అఖిలప్రియకి ఝలక్‌.. కీలక నేత రాజీనామా | Erigela Rampulla Reddy Quits TDP | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్‌.. కీలక నేత రాజీనామా

Published Sat, Dec 29 2018 2:04 PM | Last Updated on Sat, Dec 29 2018 4:39 PM

Erigela Rampulla Reddy Quits TDP - Sakshi

సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ తీరు కారణంగానే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాల్లో మంత్రి భూమా అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు.

టీడీపీ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. నీరు చెట్టు పథకంలో అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధం అని తెలిపారు. ఇరిగెల బాటలోనే పలువురు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement