ఆక్వా రంగానికి పెనుసవాల్‌గా మారిన ఈహెచ్‌పీ
ఏటా 49 శాతం పంటపై ఈ వ్యాధి ఉధృతి
సాక్షి, అమరావతి: ఈ.హెచ్.పీ (ఎంటెరోసైటోజోన్ హెపటోపీనాయి)..ఇదొక మైక్రో స్పోరిడియన్ జాతికి చెందిన పరాన్న జీవి. ఆక్వా రైతులను ఆర్ధికంగా దెబ్బతీస్తోన్న ఈ వ్యాధి నియంత్రణకు ఓ చక్కని పరిష్కారం లభించింది. దాదాపు ఐదేళ్ల పాటు సుదీర్ఘ పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసిన ‘పాథరోల్’ రొయ్య రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఆక్వాఆధారిత దేశాల్లో ఈహెచ్‌పీ వ్యాధి తీవ్రత, వాటిల్లుతున్న నష్టాలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, వ్యాధి నియంత్రణలో పాథోరోల్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ మందు తయారు చేస్తున్న ‘కెవిన్’ సంస్థ వెల్లడించింది.
ఈహెచ్‌పీతో ఏటా 4వేల కోట్ల నష్టం
దేశీయ రొయ్యల సాగులో 49 శాతం విస్తీర్ణంలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపు తున్నట్టు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐఎసీఆర్) గుర్తించింది. సమీప భవిష్యత్‌లో 100 శాతం చెరువులను ఈ వ్యాధి సంక్రమించే పెనుముప్పు ఉన్నట్టు ఐసీఎఆర్ హెచ్చరించింది. రొయ్యల ఆరోగ్యాన్నే కాదు..చెరువులను తీవ్ర ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధి నియంత్రణ కోసం ఎటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతుంది.. వ్యాధి నిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం చూపే ఈహెచ్‌పీ వల్ల ఎదుగుదల లేక ఆశించిన కౌంట్‌లో రొయ్యలు పట్టుబడి పట్టలేక తక్కువ కౌంట్‌కే రైతులు తెగనమ్ముకోవల్సి వస్తోంది. ఈ వ్యాధి ఉ«ధృతి వల్ల ఏటా రూ.4 వేల కోట్లకు పైగా రైతులు నష్టపోతున్నారు.
ఔషధ మొక్కల నుంచి ‘పాథోరోల్’
ఆక్వా రంగంలో అపారమైన అనుభవం కల్గిన సౌత్ ఏషియాకు చెందిన కెమిన్ ఇండస్ట్రీ ఈ వ్యాధిని నియంత్రణ లక్ష్యంగా భారతీయ పరిశోధనా కేంద్రాలతో కలిసి జరిపిన విస్తృత పరిశోధనల ఫలితంగా ‘ఫాథోరోల్’ను ఆవిష్కరించింది. ఔషద మొక్కల నుంచి అభివృద్ధి చేసిన ఈ మందును 20కు పైగా దేశాల్లో ఈహెచ్‌పీ సోకిన చెరువుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసింది. వినియోగం ల్ల దుష్ప్రభావాలు ఉండవని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment