సాక్షి, కర్నూలు: మంత్రి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. అఖిలప్రియ పోటీ చేసిన ఆళ్లగడ్డ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బీజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఓటమికి ఆమె వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె ప్రవర్తన తీరు నచ్చక పలువురు నేతలు కూడా టీడీపీని వీడారు. ఇవన్నీ కూడా ఆమె ఓటమిలో కీలక భూమిక పోషించాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కాగా, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అఖిలప్రియ.. టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భూమ బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాలలో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment