రాయచోటి టౌన్ (వైఎస్సార్ జిల్లా) : పాల బకాయిల కోసం పాడి రైతులు ఆందోళన బాట పట్టారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలోని విజయ డెయిరీ కేంద్రాన్ని రైతులు శుక్రవారం ముట్టడించారు. రెండు నెలలుగా తాము పోసిన పాలకు డబ్బులు చెల్లించడం లేదని, తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే మరికొంత వ్యవధి కావాలని మేనేజర్ రాజమోహన్ సర్దిచెప్పబోగా వారు వినలేదు. డెయిరీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. విజయ డెయిరీ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. డెరైక్టర్‌తో మాట్లాడి వారం రోజుల్లో బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.