
సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఉనికి కోసం ప్రజా చైతన్య యాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. అందుకే విశాఖలో ఆయనను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. కర్నూలు జ్యూడిషియల్ క్యాపిటల్‌కు మద్దతు ఇవ్వకపోతే కర్నూలులో కూడా చంద్రబాబుకు విశాఖ గతే పడుతుందన్నారు. కర్నూలును రాజధానిగా స్వాగతించిన తర్వాతే చంద్రబాబు రాయలసీమలో అడ్డుగుపెట్టాలని శిల్ప రవిచంద్ర కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు.
(చంద్రబాబును అడ్డుకున్నది ప్రజలు, విద్యార్థులే)
Comments
Please login to add a commentAdd a comment