Aqua farmer
-
‘పాథోరోల్’తో ‘ఈహెచ్‌పీ’కి చెక్
సాక్షి, అమరావతి: ఈ.హెచ్.పీ (ఎంటెరోసైటోజోన్ హెపటోపీనాయి)..ఇదొక మైక్రో స్పోరిడియన్ జాతికి చెందిన పరాన్న జీవి. ఆక్వా రైతులను ఆర్ధికంగా దెబ్బతీస్తోన్న ఈ వ్యాధి నియంత్రణకు ఓ చక్కని పరిష్కారం లభించింది. దాదాపు ఐదేళ్ల పాటు సుదీర్ఘ పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసిన ‘పాథరోల్’ రొయ్య రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఆక్వాఆధారిత దేశాల్లో ఈహెచ్‌పీ వ్యాధి తీవ్రత, వాటిల్లుతున్న నష్టాలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, వ్యాధి నియంత్రణలో పాథోరోల్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ మందు తయారు చేస్తున్న ‘కెవిన్’ సంస్థ వెల్లడించింది. ఈహెచ్పీతో ఏటా 4వేల కోట్ల నష్టందేశీయ రొయ్యల సాగులో 49 శాతం విస్తీర్ణంలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపు తున్నట్టు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐఎసీఆర్) గుర్తించింది. సమీప భవిష్యత్‌లో 100 శాతం చెరువులను ఈ వ్యాధి సంక్రమించే పెనుముప్పు ఉన్నట్టు ఐసీఎఆర్ హెచ్చరించింది. రొయ్యల ఆరోగ్యాన్నే కాదు..చెరువులను తీవ్ర ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధి నియంత్రణ కోసం ఎటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతుంది.. వ్యాధి నిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం చూపే ఈహెచ్‌పీ వల్ల ఎదుగుదల లేక ఆశించిన కౌంట్‌లో రొయ్యలు పట్టుబడి పట్టలేక తక్కువ కౌంట్‌కే రైతులు తెగనమ్ముకోవల్సి వస్తోంది. ఈ వ్యాధి ఉ«ధృతి వల్ల ఏటా రూ.4 వేల కోట్లకు పైగా రైతులు నష్టపోతున్నారు. ఔషధ మొక్కల నుంచి ‘పాథోరోల్’ ఆక్వా రంగంలో అపారమైన అనుభవం కల్గిన సౌత్ ఏషియాకు చెందిన కెమిన్ ఇండస్ట్రీ ఈ వ్యాధిని నియంత్రణ లక్ష్యంగా భారతీయ పరిశోధనా కేంద్రాలతో కలిసి జరిపిన విస్తృత పరిశోధనల ఫలితంగా ‘ఫాథోరోల్’ను ఆవిష్కరించింది. ఔషద మొక్కల నుంచి అభివృద్ధి చేసిన ఈ మందును 20కు పైగా దేశాల్లో ఈహెచ్‌పీ సోకిన చెరువుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసింది. వినియోగం ల్ల దుష్ప్రభావాలు ఉండవని పేర్కొంది. -
దిగుబడులు పెంచుతున్న రైతు‘బడులు’
సాక్షి, అమరావతి: నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు పొలం బడులు.. పట్టు దిగుబడులు పెంచేందుకు పట్టుబడులు, ఉద్యాన రైతుల కోసం తోట బడులు, ఆక్వా రైతుల కోసం మత్స్య సాగు బడులు, పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తోంది. ‘ఈ–ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్’ ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు ఉత్పత్తుల్లో నాణ్యతతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన విషపూరిత రసాయనాలు (యాంటీìబయోటిక్స్) వినియోగానికి బ్రేకులు పడ్డాయి. పాల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో సుమారు 10 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వగలిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో.. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు క్షేత్ర ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సమగ్ర సస్యరక్షణ, పోషక, నీటి, కలుపు యాజమాన్య పద్ధతులతోపాటు కూలీల ఖర్చును తగ్గించుకునేలా అవగాహన కలి్పస్తున్నారు. సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా కాగా.. 9 నుంచి 20 శాతం మేర దిగుబడులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎకరాకు వరిలో 275 కేజీలు, మొక్కజొన్నలో 300 కేజీలు, పత్తిలో 45 కేజీలు, వేరుశనగలో 169 కేజీలు, అపరాల్లో 100 కేజీల అదనపు దిగుబడులు సాధించారు. అలాగే పట్టు సాగుబడుల ద్వారా పట్టుగూళ్ల ఉత్పాదకత ప్రతి వంద గుడ్లకు 60 కేజీల నుంచి 77 కేజీలకు పెరిగింది. ఆక్వా ఉత్పత్తుల్లో తగ్గిన యాంటీబయోటిక్స్ వినియోగం సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో అప్సడా, సీడ్, పీడ్ యాక్టుల్ని తీసుకురావడంతోపాటు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచి్చంది. నాణ్యమైన ఆక్వా దిగుబడులు సాధించడం ద్వారా యాంటీబయోటిక్స్ వినియోగాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలిస్తున్నాయి.మితిమీరిన యాంటీబయోటిక్స్ వినియోగం వల్ల అమెరికా, చైనా సహా యూరప్, మధ్య ఆసియా దేశాలు గతంలో మన ఆక్వా ఉత్పత్తులను తిరస్కరించేవి. మత్స్య సాగుబడుల ద్వారా ఇస్తున్న శిక్షణ ఫలితంగా యాంటీబయోటిక్స్ శాతం గణనీయంగా తగ్గించగలిగారు. గతంలో 37.5 శాతం నమోదైన యాంటీబయోటిక్స్ అవశేషాలు ప్రస్తుతం 5–10 శాతం లోపే ఉంటున్నాయని చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడంతోపాటు దిగుబడులు సైతం 10–15 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు. గడచిన ఐదేళ్లలో ఏపీ నుంచి రొయ్యల కన్సైన్మెంట్లను తిప్పిపంపిన ఘటనలు చోటుచేసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. పశువుల్లో తగ్గిన వ్యాధులు మరోపక్క ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పశు విజ్ఞాన బడుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనలో మూగ, సన్న జీవాలకు సీజన్లో వచ్చే వ్యాధులు 20–30 శాతం మేర తగ్గాయని గుర్తించారు. ఈనిన 3 నెలలకే ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించడం వల్ల ఏడాదికో దూడను పొంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతున్నారు. దూడలు పుట్టుక మధ్య కాలం తగ్గడంతో లీటరున్నరకు పైగా పాల దిగుబడి (15–20 శాతం) పెరిగిందని, ఆ మేరకు రైతుల ఆదాయం పెరిగిందని గుర్తించారు. దూడ పుట్టిన నాటినుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని వాటిని అవలంబించడం ద్వారా దూడల్లో మరణాల రేటు 15 శాతం, సకాలంలో పశు వైద్య సేవలందించడం వల్ల 10 శాతం మేర పశువుల మరణాలు ‡తగ్గినట్టు గుర్తించారు. హెక్టార్‌కు 4 టన్నుల దిగుబడి నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్ వేశా. మత్స్య సాగుబడుల్లో చెప్పిన సాగు విధానాలు పాటించా. సిఫార్సు చేసిన ప్రోబయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు పెడితే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు మించి ఖర్చవలేదు. గతంలో హెక్టార్‌కు 3నుంచి 3.2 టన్నుల దిగుబడి రాగా.. ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనపు ఆదాయం వచి్చంది. –పి.లక్ష్మీపతిరాజు, కరప, తూర్పు గోదావరి జిల్లాపశువిజ్ఞాన బడులతో ఎంతో మేలు మా గ్రామంలో 26 మంది రైతులు 3,600 గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రోగాలొస్తే తప్ప పశువైద్యుల దగ్గరకు వాటిని తీసుకెళ్లే వాళ్లం కాదు. తరచూ వ్యాధుల బారిన పడుతూ మృత్యువు పాలయ్యేవి. తగిన బరువు తూగక ఆరి్థకంగా నష్టపోయే వాళ్లం. పశువిజ్ఞాన బడుల వల్ల క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తుండటంతో వ్యాధులు, మరణాల రేటు తగ్గింది. సబ్సిడీపై ఇస్తున్న పచి్చమేత, సమీకృత దాణాను తీసుకోగలుగుతున్నాం. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక బరువును పొంది అధిక లాభాలను ఆర్జిస్తున్నాం. – బమ్మిడి అప్పలరాజు, తొడగువానిపాలెం, విశాఖ జిల్లా -
కామ్రేడ్స్ పేరుతో బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్
కైకలూరు: ఓ ఆక్వా రైతును నెల రోజులుగా కామ్రేడ్స్ పేరుతో సెల్ ఫోన్ల ద్వారా బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న డ్రైవర్ల గ్యాంగ్‌ను ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టౌన్ స్టేషన్లో సీఐ ఆకుల రఘు, ఎస్ఐ జ్యోతిబసు వివరాలు వెల్లడించారు. కైకలూరుకు చెందిన ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ప్రముఖ ఆక్వా రైతు. నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్ మాట్లాడుతున్నాం.. మాకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే నీతో పాటు నీ కొడుకును చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. పదే పదే ఫోన్లు రావడంతో ప్రసాదరాజు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. మండవల్లి మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తోకల ఏసేబు (36), చిన్నం బారంబాసు (51), హైదరాబాదు, ఏజీ కాలనీ, ఎర్రగడ్డకు చెందిన శీలం హేమంత్‌కుమార్ (33), హైదరాబాదు, హిమాయత్‌నగర్‌కు చెందిన దారా మాణిక్యరావు (44)గా వారిని గుర్తించారు. వీరిలో ఏసేబు, మాణిక్యరావు కైకలూరులో ప్రసాదరాజు దగ్గర గతంలో కారు డ్రైవర్లుగా పనిచేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మాణిక్యరావు హైదరాబాదులోని తన స్నేహితుడు, కారు డ్రైవర్ హేమంత్‌కుమార్‌తో రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. హైదరాబాదు శివారు రింగురోడ్డు నుంచి ఫోన్లు చేసి ప్రసాదరాజును డబ్బు కోసం బెదిరించారు. నిందితుల్లో ఏసేబు, బారంబాసు, హేమంత్‌కుమార్ అరెస్టు చేశారు. మాణిక్యరావును పట్టుకోవాల్సి ఉంది. -
జయచంద్రనాయుడి నుంచి మా కుటుంబాన్ని కాపాడండి
కావలి: తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలి సోదరుడు జయచంద్రనాయుడు నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించి, తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం ఒట్టూరుకి చెందిన ఆక్వారైతు కుటుంబం వేడుకుంది. కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆక్వారైతు నారాయణ, ఆయన భార్య, కుమార్తెలు విలేకరులతో మాట్లాడారు. రొయ్యల సాగుకోసం జయచంద్రనాయుడు వద్ద రూ.34 లక్షలకు రొయ్యపిల్లలు, మేత, రసాయనాలు తీసుకున్నామని చెప్పారు. నాలుగేళ్లుగా తమ కుటుంబానికి చెందిన 15 ఎకరాల్లో సాగుచేస్తున్న రొయ్యల పంట మొత్తం జయచంద్రనాయుడు తీసుకుంటున్నాడన్నారు. ఇప్పటివరకు రూ.5 కోట్లకుపైగా విలువ చేసే రొయ్యలు తీసుకున్న జయచంద్రనాయుడు ఇంకా తాము బాకీ ఉన్నట్లు నిత్యం వేధిస్తున్నాడని విలపించారు. ఇప్పటివరకు చెల్లించిన డబ్బులు లెక్కలు చూస్తే తమకే జయచంద్రనాయుడు బాకీ ఉన్నాడన్నారు. ఇప్పుడు తమ పొలాలను స్వాధీనం చేసుకోవడానికి తమను చంపిస్తామని బెదిరిస్తున్నాడని చెప్పారు. జయచంద్రనాయుడు తాగుబోతులను ఉసిగొలిపి తమ కుమార్తెలను అల్లరి చేయిస్తూ, మాటలతో వేధిస్తున్నారని, తమపై నిత్యం దౌర్జన్యం చేస్తూ అరాచకంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. రొయ్యల గుంతకు విద్యుత్ సరఫరా నిలిపేసి అక్కడ పనిచేసేవారిని బెదిరించి వెళ్లగొట్టాడని చెప్పారు. జయచంద్రనాయుడు దొంగ లెక్కలు రాసిన విషయాన్ని తాము ప్రశ్నిస్తే అహంకారంతో చెలరేగిపోతున్నాడన్నారు. ఈ విషయాన్ని కావలి వచ్చిన లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. -
ఆక్వా చెరువుల కోసం అన్నదాతల కడుపు కొట్టారు..!
సాక్షి, సింగరాయకొండ: ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కాదు..చెడు మాత్రం చేయకూడదు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం మంచి అన్న పదాన్ని మర్చిపోయారు. తమ స్వార్థం కోసం ఎంతకైనా వెనుకాడలేదు. వేల మంది రైతులకు ఉపయోగడే చెక్ డ్యాం నిర్మాణాన్ని నిర్ధాక్షిణ్యంగా అడ్డుకొని అన్నదాతల కడుపుకొట్టారు. వీరికి ఎమ్మెల్యే స్వామి మద్దతు పలకడంతో చెక్‌డ్యాం నిర్మాణం నిలిచిపోయి వేల ఎకరాల భూములు సాగుకు నోచుకోలేదు. రైతులకు ఆసరాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఆక్వా రైతులకు అండగా ఉండటంతో చివరకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనా.. పాకల సమీపంలో పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.1.53 కోట్లు మంజూరుచేసింది. ఈ చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే బీడులుగా ఉన్న 250 ఎకరాల సాగులోకి రావడంతో పాటు కొత్త చెరువు కింద ఉన్న సుమారు 1300 ఎకరాల ఆయకట్టులో పంటలు పుష్కలంగా పండుతాయి. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ రూ.4.80 లక్షల పనులు చేసిన తరువాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత తనను గెలిపిస్తే చెక్‌డ్యాంను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దామచర్ల కుటుంబానికి చెందిన బంధువులకు సంబంధించిన ఆక్వా చెరువులకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించి చెక్‌డ్యాం పనులను అడ్డుకుని ఎమ్మెల్యే స్వామి తన స్వామి భక్తిని చాటుకొని మా నోట్లో మట్టి కొట్టారని రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అనుమతులన్నీ ఉన్నా.. పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి అన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం కుంటిసాకులు చెబుతూ పనులను అడ్డుకున్నారు. చెక్‌డ్యాం నిర్మాణానికి ఫారెస్టుతో సహా అన్ని శాఖల అనుమతులు ఉన్నా పనులు అడ్డుకుంటున్నారని, దీంతో తామేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సాక్షాత్తు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులే చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం మునిగిపోతుందంటూ పుకార్లు.. అధికార పార్టీ నేతలు చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. చెక్‌డ్యాం పూర్తయితే సమీపంలోని టంగుటూరు మండలం రాయివారిపాలెం గ్రామం మునిగిపోతుందని పుకార్లు పుట్టించారు. వాస్తవానికి రొయ్యల చెరువుల కట్టలు 6 అడుగుల ఎత్తులో ఉండగా, చెక్‌డ్యాం ఎత్తు కేవలం 4 అడుగులు మాత్రమేనని, అటువంటప్పుడు ఊరు ఏ విధంగా మునుగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరం లేకున్నా నిర్మాణం.. పాకల సమీపంలో పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకున్న అధికార పార్టీ నేతలు..అవసరం లేని ప్రాంతంలో రూ.10 లక్షల చొప్పున చెక్‌డ్యాంలు నిర్మించారు. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రైతులు పేర్కొంటున్నారు. కేవలం అధికార పార్టీ కోసమే వీటిని నిర్మించారని రైతులు పేర్కొంటున్నారు. చెక్‌డ్యాంతో ఎంతో ప్రయోజనం పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మిస్తే సుమారు 1500 ఎకరాల్లో ఏటా నీటి ఎద్దడి తీరి పంటలు బాగా పండతాయి. మరో 250 ఎకరాలు సైతం సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సరైన వర్షాలు లేక కేవలం 10 ఎకరాల్లో మాత్రమే పంటలు వేసుకున్నాం. - గండవరపు పిచ్చిరెడ్డి, రైతు, పాకల చెక్‌డ్యాం నిర్మాణంతో మా కష్టాలు తీరుతాయి చెక్‌డ్యాం పూర్తయితే ఏటా రెండు పంటలు పండించుకోవచ్చు. చెక్‌డ్యాంకు నిధులు మంజూరైతే కష్టాలు తీరతాయని ఆశించాం. అయితే నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండించుకోలేపోయాం. - బత్తుల భాస్కరరెడ్డి, రైతు, పాకల -
‘వెనామీ’పై చలి పంజా
చలికి మేత తినక తగ్గిన పెరుగుదల ఆందోళనలో ఆక్వారైతు తోటపల్లిగూడూరు : ప్రస్తుతం తీర గ్రామాల్లో సాగులో ఉన్న వెనామీ రొయ్య చలికి వణుకుతోంది. సాధారణంగా శీతల పరిస్థితులను వెనామీ తట్టకోవడం కష్టం. వారం రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి, మంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతుంది. కొంత కాలంగా వెనామీ రొయ్య గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇటీవల వాయుగుండాలు, భారీ వర్షాలు, చలిగాలులు వరుస పెట్టాయి. ఈ క్రమంలో చలిగాలులు ఉధృతం కావడంతో ప్రస్తుతం సాగులో ఉన్న నెల లోపు వెనామీ రొయ్యలు చలికి తట్టకోలేక, మేత తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. గుంతలపై మంచు తెరలు ఉదయం 10 గంటలకు కూడా తొలగడం లేదు. చలి తీవ్రతకు రొయ్య పిల్ల సరిపడినంత మేత కూడా తీసుకోలేక పెరుగుదలలో లోపం కన్పిస్తోంది. చలికి కొన్ని పిల్లలు గుంతల్లోనే మృత్యువాత పడుతున్నాయి. ఈ చలి గాలులు, మంచు తీవ్రత మరికొద్ది కాలం కొనసాగితే 50 నుంచి 70 శాతం మేర రొయ్య పిల్లలు మృత్యువాత పడతాయని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆక్వా రైతులూ.. మేలుకోండి
వాతావరణంలో మార్పులతో ఆక్వాకు నష్టం అధికారులు వెంటనే స్పందించాలి చేపల రైతులకు సూచనలిచ్చి ఆదుకోవాలి లేకుంటే వందల కోట్లలో నష్టం జరిగే ప్రమాదం వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి గుడివాడ, న్యూస్‌లైన్ : ఆక్వా రైతులూ మేలుకోండి.. వాతావరణంలో ప్రస్తుతం వస్తున్న మార్పులు అర్థం చేసుకుని తక్షణం నివారణ చర్యలు చేపట్టండి.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్, ఐసీఆర్ఏ బోర్డు సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. రెండు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులపై ఆక్వా రైతులను అప్రమత్తం చేయాలని మత్స్య శాఖ అధికారులకు ఆయన సూచించారు. లేకుంటే వందల కోట్ల రూపాయల్లో నష్టం జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఏలూరు రోడ్డులోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేపల చెరువుల్లో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు మారుతున్నాయని చెప్పారు. వాతావరణంలో మార్పులు, అక్కడక్కడ పడుతున్న వర్షాల వల్ల చెరువుల్లో ఉష్ణోగ్రత తగ్గి చేపలు చనిపోతున్నాయన్నారు. నేడు సీమాంధ్రలో చేపల సాగు ఎంతో కీలకమైనదని, ఈ రంగానికి నష్టం జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలను రైతులకు వివరించి వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్రంలోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో చేపలు, రొయ్యల సాగు దాదాపు రెండు లక్షల 50 వేల ఎకరాల్లో ఉందని చెప్పారు. ప్రతి ఎకరానికీ చేపల సాగుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, ఫంగస్ చేపల సాగుకు రూ.5 లక్షల వరకు, రొయ్యల సాగుకు రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చు పెట్టారని తెలిపారు. వాతావరణం మార్పుతో ఆక్సిజన్ అందదు... వాతావరణం మార్పు కారణంగా వేసవిలో ఒక్కసారిగా వర్షాలు పడినా, చేపలకు ఆక్సిజన్ అందదని నాగిరెడ్డి చెప్పారు. చేపల శరీర ఉష్ణోగ్రత చెరువులో ఉండే నీటి ఉష్ణోగ్రతతో సమానంగా ఉంటుందని ఆయన తెలిపా రు. ఒక్కసారిగా చేపల చెరువులో నీ టి ఉష్ణోగ్రత మారితే ఆక్సిజన్ అందక అవి మృత్యువాత పడతాయన్నారు. చేపల మేత ఆపాలి... ప్రస్తుత పరిస్థితిలో చేపలకు మేత వేయటం ఆపాలని నాగిరెడ్డి కోరారు. చేపలకు మేత వేయటం వల్ల బరువు పెరిగి ఆక్సిజన్ లోపం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రైతులు ముందస్తు జాగ్రత్తలను తక్షణం చేపట్టడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీనిపై మత్స్య శాఖ అధికారులు రైతుల్ని అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. ప్రస్తుత డిమాండును చూసి చేపల మందుల కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రమాదముందని తెలిపారు. రైతులు ఆక్వా కన్సల్టెంట్లను సంప్రదించి ముందస్తు యాజమాన్య చర్య లు చేపట్టాలని ఆయన సూచించారు.