![SV Jagan Reddy Resign To TDP And Joins In YSRCP - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/16/akhila-priya.jpg.webp?itok=GqPKYMUe)
సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది. ఆమె సొంత మేనమామ, టీడీపీ నేత ఎస్వీ జగన్ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్ శనివారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎస్వీ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు.
మంత్రికి ఝలక్... వైఎస్‌ఆర్‌సీపీలోకి సింగం
కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో మంత్రి అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వలసలను ఆపేందుకు స్వయంగా ఫోను చేసి మాట్లాడటంతో పాటు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి బుజ్జగిస్తున్నారు. కాగా గతంలో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment