
సాక్షి, కర్నూలు: ప్రతిపక్షాలు ధన ప్రభావంతో తనపై ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయిని ఆయన మండిపడ్డారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండ అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు తనపై సోషల్‌మీడియాలో అసత్య ఆరోపణలు, వదంతులు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. (ర్యాపిడ్ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లు విడుదల)
అసత్య ప్రచారంతో పచ్చ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని హఫీజ్ ఖాన్ ఆగ్రహించారు. ఇది బాధాకమని లేని ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.
మర్కజ్ వెళ్లిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, వారికి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను క్వారంటైన్ వెళ్లేవారిని తాకలేదన్నారు. క్వారంటైన్‌లో ఏర్పాటు చేసిన సదుపాయలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై లేని ఆరోపణలు సృష్టిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి, డీజీపీని కోరినట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment