srinivasrao
-
ఏది వాస్తవ చరిత్ర?
జూన్ 27న ‘వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత’ అని డా. కత్తి పద్మారావుగారు రాసిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి అభ్యంతరం లేదు. కాని వాస్తవ చరిత్ర ఏదన్నదే అసలైన చిక్కు. నాలుగు దశాబ్దాల నాడు వచ్చిన ఒక తెలుగు సినిమాలో రావుగోపాలరావు పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ అనే దాన్ని ఆయన తన వ్యాసం ద్వారా మరోమారు చెప్పారు. డీ.డీ. కోశాంబి, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్రలు చెప్పిందే చరిత్రగా అంగీకరించి తీరాలా! అంతకన్నా భిన్నమైన చరిత్ర ఉందని కొత్త పరిశోధన ద్వారా బయటకు తీసుకురాకూడదా?ఒక సబ్జెక్టులో ఒకరి కన్నా ఎక్కువ మంది రాసిన పుస్తకాలు ఉంటాయి. వాటిలో దేనినైనా చదువుకోవచ్చు. కాని చరిత్రలో మాత్రం నియంతృత్వ పోకడగా రొమిల్లా, బిపిన్ చంద్రల పుస్తకాలు దాటి చదవటానికి వీలు లేదనడం సబబేనా? ఈ రచయితలు భారతీయ చరిత్రకు ఒక రంగు పులిమారు. ఆ రంగును పలుచన చెయ్యటాన్ని అంగీకరించం అంటారు వారి శిష్యులు. వివాదాస్పద కట్టడం కూల్చివేత చిన్న విషయం కాదన్నారాయన. ఆ కూల్చివేత వెనుక హిందూ రాజ్య నిర్మాణ భావన ఉందని తీర్మానించారు. అయితే జమ్మూ–కశ్మీర్, కాశీ, మధురల్లో దేవాలయాలు ధ్వంసమవ్వడం చారిత్రక వాస్తవమే కదా! ఆ ధ్వంసం వెనుకనున్న భావన ఏమిటో కూడా పిల్లలకు తెలియాలి కదా!ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి చరిత్ర పుస్తకాలలో మత ఘర్షణల గురించి చెప్పిన అధ్యాయంలో ఏమి రాశారో ఆయన చదివారా? అందులో గుజరాత్లో జరిగినవి, అయోధ్య నేపథ్యంలో జరిగినవి మాత్రమే ఉన్నాయి. నవీన భారత చరిత్రలో ఆ రెండు సందర్భాలలో తప్పించి మరెన్నడూ మత కల్లోలాలు జరగలేదన్నది యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ వంటి రచయితలు భావిస్తుంటే అంతకన్నా హాస్యాస్పదం ఏదీ ఉండదు.కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్కుల ఊచకోత గురించి కూడా వీరు ప్రస్తావించి ఉంటే అది వాస్తవ చరిత్ర అయి ఉండేది. కొన్నింటిని కప్పిపుచ్చి, మరికొన్నింటిని కొందరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివరంగా రాస్తామంటే అది వాస్తవ చరిత్ర కానేకాదు. రైతు ఉద్యమాల గురించి రాసినప్పుడు, 2018లో నాసిక్ నుండి ముంబైకి, ఆ తర్వాత పంజాబ్ నుండి ఢిల్లీకి జరిగిన రైతాంగ ఊరేగింపుల గురించే రాస్తామంటే ఎలా!ఆంధ్రాలో జరిగిన ఎన్జీ రంగా ఆధ్వర్యంలో పలాస నుండి చెన్నపట్నంకి జరిగిన రైతు యాత్ర గురించి రాయం అంటే ఎలా! ‘దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరగనున్నాయి’ అనడాన్ని అంతా స్వాగతించాల్సినదే. అయితే భారతీయులందరికీ వర్తించే లౌకిక చట్టాలు లేకుండా లౌకికవాదం ఎలా పెరుగుతుంది? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అమలు చెయ్యకుండా రాజ్యాంగ స్ఫూర్తి ఎలా వస్తుంది?ఏ వర్గానికి చెందినవైనా చరిత్రలోని మంచి చెడులు చెబితేనే అది వాస్తవ చరిత్ర. ముఖ్యమైనవి, విద్యార్థులకు అంతగా అవసరం లేని అంశాలు పుస్తకాల నుండి తొలగించటం అన్ని సబ్జెక్టులలో జరుగుతుంది. చరిత్ర పుస్తకాల్లోనూ జరిగింది. విద్యార్థులకు మేలు చేసిన అంశం మీద అనవసరపు రాద్ధాంతం ఎందుకు? – డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, 9440421695 -
కొలువుల్లోకి టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ (టీఎస్ఎస్పీ) శిక్షణ కానిస్టేబుళ్లు ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వీరికి ఈనెల 26వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్లు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) చైర్మన్ శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి శిక్షణ అనంతరం వీరికి వారం రోజుల పాటు సెలవులు ఉంటాయని తొలుత భావించారు. కానీ ఈనెల 28వ తేదీనే తమకు కేటాయించిన యూనిట్లలో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వీరికి కేవలం 25, 26, 27 తేదీల్లో మూడు మాత్రమే సెలవు దినాలు రానున్నాయి. 