తాత దొంగతనం గురించి నిజం చెప్పాల్సింది! | Satires On Nara Bhuvaneswari Thatha Manavadu Story Tirupati Meeting | Sakshi
Sakshi News home page

తాత దొంగతనం గురించి దేవాన్ష్‌కు చెప్పలేదా భువనేశ్వరమ్మా!

Published Fri, Oct 27 2023 7:43 AM | Last Updated on Fri, Oct 27 2023 9:02 AM

Satires On Nara Bhuvaneswari Thatha Manavadu Story Tirupati Meeting - Sakshi

సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ఓదార్పు యాత్ర.. పేలవమైన ప్రసంగాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించేలా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలను చదవలేక ఇబ్బంది పడుతున్న ఆమె.. భర్తకు సంఘీభావంగా ఇస్తున్న స్టేట్‌మెంట్లతో ఇటు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీస్తున్నాయి.  

తాజాగా తిరుపతిలో నిర్వహించిన సభలో తెలుగుదేశం మహిళా నేతలు ఆమెను వెరైటీగా ప్రశ్నలు అడగడం.. ఆ ప్రశ్నలతో అయోమయానికి గురైన ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. అందులో తాతామనవడి సెంటిమెంట్‌ను పండించేందుకు ఆమె పడిన తాపత్రయం నవ్వులపాలు జేస్తోంది.   

‘తాత ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్‌ అడుగుతున్నాడు.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదు. చిన్న వయసు కావడంతో తనకు చెప్పదల్చుకోలేదు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం’ అని తెదేపా నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిచ్చారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అధికార మదంతో,  పైగా అధికారుల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేశారని ఆధారాలతో సహా బయటపెట్టింది దర్యాప్తు సంస్థ. అలాంటిది ప్రజల సొమ్ము దొంగతనం చేసి జైలుకు వెళ్లిన 73 ఏళ్ల తాత గురించి.. తొమ్మిదేళ్ల వయసున్న మనవడికైనా కనీసం నిజం చెప్పాల్సిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement