తాతామనవడి లాహిరి లాహిరి | chandrababu along with his grand son boating in krishna river | Sakshi
Sakshi News home page

తాతామనవడి లాహిరి లాహిరి

Published Wed, Dec 28 2016 5:20 AM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

తాతామనవడి లాహిరి లాహిరి - Sakshi

తాతామనవడి లాహిరి లాహిరి

కృష్ణా నదిలో సీఎం బోటు విహారం
ఆరు టూరిజం బోట్లలో అనుసరించిన భద్రతా సిబ్బంది  


సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం తన కుమారుడు, మనవడితో కలసి కృష్ణా నదిలో బోటు షికారు చేశారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు నదిలో విహరించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రైవేటు స్పీడు బోటులో కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్ తో కలసి బయల్దేరి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం ఘాట్, అక్కడినుంచి వెనక్కు తిరిగి పున్నమి ఘాట్‌ మీదుగా ప్రకాశం బ్యారేజీ నుంచి మళ్లీ తన నివాసానికి చేరుకున్నారు.

ఆయన ప్రయాణిస్తున్న బోటును ఆరు టూరిజం బోట్లల్లో భద్రతా సిబ్బంది అనుసరించారు. కృష్ణా నది ఘాట్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిన సీఎం ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా కుటుంబంతో గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement