
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలులో ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం సర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ‘థ్యాంక్యూ సీఎం సర్’ ఆకారంలో నిలబడి తమకు ఉద్యోగాలు ఇచ్చి భరోసా కల్పించారంటూ వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వలంటీర్లు, ఉద్యోగుల చేత ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment