
ఆళ్లగడ్డ: మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు నమోదు చేసినట్టు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలో కోవిడ్ నిబంధనల మేరకు సెక్షన్–30 అమల్లో ఉన్నప్పటికీ అఖిలప్రియ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారని పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో అఖిలప్రియతో పాటు టీడీపీకి చెందిన మరో 25 మందిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు.