hafiz khan
-
చంద్రబాబు అంటే స్కాములు: హఫీజ్ ఖాన్
-
లోకేష్... దమ్ముంటే నిరూపించు!
కర్నూలు(రాజ్‌విహార్): ‘పవిత్ర మసీదులు, దర్గాల ఆస్తులు నేను కబ్జా చేసినట్లు నువ్వు ఆరోపించావు. అల్లాను నమ్మిన నేను అలాంటి పని చేయను. ఖురాన్‌పై ప్రమాణం చేస్తా! దమ్ముంటే నువ్వు నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి లేదంటే క్షమాపణ చెప్పాల’ని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు సవాల్ విసిరారు. యువగళం పాదయాత్రలో లోకేష్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తర్వాత ఆరోపణలు రుజువు చేయాలని లోకేష్‌ను కోరేందుకు ఉదయం 9:45 గంటలకు ఇంటి నుంచి పవిత్ర గ్రంధం ఖురాన్ పట్టుకుని ద్విచక్ర వాహనంపై పాతబస్తీలోని ఖూబ్సూరత్ మసీదుకు చేరుకున్నారు. అక్కడ మసీదులో నమాజ్ చదివి ఖురాన్ పఠనం చేశారు. పాదయాత్రలో లోకేష్‌ను ప్రశ్నించేందుకు ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకున్న నగర కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు మసీదుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు మసీదు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే.. లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన యాత్రకు ఎదురెళ్లారు. దీంతో స్థానిక పాతబస్తీలోని మాసుంబాషా దర్గా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకునే యత్నం చేయగా ఆయన నేలపై కూర్చున్నారు. తర్వాత ఆయనను పోలీసులు వాహనంలో తరలిస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. దమ్ముంటే అబద్దాల లోకేష్ బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే మీసం మెలేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు పోలీసులు ఎమ్మెల్యేను రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లగా అక్కడ స్టేషన్ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. అరగంట తరువాత ఎమ్మెల్యేను ఆయన ఇంటికి తీసుకెళ్లి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు షాషావలి, జుబేర్, యూనుస్, రాజేశ్వరరెడ్డి, కృష్ణకాంత్, పార్టీ నాయకులు ఖాదర్‌బాషా, హకీమ్, ఇర్ఫాన్, ఖాజా, అక్బర్, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. -
ముస్లింల సమస్యలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు
కర్నూలు(రాజ్‌విహార్) /సెంట్రల్: మాజీ సీఎం చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. ఆయన హయాంలో ముస్లింలను పావులా వాడుకుని వదిలేశారు తప్ప ఏనాడూ వారి బాగోగుల గురించి ఆలోచించలేదన్నారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం స్పందించి.. ఐపీఎస్ అధికారులతో విచారణ కమిటీ వేశారన్నారు. బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా బాధితులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారన్నారు. చంద్రబాబు టీడీపీకి చెందిన లాయర్‌తో నిందితుల తరఫున వకాల్తా ఇప్పించారని విమర్శించారు. ఎన్ఎండీ ఫరూక్, లాల్‌జాన్ బాషా, అబ్దుల్ ఘనీ కుటుంబాలకు పదవులేవీ ఇవ్వని చంద్రబాబు తీరా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఫరూక్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. కానీ సీఎం జగన్ ముస్లింలకు రంగాల్లో పెద్దపీట వేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. -
కరోనా మృతుడికి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
కర్నూలు(సెంట్రల్): కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కరోనా కారణంగా మరణించిన ఓ వ్యక్తికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. కర్నూలు పాతబస్తీకి చెందిన వ్యక్తి శుక్రవారం కరోనాతో స్థానిక పెద్దాసుపత్రిలో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆసుపత్రి, మున్సిపల్ సిబ్బందితో కలిసి పీపీఈ కిట్లు ధరించి నగరంలోని సంతోష్‌నగర్ శ్మశాన వాటికలో శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. వైరస్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాలుపంచుకున్నట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అబ్దుల్ హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నిర్మాత రాకేష్ రెడ్డి ఉదయం విఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. దేవుని ఆశీస్సులు ఉండాలి:కొడాలి నాని మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దేశం, ప్రపంచంలో అనేక వ్యవస్థలు కుప్పకూలి ఆర్థికంగా చితికి పోయాయన్నారు. కరోనా నుండి త్వరగా కోలుకోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. మంత్రివర్గ విస్తరణకు సమయం ఉంది.. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి త్వరగా నాశనం అయి.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. మంచి వర్షాలు కురిసి రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంత్రివర్గ విస్తరణ.. ముఖ్యమంత్రి నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ కి ఇంకా సమయం ఉందని కాటసాని తెలిపారు. దివంగత సీఎం జయలలితపై చిత్రం నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తమిళనాడు దివంగత సీఎం జయలలిత పై చిత్రం నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా బారి నుండి ప్రజలను రక్షించాలని దేవున్ని కోరుకున్నానని తెలిపారు. కరోనా కారణంగా సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని, త్వరలో కోలుకొని పూర్వ వైభవం వస్తుందని ఆశీస్తున్నామన్నారు. జయలలిత అనే చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని, తెలుగు, తమిళం తోపాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని తీస్తామని తెలిపారు. జయలలిత జీవితంలో ఓ ఘట్టాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నామని ఆయన వెల్లడించారు. -
‘ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదు’
సాక్షి, కర్నూలు: జిల్లాలోని ఖడపూరలో జరిగిన రెండు కుటుంబాల మధ్య గొడవను టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం కర్నూల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తే తాము సహించేది లేదు. చట్టపరమైన పోరాటం చేస్తాం. కరోనా వైరస్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు ఎమ్మెల్యే పై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎమ్మెల్యే కష్టపడి ప్రతి వార్డులో శానిటేషన్, అత్యవసర సేవలు అందించారు. ఎమ్మెల్యే పై అనవసరమైన రాజకియాలు చేస్తే వారికి బుద్ధి చెబుతాం. అసత్య ఆరోపణలు పై కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తాం అని ఆయన తెలిపారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
కర్నూలులో కరోనా తగ్గుముఖం
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కరోనా కేసులు కర్నూలులో తగ్గుముఖం పట్టినట్లు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్ తెలిపారు. స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొని కర్నూలులో ‘కరోనా’ను కట్టడి చేసిందన్నారు. వలంటీర్లతో నిర్వహించిన ఇంటింటి సర్వేలు ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. కరోనా నివారణలో డాక్టర్లు, పోలీసులు, నర్సింగ్, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. (కరోనా.. మళ్లీ హైరానా) కష్టకాలంలో ప్రజలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ‘మన కర్నూలు – మన బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దాతల సహకారంతో కర్నూలులోని 60 వేల ఇళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తానా వారు..రూ.3లక్షల విలువ చేసే 5వేల కేజీల బియ్యం, వెయ్యి కేజీల కందిపప్పు అందజేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో కర్నూలు తానా సభ్యుడు రాజశేఖర్ పాల్గొన్నారు. -
హాఫీజ్ ఖాన్‌పై దుష్ప్రచారం..
-
కరోనా వేళ ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి
-
‘అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు’
సాక్షి, కర్నూలు: చంద్రబాబు మెప్పు కోసం మాజీ మంత్రి అఖిల ప్రియ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. జిల్లా సమస్యలు తెలియని అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. అవగాహన లేకుండా అసత్య ఆరోపణలు చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ అపోహల్ని ముస్లింలపై రుద్దడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కర్నూలు కష్టాలు తెలియని అఖిల ప్రియ మానవత్వం చూపాలి తప్ప రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ముస్లింలను అవమానిస్తున్నారని, ముస్లిం ఓట్లను ఉపయోగించుకొని వారిపై బురద జల్లుతున్నారని వాపోయారు. మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజల కష్టాలను తెలుసుకోకుండా హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితం సాగిస్తున్నారని, రాష్ట్రం ప్రజానీకం కరోనాతో బాధలు పడుతుంటే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా పని కట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. -
నాపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం: హఫీజ్ ఖాన్
సాక్షి, కర్నూలు: ప్రతిపక్షాలు ధన ప్రభావంతో తనపై ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయిని ఆయన మండిపడ్డారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండ అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు తనపై సోషల్‌మీడియాలో అసత్య ఆరోపణలు, వదంతులు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. (ర్యాపిడ్ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లు విడుదల) అసత్య ప్రచారంతో పచ్చ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని హఫీజ్ ఖాన్ ఆగ్రహించారు. ఇది బాధాకమని లేని ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. మర్కజ్ వెళ్లిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, వారికి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను క్వారంటైన్ వెళ్లేవారిని తాకలేదన్నారు. క్వారంటైన్లో ఏర్పాటు చేసిన సదుపాయలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై లేని ఆరోపణలు సృష్టిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి, డీజీపీని కోరినట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. -
‘సీఎం జగన్ మా ఆశలను చిగురింపజేశారు’
-
చంద్రబాబు,లోకేష్‌లను అరెస్ట్ చేయాలి
-
పవన్‌వి దిగజారుడు రాజకీయాలు
-
రేణుదేశాయ్ ఇబ్బందులు అందరికీ తెలుసు
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ పవన్ వ్యాఖ్యలు అర్థరహితం. కర్నూలులో 2017లో బాలికపై జరిగిన హత్యాచారం జరిగితే ఇప్పుడు న్యాయం చేయాలని పవన్ అడుగుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై న్యాయం చేయాలని ఇప్పుడు పవన్ కల్యాణ్ అడగడం ఏంటి? చదవండి: అప్పుడే పవన్ సీమలో అడుగు పెట్టాలి.. చంద్రబాబు సూచన మేరకే ఆయన ఇప్పుడు కర్నూలు వచ్చారా? ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్ వేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. జరిగిన సంఘటనపై మరలా విచారణ జరిపించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మళ్లీ విచారణ జరిపిస్తున్నాం. విచారణ కోసం ఒక మహిళా అధికారిని ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు హయాంలో జరిగిన సంఘటనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్లు పవన్ మాట్లాడుతున్నారు. పవన్ వల్ల రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. చదవండి: మమ్మల్ని కాదు... పవన్‌ను అరెస్ట్ చేయండి శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి ‘దిశ’ చట్టం తీసుకు వచ్చారు. 21 రోజుల్లో బాధితులకు న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. కర్నూలులో జరిగిన సంఘటనపై చంద్రబాబు పవన్ నిలదీయాలి. హత్యాచారానికి గురైన బాలిక పేరు ప్రస్తావించకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా పవన్ కల్యాణ్‌కు లేదు. ఇప్పటికే బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతో డీజీపీని కలిశాం. పవన్ రోడ్డు మీదకు రాకముందే సీబీఐ విచారణకు పరిశీలించాలని డీజీపీని కోరాం. పవన్ కల్యాణ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. బాలిక పేరు చెప్పుకుని ఆయన కర్నూలులో అడుగుపెట్టారు. అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న పవన్‌కు సీమలో అడుగుపెట్టే అర్హత లేదు’ అని మండిపడ్డారు. -
‘బాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు’
సాక్షి, కర్నూలు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాజాధానిని తరలించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. సోమవారం కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 70 సంవత్సరాలుగా కర్నూలు తీవ్రంగా నష్టపోయిందన్నారు. వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోని చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. టీడీపీ, శాసనమండలి సభ్యులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి.. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆయన మండిపడ్డారు. కాగా కొందరు టీడీపీ నేతలు రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్పి మోసం చేశారని హఫీజ్ ఖాన్ అన్నారు. ఇందుకు అప్పటి మంత్రి అభిల ప్రియ నిదర్శనం అన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్ఆర్సీ బిట్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్రంలో ఈ బిల్లును అమలు చేయమని సీఎం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ సీపీ అదనపు కార్యదర్శి తెర్నకల్లు సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్థన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘త్వరలో టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు’
సాక్షి, తాడేపల్లి: రాయలసీమలో హైకోర్టు వద్దని అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ క్రాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని పెద్ద ఎత్తున్న ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. హై బెంచ్ రాయలసీమలో పెడతామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాలు సమానమేనని, ప్రజల ఆకాంక్ష మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారని హఫీజ్ ఖాన్ తెలిపారు. రాయలసీమలో హైకోర్టు పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది అక్కడి ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఇక 29 గ్రామాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలుపుతారని ఆయన ఎద్దేవా చేశారు. -
‘ముస్లింల గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’
సాక్షి, తాడేపల్లి : శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీ నాయకుడిగా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారని.. పెద్దల సభలు సలహాలు, సూచనలు ఇవ్వాలే కానీ, బిల్లులు చర్చకు రాకుండా రూల్ 71ను తీసుకు వచ్చారన్నారు. 51 శాతం ఓట్లు 86 శాతం సీట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సభలో మండలి ఛైర్మన్ అనైతికంగా వ్యవహరించారని, ఆయన చైర్‌ను గౌరవించలేదని విమర్శించారు. సభలో నిబంధనలను అతిక్రమించారని, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి చైర్మన్ తప్పు మీద తప్పు చేశారన్నారు. ఛైర్మన్ తీరుపై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు.సభ నిబంధనలకు విరుద్ధంగా సభలో వీడియోలు తీశారని, చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. కాలయాపన చేయడం కోసమే సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. సభలో టీడీపీ సభ్యులు గూండాలు, రౌడీలుగా వ్యవహరిస్తే చంద్రబాబు వారిని శెభాష్ అని మెచ్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించినవారు దేశంలో మరొకరు ఉండరని అన్నారు. ఛైర్మన్‌ను మంత్రులు కులంపేరుతో తిట్టారని టీడీపీ నేతలు అంటుంటే... ఛైర్మనే స్వయంగా తనను ఎవరూ తిట్టలేదని చెబుతున్నారన్నారు. టీడీపీ నేతలు కావాలనే మతం, కులంతో రాజకీయాలు చూస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఈ సందర్భంగా తనను మంత్రులు తిట్టలేదని శాసనమండలి ఛైర్మన్ చెప్పిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని, ఆ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కు అని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు... కనీసం సీమలో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారన్నారు. కర్నూలు అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. -
‘కర్నూలులో హైకోర్టు వద్దని చెప్పగలరా’
సాక్షి, కర్నూలు : గత అయిదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు పాలన గ్రాఫిక్స్‌కే పరిమితం చేశారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పాటు చేయకుండా తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. విజన్ 2020లో చంద్రబాబుకు మిగిలేది 20 మంది ఎమ్మెల్యేలేనని ఎద్దేవా చేశారు. రాజధాని భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పురుద్ఘాటించారు. ప్రజల ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి వున్నారని, అమరావతిలో భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తెచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. (‘ఇన్నేళ్లు అద్దె రాజధానిలో ప్రజలు గడిపారు’) కర్నూలుకు రావాల్సిన రాజధానిని తాము కోల్పోయామని, తమకు ఎవరూ మేలు చేయలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు అభివృద్ధి కోసం న్యాయవాదులు కష్టపడ్డారని, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) నివేదికను స్వాగతిస్తున్నామన్నారు. గత టీడీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. మూడు రాజధానులపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, వారికి దమ్ముంటే కర్నూలులో హైకోర్టు వద్దని చెప్పగలరా అని ప్రశ్నించారు. బీసీజీ కమిటీ అనేక సర్వేలు చేసిందని, ఈ కమిటీ ద్వారా కర్నూలుకు న్యాయం జరుగుతుందని హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. చదవండి: ఏపీ రాజధానిపై నివేదిక అందించిన బీసీజీ -
కర్నూలులో ‘థ్యాంక్యూ సీఎం సర్’
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలులో ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం సర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ‘థ్యాంక్యూ సీఎం సర్’ ఆకారంలో నిలబడి తమకు ఉద్యోగాలు ఇచ్చి భరోసా కల్పించారంటూ వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వలంటీర్లు, ఉద్యోగుల చేత ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఏపీలో ఎన్ఆర్సీ అమలు చేయం
కర్నూలు (సెంట్రల్) : ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను అమలు చేయబోమని ఉప ముఖ్యమంత్రి (రాష్ట్ర మైనార్టీ సంక్షేమం) అంజాద్‌బాషా తెలిపారు. శనివారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలసి ముస్లిం పెద్దలు, ప్రజా సంఘాల నాయకులకు ఎన్ఆర్సీపై గల సందేహాలను నివృత్తి చేశారు. మొదట రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేయబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజాద్‌బాషా మాట్లాడుతూ ఎన్ఆర్సీపై దేశంలోని ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేయాలన్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్ఆర్సీని అడ్డుపెట్టుకుని అలజడి సృష్టించేందుకు చూస్తున్నాయని, అలాంటి వారిపై నిఘా ఉంచామని చెప్పారు. ఎన్ఆర్సీని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు శాంతియుతంగా నిరసన తెలపడం అభినందనీయమన్నారు. కాగా, కొందరు ముస్లిం పెద్దలు ఎన్పీఆర్ని వ్యతిరేకించాలని కోరగా.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్ సీపీకి వెన్నెముక అని, వారికి అన్యాయం జరిగే ఏ పనికీ ప్రభుత్వం మద్దతు తెలపదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నాయకుడు ఆదిమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘అందుకే ప్రజల ముందుకు బాబు రాలేని పరిస్థితి..’
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలోని మూడు కాలేజీలను క్లస్టర్ యూనివర్శిటీలుగా అభివృద్ది చేస్తామని సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పటం శుభపరిణామమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , మేరుగ నాగార్జునతో కలిసి మాట్లాడారు. సిల్వర్ జుబ్లీ డిగ్రీ కాలేజీలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వనున్నట్టు హఫీజ్‌ఖాన్ తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రూ. 4200 కోట్ల ఉపాధి హామీ నిధులు స్వాహా చేశారని.. యంత్రాలతో పనులు చేసి భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఉపాధి హామీ పనులు జరగకుండా టీడీపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. నీరు-చెట్టు పథకం పేరుతో బాబు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడుతుంటే చంద్రబాబు సభలో లేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళిత, బీసీ వ్యతిరేకిగా బాబుపై ముద్ర పడిందని.. ఆయన దళితుల్ని ఎన్నోసార్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ నడుంబిగించారని చెప్పారు. తన డొల్లతనం బయట పడంతో చంద్రబాబు ప్రజల ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారని నాగార్జున ఎద్దేవా చేశారు. -
‘నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు’
సాక్షి, కర్నూలు : టీడీపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ తన కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... తన నామినేషన్ పట్ల పలువురు టీడీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఖండించారు. డబ్బుతో ప్రలోభాలకు పాల్పడుతూ.. టీజీ వెంకటేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బుకు లొంగని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి డబ్బు, బెదిరింపు రాజకీయాలను తిప్పికొట్టేందుకు కర్నూలు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కాగా టీజీ వెంకటేష్ కుమారడు టీజీ భరత్ టీడీపీ నుంచి కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సీటు కోసం ఏకంగా రూ. 100 కోట్ల మేర అధికార పార్టీ చేతులు మారినట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి.(ఆ సీటు... హాట్ కేకు..) డ్రైనేజీ నీరు తాగాల్సి వస్తుంది.. టీజీ వెంకటేష్ నీచ రాజకీయాలకు తెగబడ్డారని వైఎస్సార్ సీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. డబ్బులతో కర్నూలు ప్రజలను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీల వల్ల ఆయనకు డబ్బు వస్తే... వాటి కారణంగా ప్రజలు మాత్రం జబ్బుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన కుమారుడు టీజీ భరత్ గనుక గెలిస్తే వారి ఫ్యాక్టరీల డ్రైనేజీ నీరు తాగాల్సిన దుస్థితి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. అమలు కాని హామీలతో.. అమలు కాని హామీలు ఇచ్చి...రాష్ట్రంలో అవినీతి పాలన సాగించిన టీడీపీకి బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవీ రామయ్య ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి, కార్పొరేషన్ నిధులు కేటాయించని చంద్రబాబు నాయుడు... ప్రజలను మభ్యపెడుతూ మరోసారి నిస్సిగ్గుగా ఓటు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘కొండారెడ్డి బురుజుపై పార్టీ జెండా ఎగరేస్తాం’
కర్నూలు: కర్నూలు నగర వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు నగరంలోని జమ్మి చెట్టు నుంచి కర్నూలు ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నామినేషన్ వేసిన అనంతరం హఫీజ్ ఖాన్ విలేకరులతో మాట్లాడారు. డబ్బు రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు టీడీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. కులాలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అది చూసి ఓర్వలేని టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ భయపడుతున్నారని విమర్శించారు. 20 ఏళ్లుగా కర్నూలులో ఏం అభివృద్ధి చేశారో టీజీ వెంకటేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీజీ వెంకటేశ్ గాజు గ్లాసు లాంటి వారని, ఆ గాజుపై రాళ్లు వేయించుకోవద్దని సూచించారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు మేలు చేస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను కొండారెడ్డి బురుజుపై ఎగరేస్తామని చెప్పారు. కర్నూలు నగరాన్ని కనివినీ ఎరుగుని రీతిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. -
కర్నూలు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా హఫీజ్‌ఖాన్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్‌ను ప్రకటించారు. కర్నూలులోని రాయల్ ఫంక్షన్ హాలులో బుధవారం సాయం త్రం కర్నూలు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన హఫీజ్ ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.