నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎన్నికల జిమ్మిక్కు
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎన్నికల జిమ్మిక్కు
Published Wed, Jul 12 2017 12:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
– వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ విమర్శ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జిల్లాకు చెందిన నలుగురికి ఒకేసారి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ఎన్నికల జిమ్మిక్కు అని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ విమర్శించారు. ఎలాగైనా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ కుట్రలు పన్నుతుందన్నారు. స్థానిక టీజే షాపింగ్‌మాల్‌లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి జిల్లాను పట్టించుకోని సీఎం చంద్రబాబుకు ఇప్పుడే ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్రాభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని, ఉపఎన్నికల ముగిసిన తర్వాత నంద్యాలదీ అదే పరిస్థితేనని చెప్పారు. సీఎం మాయలో నంద్యాల ప్రజలు పడరని.. వైఎస్‌ఆర్‌సీపీ పక్షాన నిలుస్తారనా్నరు. తమ పార్టీ ప్లీనరీకి ఊహించిన దానికంటే రెట్టింపు ప్రజాస్పందన లభించిందన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారని, అందుకు ప్లీనరీలో ప్రకటించిన పథకాలే నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని, అయితే, అక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆ సీటు వైఎస్‌ఆర్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు అనిల్‌కుమార్, పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు డి.కె.రాజశేఖర్, కటారి సురేశ్‌కుమార్, సోమిరెడ్డి, జగన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, రిజ్వాన్‌ఖాన్, షోయేబుద్దీన్‌ఖాద్రి, గణపచెన్నప్ప, జీవరత్నం, అశోక్‌బాబు, సంజు పాల్గొన్నారు.
Advertisement