Shilpa Ravichandra kishore Reddy
-
శిల్పా నా ఫ్రెండ్.. నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..
-
Allu Arjun Nandyal Photos: అస్సలు తగ్గేదే లే.. నంద్యాలలో శిల్పాతో పుష్పరాజ్ (ఫొటోలు)
-
ఛీ కొట్టిన చంద్రబాబుకు ఎప్పటికీ బుద్ధిరాదు..
-
ఛీ కొట్టిన చంద్రబాబుకు ఎప్పటికీ బుద్ధిరాదు..
-
ఇంటింటా ప్రచారం చేసిన YSRCP అభ్యర్థులు
-
నా దమ్ము, ధైర్యం.. మన జగనన్న: శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి
సాక్షి, నంద్యాల: గత 17 ఏళ్లలో నంద్యాలలో చేయని అభివృద్ధి మనం మూడేళ్లలోనే చేశామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అన్నారు. నంద్యాల బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, మనమంతా చొక్కా చేతులు మడత పెడదామా?. వైఎస్ జగన్‌ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధమా?. నంద్యాల పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మీరంతా సిద్ధమా?’’ అంటూ క్యాడర్‌ను ఉత్సాహపరిచారు. శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ‘‘నా దమ్ము, నా ధైర్యం.. మన జగనన్న. ఈ కటౌట్ మన వెనుక ఉన్నంతవరకు మనకు భయమనేది డిక్షనరీలో ఉంటుందా? మనల్ని ఎవరైనా భయపెట్టగలుగుతారా?. రెండేళ్లు కరోనా ప్రభావం తర్వాత కేవలం మూడేళ్లలోనే మన నంద్యాల అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈరోజు నంద్యాలను జిల్లా చేశాం. నంద్యాలకు రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని తీసుకొచ్చాం. నంద్యాల దాహార్తిని తీర్చడానికి రూ.154 కోట్లతో అమృత్ పథకాన్ని పూర్తి చేశాం. కుందు వెడల్పు కార్యక్రమం చేశాం, నేషనల్ హైవే తీసుకొచ్చాం, పార్కులు కట్టాం, అర్బన్ హెల్త్ సెంటర్లు, సీహెచ్‌సీలు కట్టాం, గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి లోన్లు, మిర్చి యార్డు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించాం. వర్షాలు లేకపోయినా సరే పంటలు ఎండిపోకుండా రెండుసార్లు పంటలు పండించిన ఘనత జగనన్న ప్రభుత్వానిది. గత 17 ఏళ్లలో నంద్యాలలో చేయని అభివృద్ధి మనం మూడేళ్లలోనే చేశాం. జగనన్న మీ ముందు కొన్ని కోరికలు, డిమాండ్లు ఉంచుతున్నాను. ఒకటి.. నంద్యాలను మున్సిపల్ కార్పొరేషన్ చేయడం, రెండు.. నుడా చేయడం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అవుటర్ రింగ్ రోడ్డు, భూసేకరణ చేసి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి ఒకటే డిసైడ్ అయ్యి వచ్చాం. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాం, కొనసాగుతాం లేకపోతే రాజకీయాల నుంచి తప్పకుంటా కానీ, జగనన్నను మాత్రం వదలేది లేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన జనం, బయట చూసిన జనం, వారు చూపిన ప్రేమానురాగాలు చూస్తుంటే మనస్సు ఉప్పొంగి పొర్లుతోంది’’ అని శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అన్నారు. -
నంద్యాల అభివృద్ధి ఎలా జరిగిందో వివరించిన ప్రజలు..
-
నారా లోకేష్‌పై ఎమ్మెల్యే శిల్పా రవి ఫైర్
సాక్షి, కర్నూలు: లోకేశ్ తీరుపై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో లోకేష్ పాదయాత్ర గొడవలు సృష్టించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ రాజధాని వద్దన్న వ్యక్తి యాత్ర చేయడం బాధాకరమన్నారు. దళితులు, మహిళా ఎమ్మెల్యేను కించపరచడం సరికాదని, ఘర్షణలు జరగాలని లోకేశ్ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే శిల్పా రవి దుయ్యబట్టారు. చదవండి: అసలుకే ఎసరు పెట్టిన లోకేష్ యాత్ర.. టీడీపీలో కొత్త ట్విస్టులు! నారా లోకేశ్ నిజాలు తెలుసుకుని.. ఆదోని అర్బన్: ఎవరో అవగాహనలేని వారు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మాని, నారా లోకేశ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి హితవు పలికారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు జయమనోజ్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కడితోట యువగళం సభలో నారా లోకేష్ తనపై, తన భార్య, కుమారుడిపై కబ్జాలు, దోపిడీలు అంటూ ఆరోపణలు చేశారని, వాటిని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా అంటూ లోకేశ్‌కు సవాల్ విసిరారు. తాము పుట్టుకతోనే భూస్వాములమని కబ్జాలు చేసే చరిత్ర తమకు లేదని అన్నారు. -
అది చంద్రబాబు భరోసా యాత్రే
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తోంది చంద్రబాబు భరోసా యాత్ర అని అందరికీ స్పష్టంగా అర్థం అవుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఎంత మంచి చేస్తోందో కనీస అవగాహన లేకుండా పవన్.. కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పడం చూస్తుంటే ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడు కాక మరేమవుతారని ప్రశ్నించారు. రైతుల పేరుతో రాజకీయం చేస్తూ.. చంద్రబాబుకు లబ్ధి చేకూరుస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో తయరయ్యే స్క్రిప్ట్ మేరకు స్క్రీన్‌ప్లే, కథ, దర్శకత్వం సాగుతోందని.. వెరసి చంద్రబాబు ఆనే నిర్మాతకు అనుకూలంగా వపన్ కల్యాణ్ నటిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు కోసమే తాను ఈ పని చేస్తున్నానని ప్యాకేజీ స్టార్ స్పష్టంగా చెప్పేశారన్నారు. ‘చంద్రబాబు అధికారంలోఉంటే... యాంటి ఇంకంబెన్సీ ఓటును, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పోటీ చేయాలని మిగతా పార్టీలను కూడా సిద్ధం చేయటానికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. చంద్రబాబుకు సొంత పుత్రుడు లోకేశ్‌పై నమ్మకంలేకనే.. దత్త పుత్రుడి వెంట పడుతున్నారు. బీజేపీ వెంట ఉన్న పవన్.. ఎప్పుడెప్పుడు చంద్రబాబు తోక పట్టుకోవాలా.. అని తహతహలాడుతున్నారు. రియల్ లైఫ్‌లో, పొలిటికల్ లైఫ్‌లో ఒక సిద్ధాంతం అంటూ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇదీ క్యారెక్టర్ లేని ఈ ఆర్టిస్టు పరిస్థితి. ఇవాళ చనిపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. మహిళలంటే వాడుకుని వదిలేసే వస్తువులుగా చూస్తున్న పవన్‌కల్యాణ్.. ఇవాళ ఏ ఒక్క అక్కచెల్లెమ్మను ఓదార్చడానికి అర్హుడు కాదు. అయినా చంద్రబాబుకు కానీ, పవన్‌కు కానీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేదు’ అని అన్నారు. -
నంద్యాల జిల్లా పర్యటనకు సీఎం జగన్.. పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ఈనె 8వ తేదీన నంద్యాల జిల్లాకు వస్తున్నారు. ఈసందర్భంగా సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ మనజీర్‌జిలానీ శామూన్ బుధవారం రాత్రి వెల్లడించారు. విజయవాడ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు శుక్రవారం ఉదయం 10.50 గంటలకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11.10 గంటలకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి 11.35గంటలకు బహిరంగ సభ జరిగే ఎస్పీజీ మైదానానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం, పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.40కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వెళ్తారు. ఏర్పాట్ల పరిశీలన నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్, ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్‌జిలానీ శామూన్, కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీ సెంథిల్‌కుమార్, ఎస్పీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) ఎయిర్‌పోర్టులో పటిష్ట బందోబస్తు కర్నూలు(సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీన నంద్యాల రానున్న నేపథ్యంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డి, ఎయిర్‌పోర్టు ఇన్చార్జ్ డైరెక్టర్ మధుసూదన్‌తో కలసి ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం గన్నవరం నుంచి విమానంలో ఓర్వకల్లు చేరుకొని హెలికాప్టర్ ద్వారా నంద్యాల వెళ్లనున్నారన్నారు. అలాగే తిరిగి నంద్యాల నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకొని విమానంలో గన్నవరం వెళ్లనున్నారని పేర్కొన్నారు. -
‘జగత్’ కంత్రీలు.. వెలుగులోకి 'భూమా'య..
ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే వారే కబ్జాదారుడికి అండగా నిలిచారు. పీర్ల మాన్యం ఆక్రమణలో తమ వంతు పాత్ర పోషించారు. ఆక్రమిత స్థలంలో డెయిరీ నిర్మాణాన్ని సైతం చేపట్టారు. బాధిత ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ‘భూ మా’య విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నంద్యాల: ఆళ్లగడ్డ పట్టణంలోని సర్వే నం. 67లో 6.40 ఎకరాల పీర్ల మాన్యం భూమి ఉంది. దీన్ని ముల్లా మక్తుమ్ సాహెబ్ వారసులు అనుభవించేవారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో పీర్ల చావిడి సేవలు, పండుగలు ఘనంగా జరిపేవారు. అయితే ఈ భూమిపై భూమా అఖిలప్రియ అనుచరుడు కోతమిషన్ షరీఫ్ కన్ను పడింది. ముల్లా కుటుంబ సభ్యులను భయపెట్టి మాన్యాన్ని కబ్జా చేశారు. ఈ భూమిని తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ఇళ్లను నిర్మించారు. వీటిని కొంత మందికి అమ్మేశారు. మరికొంత స్థలంలో భూమా కుటుంబ సభ్యులు జగత్ డెయిరీని నిర్మించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 67 సర్వే నంబరులో రికార్డుల ప్రకారం ఏయే నిర్మాణాలు ఉన్నాయో తెలపాలని ముల్లా కుటుంబం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సర్వే నంబరులో ఇళ్లు, జగత్ డెయిరీ, బీబీఆర్ స్టేడియం, షాదీఖానా, రోడ్లు, జగత్ డెయిరీ ఫార్మా నిర్మాణాలు ఉన్నాయని, 4.50 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని ఆళ్లగడ్డ తహసీల్దార్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాన్యం భూమిలో 0.66సెంట్లు ఆక్రమించి జగత్ డెయిరీ ఫార్మా నిర్మించినట్లు తేలింది. పీర్ల మాన్యం మొత్తం ఆక్రమణలో ఉన్నా.. రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ భూమా అఖిలప్రియ సైతం నోరుమెదపడం లేదు. (అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?) ముస్లింలకు న్యాయం చేయాలి భూమా అఖిలప్రియ మాటలు, చేష్టలు వేర్వేరుగా ఉన్నాయి. ముస్లింలపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నట్లు మాట్లాడుతారు. ఆళ్లగడ్డలో మాత్రం ముస్లింలకు చెందిన భూములను ఆక్రమించుకొని, అందులో కట్టడాలు నిర్మిస్తారు. ఆళ్లగడ్డలో పీర్ల మాన్యం ఆక్రమించుకున్న వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ముస్లింలకు న్యాయం చేయాలి. – శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు.. పీర్ల మాన్యం ఆక్రమణకు గురైందని, తమకు న్యాయం చేయాలని ముల్లా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని కోరారు. ముల్లా కుటుంబీకులతో కలిసి ఇరువురు ఎమ్మెల్యేలు గురువారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు వినతి పత్రం అందించారు. పీర్ల మాన్యాన్ని భూమా అనుచరుడు ఆక్రమించడంతో ఆదాయం కోల్పోయి పీర్ల పండుగ ఘనంగా నిర్వహించలేకపోతున్నామని ముల్లా వంశస్తులు మహబూబ్‌బాషా, గౌస్‌మొద్దీన్, ముక్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేనెంబరు 67లో ఉన్న 6.40 ఎకరాల పీర్ల మాన్యం తమకు అప్పగించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) విచారణ జరపండి.. ఆళ్లగడ్డ పట్టణంలోని పీర్ల మాన్యం ఆక్రమణ విషయంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెంటనే స్పందించారు. ఆళ్లగడ్డ తహసీల్దార్‌కు ఫోన్ చేసి, రికార్డులను పరిశీలించి విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇన్చార్జ్ భూమా అఖిల ప్రియ సైతం నోరు మెదపడం లేదు ముస్లింల మాన్యం భూమిని ఆక్రమించుకొని అందులో జగత్ డెయిరీని నిర్మించుకున్న భూమా అఖిలప్రియకు ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదు. ముస్లింలపై మీకు నిజంగా ప్రేమ, అభిమానం ఉంటే పీర్ల మాన్యంలో నిర్మించుకున్న కట్టడాలను తీసివేసి స్థలం వారికి ఇవ్వాలి. ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేశారు. భూమా కుటుంబ సభ్యులు మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారు. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే -
అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?
సాక్షి, నంద్యాల: అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్య చేసుకుంటే మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రం 11వ తేదీ వచ్చి పరామర్శించారని, ఇన్నాళ్లూ ఆమె ఎక్కడికెళ్లారని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు మొదటి నుంచీ శిల్పా కుటుంబం అండగా ఉంటోందన్నారు. మొన్నటి ఎన్నికల్లో 38 వేల మెజార్టీ వచ్చిందంటే ముస్లిం మైనార్టీలు తనకు అండగా నిలవడం వల్లే సాధ్యమైందన్నారు. అఖిలప్రియ శవ, హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత తాత అయిన భూమా నారాయణరెడ్డిని విజయ డెయిరీ చైర్మన్ పదవి నుంచి దించడానికి ఇంటికి వెళ్లి చంపుతామని అఖిలప్రియ భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి బెదిరించలేదా అని నిలదీశారు. సొంత తాతనే మీ కుటుంబ సభ్యులపై కేసు పెట్టారంటే ఏం రాజకీయం చేస్తున్నారో అందరికీ అర్థమవుతోందన్నారు. ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని అఖిలప్రియ శిల్పా కుటుంబంపై ఆరోపణలు చేయడం శోచనీయమని, తాను మొదటి సారి పోటీ చేసి 35వేల మెజార్టీతో గెలిస్తే ఆమె మాత్రం 38వేల మెజార్టీతో ఓడిపోయారని గుర్తు చేశారు. (24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు) ‘మీ నాన్న ప్రాణ స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి కుట్ర పన్నారు. నంద్యాలలో మాజీ కౌన్సిలర్ జాకీర్‌హుసేన్, మరో 9మందిపై ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే హత్యాయత్నం కేసు పెట్టి వేధించారు. ముస్లిం సోదరులకు అయ్యలూరు మెట్ట వద్ద మాజీ మంత్రి పట్టాలు ఇస్తే వాటిని రద్దు చేయించారు. ఉప ఎన్నిక సమయంలో బేస్మెంట్లు సైతం రాత్రికి రాత్రి తొలగించి ముస్లింలను ఇబ్బంది పెట్టారు. వీటిని ముస్లిం సోదరులు మరచిపోలేద’ని అన్నారు. తమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, మీ ఆస్తులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చిన పర్సెంటేజీలతో సంపాదించినవి కావా అని ప్రశ్నించారు. దళితుడైన న్యాయవాది సుబ్బరాయుడును టీడీపీ నాయకులే హత్య చేశారు కాబట్టి అఖిలప్రియ నోరు మెదపడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హబీబుల్లా, గన్నికరీం, మాజీ కౌన్సిలర్ జాకీర్‌హుసేన్ తదితరులు పాల్గొన్నారు. (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) -
టీడీపీ తీరు రాబందులను గుర్తుచేస్తోంది
నంద్యాల: అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేయడం నీచం, దారుణమని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నంద్యాలలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య వ్యవహారంలో టీడీపీ నాయకుల హడావుడి, తాపత్రయం చూస్తుంటే రాబందులు గుర్తుకొస్తున్నాయన్నారు. సలామ్ కుటుంబం మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి ఐపీఎస్ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారని, 24 గంటల్లోనే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేíÙయా కూడా ప్రకటించారన్నారు. సలామ్ కుటుంబానికి మొట్టమొదట ధైర్యం ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుంటే మరో పక్క చంద్రబాబు, అచ్చెన్నాయుడు తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావుతో బెయిల్ పిటిషన్ వేయించి డబుల్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. అబ్దుల్ సలామ్ ఆత్మహత్య కేసులో బెయిల్ ఇప్పించడంపై ప్రజలకు చంద్రబాబు, అచ్చెం, లోకేష్‌లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత న్యాయవాది సుబ్బరాయుడును హత్య చేస్తే టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదన్నారు. గుంటూరులో ముస్లిం యువకులు న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని, దీన్ని ఎవరూ మరచిపోలేదని అన్నారు. -
‘యూజ్లెస్ ఫెలో’ అని బాబు తిట్టింది మర్చిపోయారా?
సాక్షి, కర్నూలు: అబ్దుల్ సలాం ఘటనపై తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధిత కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల తర్వాత నీచమైన ఆలోచనతో రాజకీయ లబ్ది కోసం టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు. టీడీపీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించిన విషయం అందరికీ తెలుసునని, కానీ చంద్రబాబు నాయుడు, అచ్చెంనాయుడు, అఖిల ప్రియ, ఫారుక్ బెయిలు ఎలా వస్తుందంటూ గగ్గోలు పెట్టడటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇక గుంటూరులో ‘నారా హమారా టీడీపీ హమారా’ సభలో నంద్యాలకు చెందిన తొమ్మిది మంది యువకులు, బాబు ముస్లింలకు చేసిన అన్యాయం గురించి నిలదీస్తే, వారిపై దేశద్రోహం కేసు పెట్టించారని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే విధంగా ఆనాడు వారిపై కేసులు ఎందుకు పెడుతున్నారని అడగని టీడీపీ మాజీ మంత్రి ఫారుక్ ఈరోజు ఈ ఘటనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింలను ‘యూజ్లెస్ ఫెలో’ అని చంద్రబాబు నాయుడు అన్న మాటలు మర్చిపోయారా ఫారుక్ అంటూ చురకలు అంటించారు. 2017 నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ఒకే కుటుంబంలోని 7 మంది ముస్లింలపై హత్య కేసు నమోదు చేయించింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు.(చదవండి: చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా: కొడాలి నాని) ఆ హత్యకు కారణం టీడీపీకి చెందిన మనోహర్ గౌడ్! ‘‘గత నెలలో నంద్యాల పొన్నపురంలో దళిత న్యాయవాది సుబ్బరాయుడును దారుణంగా హత్య చేస్తే నోరుమెదపని టీడీపీ నాయకులు ఈ రోజు గొంతు పెంచి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆ హత్యకు కారణం టీడీపీకి చెందిన మనోహర్ గౌడ్ కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించలేదా?’’ అని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ‘‘అబ్దుల్ సలాం కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని మొదట హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బాధిత కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబం ఆత్మహత్యకు కారకులైన సీఐ, హెడ్ కానిస్టేబుబుల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే మీరేమో బెయిలు ఇప్పించారు. రాబందుల్లా వ్యవహరిస్తున్న మీరు తీరు సరికాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెంనాయుడు వాళ్ల పార్టీ కార్యదర్శి న్యాయవాది రామచంద్రరావును పంపించి నిందితులకు బెయిల్ ఇప్పించడమే గాక ఎవరికి తెలియనట్టు బాధితులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు’’ అంటూ టీడీపీ తీరును ఎండగట్టారు. . -
‘ఫ్యాక్షన్ రాజకీయాలను సహించేది లేదు’
సాక్షి, కర్నూలు: దళిత న్యాయవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాయుడుని దారుణంగా హత్య చేయడాన్ని ఎమ్మెల్యే శిల్ప రవీంద్ర కిషోర్ ఖండిస్తూ.. టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత న్యాయవాది సుబ్బరాయుడిని టీడీపీ నాయకులు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే చంద్రబాబు ఈరోజు దళిత న్యాయవాది టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైతే ఎక్కడున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ రాజకీయాలు నంద్యాలలో చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాల ప్రాంతాన్ని భూమా కుటుంబం వారి రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు, హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది హత్య కేసుపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి హత్య కుట్ర వెనక ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. సుబ్బరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మనోహర్ గౌడ్ భూమా కుటుంబానికి ఆర్థికంగా, రాజకీయంగా నమ్మిన బంటు అన్నారు. ఈ హత్యకు భూమా కుటుంబం ఆజ్యం పోసిందనేది ప్రజలందరూ గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
ఉనికి కోసమే ఆయన డ్రామాలు..!
సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఉనికి కోసం ప్రజా చైతన్య యాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. అందుకే విశాఖలో ఆయనను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. కర్నూలు జ్యూడిషియల్ క్యాపిటల్‌కు మద్దతు ఇవ్వకపోతే కర్నూలులో కూడా చంద్రబాబుకు విశాఖ గతే పడుతుందన్నారు. కర్నూలును రాజధానిగా స్వాగతించిన తర్వాతే చంద్రబాబు రాయలసీమలో అడ్డుగుపెట్టాలని శిల్ప రవిచంద్ర కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. (చంద్రబాబును అడ్డుకున్నది ప్రజలు, విద్యార్థులే) -
ఎమ్మెల్యే స్పందన; ఇద్దరు యువకులు సేఫ్
సాక్షి, బొమ్మలసత్రం/కర్నూలు: కుందూనది వంతెనపై సరదాగా సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన నంద్యాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. స్థానిక కల్పన సెంటర్లో నివాసముంటున్న ప్రవీణ్.. కర్నూలు పుల్లారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శని, ఆది వారాలు సెలవు దినాలు కావటంతో వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామనికి చెందిన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న కుందూనది వంతెన వద్దకు వెళ్లారు. సరదాగా సెల్ఫీ దిగేందుకు వంతెన చివరి భాగంలో నిలబడ్డారు. సెల్ఫీ దిగుతుండగా ప్రవీణ్ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ప్రవీణ్‌ను కాపాడేందుకు విష్ణువర్ధన్ రెడ్డి దూకే క్రమంలో అదుపు తప్పి రాళ్లపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వాహనం నిలిపి తన అనుచరులతో యువకులను కాపాడారు. ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయప డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విష్ణువర్ధన్ రెడ్డిని వైద్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. కళాశాలలో ఓ యువతి ప్రేమ పేరుతో ప్రవీణ్‌నను మోసం చేయడంతో తట్టుకోలేక కుందూలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని.. అతన్ని కాపాడే క్రమంలో స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి గాయపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవి -
సీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి : ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు చెప్పారని, అయితే అప్పట్లో అలా చేయడం వల్లే రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితులకు దారి తీసిందన్నారు. రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు అని, ఆయన 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా ఈ ప్రాంతానికి చేసింది శూన్యమన్నారు. రాయలసీమకు రాజధాని కాకపోయినా కనీసం హైకోర్టు ఇవ్వాలని చంద్రబాబును ఎన్నో సార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. అసలు రాయలసీమకు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో నెరవేర్చింది ఒక్కటీ లేదన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేస్తున్నారని, సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని, జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా ప్రజాభిప్రాయం మేరకే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలకు రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకూలమో... వ్యతిరేకమో చెప్పాలని శిల్పా డిమాండ్ చేశారు. రాజధానిలో చంద్రబాబు, ఆయన మనుషులు కొన్న భూములకు రేట్లు తగ్గి పోతాయని భయపడి పోతున్నారని అసలు కారణం అదేనన్నారు. త్యాగం చేసిన కర్నూలుకు న్యాయం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలుగు ప్రజల ఐక్యత కోసం గతంలో రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు సీఎం జగన్ వల్ల న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1953 నుంచి మూడేళ్ల పాటు కర్నూలు రాజధానిగా ఉండేదని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసమే రాజధానిని కర్నూలు ప్రజలు వదులుకున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత కర్నూలుకు న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ సీఎంగా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాకు కనీసం జ్యూడీషియల్ కేపిటల్ ఇస్తే ఇప్పటికైనా అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం సముచితంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా కర్నూలు ప్రజలు హైకోర్టు కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏది కోరుటున్నారో అదే జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని, దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. రాజధానిలో చంద్రబాబు, ఆయన మనుషులు నాలుగు వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అన్నారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు సీఆర్డీఏ పరిధిని పెంచుకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. -
‘ఆయనను జానీ వాకర్ దివాకర్ రెడ్డి అనాలేమో’
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రారెడ్డి స్వాగతించారు. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే జరుగుతుందని ఆయన అన్నారు. రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు అని ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి బుధవారమిక్కడ విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో కరువు పోయిందని అన్నారు. సీమ ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లా అభివృద్థి అంతా ఒకే దగ్గర కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మాట మార్చారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లాగానే అమరావతిని చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, అభివృద్ధి హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వల్లే రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నోసార్లు సీమ బిడ్డగా హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కోరామన్నారు. సీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలను చంద్రబాబు మాయ మాటలతో మోసం చేశారని ధ్వజమోత్తారు. సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కొన్ని మెరిగే కుక్కలను పక్కన పెట్టుకుని సీఎం జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారన్నారు. ‘‘సీమలో పుట్టిన చంద్రబాబుకు అక్కడ మూడు సీట్లు వచ్చాయంటే ఆయన పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. రాయలసీమ ప్రజల ఆకాంక్షను వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చుతున్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి. జీఎన్‌రావు కమిటీ నివేదిక కూడా ప్రజాభిప్రాయం మేరకే వస్తుందని భావిస్తున్నా. సీఎం జగన్ నిర్ణయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకులమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలి. రాజధానిలో చంద్రబాబు తాను కొన్న భూములకు రేట్లు తగ్గిపోతాయని భయపడుతున్నారు. ఇక జేసీ దివాకర్ రెడ్డిని జేసీ దివాకర్ రెడ్డి అనాలో ...జానీ వాకర్ దివాకర్ రెడ్డి అనాలో అర్థం కావడం లేదు. రెండు పెగ్గులు వేస్తే ఏమి మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు.’’ అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. -
ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా
సాక్షి, కర్నూలు/ నంద్యాల: ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అందరి సంక్షేమానికి కృషి చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలే తమకు స్ఫూర్తి అని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలు చూడమన్నారు. తమకు ఓటు వేయని వారికి సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన చేసిన తొలి ప్రసంగం ఆకట్టుకుంది. చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా..సూటిగా చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు అందుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగం సాగిందిలా ‘పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృత నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుపేదలకు స్థలాలు ఇచ్చి వాటిలో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. దివంగత వైఎస్ఆర్లాగా తమ ముఖ్యమంత్రి ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు పేదలకు గృహాలు కట్టించి ఇచ్చాయి. అయితే మా ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇంటిపై లబ్ధిదారుడు అవసరాల కోసం బ్యాంకులో రుణం సైతం పొందవచ్చు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 300 చదరపు అడుగుల ఇంటి కోసం పేదల నుంచి రూ.2.65 లక్షలు వసూలు చేశారన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే కొత్త ఇళ్ల నిర్మాణానికి నంద్యాల, బేతంచెర్లలో ఉండే క్వారీల్లో దొరికే బండలు, టైల్స్‌ను తీసుకుని మూతపడుతున్న పరిశ్రమలకు జీవం పోయాలని కోరుతున్నాను. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి రివర్స్ టెండర్ విధానం, జ్యుడీషియల్ విచారణకు శ్రీకారం చుట్టార’న్నారు. చివరకు అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెప్పి ప్రసంగాన్ని ముగించారు. -
ఎన్నికల చిత్రాలు..
సాక్షి నెట్వర్క్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. ఒకపక్క కరి పండుగ.. మరో పక్క ఆదివారం.. అయినా పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు నిద్రలేచింది మొదలు.. పొద్దుపోయే వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు. వీలైనంత మందిని కలిసి తమకే ఓటు వేయాలని కోరారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతామంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అభ్యర్థుల వెంట అనుచర, బంధు గణం రావడంతో ఆయా గ్రామాల వీధులు కిటకిటలాడాయి. -
నందుల కోటలో ‘‘శిల్పా’’ పట్టు..
సాక్షి, నంద్యాల : నందుల కోట నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రసవత్తర పోరు నెలకొంది. వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి.. పల్లెనిద్ర–రచ్చబండ కార్యక్రమాల ద్వారా పల్లె ప్రజలకు చేరువయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా శిల్పా సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. టీడీపీ నాయకుల అవినీతి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎండగట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం అందించలేకపోయారు. భూమా అనుచరులు అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకోవడంతో టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. నంద్యాల నియోజకవర్గం 1952లో అవతరించింది. ప్రస్తుతం నంద్యాల పట్టణం, నంద్యాల, గోస్పాడు మండలాలు నియోజకవర్గం లో ఉన్నాయి. ఇప్పటి వరకు 15సార్లు నంద్యాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009లో నంద్యాల నియోజకవర్గంలో ఉన్న బండిఆత్మకూరు, మహానంది మండలాలను శ్రీశైలం నియోజకవర్గంలో కలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న గోస్పా డు మండలాన్ని నంద్యాల నియోజకవర్గానికి కలిపారు. ఇప్పటి వరకు నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ ఏ వర్గానికి రిజర్వ్ కాలేదు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఎన్ఎండీ ఫరూక్‌పై శిల్పామోహన్‌రెడ్డి 40,677ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇది నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ. 1978లో నబీ సాహెబ్‌పై బొజ్జా వెంకటరెడ్డి 1,693 ఓట్లతో గెలుపొందారు. ఇది నియోజకవర్గంలో అత్యల్ప మెజార్టీ. పదవులు..నంద్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని, పీవీనరసింహరావు ప్రధాన మంత్రి పదవిని, పెండే కంటి వెంకటసుబ్బయ్య కేంద్ర హోం శాఖ మంత్రి పదివిని అలంకరించారు. అలాగే శిల్పామోహన్‌రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్‌లు మంత్రి పదవులు చేపట్టారు. -
టీడీపీ నేతలవి గిదజారుడు రాజకీయాలు : శిల్పా
-
ప్రజలే మీ తాటతీస్తారు..
కర్నూలు , నంద్యాల: మంత్రి అఖిలప్రియ నంద్యాలలో ఆళ్లగడ్డ రాజకీయాలు చేయాలని చూస్తే అవి ఇక్కడ చెల్లుబాటు కావని, నంద్యాల ప్రజలు మీ తాటతీసే రోజులు దగ్గర్లో ఉన్నాయని వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని శిల్పాసేవా సమితిలో కో ఆప్షన్‌మెంబర్ దేశం సు«ధాకర్రెడ్డితో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. మంత్రి అఖిలప్రియ నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆమె బెదిరింపులకు నంద్యాలలో భయపడే వ్యక్తులు ఎవరూ లేరన్నారు. ఆళ్లగడ్డలో వస్తున్న పర్సెంటేజీలు సరిపోక నంద్యాలకు మంత్రి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. తాటతీస్తాం.. వంటి పదజాలం తాము మాట్లాడగలమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మంత్రి తాట తీయడం ఖాయమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చే యించి వేధిస్తున్నారన్నారు. పోలీసు అధికారులు కూడా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు పెట్టుకుంటూ పోవడం మంచి పరిణామం కాదన్నారు. సొంతూరుకు ఏం చేశారో చెప్పండి.. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామాన్ని మాజీ సర్పంచ్ తులసిరెడ్డి హయాంలో శిల్పామోహన్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేశామని శిల్పా రవి పేర్కొన్నారు. కొత్తపల్లెకు వచ్చే ముందు మంత్రి స్వగ్రామమైన డబ్లు్య. కొత్తపల్లెలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అక్కడికి వెళ్లి అభివృద్ధి పనులు చేసుకుంటే మంచిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నంద్యాలలో అమృతస్కీం కింద అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారని, ఆ నిధులను తమవి అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి హయాంలోనే అమృత స్కీం మంజూరు అయిందనే విషయం ప్రజలకు తెలుసున్నారు. నంద్యాలలో రోడ్ల వెడల్పులో నష్టపోయిన బాధితులకు ఇంత వరకు పరిహారం అందివ్వలేదన్నారు. తమకు తెలిసిన టీడీపీ నాయకుల షాపుల వద్ద 17 అడుగుల నుంచి 10 అడుగుల వరకు తగ్గించి రోడ్లు వేసిన దాఖలాలు మంత్రికే చెల్లాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో టీడీపీ నాయకుల సమావేశం పెడతారా? అభివృద్ధి కార్యక్రమాలు అంటూ అధికారులను అందరినీ పిలిచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేజీపై కూర్చోబెట్టి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని మంత్రి అఖిలప్రియను శిల్పారవి సూటిగా ప్రశ్నించారు. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అనుమతి లేకుండా ఆమె చాంబర్లోకి వెళ్లడమే కాకుండా.. ఇన్ని సదుపాయాలు ఈమెకు కల్పించడం అవసరమా అని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సీసీ టీవీ మానిటరింగ్ చైర్పర్సన్ పరిధిలో లేకపోయినా ఇక్కడ మానిటరింగ్ పెట్టవద్దని, తొలగించమని అధికారులను మంత్రి ఎలా ఆదేశిస్తారన్నారు. అసలు చైర్పర్సన్ చాంబర్లో సీసీ టీవీ మానిటరింగ్ లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులపై, ప్రజాప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా ఏదో మాట్లాడాలని మాట్లాడితే తాము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. చైర్‌పర్సన్‌కు మున్సిపల్ అధికారులు నంద్యాల పట్టణ అభివృద్ధికి ఏం పనులు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఆమెకు తెలియకపోవడం విచారకరమన్నారు. అందినకాడికి దోచుకోవడమే టీడీపీ నేతల పని వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న ఉద్దేశంతో టీడీపీ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారని శిల్పా రవి ఆరోపించారు. భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు, వక్ఫ్‌బోర్డు స్థలాలు దేనినీ వదలడం లేదన్నారు. చివరకు పట్టణ నడి బొడ్డున ఉన్న 150 ఏళ్ల చరిత్ర ఉండి పెళ్లిళ్లకు ఉపయోగపడే పాలకొమ్మ చెట్టును నరికివేశారన్నారు. నీరు–చెట్టు పథకం కింద కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. చిన్నవయస్సులో అఖిలప్రియ మంత్రి పదవి పొంది ఎలా పేరు పొందారో.. అదే విధంగా తక్కువ కాలంలోనే అవినీతి మంత్రిగా కూడా రికార్డులోకి ఎక్కనున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉప్పు జగన్ ప్రసాద్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసాక్‌బాషా, కౌన్సిలర్లు జాకీర్‌హుసేన్, అమృతరాజు, మాబున్నిసా, చాంద్‌బీ, శోభారాణి, కన్నమ్మ, దేవనగర్‌బాషా, కిరణ్, టైలర్‌శివ, కృష్ణమోహన్, వైఎస్‌నగర్ రమణ, అహమ్మద్ హుసేన్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుది హిట్లర్ పాలన
నంద్యాల: హిట్లర్ పాలనను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అన్నారు. గుంటూరులో అరెస్ట్ చేసిన ముస్లిం యువకులను బెయిల్‌పై బయటకు తీసుకొని వచ్చి శుక్రవారం రాత్రి నంద్యాల పట్టణంలోని శిల్పా సేవా సమితిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పారవి మాట్లాడుతూ.. హామీలు నెరవేర్చాలని ముస్లిం యువకులు ప్లకార్డులు సభలో ప్రదర్శిస్తే దేశ ద్రోహం కేసు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో సైతం ప్లకార్డులు ప్రదర్శిస్తారని, అలాంటిది సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబునుప్రశ్నిస్తే ఇంతలా హింసకు గురి చేయాల్సి అవసరం ఏముందన్నారు. తొమ్మిది మంది ముస్లిం సోదరుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక.. వారు పడిన మనోవేదన వర్ణనాతీతమన్నారు. కేసులకు ఎవరూ భయపడబోరని.. ఇప్పుడు పదిమందే ప్రశ్నించారని, రేపు వందలు, వేల మంది నిలదీస్తారని, వారందరినీ జైలులో పెట్టుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జైళ్లు పట్టబోవన్నారు. ముస్లిం యువకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పరామర్శించడానికి వెళితే అరెస్ట్ చేస్తారా? నంద్యాల ముస్లిం యువకులపై అన్యాయంగా కేసు పెట్టి వేధిస్తున్నారని తెలుసుకొని పరామర్శించడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే తనపై కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందని వైఎస్సార్సీపీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా పేర్కొన్నారు. నంద్యాల టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, మరికొంత మంది హబీబుల్లాను నంద్యాలలో అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. నంద్యాలకు రానివ్వనని చెబుతున్న ఏవీ సుబ్బారెడ్డిది ఇంతకు ఏ ఊరు అని ప్రశ్నించారు. ఫ్యాక్షనిజం, గూండాయిజానికి తాను ఎన్నటికీ భయపడబోనని, ముస్లిం మైనార్టీల హక్కుల కోసం, వారి సమస్యల కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు తీసుకున్న నంద్యాల నాయకులు.. ముస్లిం యువకులపై అన్యాయంగా దేశద్రోహం కేసు నమోదు చేస్తే చూస్తూ ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలను టీడీపీ నాయకలు కేవలం ఓట్ల కోసమే రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ముస్లిం సోదరులకు శిల్పాసోదరులు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇషాక్, కౌన్సిలర్ జాకీర్‌హుసేన్, కలాం, నవభారత్ హుసేన్, రసూల్ ఆజాద్, దేవనగర్ బాషా, షాదిక్, అహమ్మద్, కరీం, హబీబ్, జంషీర్, బాసీద్, కార్పెంటర్ మౌలాలీ, మద్దూరుబాషా, తదితరులు పాల్గొన్నారు. నోరుమెదపరేం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించారని శిల్పా రవి అన్నారు. చంద్రబాబునాయుడు తన బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యే కావడానికి హిందూపురం ముస్లిం నాయకుడు అబ్దుల్‌గనికి టికెట్ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ తన బావమరిది రవీంద్రనాథరెడ్డి కడప టికెట్ కావాలని డిమాండ్ చేసినా ముస్లిం నాయకుడైన అంజాద్‌బాషాకు ఇచ్చారని గుర్తు చేశారు. నంద్యాల టీడీపీ నాయకులు.. శిల్పామోహన్‌రెడ్డిని తిట్టు.. పోస్టు కొట్టు.. అన్న విధంగా తయారయ్యారన్నారు.శిల్పామోహన్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేసి ఇప్పటికే నలుగురు నామినేటెడ్ పోస్టులు తెచ్చుకున్నారన్నారు. ముస్లిం యువకులపై అన్యాయంగా కేసులు పెట్టి జైలులో వేస్తే నంద్యాల టీడీపీ నాయకులు నోరుమెదపడం లేదన్నారు.