25వ తేదీలోగా ట్రైనీ కానిస్టేబుళ్లందరికీ స్టైఫండ్ చెల్లించాలని స్పష్టం చేశారు. మరోవైపు 22, 23, 24 తేదీల్లో వీరి పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. అపాయింట్మెంట్ ఆర్డర్లు, విధుల్లో చేరాల్సిన తేదీలు ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా శిక్షణ కేంద్రాల్లోని దాదాపు 3,900 మంది టీఎస్ఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లు రెట్టించిన ఉత్సాహంతో పరేడ్‌కు సాధన చేస్తున్నారు. -
రాష్ట్రంలో 4 కేంద్రాల్లో పాస్‌పోర్ట్ సేవలు
సాక్షి, అమరావతి: ‘‘కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పోస్టాఫీస్‌లలో పాస్‌పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశాం. పరిస్థితిని బట్టి ఈ సేవలను పునరుద్ధరిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో పాస్‌పోర్ట్ సేవల కోసం విజయవాడ, విశాఖ, తిరుపతి, భీమవరం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను వినియోగించుకోవచ్చు’’ అని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీ, నిర్వహణతోపాటు పలు విషయాలను ఆయన శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► పాస్‌పోర్ట్ సేవలు బాగా సరళతరం అయ్యాయి. చిరునామాతో ఉన్న ధ్రువపత్రాలు (ప్రభుత్వం నిర్ధారించిన ధ్రువపత్రాల జాబితాకోసం పైన పేర్కొన్న వెబ్సైట్ చూడొచ్చు), జనన ధ్రువీకరణకు ఎస్ఎస్సీ లేదా ప్రభుత్వం నిర్ధారించిన పత్రాలలో ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే చాలు. ► అన్ని ధ్రువపత్రాలు కరెక్ట్‌గా ఉండి పోలీస్ క్లియరెన్స్ వచ్చిన తరువాత 5–7 పనిరోజుల్లో పాస్‌పోర్ట్‌ను ఇంటికి చేరుస్తున్నాం. ► గతంలో ఏ ఊరిలో ఉంటే అక్కడే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడలా లేదు. మీ చిరునామా ఏపీలో ఉన్నా.. నాగపూర్ లేదా ఢిల్లీలో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ పూర్తవగానే మీరున్న ప్రస్తుత చిరునామాకు పాస్‌పోర్ట్ వస్తుంది. ► పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేవారు వేలాదిమంది నకిలీ వెబ్సైట్ల వలలో పడుతున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు. విదేశాంగశాఖ ఇచ్చిన వెబ్సైట్ మినహా దేన్నీ నమ్మొద్దు. ఆర్డినరీ పాస్‌పోర్ట్‌కు రూ.1,500, తత్కాల్‌కు అదనంగా రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఒక్క పైసా ఎక్కువ అడుగుతున్నా అది నకిలీ వెబ్సైట్ అని గుర్తించండి. ► నకిలీ వెబ్సైట్లు, బ్రోకర్లను/ఏజెంట్లతో మోసపోవద్దు. కొన్ని నకిలీ అంతర్జాల చిరునామాలతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులును మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అందువల్ల www.passportindia. gov.inలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌లో mPassport Seva యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి చిరునామాలు పాస్‌పోర్ట్ నంబర్ ద్వారానే గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాం. దీనివల్లే వారిని హోం క్వారంటైన్ చేయగలిగారు. -
తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు స్వచ్ఛమైన పాలను అందిస్తున్నందుకు ఈ అవార్డు లభించింది. శుక్రవారం ఢిల్లీల్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేశ్‌ప్రభుల చేతుల మీదుగా తెలంగాణ డైయిరీ డెవలప్మెంట్ సహకార సంస్థ (విజయ డెయిరీ) ఎండీ శ్రీనివాస్‌రావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మల్లయ్యలు అవార్డు అందుకున్నారు. విజయ డెయిరీకి ఆహార భద్రత–ఆహార నాణ్యత’విభాగంలో అవార్డు రావడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విజయ డెయిరీ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. -
శ్రీనివాస్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు
-
ఫ్లెస్కీ కథలో ఎవరిది నిజం?
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసరావు(40) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి తన పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతంగా 2 ఎకరాలు, కౌలుకు రెండెకరాలు సాగుచేస్తున్నాడు. సాగునీరు సరిగా అందక, పంటల దిగుబడి లేక రూ.15 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించక తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సత్తెనపల్లి సీఐ నూర్జాన్ నిజిత్ బేగ్ సంఘటనస్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. -
భార్యపై రోకలితో దాడి..పరిస్థితి విషమం
ఈపూరు(గుంటూరు జిల్లా): ఈపూరు మండలకేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసరావు, గుడికందుల కుమారి భార్యాభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్‌రావు రోకలిబండతో భార్య తలపై బలంగా మోదాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీ కోసం తపాల పథకాలు
అనంతపురం రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువయ్యేందుకు తపాల శాఖ మంచి పథకాలను ప్రవేశ పెడుతోంది. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తపాలశాఖ ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుతం తపాల శాఖ ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, అటల్ పింఛన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా, జీవన జ్యోతి వంటి పథకాలు పేద ప్రజల భవిష్యత్‌కు బాటలు వేసే పథకాలన్నారు. ఈ పథకాలకు అర్హులు వీరే అటల్ పింఛన్ యోజన ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా అర్హులే.. 18– 40సంవత్సరాల లోపు వారు ప్రతి నెల రూ. 42 నుంచి 210వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఇందులో ప్రత్యేకంగా మూడు నెలలు, ఆరు నెలలకు ఒక సారి డిపాజిట్ చేసుకునే సదుపాయం ఉంది. ముందుగా పోస్టాఫీసులో ఖాతా తెరచి నిర్ధేశించుకున్న మొత్తాన్ని జయ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసుకున్న వ్యక్తికి 65సంవత్సరాలు నిండిన తర్వాత పొదుపు చేసిన మొత్తాన్ని బట్టి ప్రతి నెల పింఛన్ అందుతుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఈ బీమా యోజనలో చేరే వ్యక్తి ముందుగా పోస్టాఫీసులో ఖాతా తెరవాలి. ఈ పథకానికి సంవత్సరానికి రూ. 12చెప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు డిపాజిట్ దారుడు గాయపడితే రూ. లక్ష, ప్రాణాలు కోల్పోతే రూ.2లక్షలు బీమా అందుతుంది. ఈ బీమాకు 18 నుంచి 60సంవత్సరాల వారు అర్హులు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన జీవన్ జ్యోతి యోజన పథకం జీవిత బీమా పథకం ఈ పథకంలో చేరే వ్యక్తులకు 18నుంచి 50సంవత్సరాల లోపు ఉండి పోస్టాఫీసులో ఖాతా ఉండాలి. సంవత్సరానికి రూ. 330 చెల్లించాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే రూ. 2లక్షలు అందజేస్తారు. సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం పదేళ్లలోపు బాలికలకు వర్తిస్తుంది. ఈ ఖాతను రూ. 1000 నుంచి ప్రారంభించి గరిష్టంగా సంవత్సరానికి రూ.1.50లక్షల వరకు చెల్లించ వచ్చు బాలికకు 18ఏళ్లు నిండిన తర్వాత చుదువు, వివాహాం కోసం ఖాతాలోని నిల్వ నుంచి 50శాతం మేర విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తం బాలికకు 21ఏళ్లు నిండిన తర్వాత మొత్తం డబ్బును చెల్లిస్తారు. -
ప్రేమజంట ఆత్మహత్య
గుంటూరు జిల్లా: పురుగుల మందు తాగి ఓ యువకుడు, యువతి మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడు రోడ్డులో శనివారం ఉదయం జరిగింది. వివరాలు..రావిపాడు గ్రామానికి చెందిన మేడ శ్రీనివాసరావు (30) నాలుగు రోజులుగా తల్లిదండ్రులతో మాట్లాడకుండా, ఫోన్లోను అందుబాటులోకి రాకుండా ఉన్నాడు. కాగా, శనివారం శ్రీనివాసరావు, మరో అమ్మాయి శ్రావణి సంధ్య (23) తో కలిసి నరసరావుపేట మండలం పాలపాడు రోడ్డులో ఉన్న ఒక కాలువలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీంతో పోలీసులకు అమ్మాయి ఆవనిగడ్డలో చదువుతున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా వారివద్ద ఉన్న ఫొటోల ఆధారంగా వారు తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వీరి ఆత్మహత్యలకు ప్రేమ వివాహమే కారణమా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (నరసరావుపేట) -
ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం
నెల్లూరు (బృందావనం), న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలపై రానున్న మూడు నెలల్లో వారి భాగస్వామ్యంతోనే ఉద్యమం చేయనున్నట్లు లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు రామలింగాపురంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమాలకు పుట్టినిల్లయిన నెల్లూరు నుంచే తమ పోరాటానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. మద్యం మహమ్మారి, రాజీవ్ యువకిరణాలు పథకం అమలు తీరు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై తమ పోరాటం సాగుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదన్నారు. ప్రజలను మభ్యపెడుతున్న పాలకుల తీరును బట్టబయలు చేస్తామన్నారు. ఉద్యమంలో భాగంగా జనవరి 30న రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలుపుతామన్నారు. అనంతరం నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు తదితర నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పలువురు యువకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు రానున్న ఎన్నికల్లో తాము ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరులోని లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం లోక్‌సత్తా ప్రచారం చేసిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ కలిసి పనిచేశామన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరును లోక్‌సత్తా అధ్యక్షుడు దుయ్యబట్టారు.