కరోనా; ఒకే కుటుంబంలో నలుగురు మృతి | Family Deceased With Coronavirus in Kurnool | Sakshi
Sakshi News home page

అంతులేని విషాదం

Published Sat, Aug 15 2020 1:11 PM | Last Updated on Sat, Aug 15 2020 1:11 PM

Family Deceased With Coronavirus in Kurnool - Sakshi

ఆళ్లగడ్డ: కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురిని బలిగొంది. దీంతో రుద్రవరం మండలం నర్సాపురంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన రాచంరెడ్డి రామిరెడ్డి సోదరి దస్తగిరమ్మ(70)  కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడింది. తర్వాత ఆమె కుమారుడు నాగార్జునరెడ్డి(48)కి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. కోలుకోలేక ఈ నెల 8వ తేదీ నాగార్జునరెడ్డి,  ఈ నెల 11న దస్తగిరమ్మ చనిపోయారు. ఈ విషాదాన్ని మరచిపోకముందే దస్తగిరమ్మ అన్న రాచంరెడ్డి రామిరెడ్డి(80) ఈ నెల 13న, రామిరెడ్డి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి(54) శుక్రవారం మృతిచెందారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement