Prawn cultivation
-
ఏపీలో మళ్లీ మొదలైన టైగర్ రొయ్య సాగు
సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాల క్రితం ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందిన మోనోడాన్ (టైగర్ రొయ్య) మళ్లీ వచ్చేసింది. గత సీజన్లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన మడగాస్కర్ సీడ్ మోనోడాన్ (Penaeus Monodon) రైతులకు కాసుల వర్షం కురిపించింది. దీంతో తీరం వెంబడి ఈ ఏడాది అధిక శాతం సాగు చేసేందుకు ఆక్వా రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వాలో 2002 సంవత్సరానికి పూర్వం టైగర్ రొయ్యదే హవా. ఈ రొయ్యకు లోకల్ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయంగా ఎగుమతులకు బాగా డిమాండ్ ఉండేది. క్రమంగా టైగర్ రొయ్యపై వైట్‌స్పాట్ వైరస్ దాడి తీవ్రం కావడంతో ఆక్వా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత 2011లో వచ్చిన వనామీ (Vannamei Prawn) మూడేళ్లపాటు రైతులకు అధిక లాభాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా చాలామంది రైతులు తమ పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 4.66 లక్షల ఎకరాలకు పెరగ్గా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి 1.05 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి చెరువులు ఉన్నాయి. వనామీపైనా 2014 నుంచి వైట్ స్పాట్, విబ్రియో, వైట్‌గట్, ఈహెచ్‌పీ వైరస్ల దాడి మొదలైంది. రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ఆక్వా రైతులకు గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అప్సడా ఏర్పాటుచేసి కొండంత అండగా నిలిచింది. తీరం వెంబడి మొదలైన సాగు చెన్నైకి చెందిన హేచరీలు మూడేళ్ల క్రితం మడగాస్కర్ ప్రాంతంలోని సముద్ర జలాల నుంచి నాణ్యమైన మేల్, ఫిమేల్ మోనోడాన్ బ్రూడర్స్‌ను సేకరించి సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. 2023లో కృష్ణా, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ జిల్లాల్లోని సముద్రతీరం వెంబడి 7,200 ఎకరాల్లో మోనోడాన్ సీడ్‌ను రైతులు సాగు చేశారు. వైరస్ బెడద లేకపోవడం, ఆరు నెలల పంట కాలానికి కేజీకి 20 కౌంట్‌తో రూ.1,050 వరకు ధర పలికి మంచి లాభాలు వచ్చాయి. దీంతో గత ఏడాది దాదాపు రెట్టింపు స్థాయిలో ఈ సీడ్‌ను సాగు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, చినమైనవానిలంక, దర్భరేవు తదితర ప్రాంతాల్లో 520 ఎకరాల్లో సాగు చేశారు.ఆరు నెలల్లో అధికంగా 20 కౌంట్ తీయగా, కొందరు ఎనిమిది నెలల కాలానికి 10.5 నుంచి 11 కౌంట్ కూడా తీశారు. సాగు పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తుండటంతో ఈ సీజన్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆరు వేల ఎకరాలకు పైగా సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కాగా, చెన్నైతోపాటు మన రాష్ట్రంలోని ఐదారు హేచరీల్లో మాత్రమే మోనోడాన్ సీడ్ లభిస్తోంది. రొయ్య పిల్ల ధర రూపాయి వరకు ఉంది. ఈ సీడ్ కావాల్సిన రైతులు రెండు నెలల ముందే డబ్బులు చెల్లించి బుకింగ్ చేసుకుంటున్నారు. మోనోడాన్ 15 నుంచి 20 శాతం వరకు ఉప్పు సాంద్రత ఉన్న నీటిలో సాగుకు అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. లాభాలు బాగున్నాయి గత ఏడాది 12.5 ఎకరాల్లో మడగాస్కర్ సీడ్ మోనోడాన్ సాగుచేసి 10.5 కౌంట్ తీశాను. పెట్టుబడులు పోను రెట్టింపు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మా ప్రాంతంలో చాలామంది రైతులు మోనోడాన్ సీడ్ సాగు చేసేందుకు అప్పుడే హేచరీలకు అడ్వాన్స్‌లు చెల్లించారు. – వాతాడి కృష్ణారావు, ఆక్వా రైతు, చినమైనవానిలంక, పశ్చిమ గోదావరి జిల్లా సాగు విస్తీర్ణం పెరుగుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల చెరువుల్లో రైతులు మోనోడాన్ సీడ్ సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. లాభదాయకంగా ఉండటంతో మిగిలిన రైతులు ఈ సీడ్ సాగుపట్ల ఆకర్షితులవుతున్నారు. తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది మోనోడాన్ సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. – ఎన్డీవీ ప్రసాద్, మత్స్యశాఖ అధికారి -
‘పాథోరోల్’తో ‘ఈహెచ్‌పీ’కి చెక్
సాక్షి, అమరావతి: ఈ.హెచ్.పీ (ఎంటెరోసైటోజోన్ హెపటోపీనాయి)..ఇదొక మైక్రో స్పోరిడియన్ జాతికి చెందిన పరాన్న జీవి. ఆక్వా రైతులను ఆర్ధికంగా దెబ్బతీస్తోన్న ఈ వ్యాధి నియంత్రణకు ఓ చక్కని పరిష్కారం లభించింది. దాదాపు ఐదేళ్ల పాటు సుదీర్ఘ పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసిన ‘పాథరోల్’ రొయ్య రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఆక్వాఆధారిత దేశాల్లో ఈహెచ్‌పీ వ్యాధి తీవ్రత, వాటిల్లుతున్న నష్టాలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, వ్యాధి నియంత్రణలో పాథోరోల్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ మందు తయారు చేస్తున్న ‘కెవిన్’ సంస్థ వెల్లడించింది. ఈహెచ్పీతో ఏటా 4వేల కోట్ల నష్టందేశీయ రొయ్యల సాగులో 49 శాతం విస్తీర్ణంలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపు తున్నట్టు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐఎసీఆర్) గుర్తించింది. సమీప భవిష్యత్‌లో 100 శాతం చెరువులను ఈ వ్యాధి సంక్రమించే పెనుముప్పు ఉన్నట్టు ఐసీఎఆర్ హెచ్చరించింది. రొయ్యల ఆరోగ్యాన్నే కాదు..చెరువులను తీవ్ర ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధి నియంత్రణ కోసం ఎటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతుంది.. వ్యాధి నిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం చూపే ఈహెచ్‌పీ వల్ల ఎదుగుదల లేక ఆశించిన కౌంట్‌లో రొయ్యలు పట్టుబడి పట్టలేక తక్కువ కౌంట్‌కే రైతులు తెగనమ్ముకోవల్సి వస్తోంది. ఈ వ్యాధి ఉ«ధృతి వల్ల ఏటా రూ.4 వేల కోట్లకు పైగా రైతులు నష్టపోతున్నారు. ఔషధ మొక్కల నుంచి ‘పాథోరోల్’ ఆక్వా రంగంలో అపారమైన అనుభవం కల్గిన సౌత్ ఏషియాకు చెందిన కెమిన్ ఇండస్ట్రీ ఈ వ్యాధిని నియంత్రణ లక్ష్యంగా భారతీయ పరిశోధనా కేంద్రాలతో కలిసి జరిపిన విస్తృత పరిశోధనల ఫలితంగా ‘ఫాథోరోల్’ను ఆవిష్కరించింది. ఔషద మొక్కల నుంచి అభివృద్ధి చేసిన ఈ మందును 20కు పైగా దేశాల్లో ఈహెచ్‌పీ సోకిన చెరువుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసింది. వినియోగం ల్ల దుష్ప్రభావాలు ఉండవని పేర్కొంది. -
మట్టి లేకుండా బయోప్లాక్ పద్దతిలో రొయ్యల సాగు
-
రొయ్యకు రోగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గతనెలలో వచ్చిన వరదలు ఆక్వా రంగానికి తీవ్ర నష్టాలను మిగిల్చాయి. మిగిలిన రొయ్యల సాగును ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. అంతుబట్టని వ్యాధులతో రొయ్య పిల్లలు చనిపోతుండటం, పెరుగుదల లేకపోవటం చూసి ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, తల్లి రొయ్యల ద్వారా సోకుతున్న వ్యాధులపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో రొయ్యకు వచ్చిన రోగం ఒకటైతే.. రైతులు వైరస్ అంటూ రూ. లక్షలు వెచ్చించి తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆక్వా కల్చర్ సాగవుతుంది. అత్యధికంగా వెనామీ నెల్లూరు జిల్లాలోనే ఉంది. సముద్ర తీరాన 54 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చే పట్టారు. అయితే నవంబర్‌లో కురిసిన భారీవర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో రొయ్యల గుంతలు వరదలకు కొట్టుకుపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో విపత్తు సంభవించ డంతో ఆక్వారైతులు రూ. కోట్లు నష్టపోయారు. వరదలకు ముందు ‘వైట్‌గట్’ వైరస్ కారణంగా కూడా నష్టపోయారు. తల్లి రొయ్య నుంచే ఈహెచ్‌పీ వ్యాధి రొయ్యకు సోకిన ఎంటిరో సైటోజోన్ హెపిటోప్ పెయినీ (ఈహెచ్‌పీ) వ్యాధి తల్లి రొయ్య నుంచే సోకిందని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఆక్వాసాగుకు సంబంధించి గుర్తింపుపొందిన కంపెనీ నుంచే హెచరీలు తల్లిరొయ్యలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని హెచరీల వారు స్థానికంగా తక్కువ ధరకు దొరికే తల్లిరొయ్యల వైపు మొగ్గుచూపుతున్నారు. తద్వారా ఏహెచ్‌పీ, ఈహెచ్‌పీ వ్యాధులు సోకుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈహెచ్‌పీ వ్యాధి సోకిన రొయ్యపిల్ల ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోతుంది. ఆహారం తీసుకుంటుంది కానీ పెరుగుదల కనిపించదు. అయితే చనిపోయినట్లు కనిపిస్తూ కదలకుండా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిశోధనలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. మరో నాలుగేళ్ల తర్వాత మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు రైతులు యాజమాన్య పద్ధతుల ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చూచిస్తున్నారు. - కోస్టల్ అథారిటీ గుర్తింపు పొందిన సంస్థల నుంచే హేచరీలు తల్లి రొయ్యలను కొనుగోలు చేయాలి. - రొయ్యల గుంట చుట్టూ వల ఏర్పాటు చేయాలి (వేరొకచోట నుంచి చేపపిల్లలు, ఇతరత్రా వాటిని తెచ్చి గుంతల్లో పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎకరం గుంతలో లక్ష పిల్లలను మాత్రమే వేయాలి. రెండు నెలలైనా రొయ్యలు పెరగలేదు రెండు నెలల క్రితం గుంతలో రొయ్య పిల్లలు పోశా ను. ఇప్పటికి దాదాపుగా 12 గ్రాముల వరకు పెరగాల్సి ఉంది. కానీ నాలుగు, ఐదు గ్రాముల బరువు మాత్రమే పెరి గాయి. పిల్లల్లో తేడా.. లేదా ఇంకేమైనా వ్యాధా అనేది తెలియడం లేదు. - శ్రీహరికోట వెంకటేశ్వర్లు(మైపాడు) వైరస్‌తో తీవ్రంగా నష్టపోయాం స్నేహితులం భాగస్వాములుగా చేరి పది ఎకరాల వరకు వెనామీ సాగు చేశాం. రెండు నెలలు అయిన రొయ్య ఎదుగదల లేదు. వర్షాలు ఆగిపోయిన తర్వాత వైరస్ సోకి రొయ్యలు చనిపోయాయి. ఈ వైరస్‌తో తీవ్రంగా నష్టపోయాం. - ఎస్కే రఫి (గంగపట్నం) -
సాగు..జాగు
పాలకొల్లు, న్యూస్‌లైన్ : వ్యవసాయమే జీవనాధారమైన డెల్టాలో సార్వా సాగు సారూప్యత లేకుండా సాగుతోంది. కొన్నిచోట్ల నాట్లు పూర్తరుు నేడోరేపో పొట్ట దశకు చేరుకునే పరిస్థితులుండగా, మరికొన్ని చోట్ల నాట్లు కూడా పడలేదు. నారుపోసి, పొలాన్ని దమ్ము చేసే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు. కొంతమంది రైతులు పైరుకు ఎరువులు వేస్తుండగా మరికొందరు పురుగు మందుల పిచికారీ, కలుపుతీత వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. కనీసం 30 శాతం వ్యవసాయ క్షేత్రాల్లో రానున్న వారం రోజుల్లో నాట్లుపడే పరిస్థితి కనిపిస్తోంది. డెల్టాలో అధిక శాతం కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అక్కడక్కడా కొందరు చేపలు, రొయ్యల సాగు చేస్తుండగా అతికొద్దిమంది మాత్రం కూరగాయలు పండిస్తున్నారు. ఎక్కువమంది రైతులు, కూలీలు వరి సాగుపైనే ఆధారపడుతున్నారు. అరుుతే, సాగు విషయంలో రైతుల మధ్య సారూప్యత లేకపోవడంతో వరి విషయంలోనే ఒకే ప్రాంతంలో వ్యత్యాసం కనబడుతోంది. నియోజకవర్గంలోని పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా, కనీసం 10 వేల ఎకరాల్లో నేటికీ నాట్లు పడలేదు. పాలకొల్లు మండలం వరిధనంలో ఒక రైతు ముందుగా నాట్లు వేసిన పొలంలో ఇప్పటికే ఒక విడత ఎరువు వేయడం, కలుపుతీత, పురుగుల మందు పిచికారీ వంటి పనులు పూర్తి చేయగా, సమీపంలోని లంకలకోడేరులో రెండుమూడు రోజుల క్రితం నాట్లు వేశారు. యలమంచిలి మండలంలో నేటికీ దుక్కు చేయని పొలాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు రైతులంతా దాదాపు వారం, పది రోజుల వ్యవధిలో నాట్లు పూర్తి చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామానికి, గ్రామానికి మధ్య నెలరోజుల వ్యత్యాసం కనిపిస్తోంది. డెల్టా ఆధునికీకరణ పనుల కారణంగా కాలువలకు నీటి విడుదలలో జాప్యం, రైతులు నాట్లు వేసే సమయంలో భారీ వర్షాలు కురిసి నారుమళ్లు దెబ్బతినడం వంటి కారణాల నడుమ నాట్లు వేయడంలో వ్యత్యాసం కనబడుతోంది. ఆలస్యంగా నాట్లు వేస్తే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయాధికారులు చెబుతుండగా, సార్వా జాప్యం ప్రభావం దాళ్వా పంటపై కూడా పడుతుందని, దీనవల్ల మూడో పంటగా ఆరుతడి పంటలు వేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు.