మాట్లాడుతున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కరోనా కేసులు కర్నూలులో తగ్గుముఖం పట్టినట్లు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్ తెలిపారు. స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొని కర్నూలులో ‘కరోనా’ను కట్టడి చేసిందన్నారు. వలంటీర్లతో నిర్వహించిన ఇంటింటి సర్వేలు ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. కరోనా నివారణలో డాక్టర్లు, పోలీసులు, నర్సింగ్, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. (కరోనా.. మళ్లీ హైరానా)
కష్టకాలంలో ప్రజలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ‘మన కర్నూలు – మన బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దాతల సహకారంతో కర్నూలులోని 60 వేల ఇళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తానా వారు..రూ.3లక్షల విలువ చేసే 5వేల కేజీల బియ్యం, వెయ్యి కేజీల కందిపప్పు అందజేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో కర్నూలు తానా సభ్యుడు రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment