padayatara
-
ఈవెనింగ్ వాక్‌ను తలపించిన యువగళం పాదయాత్ర
సాక్షి ప్రతినిధి, కడప: ‘ప్రజల కష్టాలు తెలుసుకుందామంటే ప్రజలెవ్వరూ దరిదాపులకు రాలేదు. 14 ఏళ్లు అధికారం వెలగబెట్టినా ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. చెప్పుకునేందుకు చేసిన కనీస అభివృద్ధి లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాలో యువగళం పాదయాత్ర విజయవంతం బాధ్యత ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలకు అప్పగించారు. అరువు తెచ్చిన జనాలతో రక్తికట్టించే జాగ్రత్తలైతే తీసుకున్నారు. కానీ హాజరైన వారినైనా ఆకట్టుకునే చర్యలకు ఉపక్రమించారా అంటే అదీ లేదు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సరిగా చదవడం రాలేదు. వెరసి ఈవెనింగ్ వాక్‌ను మరిపించేలా యువగళం పాదయాత్ర కొనసాగింది. పక్షం రోజుల పాటు ఇక్కడ పర్యటించిన టీడీపీ నేత నారా లోకేష్ ఇక చేసేది.. చెప్పేది ఏమీలేక ‘ఆత్మస్తుతి..పరనింద’కు ప్రాధాన్యత ఇస్తూ తన పర్యటన ముగించుకుని వెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు నలుగురికి మంచి చేసినా, ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా ప్రజలు గుర్తు పెట్టుకోవడం సహజం. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 14 ఏళ్లు వైఎస్సార్ జిల్లా వివక్షకు గురైంది. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు హయాం మొత్తం జిల్లాకు చంద్రగ్రహణం పట్టిందనే చెప్పాలి. నిర్దిష్టమైన అభివృద్ధి చేపట్టకపోగా, పైగా జిల్లాపై, ఇక్కడి ప్రజానీకంపై విషం గక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఘటన చోటుచేసుకున్నా ‘కడప గూండాలు, పులివెందుల రౌడీలంటూ’ అభాండాలు వేస్తూ, ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారు. అధికారంలో లేనప్పుడు మాత్రం ఈ జిల్లాపై ‘మొసలి కన్నీరు’ కార్చడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ విషయంలో‘ పెదబాబు–చినబాబు ఇద్దరూ ఇద్దరే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు. పాదయాత్రకు కొత్త భాష్యం... ప్రజలు ప్రభుత్వం వద్దకు వెళ్లి వారి సమస్యలు చెప్పుకోలేని స్థితి, చెప్పుకున్నా పరిష్కారం లభించని పరిస్థితుల్లో నాయకులే ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం చూపించడం పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. అయితే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కొత్త భాష్యం చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి, 10.30 గంటలలోపు ముగింపు పలికారు. ‘నాడు పెదబాబు రాత్రిళ్లు లాంతరు లైటింగ్‌లో పాదయాత్ర చేపట్టగా, నేడు చినబాబు ఈవెనింగ్ వాక్‌ను తలపించేలా జిల్లాలో పక్షం రోజులు తిరిగారు. ఇక ఏ నియోజకవర్గానికి వెళితే అక్కడ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేయడమే అసలు పనిగా పెట్టుకున్నారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపకపోగా బురదజల్లి పోవడమే లక్ష్యంగా ప్రసంగం కొనసాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ అభివృద్ధి సాధించామని చెప్పుకునేందుకు అవకాశం లేకపోవడంతో పదేపదే అనంతపురం జిల్లాలోని ‘కియా’ కార్ల పరిశ్రమ గురించి ఊదరగొట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారమే.. యువగళం విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికాబద్ధంగా టీడీపీ పావులు కదిపింది. ఓవైపు జనాలను తరలించే భారాన్ని భరిస్తూనే, మరోవైపు నారా లోకేష్ అండ్ టీమ్‌కు ఖర్చులకు రోజుకు రూ.7లక్షల చొప్పున నియోజకవర్గ ఇన్చార్జిలు చెల్లించాల్సి వచ్చిందని వినికిడి. నారా లోకేష్ ‘జాలీ’గా యాత్ర చేస్తుంటే వ్యయ ప్రయాసలకు లోనైన ఇన్చార్జిల వైపు ‘జాలి’గా చూడటం పార్టీ శ్రేణుల వంతైంది. జమ్మలమడుగు మొదలుకొని ప్రొద్దుటూరు, మైదుకూరు, చెన్నూరు, సిద్దవటం, బద్వేల్ ప్రాంతాల్లో బహిరంగ సభల నిర్వహణకు కూడా పథకం ప్రకారం ఇరుకు సందులనే ఎంచుకోవడం విశేషం. తండ్రికి తగ్గ తనయుడుగా.. అబద్ధాలు వల్లించడంలో తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ జిల్లాలో పేరు పొందారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కడప స్టీల్ ప్లాంట్‌ను చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని పొందుపర్చినా ఐదేళ్ల కాలంలో టీడీపీ సర్కార్ ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత 2018 డిసెంబర్ 27న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామం వద్ద సీఎం హోదాలో చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు శంకుస్థాపనతో సరిపెట్టారు. టీడీపీ సర్కార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కృషి చేస్తే, వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ పట్టించుకోలేదనే విమర్శలు నారా లోకేష్ చేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు తీవ్రమైన కరోనా వైరస్‌ను ఎదుర్కొని ప్రజలను రక్షించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండిపోయింది. తర్వాత ప్రఖ్యాత స్టీల్ ప్లాంట్ జేఎస్‌డబ్ల్యు సంస్థ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. పరిశ్రమ నెలకొల్పేందుకు అనువైన మౌలిక వసతుల కోసం రూ.725 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి వసతులు సమకూర్చింది. రూ.3300 కోట్ల పెట్టుబడితో తొలివిడత నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యు అధినేత సజ్జన్ జిందాల్ శ్రీకారం చుట్టారు. అలాగే జిల్లాలోని గండికోట, రాజోలి రిజర్వాయర్, నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు పట్ల కూడా నారా లోకేష్ అవగాహన లేమి స్పష్టంగా తేటతెల్లమైందని పలువురు వివరిస్తున్నారు. బలోపేతం కాకపోగా.. వర్గాలకు ఆజ్యం... నారా లోకేష్ యువగళం కార్యక్రమం వల్ల తెలుగుదేశం పార్టీకి బలం చేకూరకపోగా, వర్గ విభేదాలకు ఆజ్యం పోశారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఇన్చార్జి గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ఆకాశానికెత్తి, మాజీ ఎమ్మెల్యేలు మల్లెల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డిలను నియంత్రించడంపై ఆయా నేతల అనుచరులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డితో ఏకాంతంగా చర్చలు జరపడం, టీడీపీ బహిష్కృత నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సాయినాథ్శర్మలను లోకేష్ టెంట్‌లోకి అనుమతించడంతో ఇన్చార్జిలు అటు పుత్తా నరసింహారెడ్డి, ఇటు పుట్టా సుధాకర్‌యాదవ్‌లు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కడపలో ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబాన్ని నియంత్రించేందుకు కడప నేతలు ఏకమయ్యారని, నేతల మధ్య అనైక్యత స్పష్టంగా కన్పించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ఓ ప్రహసనంలా ముగిసిందనడంలో సందేహం లేదు. -
నారా లోకేష్‌పై ఎమ్మెల్యే శిల్పా రవి ఫైర్
సాక్షి, కర్నూలు: లోకేశ్ తీరుపై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో లోకేష్ పాదయాత్ర గొడవలు సృష్టించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ రాజధాని వద్దన్న వ్యక్తి యాత్ర చేయడం బాధాకరమన్నారు. దళితులు, మహిళా ఎమ్మెల్యేను కించపరచడం సరికాదని, ఘర్షణలు జరగాలని లోకేశ్ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే శిల్పా రవి దుయ్యబట్టారు. చదవండి: అసలుకే ఎసరు పెట్టిన లోకేష్ యాత్ర.. టీడీపీలో కొత్త ట్విస్టులు! నారా లోకేశ్ నిజాలు తెలుసుకుని.. ఆదోని అర్బన్: ఎవరో అవగాహనలేని వారు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మాని, నారా లోకేశ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి హితవు పలికారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు జయమనోజ్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కడితోట యువగళం సభలో నారా లోకేష్ తనపై, తన భార్య, కుమారుడిపై కబ్జాలు, దోపిడీలు అంటూ ఆరోపణలు చేశారని, వాటిని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా అంటూ లోకేశ్‌కు సవాల్ విసిరారు. తాము పుట్టుకతోనే భూస్వాములమని కబ్జాలు చేసే చరిత్ర తమకు లేదని అన్నారు. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. బెల్ట్ తీస్తా: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్ట్ షాపులు కేసీఆర్ తీసుకొచ్చారు. అందుకే అక్కల బాధలను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామాల్లో బెల్ట్ షాపులుంటే బట్టలూడదీసి కొట్టి బొక్కలో వేయిస్తా’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ రైతు బజార్లను తెరిపిస్తే.. ఈనాడు బెల్ట్ షాపులు తెరిచారని, వీటిని కాంగ్రెస్ రాగానే రద్దు చేస్తుందని ప్రకటించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ తెచ్చామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. అదే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘10 ఎకరాల్లో పంజాగుట్ట చౌరస్తాలో గడీ నిర్మించుకున్నాడు. సచివాలయం, ప్రగతి భవన్లో విలాసవంత జీవనం ఉంది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్, కొడుకు కేటీఆర్ 500 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. కానీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు’అని ఆయన మండిపడ్డారు. కొండా మీద కోపంతో వరంగల్‌ను చెత్త కుప్పలా తయారు చేశారు ’’దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వరంగల్‌కు 2014లో గ్రహణం పట్టింది. ప్రజలపై ఆధిపత్యం చెలాయించే ప్రతీ సందర్భంలోనూ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు స్పందించారు. కానీ ఈ వర్సిటీలో నియామకాలు లేవు. బోధనా సిబ్బంది లేరు. ఉన్నవాళ్లకు జీతాలు లేవు. విద్యార్థులకు వసతుల్లేవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. మొన్న సునీల్‌నాయక్ పీజీ చదివి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్‌లో నామీద కోపం ఉండి అభివృద్ధి చేయలేదు. కొండా దంపతుల మీద కోపం ఉండి వరంగల్‌ను చెత్త కుప్పలా తయారు చేసింది ఈ దండుపాళ్యం ముఠా’’అని రేవంత్ విమర్శించారు. వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలకు గంజాయి అలవాటు చేశారు. ఇక్కడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సహా వరంగల్ ఎమ్మెల్యేలు అంతా కబ్జాలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపించారు. ’’దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే కేసీఆర్.. తేదీ, స్థలం ప్రకటించండి. కేసీఆర్ ఫామ్‌హౌస్ అయినా, వరంగల్ హంటర్ రోడ్డు అయినా ఎక్కడైనా సిద్ధం’’అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్ ఇన్చార్జ్ అంజన్‌కుమార్ యాదవ్, కొండా మురళి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘లోకేష్ యువగళం.. యువగంగాళంలా మారిపోయింది’
సాక్షి, అమరావతి: విభజన చట్టానికి చంద్రబాబు వక్రభాష్యం చెబుతున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శివరామకృష్ణన్, శ్రీకృష్ణ, బూస్టన్ కమిటీలు వికేంద్రీకరణే అవసరమన్నాయన్నారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానికే లేదంటున్నాడు చంద్రబాబు. మరి అమరావతిని నిర్ణయించే అధికారం మీకు ఎవరిచ్చారు? అని వెంకటరెడ్డి ప్రశ్నించారు. ‘‘లోకేష్ యువగళం.. యువగంగాళంలా మారిపోయింది. లోకేష్ పాదయాత్ర కామెడీగా మారింది. లోకేష్ అడ్డదారిలో వచ్చి మంత్రి పదవులు సాధించాడు. మళ్లీ గెలవలేక పారిపోయాడు. పాదయాత్ర అంటే అదొక ఫీలింగ్. పేదలను అక్కున చేర్చుకోవటం, వారి సాధక బాధకాలు అర్థం చేసుకోవాలి. అడ్డదారిలో తిరిగే లోకేష్‌కి అవేమీ తెలియవు. చంద్రబాబు చేసినన్ని బ్రోకర్ పనులు మరెవరూ చేయలేదు’’ అంటూ వెంకటరెడ్డి దుయ్యబట్టారు. చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’ -
ఏప్రిల్ 14 నుంచి ‘బండి’ నడక
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులను.. ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడతామన్నారు. సోమవారం హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. ‘ఈసీకి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌పై ఫిర్యాదు చేసిన వారిని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు కిడ్నాప్ చేయడం అత్యంత దారుణం. దీనిపై ఈసీ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫి ర్యాదుదారులను జైళ్లో పెట్టడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారు. బీజేపీ ఇలాంటి దా రుణాలను అడ్డుకుని తీరుతుంది. మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందో ళనలను కొనసాగిస్తాం’అని ప్రకటించారు. మేధావులంతా బీజేపీలోకి రావాలి.. ‘బీజేపీ అధికారంలోకి రానుందని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అక్కడా.. ఇక్కడా.. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నరు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమిస్తాం’అన్నారు. నిజమైన ఉద్యమకారులతోపాటు మేధావులంతా బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘ఇటీవల జనగామ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారు. అదే జనగామలో మార్చి నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించి సత్తా చూపిస్తాం. మార్చి 6 నుంచి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించనున్నాం. 6న తొలి సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిస్తాం. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగింది’అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని, గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన అంశాలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్‌ఛుగ్, పార్టీ జాతీయ సంస్థాగత సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్‌జీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసం క్లైమాక్స్‌కు చేరింది
-
చంద్రబాబు మోసం క్లైమాక్స్‌కు చేరింది : వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : నాలుగేళ్లుగా 5 కోట్ల ఏపీ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు వ్యవహారం క్లైమాక్స్‌కు చేరినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం గుంటూరు కింగ్ హోటల్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముందుగా ఎండల్ని సైతం లెక్కచేయకుండా తన వెంట నిలుస్తున్న ప్రజానీకానికి అభివాదం చేసి ఆయన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు. కనుచూపు మేరలో సీఎం ఆఫీస్... ‘ఇక్కడికి కొద్దికిలోమీటర్ల దూరంలోనే సీఎం క్యాంప్ ఆఫీసు కనిపిస్తోంది. అయినా గుంటూరులో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. తాగటానికి కనీసం మంచి నీరు కూడా దొరకటం లేదు. తాగేది మంచి నీరా? మురుగు నీరా? అన్నది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. డయేరియా వ్యాధితో తమ వాళ్లు చనిపోతున్నారని.. అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని ఇక్కడి ప్రజలు చెబుతుంటే గుండె తరుక్కుపోతోంది. సుమారు 20 మంది చనిపోయారని అధికారులు లెక్కలు చెబుతుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోనీ.. బాధిత కుటుంబాలకు పరిహారమైన సరిగ్గా ఇచ్చారా? అంటే అది లేదు. గాలికొదిలేశారు’ అని జగన్ ప్రసంగించారు. జీజీహెచ్ ప్రత్యక్ష ఉదాహరణ... డయేరియా మరణాలకు తోడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్) నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 10 రోజుల పసికందును ఎలుకలు కొరికి చంపడం.. పాములు కనిపిస్తే పేషంట్లు పరుగులు తీయటం.. చిన్న పిల్లలు కిడ్నాప్‌లకు గురికావటం.. చివరకు జనరేటర్లు లేక సెల్‌ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు జరిగిన దారుణమైన పరిస్థితులు కనిపించాయి. వీటన్నింటికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? అని జగన్ నిలదీశారు. పేదల జీవితంతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫ్లాట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. రూ.3లక్షలు విలువ చేసే ఫ్లాట్లను రూ.6లక్షలకు అంటగడుతూ.. కాంట్రాక్టర్లతో కలిసి చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఇదేనా హైటెక్ పాలన?... ‘పాలన పరంగా అభివృద్ధికి నోచుకోకపోగా.. ప్రజల జీవితాలు మరింత అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఈ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది ఏదైనా ఉందా? అంటే.. మోసం చేయటం.. అబద్ధాలు చెప్పటం.. విచ్చల విడి అవినీతి. మట్టి నుంచి ఇసుక దాకా.. దేన్నీ వదల్లేదు. చివరకు గుడి భూములను కూడా మింగేశారు. ఇదేనా హైటెక్ పాలన అంటే?... పైన చంద్రబాబు-గ్రామాల్లో జన్మభూమి కమిటీలు లంచాలు లేకుండా పనులు చేయట్లేదు. మరుగుదొడ్ల విషయంలో కూడా అవినీతే’ అని వైఎస్ జగన్ ఆక్షేపించారు. ఇక పేరే చర్ల ఘోర ప్రమాదం తాలుకూ బాధిత కుటుంబాల ఆవేదనను జననేత ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా ఆడపడుచుల కన్నీళ్లను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని చంద్రబాబుకు జగన్ సూచించారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉందా? ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ది ఉందా? అని ప్రజల తరపున వైఎస్ జగన్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మీద వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోయి ఉంటే.. చంద్రబాబు అవిశ్వాసం ప్రస్తావన తెచ్చేవాడా? అని నిలదీశారు. మార్చి 15న వైఎస్సార్సీపీ అవిశ్వాసానికి మద్ధతు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. మరుసటి రోజే యూటర్న్ తీసుకున్నారన్నారు. ‘మొత్తంగా ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని చెబుతున్నప్పటికీ.. ఈ పెద్ద మనిషి(చంద్రబాబును ఉద్దేశించి) రాజీనామాలు చేయించనని చెబుతున్నాడు. పైగా రాజీనామాల గురించి ప్రస్తావించని మనిషి ఇప్పుడు అవినీతిపై కేంద్రం ఎక్కడ విచారణ జరిపిస్తుందోనన్న భయంతో ఇతర పార్టీల మద్ధతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లాడు. చంద్రబాబు తరపున రాజీనామాల నిర్ణయం ఏదైనా.. మా ఎంపీలు మాత్రం రాజీనామా చేసి ఏపీ భవన్లో ఆమరణ దీక్ష చేస్తారు’ అని జగన్ ఉద్ఘాటించారు. ఆమరణ దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం చర్చిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దిగివస్తుందని జగన్ చెప్పారు. ఒక్కసారి ఆలోచన చేయండి.. ‘చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోకండి. ఈసారి మిమల్ని ప్రలోభ పెట్టడానికి పెద్ద పెద్ద మోసాలకు తెరలేపుతాడు. ఇచ్చేదంతా తీసుకోండి. అదంతా ప్రజలను దోచేసి ఆయన సంపాదించిన సొమ్మే. కానీ, ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయండి’ అని జగన్ ప్రజలను కోరారు. నవరత్నాలు... ‘పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటుకానున్న ప్రజా ప్రభుత్వం ఏమేమి చెయ్యబోతున్నదో ‘నవరత్నాల’ ద్వారా ఇప్పటికే ప్రకటించాం. అందులో పేద పిల్లల చదువులు, పెన్షన్ల అంశాలను మరొకసారి గుర్తుచేసుకుందాం. పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చదవాలంటే లక్షల ఫీజు కట్టాలి. చంద్రబాబు రూ.30 వేలిచ్చి సరిపెడుతున్నారు. అదే మన ప్రభుత్వం వస్తే పిల్లల చదువులకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులు హాస్టళ్లలో ఉండటానికి వీలుగా మెస్‌చార్జి కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. అప్పులబారినపడి ఏ తల్లిదండ్రీ పిల్లల్ని స్కూలుకు పంపించని పరిస్థితి రావద్దు. అందుకే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి నెల నెలా రూ.15 వేలు అందిస్తాం. అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా మీ పిల్లల్ని చదవిస్తా’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
పొద్దు పొడవక ముందే.. పోటెత్తారు!
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పొద్దు పొడవక ముందే ప్రొద్దుటూరు పోటెత్తింది. తమ అభిమాన నేతను చూసేందుకు జనం వెల్లువలా తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాత్రి బసచేసిన ప్రాంతానికి ఆదివారం ఉదయం 6 గంటలకే జనం పోటెత్తారు. 7 గంటలకు ఆ ప్రాంతం జన సంద్రంగా మారింది. 8.30 గంటలకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించే సమయానికి హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీసాయి వెంచర్ జనంతో నిండిపోయింది. ఇదే ఆదరణ దారి పొడవునా.. రాత్రి బస చేసే వరకూ కొనసాగింది. జగన్ పాదయాత్ర అమృతనగర్, చెన్నమరాజుపల్లె, రాధానగర్, ఎర్రబల్లె మీదుగా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలానికి చేరుకుంది. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు, కుల సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, టీచర్లు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, రైతులు వైఎస్సార్ సీపీ అధినేతకు తమ సమస్యలను విన్నవించారు. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకూ అభయం ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర మొదలెట్టి అమృతనగర్ వైపు వెళ్తున్న సమయంలో కొందరు వృద్ధులు పింఛన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సుబ్బమ్మ అనే వృద్ధురాలు అమృతనగర్‌లో రహదారుల దుస్థితిని వివరిస్తూ.. గుంతలమయమైన రహదారుల వల్ల తమ మనుమరాలికి రెండుసార్లు కాళ్లు, చేతులు విరిగాయని విలపించారు. రోదిస్తున్న సుబ్బమ్మను జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటుచేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం వచ్చాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2 వేల చొప్పున పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్నారు. అవ్వాతాతలకు తోడుగా ఉండాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏకోశానా లేదని విమర్శించారు. అమృతనగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బుడగ జంగాల హక్కుల పోరాట సమితి నేతలు వారి సమస్యలు వివరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఎస్టీ జాబితాలో చేరుస్తామని వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర అమృతనగర్‌కు చేరుకున్నప్పుడు చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. రుణాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని, పిల్లలను చదివించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేయగా, అన్ని విధాలా ఆదుకుంటానని జగన్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మగ్గాన్ని తిప్పి నూలు వడికారు. పలువురు ఆటో డ్రైవర్లు, రజకులు జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. విద్యార్థి, యువజన సంఘాలు సైతం జగన్‌ను కలిసి వినతిపత్రాలిచ్చాయి. రుణాలు మాఫీ కాలేదని రైతుల ఆవేదన ప్రొద్దుటూరు పట్టణం శివారులోని హౌసింగ్ బోర్డు సాయిశ్రీనగర్ వద్ద జగన్మోహన్రెడ్డిని దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కలిసి తమ గోడు వినిపించారు. వరి కంకులు, పనలతో వచ్చిన రైతులు తమకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరారు. తమ రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే రైతుల కష్టాలు తీరుస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయించేందుకు కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర నేతలు శ్యాంసుందర్‌రెడ్డి, ఆర్.వెంకటరమణ, ఏ.కృష్ణారెడ్డి తదితరులు జగన్‌ను కోరారు. చెన్నమరాజుపల్లెలో జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ట్రాక్టర్లలో పూలగంపలను పెట్టుకుని రోడ్డంతా చల్లుతూ, ఆ పూలపై వైఎస్ జగన్‌ను నడిపించారు. కావనూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బెదిరింపులకు పాల్పడినా.. అక్కడి ప్రజలు రాజన్న బిడ్డను చూసేందుకు వందల సంఖ్యలో రోడ్డుపైకి తరలివచ్చారు. ఆరో రోజు యాత్రలో మొత్తం 15.8 కిలో మీటర్లు నడిచిన జగన్ రాత్రి 7.29 గంటలకు దువ్వూరు సమీపంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. అనంతరం వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, ప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు జగన్‌ను కలిసి సమస్యలు వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం.. పాదయాత్ర నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నేతలు జగన్‌ను కలిసి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. 11 నెలలుగా చంద్రబాబు సర్కారు పీఆర్సీ బకాయిలు చెల్లించలేదని వారు జగన్ దృష్టికి తెచ్చారు. తాము అధికారంలోకి రాగానే పీఆర్సీ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. నోషనల్ లేని పీఆర్సీని అందిస్తామన్నారు. హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఆర్వీ జనార్దన్‌రెడ్డి వైఎస్ జగన్‌కు వినతి పత్రం ఇస్తూ.. జగన్ ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు. -
ఏ చట్టం ప్రకారం నిలువరిస్తున్నారు?
బాబుపై విరుచుకుపడిన ముద్రగడ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అనేకమంది పాద యాత్రలు చేశారు. రోడ్లు తవ్వేసి మెత్తని తివాచీ వేయిం చుకొని చంద్రబాబు కూడా పాదయాత్రను చేపట్టారు. ఇవన్నీ 2009 తరువాత జరిగినవి కాదా? అప్పుడు ఏ రీతిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ రూలు, నమూనా ఇస్తే నేనూ అదే దారిలో నడుస్తాను. అస్తమానూ మాకే రూల్స్ చెబుతారు... అంటే చట్టాలు, కోర్టులు వారికే చుట్టాలా? మాకు కాదా? అసలు ఏ రూలు ప్రకారం ఆపారు?’’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. గత నెల 26న అమలు చేసిన గృహ నిర్బంధం ఉత్తర్వులు బుధవారంతో ముగియడంతో గురువారం ఉదయం 9.30 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసం నుంచి పాదయాత్రను ప్రారం భించారు.ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ తప్పని పరిస్థితుల్లో వెనక్కి వెళ్లిపోక తప్పలేదు.