జహీరాబాద్ టౌన్: పాడి రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), జిల్లా ప్రత్యేకాధికారి పవన్ కుమార్ తెలిపారు.
జహీరాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రంలో శనివారం నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను దాని వెనుక భాగం లో ముద్రించామని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని చెల్లిస్తోందన్నారు. దీనికోసం నిధులను కూడా మంజూరు చేసిందని చెప్పారు.
లీడ్ బ్యాంక్ లీకేజీ ద్వా రా పాడి రైతులకు డైరీ యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ముందుగా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్‌లో యూనిట్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా (9493173769) నంబర్‌కు ఫోన్ చేయొచ్చని సూచించారు. జిల్లా డిప్యూటీ డైరక్టర్ కామేష్, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ శంకర్‌సింగ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షకార్యదర్శులు రాంరెడ్డి, మాణిక్‌రెడ్డి, సామల నర్సింలు పాల్గొన్నారు.
పాడి రైతులకు గుర్తింపు కార్డులు
Published Sat, Nov 15 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement
Advertisement