ట్రూ నాట్ టెక్నీషియన్లు, ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ అసోషియేషన్ అధ్యక్షుడు రఘుబాబు
సాక్షి, నంద్యాల: జిల్లాలో సోమవారం నాటికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మొదలై 100 రోజులు పూర్తయాయి. దాంతోపాటు కర్నూలు వ్యాప్తంగా నేటి వరకు లక్షా ఐదు వేల కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు బాబు, సహాయ కార్యదర్శి మదన్ మోహన్, శ్రీనివాసులు, కర్నూల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు జీ.వి సతీష్, రజాక్, ఇతర ల్యాబ్ టెక్నీషియన్‌లు పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కట్టడిలో ట్రూనాట్ ల్యాబ్స్, వీర్‌డీఎల్ ల్యాబ్స్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్ల కృషిని ఈ సందర్బంగా పలువురు కొనియాడారు.
అంతేకాకుండా కరోనా కట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కర్నూల్ జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తీసుకున్న నిర్ణయాలను జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల తరుపున రఘు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏప్రిల్ 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 ట్రూ నాట్ ల్యాబ్‌లలో, మరో 20 వరకు వీర్‌ఆర్‌డీఎల్ ల్యాబ్‌లలో ల్యాబ్ టెక్నీషియన్లు నిర్విరామంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల్లో భాగస్వాములై ఉన్నారు.ఇప్పటికి దాదాపు ప్రతి జిల్లాలో కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా బారిన పడినప్పటికి కోలుకున్న తరువాత తిరిగి విధులకు సిద్ధంగా ఉన్నారు.
మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సునీతతో ల్యాబ్ టెక్నీషియన్లు
Comments
Please login to add a commentAdd a comment