
సాక్షి, కర్నూలు: జిల్లాలోని ఖడపూరలో జరిగిన రెండు కుటుంబాల మధ్య గొడవను టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం కర్నూల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తే తాము సహించేది లేదు. చట్టపరమైన పోరాటం చేస్తాం. కరోనా వైరస్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు ఎమ్మెల్యే పై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎమ్మెల్యే కష్టపడి ప్రతి వార్డులో శానిటేషన్, అత్యవసర సేవలు అందించారు. ఎమ్మెల్యే పై అనవసరమైన రాజకియాలు చేస్తే వారికి బుద్ధి చెబుతాం. అసత్య ఆరోపణలు పై కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తాం అని ఆయన తెలిపారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు)
Comments
Please login to add a commentAdd a comment