Milk bills
-
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ నెయ్యి
లాలాపేట (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన నెయ్యిని విజయ డెయిరీ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) నూతన చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్‌కు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేయాలని ఆయన సూచించారు.పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో పెండింగ్ పాల బిల్లులను త్వరలో చెల్లించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం లాలాపేటలోని విజయ భవన్లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను ఆదరించి తెలంగాణ రాష్ట్ర పాడి రైతులను, పాడిపరిశ్రమను బలపరచాలనీ కోరారు. పాల సేకరణ ధరను మూడు పర్యాయాలు పెంచాం రాష్ట్రంలోని 32 జిల్లాలోని 40,445 పాడి రైతుల నుంచి 6,148 పాల సేకరణ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెపె్టంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడాలేని విధంగా 3 పర్యాయాలు రూ. 12.48 పైసలు పెంచామన్నారు. దీంతో పాల సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు.అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను తక్కువ ధరకు రూ. 26 నుంచి రూ. 34లకే కొని ఇక్కడ తక్కువ ధరకు అమ్మకాలు చేపట్టాయని, దీంతో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. అందుకే పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. -
పాల బిల్లుల కోసం రోడ్డెక్కిన పాడి రైతులు
- హిందూపురంలో భారీ ర్యాలీ, రాస్తారోకో -హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేస్తున్నారంటూ మండిపాటు హిందూపురం అర్బన్ పాల బిల్లులు చెల్లించడంతో పాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం పాడి రైతులు రోడ్డెక్కారు. హిందూపురం ప్రాంతంలోని 17 మండలాలకు చెందిన వేలాదిమంది రైతులు పాడిరైతుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర, ఏపీరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నాయకత్వంలో పాల టిన్నులు పట్టుకుని స్థానిక ఏపీ డెయిరీ కేంద్రం నుంచి సద్భావన సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వీరి ఆందోళనకు అఖిలపక్ష పార్టీలు, రైతుసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రాస్తారోకోను ఉద్దేశించి రైతుసంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, వైఎస్సార్సీపీ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేటీ శ్రీధర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీని అభివద్ధి చేసుకోవాలన్న తలంపుతో ఏపీ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పాడి రైతులకు కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించడం లేదని, లీటర్ ధరను కూడా రూ.26 నుంచి రూ.16కు తగ్గించి వేశారని తెలిపారు. గతంలో చిత్తూరు డెయిరీని ఇదేవిధంగా నాశనం చేసి..హెరిటేజ్‌ను అభివద్ధి చేసుకున్నారని గుర్తు చేశారు. -
పాల బిల్లు ఇవ్వలేదని ధర్నా
రాయచోటిటౌన్: సుమారు రెండు నెలలకుపైగా అంటే నాలుగు బిల్లులు ఇవ్వలేదని దీంతో తమ కాపురాలు నడవడం కష్టంగా మారిందని పాడి రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం రాయచోటి విజయా పాలడెయిరీకి పాలు పోసే రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విజయా పాల డెయిరీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి 15రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను అడిగినా వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు వస్తున్నాయని తెలిపారు. విజయా డెయిరీ యజమాన్యానికి వ్యతిరేకంగా పా లక్యాన్‌లు తెచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపై పారబోసి తమ నిరసను వ్యక్త పరిచారు. అలాగే గ్రామాల్లో పాలు కొలిచే ఏజెంట్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. నాలుగు బిల్లుల నుంచి డ బ్బులు చెల్లించడం లేదని,రైతులకుఏం సమాధానం చెప్పాలో తెలియక తాము తీవ్ర వత్తిడి గురవుతున్నామని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు సకాలంలో బిల్లులు వచ్చే విధంగా చేయాలని తహసీల్దార్ దా మోదర్‌రెడ్డికి రైతులు వినతిపత్రాని సమర్పించారు.