సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు ముదిరింది. ఈ క్రమంలో అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అఖిలప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసేక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే.
మరోవైపు, అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి.
మంగళవారం జరిగిన ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment