
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు స్వచ్ఛమైన పాలను అందిస్తున్నందుకు ఈ అవార్డు లభించింది. శుక్రవారం ఢిల్లీల్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేశ్‌ప్రభుల చేతుల మీదుగా తెలంగాణ డైయిరీ డెవలప్‌మెంట్ సహకార సంస్థ (విజయ డెయిరీ) ఎండీ శ్రీనివాస్‌రావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మల్లయ్యలు అవార్డు అందుకున్నారు.
విజయ డెయిరీకి ఆహార భద్రత–ఆహార నాణ్యత’విభాగంలో అవార్డు రావడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విజయ డెయిరీ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment