కర్నూలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ‍్యర్తి హపీజ్ ఖాన్
కర్నూలు: కర్నూలు నగర వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ‍్యర్థిగా హఫీజ్ ఖాన్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు నగరంలోని జమ్మి చెట్టు నుంచి కర్నూలు ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నామినేషన్ వేసిన అనంతరం హఫీజ్ ఖాన్ విలేకరులతో మాట్లాడారు. డబ్బు రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు టీడీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. కులాలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అది చూసి ఓర్వలేని టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ భయపడుతున్నారని విమర్శించారు.
20 ఏళ్లుగా కర్నూలులో ఏం అభివృద్ధి చేశారో టీజీ వెంకటేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీజీ వెంకటేశ్ గాజు గ్లాసు లాంటి వారని, ఆ గాజుపై రాళ్లు వేయించుకోవద్దని సూచించారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు మేలు చేస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను కొండారెడ్డి బురుజుపై ఎగరేస్తామని చెప్పారు. కర్నూలు నగరాన్ని కనివినీ ఎరుగుని రీతిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment