సమావేశంలో మాట్లాడుతున్న తలసాని
సాక్షి, హైదరాబాద్: విజయ పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఐస్ క్రీం పుష్ కార్ట్ (ట్రై సైకిల్)లను రాష్ట్రవ్యా ప్తంగా 50 శాతం సబ్సిడీతో అందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో విజయ తెలంగాణ బోర్డు 14వ సమావేశం చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన జరిగింది.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్ పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తో పాటు అదనంగా పాడి రైతుల పిల్లలను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యాకానుక, ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం కింద రూ. 5 వేలు, సబ్సిడీపై దాణా, ఉచిత పశువైద్య శిబిరాలు, పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం, మిల్క్‌షెడ్‌లకు అవార్డులు, ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాలను విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
మేలుజాతి పశుసంపద అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న స హకారం గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారు విజయ డెయిరీకే పాలు పోసేవిధంగా చూడాలని మంత్రి సూ చించారు. పాడి రైతులకు ప్రతి 7 రోజుల కు ఒకసారి బిల్లులను చెల్లించాలని సమావేశం తీర్మానించింది. పాల సేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ని యమించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
ప్రధాన పర్యాటక ప్రాంతా లు, ప్రముఖ దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సమ్మక్క సారక్క, కొమురెల్లి జాతర వంటి ప్రధాన జాతరలలో తాత్కాలిక ఔట్లెట్‌లను ఏర్పాటుచేసి విజయ డెయిరీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment