Devansh
-
వైఎస్ జగన్ పై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది
-
కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఇవాళ ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి: డిప్యూటీ సీఎం
-
తాత దొంగతనం గురించి నిజం చెప్పాల్సింది!
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ఓదార్పు యాత్ర.. పేలవమైన ప్రసంగాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించేలా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలను చదవలేక ఇబ్బంది పడుతున్న ఆమె.. భర్తకు సంఘీభావంగా ఇస్తున్న స్టేట్మెంట్లతో ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీస్తున్నాయి. తాజాగా తిరుపతిలో నిర్వహించిన సభలో తెలుగుదేశం మహిళా నేతలు ఆమెను వెరైటీగా ప్రశ్నలు అడగడం.. ఆ ప్రశ్నలతో అయోమయానికి గురైన ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. అందులో తాతామనవడి సెంటిమెంట్‌ను పండించేందుకు ఆమె పడిన తాపత్రయం నవ్వులపాలు జేస్తోంది. ‘తాత ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడు.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదు. చిన్న వయసు కావడంతో తనకు చెప్పదల్చుకోలేదు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం’ అని తెదేపా నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అధికార మదంతో, పైగా అధికారుల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేశారని ఆధారాలతో సహా బయటపెట్టింది దర్యాప్తు సంస్థ. అలాంటిది ప్రజల సొమ్ము దొంగతనం చేసి జైలుకు వెళ్లిన 73 ఏళ్ల తాత గురించి.. తొమ్మిదేళ్ల వయసున్న మనవడికైనా కనీసం నిజం చెప్పాల్సిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. తిరుపతిలో నారా భువనేశ్వరి నిర్వహించిన నిజం గెలవాలి సభలో పలువురు @JaiTDP నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, నాయకుడు పులివర్తి నానిలను వేదికపైకి పిలవకపోవడంతో వారు సభ నుంచి అలిగి వెళ్ళిపోయారు. అలాగే భువనేశ్వరి ప్రసంగం పేలవంగా… — YSR Congress Party (@YSRCParty) October 26, 2023 -
జ్ఞాపకశక్తిలో భళా దేవాన్షి
రామచంద్రాపురం (పటాన్చెరు): అద్భుత మేధస్సు.. అమోఘమైన జ్ఞాపకశక్తి ఆ చిన్నారి సొంతం. ఒక్కసారి చెబితే చాలు.. గుర్తించి దాని పేర్లను చెబుతుంది. ఏడాది 9 నెలల వయసున్న ఆ బాల మేధావి అసమాన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2023లో చోటు సంపాదించింది. వివరాలివి. రామచంద్రాపురం పట్టణంలోని కాకతీయ నగర్ ప్రాంతానికి చెందిన బండారి విజయేంద్ర, మౌనిక దంపతుల కుమార్తె దేవాన్షి.. వస్తువులను గుర్తించడం, అంకెలను ఒకటి నుండి పది వరకు చెప్పడం, ఐదు రకాల జంతువుల్లా అరవడంలో దిట్ట. దీంతో కుటుంబ సభ్యులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించారు. వారి సూచనల ప్రకారం కుమార్తె ప్రతిభపై చిత్రీకరించిన వీడియోలు, జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువులను సమర్పించారు. ఆ వీడియోలో దేవాన్షి 15 బొమ్మలు, ఆరు శిశువు ఉత్పత్తులు, తొమ్మిది కూరగాయలు, ఐదు కార్టూన్ పాత్రలు, శరీరంలోని 11 భాగాల చిత్రాలను గుర్తించినట్టు చూపించారు. అదనంగా 6 రైమ్‌లు, 10 యాక్షన్ పదాలు, 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం, ఐదు జంతువుల శబ్ధాలను అనుసరించడం వంటివి రికార్డు చేశారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దేవాన్షికి చోటు కల్పించారు. కాగా చిన్నారి తండ్రి విజయేంద్ర జూరాల ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తున్నారు. -
కొడుకును బావిలో పడేసి.. ఆపై పురుగు మందు తాగి..
ఎలిగేడు: కుటుంబంలో ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కొడుకు(17 నెలలు)ను బావిలో పడేసి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాలుడు మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి, మానస దంపతులు. వీరికి దేవాన్ష్ (17 నెలలు) సంతానం. తిరుపతిరెడ్డి, అతడి సోదరుడు రత్నాకర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం పంచాయితీ పెట్టి పెద్దల సమక్షంలో ఆస్తి పంచుకున్నారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి భార్య, కుమారుడితో కలిసి సుల్తానాబాద్‌లోని ఓ అద్దింట్లో నివాసం ఉంటున్నాడు. ఆస్తి పంపకాల విషయమై చంపుతామని తరచూ కొందరు బెదిరిస్తున్నారని భార్యతో చెప్పుకుని తిరుపతిరెడ్డి బాధపడేవాడు. ఈ క్రమంలో రాములపల్లిలో ఉంటున్న తల్లిదండ్రులకు తన కుమారుడిని చూపించి తీసుకొస్తానని భార్యతో చెప్పి బయల్దేరాడు. అయితే ఎంతకూ తిరిగి రాకపోవడంతో భర్తకు మానస ఫోన్ చేయగా సమాధానం రాలేదు. వెంటనే అత్తామామలకు ఫోన్ చేయగా రాములపల్లికి రాలేదని వారు చెప్పారు. అనుమానంతో పొలం వద్దకు వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి అపస్మారకస్థితిలో కనిపించాడు. బావిలో బాలుడి చెప్పులు కన్పించాయి. తిరుపతిరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్త తేరుకున్నాక దేవాన్ష్ గురించి అడుగగా తానే బావిలో పడేసి గడ్డిమందు తాగానని చెప్పాడు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సీఐ జగదీశ్, జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ బావి వద్దకు చేరుకుని గ్రామస్తుల సహకారంతో దేవాన్ష్ మృతదేహాన్ని బయటకు తీయించారు. మానస ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బాలయ్య తాతా.. అఫిడవిట్లో హెరిటేజ్ షేర్లేవీ?
సాక్షి, అమరావతి: ఆస్తుల ప్రకటన డ్రామాతో జనాల చెవుల్లో హెరిటేజ్ క్యాలీఫ్లవర్లు పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు అండ్ కో. అసలు ఎవరైనాసరే తమ దగ్గర లేని షేర్లను ఇంకొకరికి గిఫ్ట్‌గా రాసిచ్చేయడం సాధ్యమేనా? 2018–19 ఏడాదికి గాను తాజాగా ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్ష్‌కు తాత 26,440 హెరిటేజ్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన లేదు. అయితే ఇక్కడ ప్రకటిస్తున్నది తమ కుటుంబ ఆస్తులు కాబట్టి తాతంటే చంద్రబాబే అని పేర్కొంటూ గురువారం రాత్రి ప్రధాన వెబ్సైట్లన్నీ రాశాయి. కొద్దిసేపటికి అసలు చంద్రబాబు పేరుతో షేర్లే లేనప్పుడు ఆయన మనవడికి గిఫ్ట్ ఎలా ఇస్తారని కొందరు లోకేశ్‌తో ధర్మసందేహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో తమ కోటరీ పత్రికలను ఈ తప్పు సరిదిద్దమంటూ పురమాయించారు. తెల్లారేసరికి తమ అనుకూల పత్రికలన్నింటిలో తాత బాలకృష్ణ ఈ షేర్లను దేవాన్ష్‌కు బహుమానంగా ఇచ్చారంటూ రాయించారు. తప్పు మీద తప్పు.. తాత పేరు విషయంలో తడబడ్డ చంద్రబాబు అండ్ కో.. దీన్ని సరిదిద్దుకునే క్రమంలో మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అసలు 2019 మార్చి 22న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో బాలకృష్ణ తన పేరుమీద హెరిటేజ్ షేర్లు ఉన్న విషయాన్నే పేర్కొనలేదు. అది మరిచిపోయి, తాతంటే చంద్రబాబు కాదు.. బాలయ్య అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. 2019 అఫిడవిట్లో బాలకృష్ణ తనకు రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో రూ.12 కోట్ల విలువైన 12 శాతం వాటా, సికింద్రాబాద్‌లోని ఒక సంస్థలో రూ.7 లక్షల విలువైన ఏడోవంతు వాటా, క్లాసిక్ ఇన్ఫోటెక్లో 25 శాతం వాటా (విలువ 19.21 కోట్లు), 27 రిలయన్స్ పెట్రోలియం షేర్లు (విలువ రూ.7,310), ఎన్బీకే ఫిల్మ్‌లో రూ.50,000 విలువైన వాటాలు ఉన్నట్లు మాత్రమే పేర్కొన్నారు. తన వద్ద మొత్తం 5 కంపెనీలకు సంబంధించి మొత్తం రూ.31.28 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు మాత్రమే తెలిపారు. ఎక్కడా హెరిటేజ్ ఫుడ్ షేర్లు ఉన్నట్లు ప్రకటించలేదు. మరి తన దగ్గర లేని షేర్లను బాలకృష్ణ ఇప్పుడు మనవడు దేవాన్ష్‌కు ఎలా ఇచ్చాడో లోకేశ్ చెప్పాలి. స్టాక్ ఎక్స్చేంజ్కు తెలుపలేదెందుకు? దేవాన్ష్ పేరిట 2017–18లో హెరిటేజ్ షేర్లు లేవు. అంటే 2018–19లోనే హెరిటేజ్ షేర్లు దేవాన్ష్ పేరిట బదిలీ అయ్యి ఉండాలి. దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరి కంపెనీ ఎండీ, తల్లి బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. ఇలా ప్రమోటర్లకు రక్త సంబంధీకుడైన దేవాన్ష్ పేరిట ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన 26,440 షేర్లు బదలాయింపు జరిగితే అది తప్పకుండా స్టాక్ ఎక్స్చేంజ్కి తెలియజేయాల్సిందేనని కంపెనీ సెక్రటరీలు స్పష్టం చేస్తున్నారు. 2018–19 ఆర్థిక ఏడాదికి స్టాక్ ఎక్స్చేంజ్ని పరిశీలిస్తే మనవడి పేరిట షేర్లు వచ్చినట్లు భువనేశ్వరి కానీ, కొడుకు పేరిట షేర్లు వచ్చినట్లు లోకేశ్ కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఇది కచ్చితంగా కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుంది. ఇలా ఒక వ్యక్తి పేరు మీద ఉన్న షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ ప్రమేయం లేకుండా మరో వ్యక్తికి ఎలా బదలాయిస్తారో, ఆ మాయ ఏంటో స్టాక్ మార్కెట్లో తలపండిన వాళ్లకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో గ్యాంగ్ ఇంకో కొత్త డ్రామాకు తెరతీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. -
మా కుటుంబ నికర ఆస్తులు రూ.102.48కోట్లు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ నికర ఆస్తులు రూ.102.48 కోట్లు అని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే తమ నికర ఆస్తులు రూ.13.82 కోట్లు పెరిగాయని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వారి కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ.9 కోట్లు కాగా ఆయన పేరున రూ.5.13 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. అంటే చంద్రబాబు పేరిట నికర ఆస్తులు రూ.3.87 కోట్లని, గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షల నికర ఆస్తులు పెరిగాయని తెలిపారు. ఆయన పేరిట బ్యాంకు రుణం రూ.18 లక్షలు తగ్గిందన్నారు. చంద్రబాబు సతీమణి, తన మాతృమూర్తి భువనేశ్వరి పేరిట మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు, అప్పులు రూ.11.04 కోట్లు ఉన్నట్టు లోకేశ్ వెల్లడించారు. ఆమె పేరిట రూ.39.58 కోట్ల నికర ఆస్తి ఉన్నట్టు చెబుతూ.. గత ఏడాదితో పోలిస్తే నికర ఆస్తులు రూ.8.50 కోట్లు పెరిగాయన్నారు. నా పేరుపై రూ.19 కోట్ల నికర ఆస్తులు తన పేరిట మొత్తం రూ.24.70 కోట్ల ఆస్తులు, రూ.5.70 కోట్ల అప్పులు ఉన్నట్టు లోకేశ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే నికర ఆస్తులు రూ.2.40 కోట్లు తగ్గి, ప్రస్తుతం తనకు రూ.19 కోట్లు నికర ఆస్తులు ఉన్నాయన్నారు. తన భార్య బ్రాహ్మణి ఆస్తులు రూ.15.68 కోట్లు, అప్పులు రూ.4.17 కోట్లు ఉన్నట్టుగా లోకేశ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఆమె పేరిట నికర ఆస్తులు రూ.3.80 కోట్లు పెరిగి ప్రస్తుతం మొత్తం నికర ఆస్తులు రూ.11.51 కోట్లు ఉన్నట్టుగా వివరించారు. తన కుమారుడు దేవాన్ష్ పేరిట రూ.19.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే రూ.3.80 కోట్లు పెరిగిందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు తన వాటాలోని 26,440 షేర్లను మనవడు దేవాన్ష్‌కు బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్ అప్పులు రూ.37.20 కోట్ల నుంచి రూ.34.85 కోట్లకు తగ్గినట్టు లోకేశ్ వెల్లడించారు. ఆ సంస్థ నికర ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.2.27 కోట్లు పెరిగి, రూ.9.10 కోట్లకు చేరాయన్నారు. ఐటీ అధికారులే లెక్కలు తేలుస్తారు ఇటీవల జరిగిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారుల దాడుల్లో గుర్తించిన ఆస్తుల లెక్కలను ఆ శాఖ అధికారులే తేలుస్తారని నారా లోకేశ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఐటీ దాడులు జరిగినా చంద్రబాబుకే అంటగడుతున్నారని ఆయన విమర్శించారు. తాము చెప్పిన దానికంటే ఒక్క షేర్ ఎక్కువ ఉన్నా మొత్తం ఆస్తి రాసిస్తామన్నారు. మీడియా ముందుకు వచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ జంకుతున్నారని, అందుకే 9 నెలల్లో ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదన్నారు. చంద్రబాబుకు ముప్పు ఉందని తెలిసినా భద్రత తగ్గించారని ఆయన విమర్శించారు. -
తాతా.. గిఫ్ట్ ఎలా ఇచ్చావు?
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. హడావిడిగా ఆస్తుల ప్రకటనలో దాగివున్న లోగుట్టు స్పష్టమైంది. ఐటీ దాడుల నేపథ్యంలోనే ఆస్తుల డ్రామా తెరపైకి వచ్చిందని, నిర్వాణ హోల్డింగ్స్‌తో తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకే ఈ పాట్లు అని ఆ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు 2019లో సీఎం పదవి నుంచి దిగిపోగానే అప్పటి వరకు తన పేరు మీద లేని కోట్ల రూపాయల విలువైన షేర్లను మనవడు దేవాన్ష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. వరుసగా తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నామని చెబుతున్నా.. ఎప్పుడూ కూడా చంద్రబాబు తన పేరు మీద హెరిటేజ్ కాదు కదా ఏ కంపెనీ షేర్లు ఉన్నట్లు చూపించలేదు. కానీ గురువారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు తన మనవడికి 26,640 హెరిటేజ్ షేర్లను ప్రకటిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. 2017–18లో దేవాన్ష్ పేరు మీద షేర్లు లేకపోగా ఇప్పుడు ప్రకటించిన జాబితాలో గ్రాండ్ పేరెంట్స్ 26,640 షేర్లు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరికి చెందిన హెరిటేజ్ షేర్లల్లో మార్పులు లేవు. ఈ షేర్లను తాత చంద్రబాబే ఇచ్చాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది ఒక్కటి చాలు ఏటా ఆస్తుల పేరిట చంద్రబాబు అండ్ కంపెనీ నడిపిస్తున్న డ్రామా తెలుసుకోవడానికి. కొన్న నాటి ఆస్తుల విలువను ప్రకటిస్తున్నామని చెబుతారు కానీ, కొత్తగా ఆస్తులు కొనకపోయినా ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగిపోతుండటం తల పండిన ఆర్థిక వేత్తలకు కూడా అర్థం కావడం లేదు. తనకు హెరిటేజ్ కంపెనీలో ఒక్క షేరు లేదంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు మనవడికి గిఫ్ట్ ఎలా ఇచ్చాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక సీఎంగా ఉంటూ తాను షేర్లు కలిగిన కంపెనీకి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇవ్వడం ఖచ్చితంగా క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఐటీ దెబ్బతో నిర్వాణ నుంచి లోకేశ్ ఔట్ చంద్రబాబు కుటుంబ ఆస్తులన్నీ నిర్వాణ హోల్డింగ్స్ పేరున ఉన్నాయి. ఈ కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్ లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేష్. 15 రోజుల క్రితం కిలారు రాజేష్‌పై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో లోకేశ్.. నిర్వాణ హోల్డింగ్స్‌లో తన పేరిట ఉన్న రూ.1.62 కోట్ల విలువైన (కొన్న విలువ ప్రకారం) షేర్లను బ్రాహ్మణి పేరిట బదలాయించినట్లు చూపించారు. కోట్లలో జీతం ఉన్నా తగ్గిన ఆస్తులు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి కోట్ల రూపాయల్లో జీతం తీసుకుంటున్నారు. కంపెనీ భారీ లాభాలు ప్రకటిస్తుండటంతో డివిడెండ్ కూడా బాగానే ఇస్తోంది. 2018–19లో కంపెనీ షేరుకు రూ.40 డివిడెండ్ ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం భువనేశ్వరి పేరు మీద ఉన్న షేర్లకు సుమారు రూ.42 కోట్లు డివిడెండ్‌గా వస్తుంది. కానీ 2017–18తో పోలిస్తే 2018–19 నాటికి భువనేశ్వరి ఆస్తులు రూ.2.75 కోట్లు తగ్గినట్లు చూపించారు. గతేడాదిలో రూ.53.37 కోట్లుగా ఉన్న భువనేశ్వరి ఆస్తులు ఇప్పుడు రూ.50.62 కోట్లకు తగ్గిపోయినట్లు చెప్పారు కానీ, అందుకు కారణాలను మాత్రం వివరించ లేదు. చంద్రబాబు ఆస్తులు మాత్రం రూ.8.31 కోట్ల నుంచి రూ.9 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. లోకేశ్ ఆస్తులు రూ.27.29 కోట్ల నుంచి రూ.24.70 కోట్లకు తగ్గగా, బ్రాహ్మణి ఆస్తులు రూ.13.38 కోట్ల నుంచి రూ.15.68 కోట్లకు, దేవాన్ష్ ఆస్తులు రూ.18.71 కోట్ల నుంచి రూ.19.42 కోట్లకు పెరిగినట్లు చూపించారు. కళ్లెదుటే వేల కోట్ల ఆస్తులు! గతేడాదితో పోలిస్తే కుటుంబ నికర ఆస్తులు రూ.13.82 కోట్లు పెరిగి రూ.102.48 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇందులో పేర్కొన్న నికర ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటే ఈ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న హెరిటేజ్ షేర్ల విలువే రూ.1,000 కోట్ల పైన ఉంది. ఇది కాకుండా నిర్వాణ హోల్డింగ్స్ పేరిట ఉన్న ఆస్తులు, పెట్టుబడులు అదనం. ఇలా వేల కోట్ల ఆస్తులను తక్కువ చేసి చూపిస్తూ నాటకాలు ఆడటం నారా వారికే చెల్లుతుందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు కుటుంబ నికర ఆస్తులు కోట్లల్లో ఇలా పెరిగాయి.. (అప్పులు తీసివేయగా) ఏడాది ఆస్తుల విలువ 2011 38 2012 35.59 2013 41.70 2014 63.95 2015 47.3 2016 74 2017 75.06 2018 88.66 2019 102.48 నాయనమ్మ, తాతల నుంచి దేవాన్ష్ గిఫ్టుగా పొందినట్లు కనిపిస్తున్న షేర్లు -
చంద్రబాబు మనవడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..?
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్లో కనిపించనున్నారు. ఇతర పాత్రలకు కూడా నందమూరి హీరోలనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో బాల ఎన్టీఆర్‌గా నారా లోకేష్, బ్రాహ్మణీల కుమారుడు దేవాన్ష్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మరికొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌గా కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్యారామ్, నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించనున్నారు. ఇక యంగ్ ఎన్టీఆర్‌గా బాలయ్య తనయుడు మోక్షజ్ఞను తీసుకోవాలని భావించినా బాలకృష్ణ వద్దన్నారని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు శర్వానంద్ మరోకీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
మా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి
అమృతవారిపల్లె(ఓబులవారిపల్లె) : మండలంలోని అమృతవారిపల్లె గ్రామానికి చెందిన తలపల సుభాషిణి, తలపల వెంకటేష్ దంపతులకు మూడవ సంతానం దేవాన్ష్ (12 నెలలు). పుట్టిన మూడు నెలల నుంచి కడుపు ఉబ్బుతుండటంతో తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాలేయవ్యాధి అని వైద్యులు నిర్ధారించారు. అప్పటినుంచి చికిత్స చేయిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తమిళనాడు లోని రాయవేలూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిం చారు. వ్యవసాయ కూలి పనులు చేసుకునే వెంకటేష్ సుమారు రూ.3లక్షలు ఖర్చుచేసి వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో కాలేయానికి శస్త్రచికిత్స చేయించారు. అయినా కాలేయ సమస్య తగ్గకపోవడంతో మళ్లీ వేలూరు సీఎంసీకి వెళ్లమని వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు. అప్పుచేసి దేవాన్ష్ కు వైద్యం చేయించినా ఫలితం లేకపోగా.. మళ్లీ వైద్యం చేయించే స్థోమత లేకపోయినా..బిడ్డను బతికించుకోవాలనే తపనతో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అయితే కాలేయ మార్పిడి చేసేందుకు రూ.25లక్షలు ఖర్చు అవుతుందని వీలైనంత త్వరగా చేయించాలని వైద్యులు తెలపడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంటికి చేరుకున్నారు. అప్పటినుంచి కాలేయ మార్పిడికి ఒక్కసారిగా అంత డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించలేక ఇంటివద్దనే ఉంటూ మందులు వాడుతున్నారు. దేవాన్ష్ ఏమి తిన్నా కూడా కడుపు ఉబ్బి పెద్దది అవుతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. చిన్నారి కాలేయమార్పిడికి దాతలు సహకరించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘దేవాన్షుకు ఆంధ్రాలోనే ఆధార్’
సాక్షి, అమరావతి: కేబినెట్ విస్తరణ అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ కొట్టిపారేశారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో...‘అఖిలప్రియను మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్న వార్తలు అవాస్తవం. ఆమె బాగా పని చేస్తున్నారు. కృష్ణానదిలో బోటు ప్రమాదానికి బాధ్యులైనవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక నంది అవార్డులపై చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. మా కుటుంబానికి ఏపీలో ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయా? లేవా అని కొందరు వెతుకున్నారు. ఆంధ్రాలో ఓటుహక్కు లేకపోతే ఎమ్మెల్సీని ఎలా అవుతా?. మా అబ్బాయి దేవాన్షుకు కూడా ఆంధ్రాలోనే ఆధార్ కార్డు ఉంది.’ అని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని లోకేశ్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తన తండ్రి చాలా బాధపడ్డారంటూ సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. -
అమరావతికి ఆభరణాల్లా రోడ్లు
ఏడు రహదారులకు సీఎం శంకుస్థాపన మంగళగిరి: రాజధాని అమరావతికి మకుటాయమానంగా నిలవనున్న సప్త రహదారులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడు రహదారులతో అమరావతి రూపురేఖలు మారతాయన్నారు. ఒక్కో రోడ్డు అమరావతి నగరానికి వడ్డాణం, నెక్లెస్, డైమండ్‌లా ఉంటాయన్నారు. అమరావతికి అనుసంధానంగా నిర్మించనున్న ఏడు రోడ్లకు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం గ్రామంలో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరం గసభలో మాట్లాడుతూ.. అమరావతిని కలుపుతూ తూర్పు పడమర దిశలలో మూడు రోడ్లు, ఉత్తర, దక్షిణాలను కలుపు తూ నాలుగురోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజధానికి ఉండవల్లి, పెనుమాక, నిడ మర్రు గ్రామాలకు చెందిన రైతులు సహరించకపోవడం బాధాకరమన్నారు. ఏడాదిలో దేవాన్ష్ ఆడుకునేలా చేస్తా.. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపార్థసారథి మాట్లాడుతూ విజయవాడలో కానీ రాజధానిలో కానీ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ ఆడుకునేందుకు అవకాశం లేదని, ఏడాదిలో రహదారులు, పార్కులు పూర్తిచేసి దేవాన్ష్ ఆడుకునేలా చేస్తానని అన్నారు. -
తాతామనవడి లాహిరి లాహిరి
కృష్ణా నదిలో సీఎం బోటు విహారం ఆరు టూరిజం బోట్లలో అనుసరించిన భద్రతా సిబ్బంది సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం తన కుమారుడు, మనవడితో కలసి కృష్ణా నదిలో బోటు షికారు చేశారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు నదిలో విహరించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రైవేటు స్పీడు బోటులో కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్ తో కలసి బయల్దేరి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం ఘాట్, అక్కడినుంచి వెనక్కు తిరిగి పున్నమి ఘాట్ మీదుగా ప్రకాశం బ్యారేజీ నుంచి మళ్లీ తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న బోటును ఆరు టూరిజం బోట్లల్లో భద్రతా సిబ్బంది అనుసరించారు. కృష్ణా నది ఘాట్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిన సీఎం ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా కుటుంబంతో గడిపారు.