
భజన చట్టానికి చంద్రబాబు వక్రభాష్యం చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: విభజన చట్టానికి చంద్రబాబు వక్రభాష్యం చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శివరామకృష్ణన్, శ్రీకృష్ణ, బూస్టన్ కమిటీలు వికేంద్రీకరణే అవసరమన్నాయన్నారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానికే లేదంటున్నాడు చంద్రబాబు. మరి అమరావతిని నిర్ణయించే అధికారం మీకు ఎవరిచ్చారు? అని వెంకటరెడ్డి ప్రశ్నించారు.
‘‘లోకేష్ యువగళం.. యువగంగాళంలా మారిపోయింది. లోకేష్ పాదయాత్ర కామెడీగా మారింది. లోకేష్ అడ్డదారిలో వచ్చి మంత్రి పదవులు సాధించాడు. మళ్లీ గెలవలేక పారిపోయాడు. పాదయాత్ర అంటే అదొక ఫీలింగ్. పేదలను అక్కున చేర్చుకోవటం, వారి సాధక బాధకాలు అర్థం చేసుకోవాలి. అడ్డదారిలో తిరిగే లోకేష్‌కి అవేమీ తెలియవు. చంద్రబాబు చేసినన్ని బ్రోకర్ పనులు మరెవరూ చేయలేదు’’ అంటూ వెంకటరెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’