
మృతదేహాన్ని ఖననం చేస్తున్న దృశ్యం, శ్మశాన వాటికలో పీపీఈ సూట్‌లో ఎమ్మెల్యే హఫీజ్
కర్నూలు(సెంట్రల్): కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కరోనా కారణంగా మరణించిన ఓ వ్యక్తికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. కర్నూలు పాతబస్తీకి చెందిన వ్యక్తి శుక్రవారం కరోనాతో స్థానిక పెద్దాసుపత్రిలో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆసుపత్రి, మున్సిపల్ సిబ్బందితో కలిసి పీపీఈ కిట్లు ధరించి నగరంలోని సంతోష్‌నగర్ శ్మశాన వాటికలో శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. వైరస్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాలుపంచుకున్నట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment