ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా | Demonetisation: Vijaya Dairy drawn Rs .1.20 crore on the same day | Sakshi
Sakshi News home page

ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా

Published Sat, Nov 19 2016 9:31 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM

ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా - Sakshi

ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా

- విజయ డెయిరీ ఖాతా నుంచి తీసిన వైనం...
- పెద్దనోట్లు రద్దు చేసిన రెండు రోజులకే వ్యవహారం
- కొత్త రూ.2 వేల నోట్లు, వందనోట్లు ఇచ్చిన ఎస్‌బీహెచ్
- నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు అందజేసిన వైనం
- బ్యాంకు అధికారుల తీరుపై పలు అనుమానాలు
 
 సాక్షి, మెదక్: పెద్దనోట్ల రద్దుతో దేశం అంతా ఇబ్బందులు పడుతోంది. ఒక్కోవ్యక్తికి రూ.4 వేలు మార్చుకోవాలని, రూ.10 వేలకు మించి నగదు డ్రా చేయవద్దని కేంద్రం నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు మెదక్ పట్టణంలోని ఎస్‌బీహెచ్‌కు ఏమాత్రం పట్టలేదు. పెద్దనోట్లు రద్దు చేసి రెండురోజులు కూడా కాలేదు. బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు, అధికారులు, సిబ్బంది బిజీబిజీ. అపుడు మెదక్ ఎస్‌బీహెచ్ అధికారులు విజయ డెయిరీ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో రూ.1.20 కోట్ల డబ్బు డ్రా చేసుకునేందుకు అనుమతించిన విషయం వివాదాస్పదంగా మారింది.

 నిబంధనలకు తోసిరాజని రూ.1.20 కోట్లు అందజేత
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయ డెయిరీ పాడిరైతుల నుంచి సేకరించిన పాలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయ డెయిరీ పాడి రైతులకు డబ్బుల చెల్లింపులు చేయలేదు. దీనికితోడు నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించవద్దని నిబంధనలను విధించారు.

ప్రభుత్వ నిబంధనలను తోసిరాజని మెదక్ ఎస్‌బీహెచ్ అధికారులు 11వ తేదీన విజయ డెయిరీ ఖాతా (ఎండీటీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్- 0000006221219 2509) నుంచి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రాకు అనుతించారు. సుమారు 13 సొసైటీ చెక్కులతో ఒకేరోజు ఇంతమొత్తం డ్రా చేసినట్లు తెలుస్తోంది. రూ.1.20 కోట్లలో అధికమొత్తం కొత్త రూ.2 వేల నోట్లు ఇచ్చినట్లు సమాచారం. 11వ తేదీన మెదక్ ఎస్‌బీహెచ్ బ్యాంకులో ఖాతాదారులు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నోట్ల మార్పిడి కోసం గొడవలు పడుతున్నారు.

అలాంటి సమయంలో సైతం ఎస్‌బీహెచ్ అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్ల నగదు విజయ డెయిరీ సొసైటీకి ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. పొరుగునే ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకు అధికారులు విజయ సొసైటీ సభ్యులకు అకౌంట్‌లో నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతించలేదు.

అయితే మెదక్ ఎస్‌బీహెచ్ బ్యాంకు మేనేజర్ మాత్రం ఒకేరోజు రూ.1.20 కోట్ల డబ్బులు డ్రా చేసేందుకు అనుమతించటంతోపాటు రూ.2 వేల నోట్లు పెద్దమొత్తంలో ఇవ్వటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. ఇదిలా ఉంటే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన సొసైటీ సభ్యులు పాడి రైతులకు పూర్తిస్థాయలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. బ్యాంకు అధికారులు, విజయసొసైటీ సభ్యులు కుమ్మక్కై నల్లధనం తెలుపుగా మార్చారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్‌బీహెచ్ బ్యాంకు అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్లు నగదు ఇవ్వటంపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
 
 డబ్బులు డ్రా చేశాం
మెదక్ ఎస్‌బీహెచ్ విజయ డెయిరీ ఖాతా నుంచి 11వతేదీన రూ.1.20 కోట్లు డబ్బులు డ్రా చేశాం. జారుుంట్ అకౌంట్ ఖాతా ఉన్నందున చెక్కులపై నా సంతకం, సొసైటీ చైర్మన్‌ల సంతకాలు చేసి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా చేశాం.కొత్త రూ.2వేల నోట్లు ఇచ్చారు.13 సొసైటీల్లోని పాడి రైతులకు ఇవ్వాల్సిన బకారుులు చెల్లించాం.  - రంజిత్, విజయ డెయిరీ మేనేజర్
 
 డ్రా చేయడం నిజమే
విజయ డెయిరీ ఖాతా నుంచి 11 వతేదీన రూ.1.20 కోట్లు డ్రాకు అనుమతించింది నిజమే నని మెదక్ ఎస్‌బీహెచ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. డబ్బులు డ్రా చేసిన విజయ డెయిరీ సొసైటీ వారికి కొత్త రూ.2వేలనోట్లతోపాటు వందనోట్లు ఇచ్చాం. ప్రభుత్వం ఖాతాల నుంచి డబ్బులు డ్రాకు అనుమతించవద్దన్న నిబంధన మరుసటి రోజు తెలిసింది. అరుుతే ఒకేరోజు రూ.1.20కోట్లు ఒకే ట్రాన్జాక్షన్‌లో ఎలా అనుమతిస్తారన్న దానిపై ఆయన సమాధానం ఇవ్వలేదు.
- శ్రీనివాస్‌రావు, ఎస్‌బీహెచ్ మేనేజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement