రాయచోటిటౌన్: సుమారు రెండు నెలలకుపైగా అంటే నాలుగు బిల్లులు ఇవ్వలేదని దీంతో తమ కాపురాలు నడవడం కష్టంగా మారిందని పాడి రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం రాయచోటి విజయా పాలడెయిరీకి పాలు పోసే రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విజయా పాల డెయిరీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి 15రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను అడిగినా వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు వస్తున్నాయని తెలిపారు.
విజయా డెయిరీ యజమాన్యానికి వ్యతిరేకంగా పా లక్యాన్‌లు తెచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపై పారబోసి తమ నిరసను వ్యక్త పరిచారు. అలాగే గ్రామాల్లో పాలు కొలిచే ఏజెంట్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. నాలుగు బిల్లుల నుంచి డ బ్బులు చెల్లించడం లేదని,రైతులకుఏం సమాధానం చెప్పాలో తెలియక తాము తీవ్ర వత్తిడి గురవుతున్నామని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు సకాలంలో బిల్లులు వచ్చే విధంగా చేయాలని తహసీల్దార్ దా మోదర్‌రెడ్డికి రైతులు వినతిపత్రాని సమర్పించారు.
పాల బిల్లు ఇవ్వలేదని ధర్నా
Published Tue, Jun 21 2016 8:47 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement