టాలు చవిచూడాల్సి రావడం ఇబ్బందిగా ఉందని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్ అన్నారు. సేలంలో 5.52 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం 5.02 లక్షల లీటర్లుగా తగ్గించారని తెలిపారు. పాల సేకరణ గతఆర్థిక సంవత్సరంలో 5లక్షల లీటర్లకు చేరుకోగా అమ్మకాల్లో 12 వేల లీటర్లు మాత్రమే పెరిగింది. ఈ కారణంగా ఆవిన్ తరచూ నష్టాలను ఎదుర్కొంటోందని అన్నారు. నష్టాలను తగ్గించుకునేందుకు అవకాశాలను అన్వేషించకుండా సేకరణను తగ్గించుకుంటూ పోవడం వల్ల పాడిరైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు ఆవిన్ పాలను వినియోగించడం, పాల ఉత్పత్తుల సంఖ్యను పెంచడం ద్వారా పాడి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. -
పాడి రైతులకు గుర్తింపు కార్డులు
జహీరాబాద్ టౌన్: పాడి రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), జిల్లా ప్రత్యేకాధికారి పవన్ కుమార్ తెలిపారు. జహీరాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రంలో శనివారం నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను దాని వెనుక భాగం లో ముద్రించామని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని చెల్లిస్తోందన్నారు. దీనికోసం నిధులను కూడా మంజూరు చేసిందని చెప్పారు. లీడ్ బ్యాంక్ లీకేజీ ద్వా రా పాడి రైతులకు డైరీ యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ముందుగా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్‌లో యూనిట్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా (9493173769) నంబర్‌కు ఫోన్ చేయొచ్చని సూచించారు. జిల్లా డిప్యూటీ డైరక్టర్ కామేష్, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ శంకర్‌సింగ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షకార్యదర్శులు రాంరెడ్డి, మాణిక్‌రెడ్డి, సామల నర్సింలు పాల్గొన్నారు. -
పాడికి ఆధారం పచ్చిమేతే!
పాడి-పంట కడప అగ్రికల్చర్: పాడికి ఆధారం పచ్చిమేతే అన్నారు పెద్దలు. పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు. కేవలం చొప్ప పైన మాత్రమే ఆధారపడితే ప్రయోజనం ఉండ దు. పచ్చిమేత మేపితే పశువులు ఆరోగ్యంగా ఉంటా యి. సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అయితే ఒక్క వర్షాకాలం లో మినహా మిగిలిన అన్ని కాలాలలోనూ పాడి రైతులు తగినంత పశుగ్రాసం లభించక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి కారణం... పాడి పశువులకు కావాల్సిన పచ్చిమేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉండడం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రైతు లు విధిగా పశుగ్రాస పైర్లు వేసుకోవాలి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలు పశుగ్రాసాల సాగుకు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పచ్చిమేతల సాగుపై వైఎస్ఆర్ జిల్లా పశు గణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ హేమంత్ కుమార్ అందిస్తున్న సూచనలు... ఎలా ఉండాలి? మనం పండించే పశుగ్రాస పైరు రుచికరంగా, ఎక్కువ మాంసకృత్తులను కలిగి ఉండాలి. పశువులకు ఏ మాత్రం హాని కలిగించకుం డా, సులభంగా జీర్ణం కావాలి. తక్కువ కాలంలో, ఎక్కువ దిగుబడిని ఇవ్వగలగాలి. ఎరువుల అవసరం తక్కువ ఉండే పశుగ్రాసాన్ని ఎంచుకోవాలి. కోసిన తర్వాత నిల్వకు అనువుగా ఉండాలి. పశుగ్రాసాలు రెండు రకాలు. అవి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, కాయ జాతి పశుగ్రాసాలు. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు, కాయ జాతి పశుగ్రాసాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పంటకాలాన్ని బట్టి పశుగ్రాసాలను ఏక వార్షికాలు, బహు వార్షికాలుగా విభజించారు. రైతులు తమకు అనువైన పశుగ్రాసాన్ని ఎంచుకొని సాగు చేయాలి. ఇవి ధాన్యపు జాతి పచ్చిమేతలు మొక్కజొన్న, సజ్జ వంటివి ధాన్యపు జాతికి చెందిన ఏక వార్షిక పచ్చిమేతలు. మొక్కజొన్న పైరు రుచికరంగా, ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఎకరానికి 16-20 కిలోల విత్తనాలు వేసుకుంటే 70 రోజులకు 12-16 టన్నుల గ్రాసాన్ని ఇస్తుంది. అధిక పాల ఉత్పత్తి పొందడానికి, సైలేజీ (పాతర గడ్డి)కి బాగా అనువుగా ఉంటుంది. సజ్జను పశుగ్రాసంగా సాగు చేయాలనుకుంటే ఎకరానికి 5 కిలోల విత్తనాలు కావాలి. ఇందులో అలసంద, పిల్లిపెసరను కూడా మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. ఈ పైరు 40 రోజులలో కోతకు వస్తుంది. 10-12 టన్నుల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడులను అందిస్తుంది. కాయ జాతి పచ్చిమేతలు ఇవే పిల్లిపెసర, లూసర్న్ గడ్డి, అలసంద వంటివి కాయ జాతి పచ్చిమేతలు. పిల్లిపెసర సాగుకు ఎకరానికి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఇది బలవర్ధకమైన పశుగ్రాసం. పాల దిగుబడి బాగుంటుంది. 50 రోజులకు ఒకసారి చొప్పున రెండు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల పచ్చిమేత వస్తుంది.లూసర్న్ గడ్డి మొక్క 80 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఎకరానికి 3-5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 50 రోజులకు ఒకసారి చొప్పున ఐదు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక అలసంద మొక్కలోని అన్ని భాగాలూ పశువులు తినడానికి ఉపయోగపడేవే. ఎకరానికి 12-15 కిలోల విత్తనాలు వేసుకుంటే 65 రోజుల్లో కోతకు వచ్చి 6-8 టన్నుల గ్రాసాన్ని అందిస్తుంది. మిశ్రమ పంటగా వేస్తే 6 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇవి కూడా... మెట్ట/బంజరు భూములకు అనువైన పశుగ్రాసం అంజన్ గడ్డి. ఇది నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఎకరానికి 2- 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. పైరు వేసిన 80 రోజులకు మొ దటి కోత కోసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి 60 రోజులకూ పచ్చిమేతను పొందవచ్చు. ఈ పైరు 15-20 టన్నుల పచ్చిమేతను అం దిస్తుంది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైన పశుగ్రాసపు చెట్టు అవిశ. దీని ఆకులు, కొమ్మలు పశువులకు మంచి పోషకాల తో కూడిన ఆహారాన్ని ఇస్తాయి. ఎకరానికి 5 వేల మొక్కలు నాటా లి. 60 రోజులకు ఒకసారి చొప్పున 8 సార్లు ఆకులు, కొమ్మలు కోసుకోవచ్చు. ఎకరానికి 15-20 టన్నుల దిగుబడి లభిస్తుంది. ఇక సుబాబుల్ చెట్టు ఆకులే కాకుండా కొమ్మలను కూడా పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరానికి 2-4 వేల మొక్కలు వేసుకోవాలి. ఆరు నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. అనంతరం 60 రోజులకు ఒకసారి చొప్పున 6 కోతలు కోసుకోవచ్చు. 15-20 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ పశుగ్రాసమైనా దానిని ఛాప్ కట్టర్‌తో చిన్న చిన్న ముక్కలుగా కోసి పశువులకు వేస్తే వృథా కాదు. పచ్చిమేతపై కొద్దిగా బెల్లపు నీటిని చల్లితే పశువులు ఇష్టంగా తింటాయి. -
డెయిరీకి లాభాలు... మాకు నష్టాలా?
రైతుల కష్టంతో కల్యాణమండపాలా? ఎంత పాలు పోసినా గిట్టుబాటు కాదు విశాఖ డెయిరీ డెరైక్టర్‌పై పాడి రైతుల ధ్వజం అచ్యుతాపురం : వెన్న తీసిన పాలను విశాఖ డెయిరీ లీటరు రూ.40కి అమ్ముకుంటుంది. మాకు మాత్రం వెన్నశాతం తక్కువన్న సాకుతో లీటరుకు రూ.15 ఇస్తుంది. లీటరు నీళ్లు బయట రూ.20కి అమ్ముతున్నారు. మేము సరఫరా చేసిన పాలు నీళ్ల పాటి చేయలేదా? మీరు చెప్పేవన్నీ రైతుల కోసం కాదు... డెయిరీ బాగుపడేందుకే’... అంటూ పాడి రైతులు విశాఖ డెయిరీ డెరైక్టర్ పిళ్లా రమాకుమారిపై మండిపడ్డారు. తిమ్మరాజుపేట పాల కేంద్రంలో బుధవారం 138 మంది రైతులకు రూ.2లక్షల 45,982 ఏరువాక బోనస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు కల్పించుకుని ఎన్ని పాలు పోసినా తమకు లాభాలు రావడం లేదని ఆరోపించారు. పశువులను పోషించి పాలు సరఫరా చేస్తే తమకు ఏమీ దక్కడం లేదని అసహనం వ్యక్తం చేసారు. లీటరు పాలకు రూపాయి పెంచి దాణా బస్తా ధరను రూ.50కి పెంచారన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే డెయిరీకి వచ్చిన లాభాలను కల్యాణమండపాలు, వంతెనల నిర్మాణానికి కేటాయించడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ప్రయివేటు డెయిరీల నుంచి పాల ఉత్పత్తిదారులను ఆకట్టుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కుగా అభివర్ణించారు. వెన్నశాతం తీయడంలోను పలు అనుమానాలు ఉన్నాయని రైతులు తెలిపారు. రైతుల ఆరోపణలకు రమాకుమారి సమాధానమిస్తూ వెన్నశాతంలో అనుమానాలను తొల గించడానికి లేజర్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. పాలను వేరుచేసి వెన్న శాతంలో లోపాల్లేకుండా చూసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, పీలా తులసీరాం, సత్యారావు పాల్గొన్నారు. -
పశువుల ఆస్పత్రుల్లో వైద్యుల కొరత
పాడి రైతులకు తప్పని తిప్పలు 22 ఆస్పత్రులు అప్‌గ్రేడైనా ఫలితం శూన్యం జిల్లాలో 39వైద్యుల పోస్టులు ఖాళీ గుడ్లవల్లేరు : పశువుల ఆస్పత్రులలో చాలినంతమంది వైద్యులు లేకపోవడంతో పాడిరైతులు అవస్థలు పడుతున్నారు. కాగా కొన్ని ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పశువులకు వైద్యం చేయడానికి వీల్లేక వైద్యులు సమస్యలెదుర్కొంటున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 212 పశువుల ఆసుపత్రులు ఉండగా, వాటిలో 92 ఆస్పత్రులకే వైద్యులు ఉన్నారు. మిగిలిన వాటిలో వైద్య సిబ్బందే ఇప్పటివరకూ వైద్యం అందిస్తూ వచ్చారు. మొత్తం 114మంది వైద్యులు ఉం డాల్సి ఉండగా 39 ఖాళీలున్నాయి. కాగా ఇటీవల పశు వైద్య సహాయకులకు పదోన్నతులు రావడంతో 90 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పశువులకు సకాలంలో వైద్యం అందక చనిపోతున్నాయని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఆసుపత్రుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వం జిల్లాలో 22ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసింది. కాగా అందుకు తగినట్లుగా వైద్యులను నియమిం చడం కానీ, భవనాలు నిర్మిం చడం కానీ జరగలేదు. కేవలం నాలుగు ఆస్పత్రులకు మాత్రమే వైద్యులను నియమించారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటని పాడిరైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన చోట కొత్త భవనాలను నిర్మించేందుకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చటం లేదు. గోపాల మిత్ర భవనాలతో పాటు 80 గ్రామీణ పశు వైద్యశాలల నిర్మాణాలకు రూ.5.03కోట్లను కేటాయించినా పనులు పూర్తి స్థాయిలో జరగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలోని ఆస్పత్రిలో చాలా కాలం నుంచి వైద్యుడు లేకుండానే సిబ్బందే పశువులకు వైద్యం అందిస్తున్నారని రైతుక్లబ్ కన్వీనర్ పెన్నేరు ప్రభాకర్ తెలిపారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసినా డాక్టరూ రాలేదు. కొత్త భవనం నిర్మించ లేదని చెప్పారు. విన్నకోటలో పశువుల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేయడంతో పాలకేంద్రం ఆవరణలో పశువులకు వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. జిల్లాలో పశువుల వైద్యులు, వైద్య సహాయకుల కొరత ఉన్నమాట వాస్తవమేనని జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ టి.దామోదరనాయుడు అంగీకరించారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో అప్‌గ్రేడైన 22 ఆస్పత్రుల్లో కొన్నింటికి భవనాలను నిర్మించాల్సి ఉందని, టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని వివరించారు. -
పాలిహౌస్‌లో పచ్చిమేత!
150 చదరపు అడుగుల్లోనే 10 పశువులకు గడ్డి సాగు పాలకు పచ్చిమేతకు అవినాభావ సంబంధం ఉంది. పాల దిగుబడి బాగుండాలంటే పాడి పశువులకు రోజూ పచ్చిమేత మేపాల్సిందే. ముఖ్యంగా వేసవిలో పచ్చిమేత అవసరం మరీ ఎక్కువ. పచ్చిమేతను ఏడాది పొడవునా సమకూర్చుకునే క్రమంలో పాడి రైతులు ఎన్నో వ్యయ ప్రయాసల పాలవుతుంటారు. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కించే మార్గం వెదికే కృషిలో ఓ యువ పాడి రైతు సఫలీకృతుడయ్యాడు. అతి తక్కువ స్థలంలో, తక్కువ నీటితో నాణ్యమైన సేంద్రియ పశుగ్రాసాన్ని.. ఏడాది పొడవునా, సులభంగా పెంచవచ్చని నిరూపిస్తున్నారు నలమాటి రామారావు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద వాస్తవ్యులైన రామారావు ఆధునిక హైడ్రోపోనిక్ పద్ధతికి తన వినూత్న ఆలోచనను జోడించి.. చిన్న రైతులకు అనుసరణీయమైన రీతిలో సులభంగా పశుగ్రాసం సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎమ్మెస్సీ ఎనలిటిక్ కెమిస్ట్రీ చదివి డెయిరీ ఫారం నిర్వహిస్తున్న క్రమంలో ఎదురైన ఇబ్బందులే ఆయనను పశుగ్రాసం సాగులో ప్రయోగాల దిశగా అడుగులు వేయించాయి. పాడి పశువులతోపాటు మేకలు, గొర్రెలకూ వేయొచ్చు.. స్వగ్రామంలోనే రామారావు 30 పశువులతో డెయిరీ ఫారాన్ని నిర్వహిస్తున్నారు. పచ్చిమేత కోసం గతంలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసం పెంచేవారు. కూలీల కొరత, నీటి కొరత.. ఒకటేమిటి నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రారంభించిన అన్వేషణలో ఇంటర్నెట్ ద్వారా ‘హైడ్రోపోనిక్’ విధానం గురించి తెలుసుకున్నారు. దీనికి స్వదేశీ సాంకేతికతను జోడించి ప్రయోగాలు చేశారు. ఆయన కృషి చక్కని ఫలితాలనిచ్చింది. పిడికెడు కూడా మట్టి అవసరం లేకుండా, ఎరువుల ఖర్చు లేకుండా, తక్కువ నీటితో ట్రేలలో నాణ్యమైన సేంద్రియ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు రామారావు. వరి, మొక్కజొన్న, గోధుమ, సజ్జ, రాగులు, పిల్లి పెసర, అలసంద, శనగ తదితర పది రకాల ధాన్యపు జాతి, గడ్డి జాతి పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. పాడి పశువులతో పాటు మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి పశువులకూ ఇలా పెంచిన పచ్చిమేతను మేపుకోవచ్చనేది ఆయన భావన. ప్రత్యేక ప్లాస్టిక్ ట్రేలలోనే పెంచాలి! రామారావు సొంత మేడపైన 275 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలిహౌస్‌ను ఏర్పాటు చేసుకొని పశుగ్రాసం సాగు చేస్తున్నారు. ఇనుప ర్యాక్‌లలో యూవీ స్టెరిలైజ్డ్ మెటీరియల్‌తో తయారు చేసిన ప్రత్యేక బ్యాక్టీరియా రహిత ట్రేలను ఏర్పాటు చేశారు. విత్తనాలను రెండు రోజులు నీటిలో నానబెట్టి, మొలకలు వచ్చిన తర్వాత ట్రేలలో నింపుతున్నారు. తగిన ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడల్లా సూక్ష్మపోషకాలతో కూడిన ప్రత్యేక ద్రావణాన్ని కలిపిన నీటిని పిచికారీ చేసేలా ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. రామారావే స్వయంగా ఈ ద్రావణాన్ని తయారు చేశారు. దీంతో, వారం రోజుల్లో నవనవలాడే పచ్చని పశుగ్రాసం పెరుగుతోంది. ఈ పద్ధతిలో పచ్చిగడ్డిని పాలిహౌస్లోనే పెంచాలనేమీ లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రేకుల షెడ్లలోనూ పెంచుకోవచ్చని రామారావు చెబుతున్నారు. ఒకటి నుంచి ఎన్ని ఎక్కువ పాడి పశువులున్న రైతులకైనా ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. సాధారణ పచ్చిమేతలో ఉండే పోషకాల కన్నా ఈ విధానంలో పెంచిన పచ్చిగడ్డిలో అధిక పోషక విలువలున్నట్టు తమ లేబరేటరీ పరీక్షల్లో తేలిందన్నారు. పశుగ్రాసం పెంచుతున్న పాలిహౌస్‌ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డా. డి.వెంకటేశ్వర్లు, పాడి పరిశ్రమ ప్రముఖులు ఇటీవల పరిశీలించి రామారావును అభినందించడం విశేషం. - పెనుబోతుల విజయకుమార్, న్యూస్‌లైన్, మండపేట, తూ.గో. జిల్లా 20% వరకు పెరిగిన పాల దిగుబడి - మేడపైన లోకాస్ట్ పాలిహౌస్‌లో హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చిగడ్డి సాగుకు శ్రీకారం - తేమ, ఉష్ణోగ్రతను బట్టి నీటిని పిచికారీ చేసే - ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పాటు - పొలం, ఎరువులు అక్కర్లేదు.. 50 పశువులకు ఒక కూలీ చాలు! నిరంతరాయంగా పచ్చిగడ్డి సాగుకు అనువైన పద్ధతి పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసమే ఈ ప్రయోగం చేపట్టి, రెండున్నరేళ్ల తర్వాత విజయం సాధించా. పోషకాలతో కూడిన పచ్చిగడ్డిని ట్రేలలో పెంచేందుకు సూక్ష్మపోషకాలతో కూడిన ప్రత్యేక ద్రావణాన్ని రూపొందించా. పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నా. 4 నెలలుగా ఈ పచ్చిగడ్డినే మా పశువులకు మేపుతున్నాం. పాల దిగుబడి గేదెల్లో 12%, ఆవుల్లో 20% పెరిగింది. గేదె పాలలో వెన్న 15% పెరిగింది. ఎటువంటి రసాయనాలూ వాడకుండా పూర్తిగా సేంద్రియంగా, ఏడాది పొడవునా నిరంతరాయంగా పశుగ్రాసం సాగుకు ఇది అనువైన పద్ధతి. - నలమాటి రామారావు(85199 90000), ఏడిద, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం.. పశుగ్రాసాల పెంపకానికి స్థలం, తగిన వసతి లేని చోట ప్రత్యామ్నాయంగా ఈ విధానం ఎంతో ఉత్తమం. ఉత్పత్తి వ్యయాన్ని ఇంకా తగ్గించగలిగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. - కె.గాబ్రియేల్, ప్రిన్సిపాల్, పశుసంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం, మండపేట ఇవీ ప్రత్యేకతలు...! పాలిచ్చే పశువుకు రోజుకు 30 కేజీల సాధారణ పచ్చిగడ్డి అవసరం. హైడ్రోపోనిక్ పద్ధతిలో పెంచిన పచ్చిమేత 10 కిలోలు చాలు. దీన్ని 20 కేజీలు వేస్తే ఇక దాణా అక్కర్లేదు. అయితే, ఎలా పెంచిన పచ్చిగడ్డి వేసినా.. ప్రతి పశువుకు రోజుకు 6 కిలోల ఎండుగడ్డి కూడా వేయడం అవసరం. - 10 పాడి పశువులకు సరిపోయే పచ్చిగడ్డి పెంచడానికి సాధారణంగా ఎకరం పొలం అవసరం. ఈ పద్ధతిలో 150 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. - ఒక్కో పాడి పశువుకు పొలంలో పచ్చిగడ్డి సాగుకు రూ. 110-150 ఖర్చవుతుంది. ఈ పద్ధతిలో రూ. 70-90 ఖర్చవుతుంది. - పొలంలో కిలో పచ్చిగడ్డి సాగుకు 80 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ఈ పద్ధతిలో రెండు లీటర్లు చాలు. - 10 పశువులకు పొలంలో గడ్డి కోసి వేయడానికి ఒక కూలీ అవసరం. ఈ పద్ధతిలో 50 పశువులకు ఒక కూలీ చాలు. - హైడ్రోపోనిక్ పద్ధతిలో గడ్డి సాగుకు పొలం అవసరం లేదు. కాబట్టి రైతుకు కౌలు మిగులుతుంది. - ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. కానీ, ట్రేలలో కిలో పచ్చిమేత ఉత్పత్తికి రూపాయి ఖరీదైన సూక్ష్మపోషకాల ద్రావణం వాడాల్సి ఉంటుంది. కేజీ పశుగ్రాసం ఉత్పత్తికి రూ. 5 నుంచి 7లు ఖర్చవుతాయి. - పొలంలో గడ్డి కోసిన తర్వాత మళ్లీ పెరగడానికి 45 రోజులు పడుతుంది. ఈ పద్ధతిలో గింజలు వేసిన వారం రోజుల్లో పశుగ్రాసం అందుతుంది. - 1, 2 పాడి పశువుల కోసమైతే రేకుల షెడ్డు లేదా ఒక గదిలో ఇనుప ర్యాక్‌లు ఏర్పాటు చేసి హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చిగడ్డి పెంచుకోవచ్చు. - పాలీహౌస్లో 10 పశువులకు సరిపోయే పచ్చిగడ్డి సాగు ప్రారంభానికి రూ. 2.2 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. 50 పశువులకు సరిపోయే పచ్చిగడ్డి సాగు ప్రారంభానికి రూ. 9 లక్షలు ఖర్చవుతాయి. తదనంతరం గింజలు, విద్యుత్తు, సూక్ష్మపోషకాల ద్రావణం ఖర్చు మాత్రమే. - ఈ పద్ధతిలో మొక్కజొన్నలతో పచ్చిగడ్డి సాగు రైతుకు అన్ని విధాలా అనుకూలం. ఒక పాడి పశువుకు (దాణా లేకుండా) రోజూ 20 కిలోల పచ్చిగడ్డి వేయాలనుకుంటే.. 5 కిలోల మొక్కజొన్నలు అవసరమవుతాయి. ట్రేలలో పచ్చిగడ్డిని పరిశీలిస్తున్న డా. డి.వెంకటేశ్వర్లు, తదితరులు -
‘డెయిరీ’... ఆదుకునే వారేరీ
గజ్వేల్, న్యూస్‌లైన్: వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా చెప్పుకునే ‘డెయిరీ’ సంక్షోభంలో చిక్కుకుంది. పాలు దిగుబడి భారీగా పెరిగినా, కొనేవారు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రైతుకు వెన్నదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ ఏపీ డెయిరీ.. టార్గెట్ దాటిపోయిందనే సాకుతో పాలను కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. ఇదే అదునుగా ప్రైవేట్ సంస్థలు పాలధరను భారీగా తగ్గించమేకాకుండా కొనుగోళ్లను సైతం తగ్గించుకున్నాయి. మరోవైపు నాబార్డు అధ్వర్యంలో డెయిరీ పథకాలకు ప్రతిఏటా ఇచ్చే సబ్సిడీకి సర్కార్ మంగళం పాడింది. పశువులకు బీమా సైతం దక్కని పరిస్థితు నెలకొన్నాయి. దీంతో ఉత్పత్తి వ్యయానికి..అందుతున్న రొక్కానికి వ్యత్యాసం భారీగా ఉండడంతో చాలా మంది డెయిరీలను మూసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2012 అక్టోబర్ 29న తూప్రాన్‌లో ‘ఇందిరమ్మ బాట’లో భాగంగా తూప్రాన్‌లో పర్యటించిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాడిరైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ కూడా నీటి మూటగానే మిగిలిపోవడంతో పాడిపరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోయింది. మెదక్ జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమ రెండో అతిపెద్ద పరిశ్రమగా ఆవిర్భవించింది. జిల్లావ్యాప్తంగా లక్ష మందికిపైగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు పశుసంవర్దక శాఖ గుర్తించింది. మూడేళ్ల కిందట జిల్లావ్యాప్తంగా రోజుకు 50 వేల లీటర్ల పాల సేకరణ గగనం కాగా, ఏడాది క్రితం అది ఒక్కసారిగా రెండు లక్షలకుపైగా పెరిగింది. ఈ లెక్కన నిత్యం రూ.4 నుంచి రూ.5 కోట్లకు పైగా పాల వ్యాపారం సాగింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పరిశ్రమ నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. పాల ఉత్పత్తులు పెంచడంతోపాటు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి గిట్టుబాటు ధర అందిస్తామంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం, చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాది కిందట రైతులు ఉత్పత్తి చేసిన 2 లక్షల లీటర్లలో కేవలం 70వేల లీటర్లే కొనుగోలు చేసిన ఏపీ డెయిరీ టార్గెట్ దాటిపోయిందనే కారణంతో కొనుగోళ్లను నిలిపివేసింది. మరోవైపు హెరిటేజ్, తిరుమల, జెర్సీ, ప్రియ తదితర కంపెనీలు రైతుల ద్వారా 1.3 లక్షల లీటర్లు కొనుగోలు చేశాయి. ఈ సంస్థలు కూడా ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయనే కారణంతో కొనుగోళ్లను తగ్గించుకున్నాయి. అంతేకాకుండా ఆవుపాల ధరను(4 శాతం ఫ్యాట్) 2012లో రూ. 20 నుంచి 22వరకు ఉండగా, 2013లో రూ.14 నుంచి 15కు తగ్గించాయి. ఈ పరిణామంతో తీవ్ర నష్టాల్లో చిక్కుకున్న రైతులు జిల్లాలోని డెయిరీ ఫారాలన్నింటినీ ఎత్తేశారు. ఒక్కసారిగా పాల ఉత్పత్తి తగ్గడంతో స్పందించిన అధికారులు ప్రస్తుతం ఆవు పాల ధర రూ.22 పెంచారు. కానీ డెయిరీ ఫారమ్‌లో నిర్వహణలో దాణా, మందులు ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల లీటర ధర రూ.30 ఇస్తేగానీ రైతులకు గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో పాలధర పెరిగినా రైతులకు నష్టాలే మిగిలాయి. నాబార్డు సబ్సిడీకి మంగళం.... డెయిరీ పథకాలకు నాబార్డు ద్వారా భారీగా సబ్సిడీని అందించేవారు. రూ.5 లక్షల యూనిట్‌కు గతంలో 1.25 లక్షల వరకు సబ్సిడీ వర్తించేది. గత రెండేళ్లుగా జిల్లాలో ఈ సబ్సిడీ రైతులకు వర్తించడం లేదు. మరోపక్క డెయిరీ పథకాలకు రుణాలివ్వడానికి బ్యాంకర్లు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇక బీమా కూడా అందకపోవడం పాడిరైతులకు గుదిబండగా మారింది. బ్యాంకు లింకేజీ ద్వారా పశువులను కొనుగోలు చేసే రైతులకు ఒక్కో దానికి గరిష్టంగా రూ.35 వేల బీమాను అందజేస్తున్నారు. పశువుల ధర రూ.70 వేలు అంతకుపైగా పలికినా పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం రూ. 35వేలకే బీమాను పరిమితం చేస్తున్నారు. ఇక రైతులు సొంతంగా కొనుగోలు చేసుకునే పశువులకు బీమా పథకం వర్తించడం లేదు. ఇదీ ఉదాహరణ... గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన పాలేటి నర్సింహారావు 2012 ఏప్రిల్‌లో రూ.6 లక్షలకుపైగా వ్యయం చేసి తన పొలంలో షెడ్‌ను నిర్మించుకున్నాడు. అంతేకాకుండా మరో రూ.7 లక్షలకుపైగా వ్యయంతో బెంగుళూరు నుంచి పది సంకరజాతి ఆవులను తెచ్చుకున్నాడు. వీటి కోసం రుణం అందించాలని రెండేళ్లుగా గజ్వేల్‌లోని ఎస్బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా బ్యాంకర్లు స్పందించలేదు. చివరకు సొంత డబ్బుతోనే షెడ్ నిర్మాణం, ఆవుల కొనుగోళ్లు చేపట్టాడు. తనకు సాయంగా బీహార్‌కు చెందిన ఇద్దరిని నియమించుకుని ఐదు నెలలపాటు డెయిరీని నిర్వహించాడు. 2102 ఆగస్టు నుంచి సంక్షోభం ఏర్పడిన కారణంగా పాల ధర విపరీతంగా తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, చాలా సందర్భాల్లో పాలు కొనే నాథుడే కరువవడంతో ఆదాయం మాటేమోగానీ నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో పది పశువులను రూ.3 లక్షల నష్టానికి అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం షెడ్ అతని పొలంలో వృథాగా మిగిలిపోయింది. నెరవేరని ‘ఇందిరమ్మ బాట’ హామీలు.... 2012 అక్టోబర్‌లో 29 నుంచి జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ బాటలో డెయిరీ రైతులు తమ ఇబ్బందులను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సబ్సిడీలు, బీమా వర్తింపుపై విజ్ఞప్తి చేశారు. దీనిపై కిరణ్‌కుమార్‌రెడ్డి సభాముఖంగా హామీ ఇచ్చారు. కానీ హామీలు నెరవేరలేదు. -
పాడిరైతులకు అండగా మదర్ డెయిరీ
పరిగి, న్యూస్‌లైన్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ చేపట్టిన రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తూ, మంచి ధర చెల్లిస్తూ మదర్ డెయిరీ అండగా నిలుస్తోందని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (నార్మాక్స్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పాల శీతలీకరణ కేంద్రం అతిథి గృహంలో నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పాడి రైతుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పాల విక్రయ మార్కెట్లో మదర్ డెయిరీ లేకుంటే ప్రైవేట్ డెయిరీల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని పేర్కొన్నారు. మూసివేయించేందుకు ప్రైవేట్ డెయిరీల కుట్ర: నార్మాక్స్ చైర్మన్ జితేందర్ రెడ్డి మదర్ డెయిరీకి నష్టాలు కల్గించి మూసివేయించాలని ప్రైవేటు డెయిరీలు కుట్రలు చేస్తున్నాయని నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఆరోపించారు. పాడి రైతులకు అధిక ధర ఆశ చూపించి తమవైపు తిప్పుకుంటున్న ప్రైవేట్ డెయిరీలు చివరకు వారిని మోసం చేస్తున్నాయన్నారు. గతంలో మదర్ డెయిరీ ద్వారా 2.25లక్షల లీటర్ల పాలు సేకరించేవారమని, ప్రైవేటు డెయిరీల కుట్రలతో ఇప్పుడు అది సగానికి పడిపోయిందన్నారు. ఏదేమైనా రైతుకు మంచి ధర, వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించే లక్ష్యంతోనే మదర్ డెయిరీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఆవు పాలపై లీటర్‌కు రూ.1.50పైసలు, గేదె పాలపై లీటర్‌కు రూ.2అదనంగా ఇన్సెంటివ్ చెల్లిస్తున్నామన్నారు. గత సీజన్లో లీటర్‌కు రూ.1 చొప్పున రైతుల నుంచి కట్ చేసిన డబ్బులు రూ.2.16 కోట్లు ఇప్పుడు తిరిగి వారికి చెల్లిస్తున్నామని తెలిపారు. అదే ప్రైవేట్ డెయిరీలు లీటర్‌కు రూ.5చొప్పున కట్ చేసి, వాటిని రైతులకు తిరిగి ఇవ్వకుండా తమవద్దే ఉంచుకున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోందని, అలాగే మన రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆవుపాలపై ప్రచారం జరగాలి: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఎన్నో పోషక విలువలున్న ఆవుపాలను వ్యాపార దృక్కోణంలో చిన్నచూపు చూడటం తగదని ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు. ఎంతో ఔషధగుణాలు ఆవు పాలలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే... డెయిరీలు మాత్రం ఫ్యాట్ తక్కువగా వస్తుందనే కారణంతో తక్కువ ధర చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పాల ప్రాముఖ్యతపై ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని, మదర్ డెయిరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. సమావేశంలో భాగంగా గత పాల ఉత్పత్తి సీజన్లో రైతుల నుంచి మదర్ డెయిరీ కట్ చేసిన డబ్బులను తిరిగి రైతులకు అందజేశారు. అనంతరం సహకార సంఘంలో సభ్యులైన రైతుల పిల్లల్లో పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్లు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ డెరైక్టర్ మేడిద రాజేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.పి.బాబయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేందర్‌కుమార్, నార్మాక్స్ ఎండీ సురేష్‌బాబు, డీజీఎంలు విజేందర్‌రెడ్డి, రమేష్, పరిగి కేంద్రం మేనేజర్ రవీందర్ పాల్గొన్నారు. -
పాడిరైతుకు టోపీ
తదితర ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్నారు. విజయ డెయిరీ జిల్లా వ్యాప్తంగా 150 సహకార సంఘాల పరిధిలో 420 పైగా ఉన్న కేంద్రాల ద్వారా పాలసేకరణ చేస్తోంది. వీటితో పాటు మరో 500 ప్రైవేటు కేంద్రాల ద్వారా పాలసేకరణ జరుగుతోంది. పాడి రైతుల ద్వారా జిల్లాలో ప్రతి రోజూ 1.50 లక్షల లీటర్ల వరకు పాలు సేకరిస్తున్నారు. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, గతేడాది పాలసేకరణలో తలెత్తిన ఇబ్బందుల పరంపరలో చాలామంది పాడిరైతులు గేదెల్ని అమ్మేశారు. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా పాలకు మద్దతు ధర దక్కకపోవడంతో పాటు పాలసేకరణ హాలీడేలు ప్రకటించడంతో అనేక మంది రైతులు ఈ ఏడాది గేదెల పెంపకంపై నిరాసక్తత చూపారు. కాని ఈ ఏడాది ఊహించని విధంగా పాలకు డిమాండ్ ఏర్పడింది. కనీసం జిల్లా అవసరాలకు కూడా సరిపడా పాలు లభ్యం కాలేదు. ప్రైవేటు డెయిరీలు ఉత్పత్తిదారులకు మొండిచెయ్యి చూపించినా ఏజెంట్లకు మాత్రం భారీగా తాయిలాలు ఎరవేసి పాల సేకరణ పెద్దగా పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాని విజయ డెయిరీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో సేకరణ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పాడి రైతులకిచ్చే పాల ధరను పెంచి తమ అవసరాలకు అనుగుణంగా పాల సేకరణ చేయాల్సిన విజయ డెయిరీ ప్రైవేటు డెయిరీలతో కుమ్మక్కై ఉత్పత్తిదారులకిచ్చే ధరను మాత్రం పెంచడం లేదు. ప్రైవేటు డెయిరీలు మాత్రం తమ మార్కెట్ దెబ్బతినకుండా కాపాడుకుంటుండగా, విజయ డెయిరీకి మాత్రం మార్కెట్లో ఇబ్బంది తప్పలేదు. విజయ డెయిరీకి చెందిన పాలసేకరణ ఏజెంట్లు, సహకార సంఘాల అధ్యక్షులు ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నా డెయిరీ పాలకవర్గం పట్టించుకున్న పరిస్థితులు కనిపించలేదు. రోజుకు రూ.4.50 లక్షలు కోల్పోతున్న రైతులు జిల్లాలోని విజయ డెయిరీ తీరు కారణంగా రైతులు రోజుకు సగటున రూ.4.50 లక్షలు నష్టపోతున్నారు. పొరుగున ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని విజయ డెయిరీ ఈ నెల 11వ తేదీ నుంచే పాడి రైతులకిచ్చే ధరను గణనీయంగా పెంచింది. లీటరు రూ.46 నుంచి ఒక్కసారిగా రూ.49కి పెంచింది. ఆ జిల్లాల్లో ప్రైవేటు డెయిరీలు కూడా ధరను పెంచాయి. జిల్లాలో మాత్రం ప్రస్తుతం లీటరు రూ.46 మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాలో కూడా విజయ డెయిరీ పాల సేకరణ ధరను పెంచి ఉంచి ప్రైవేట్ డెయిరీలు కూడా పెంచేవి. తద్వారా రైతులకు లీటరుకు మూడు రూపాయల వంతున ప్రయోజనం దక్కేది. కొనుగోలుదారులకు పెరిగిన ధర జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు డెయిరీలన్నీ తాము అమ్మే పాల ధరను లీటరు రూ.2 పెంచాయి. విజయ డెయిరీ కూడా నేడో.. రేపే ధరను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో ప్రజలకు అమ్మే పాలపై ధరను పెంచిన డెయిరీలు మాత్రం ఉత్పత్తిదారులకు పెంచేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. పాలసేకరణ ధరను పెంచాలి ప్రస్తుతం కరువొచ్చింది. పశువులకు మేత, నీళ్లు దొరకడం కట్టంగా మారింది. దీనికి తోడు దాణా ధరలు కూడా బాగా పెరిగాయి. పాలకు మాత్రం ధర పెరగలేదు. గేదలు పోషించడం కష్టంగా మారింది. డెయిరీలో ధర పెంచకపోతే నష్టాలు తప్పవు. నాగిరెడ్డి, పాడి రైతు రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఇటీవలే రైతులకిచ్చే పాల ధరను రూ.2 పెంచాం. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో మళ్లీ ఇప్పుడే పెంచాలంటే ఇబ్బందిగా ఉంది. వీలైనంత వరకు రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేస్తున్నాం. పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రజలకు తాము విక్రయించే పాలధరను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం. కృష్ణమోహన్, జీఎం, విజయ డెయిరీ