పశువులూ దూరం దూరం | National Livestock Research Institute Gives Suggestions To Dairy Farmers | Sakshi
Sakshi News home page

పశువులూ దూరం దూరం

Published Mon, Apr 27 2020 5:15 AM | Last Updated on Mon, Apr 27 2020 5:15 AM

National Livestock Research Institute Gives Suggestions To Dairy Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో పాడి రైతులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డెయిరీ ఫాంలలో  పశువుల నిర్వహణ పకడ్బందీగా చేయాలని జాతీయ పశు పరిశోధన సంస్థ (ఈటానగర్‌) సూచించింది. కొత్త గా పశువులను కొనుగోలు చేస్తే వాటిని నేరుగా ఫాం షెడ్లలోకి తీసుకురావద్దని, 3 వారాల పాటు వాటిని క్వారంటై న్‌ చేసిన తర్వాతే ఇతర పశువులతో వాటిని కలపాలని పేర్కొంది. రోజూ పశువులు ఆహారం సరిగా తీసుకుంటున్నాయా లేదా అనేది జాగ్రత్తగా గమనించాలని సూచించింది. ఉదయం, సాయంత్రం మూత్రం క్రమం తప్పకుండా చేస్తున్నాయో లే దో చూసుకోవాలని వెల్లడించింది. వివిధ దేశాల్లో జంతువులకు కరోనా వైరస్‌ సోకుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో డెయిరీ ఫాంలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల పట్ల వ్యవహరించా ల్సిన తీరుపై సంస్థ పలు సూచనలు చేసింది.

సూచనలు ఇవే.. 
► డెయిరీ ఫాంలలోకి సాధ్యమైనంత వరకు కొత్త వ్యక్తులను రానీయకుండా ఉంటే మంచిది. 
► ఫాంలలో పనిచేసే వారి సంఖ్య కూడా     వీలున్నంత తగ్గించాలి.
► పనిచేసే వారంతా మాస్కులు ధరించాలి. వారికి థర్మల్‌ స్కానింగ్‌ చేసిన తర్వాతే ఫాంలోకి అనుమతించాలి.
► షెడ్‌లు క్రమం తప్పకుండా శానిటైజ్‌ చేయాలి. సబ్బు, నీళ్ల బకెట్, హ్యాండ్‌ శానిటైజర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ప్రతి గంట లేదంటే 2 గంటలకు ఒకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి.
► ఫాంలలోకి వెళ్లే వాళ్లు వాచ్‌లు, ఆభరణాలు ధరించొద్దు. మొబైల్‌ ఫోన్‌ వినియోగించకుండా ఉంటే మంచిది. ఫోన్‌ తీసుకెళ్లాలనుకుంటే శానిటైజ్‌ చేయాలి.
► పశువులకు అవసరమైన గడ్డి, దాణా, మందులు అందుబాటులో ఉంచుకోవాలి. 
► పశువుల తీరును శ్రద్ధగా గమనించాలి. గడ్డి, ఇతర ఆహారం సరిగా తీసుకుంటున్నాయా, లేదా గమనించాలి. రోజూ ఉదయం, సాయంత్రం మూత్రం క్రమం తప్పకుండా పోస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి.
► ఏవైనా పశువులు అనారోగ్యం బారిన పడితే పడ్డ వాటిని ఐసోలేట్‌ చేయాలి.
► వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. 
► గర్భంతో ఉన్న పశువుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అవి ఉండే ప్రదేశాల్లో వేడి ఎక్కువ లేకుండా చూసుకోవాలి. 
► రోజూ పశువులను కడగాలి. కొత్తగా పుట్టిన దూడలకు పాలు, ఎలక్ట్రోలైట్‌ నీళ్లు తగినంత తాపించాలి. 
► పాల విక్రయం కోసం వినియోగదారుల వద్దకు పశువులను తరలించి అక్కడ పాలు పిండటాన్ని మానేయాలి.

క్వారంటైన్‌ విషయంలో పాడి రైతులు పూర్తి  అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వం పాడి అభివృద్ధిలో భాగంగా జరిపే పరిశోధనలు, ఇతర విషయాల్లో క్వారంటైన్‌ తప్పకుండా పాటిస్తాం. 21 రోజులు కొత్త పశువును దూరంగా ఉంచిన తర్వాతే మందలో కలపాలి. రైతులు పూర్తిగా ఇది పాటిం చట్లేదు. జాతీయ పశు పరిశోధనా సం స్థ సూచనల నేపథ్యంలోనైనా పాడి రైతులు ‘క్వారంటైన్‌’ అలవాటు చేసుకో వాలి. అన్ని సూచనలను విధిగా పాటించాలి. – డాక్టర్‌ లాకావత్‌ రాంసింగ్,అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పీవీ నరసింహారావు పశు విశ్వవిద్యాలయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement