కాకరవాడ దళిత కాలనీ ఎలా ఉందో మంత్రి అఖిలప్రియకు చూపుతున్న ప్రజలు
కర్నూలు, ఉయ్యాలవాడ: మంత్రి అఖిలప్రియకు కాకరవాడ గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం గ్రామంలో మంత్రి పర్యటించారు. దళిత కాలనీని సందర్శించేందుకు వెళ్లి సమస్యలు ఆరా తీశారు. ‘‘ గ్రామంలో అంతా సీసీ రోడ్లు వేస్తున్నారు.. మా కాలనీలో రోడ్లు, మురికి కాలువలు ఎందుకు ఏర్పాటు చేయరు? ఎస్సీల ఓట్లు చెల్లవా? మా సమస్యలు పరిష్కరించరా?’’ అంటూ మంత్రిని దళిత కాలనీ వాసులు నిలదీశారు. కాలనీలో సమస్యలను మంత్రి చూపించారు. దీంతో ఆమె స్పందిస్తూ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అనంతరం బీసీ కాలనీని వెళ్లగా.. విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బీవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment