దిగుబడులు పెంచుతున్న రైతు‘బడులు’ | Year round training on proprietary practices | Sakshi
Sakshi News home page

దిగుబడులు పెంచుతున్న రైతు‘బడులు’

Published Tue, Jun 4 2024 3:03 AM | Last Updated on Tue, Jun 4 2024 3:03 AM

Year round training on proprietary practices

ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఏడాది పొడవునా శిక్షణ

6నుంచి 17 శాతం తగ్గిన సాగు వ్యయం  

9 నుంచి 20 శాతం మేర పెరిగిన దిగుబడులు 

ఆక్వాలో హెక్టార్‌కు 5–7 శాతం మేర తగ్గిన ఉత్పత్తి వ్యయం 

10 శాతానికి తగ్గిన యాంటీబయోటిక్స్‌ వినియోగం 

15–20 శాతం మేర పెరిగిన పాల దిగుబడి 

పాడి పశువుల్లో 20 శాతం వ్యాధుల నియంత్రణ

సాక్షి, అమరావతి: నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు పొలం బడులు.. పట్టు దిగుబడులు పెంచేందుకు పట్టుబడులు, ఉద్యాన రైతుల కోసం తోట బడులు, ఆక్వా రైతుల కోసం మత్స్య సాగు బడులు, పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తోంది. ‘ఈ–ఫార్మర్స్‌ ఫీల్డ్‌ స్కూల్స్‌’ ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు ఉత్పత్తుల్లో నాణ్యతతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన విషపూరిత రసాయనాలు (యాంటీìబయోటిక్స్‌) వినియోగానికి బ్రేకులు పడ్డాయి. పాల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో సుమారు 10 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వగలిగింది.   

వ్యవసాయ, ఉద్యాన పంటల్లో.. 
వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు క్షేత్ర ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సమగ్ర సస్యరక్షణ, పోషక, నీటి, కలుపు యాజమాన్య పద్ధతులతోపాటు కూలీల ఖర్చును తగ్గించుకునేలా అవగాహన కలి్పస్తున్నారు. సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా కాగా.. 9 నుంచి 20 శాతం మేర దిగుబడులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎకరాకు వరిలో 275 కేజీలు, మొక్కజొన్నలో 300 కేజీలు, పత్తిలో 45 కేజీలు, వేరుశనగలో 169 కేజీలు, అపరాల్లో 100 కేజీల అదనపు దిగుబడులు సాధించారు. అలాగే పట్టు సాగుబడుల ద్వారా పట్టుగూళ్ల ఉత్పాదకత ప్రతి వంద గుడ్లకు 60 కేజీల నుంచి 77 కేజీలకు పెరిగింది.  

ఆక్వా ఉత్పత్తుల్లో తగ్గిన యాంటీబయోటిక్స్‌ వినియోగం 
సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్‌ అందించే లక్ష్యంతో అప్సడా, సీడ్, పీడ్‌ యాక్టుల్ని తీసుకురావడంతోపాటు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్‌ అందుబాటులోకి తీసుకొచి్చంది. నాణ్యమైన ఆక్వా దిగుబడులు సాధించడం ద్వారా యాంటీబయోటిక్స్‌ వినియోగాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలిస్తున్నాయి.

మితిమీరిన యాంటీబయోటిక్స్‌ వినియోగం వల్ల అమెరికా, చైనా సహా యూరప్, మధ్య ఆసియా దేశాలు గతంలో మన ఆక్వా ఉత్పత్తులను తిరస్కరించేవి. మత్స్య సాగుబడుల ద్వారా ఇస్తున్న శిక్షణ ఫలితంగా యాంటీబయోటిక్స్‌ శాతం గణనీయంగా తగ్గించగలిగారు. గతంలో 37.5 శాతం నమోదైన యాంటీబయోటిక్స్‌ అవశేషాలు ప్రస్తుతం 5–10 శాతం లోపే ఉంటున్నాయని చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడంతోపాటు దిగుబడులు సైతం 10–15 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు. గడచిన ఐదేళ్లలో ఏపీ నుంచి రొయ్యల కన్‌సైన్‌మెంట్లను తిప్పిపంపిన ఘటనలు చోటుచేసుకోకపోవడమే  ఇందుకు నిదర్శనం.   

పశువుల్లో తగ్గిన వ్యాధులు 
మరోపక్క ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పశు విజ్ఞాన బడుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనలో మూగ, సన్న జీవాలకు సీజన్‌లో వచ్చే వ్యాధులు 20–30 శాతం మేర తగ్గాయని గుర్తించారు. ఈనిన 3 నెలలకే ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించడం వల్ల ఏడాదికో దూడను పొంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతున్నారు. దూడలు పుట్టుక మధ్య కాలం తగ్గడంతో లీటరున్నరకు పైగా పాల దిగుబడి (15–20 శాతం) పెరిగిందని, ఆ మేరకు రైతుల ఆదాయం పెరిగిందని గుర్తించారు. దూడ పుట్టిన నాటినుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని వాటిని అవలంబించడం ద్వారా దూడల్లో మరణాల రేటు 15 శాతం, సకాలంలో పశు వైద్య సేవలందించడం వల్ల 10 శాతం మేర పశువుల మరణాలు ‡తగ్గినట్టు      గుర్తించారు.  

హెక్టార్‌కు 4 టన్నుల దిగుబడి 
నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్‌ వేశా. మత్స్య సాగుబడుల్లో చెప్పిన సాగు విధానాలు పాటించా. సిఫార్సు చేసిన ప్రోబయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు పెడితే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు మించి ఖర్చవలేదు. గతంలో హెక్టార్‌కు 3నుంచి 3.2 టన్నుల దిగుబడి రాగా.. ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనపు ఆదాయం వచి్చంది.     –పి.లక్ష్మీపతిరాజు, కరప, తూర్పు గోదావరి జిల్లా

పశువిజ్ఞాన బడులతో ఎంతో మేలు 
మా గ్రామంలో 26 మంది రైతులు 3,600 గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రోగాలొస్తే తప్ప పశువైద్యుల దగ్గరకు వాటిని తీసుకెళ్లే వాళ్లం కాదు. తరచూ వ్యాధుల బారిన పడుతూ మృత్యువు పాలయ్యేవి. తగిన బరువు తూగక ఆరి్థకంగా నష్టపోయే వాళ్లం. పశువిజ్ఞాన బడుల వల్ల క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తుండటంతో వ్యాధులు, మరణాల రేటు తగ్గింది. సబ్సిడీపై ఇస్తున్న పచి్చమేత, సమీకృత దాణాను తీసుకోగలుగుతున్నాం. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక బరువును పొంది అధిక లాభాలను ఆర్జిస్తున్నాం.     – బమ్మిడి అప్పలరాజు, తొడగువానిపాలెం, విశాఖ జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement