av subba reddy
-
సొంతపార్టీ నేతలపైనా అఖిలప్రియ రెడ్ బుక్ పడగ
-
ఆళ్లగడ్డలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో చెప్తే నేనెందుకు వెళ్తా.. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. మందిమార్బలంతో డెయిరీ ప్రాంగణంలోని చైర్మన్ గదిలోకి వెళ్లారు. డెయిరీలో ఏం జరుగుతుందో చెప్పాలని, ఇక్కడి అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అఖిలప్రియ రెచ్చిపోయారు. డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నూతన శిలాఫలకాల ఏర్పాటుపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యకం చేశారు. తనతో ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని అఖిల సూచించారు.‘నాతో మామగా మాట్లాడుతున్నావా... లేక చైర్మన్‌గా మాట్లాడుతున్నావా.. మామవైతే నీ సీట్లో కూర్చుంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావ్ అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నంద్యాలకు వచ్చి రాజకీయాలు చేయడం ఏంటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పరిధిలో రాజకీయాలు చేసుకోవాలని.. తమ పరిధిలోకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. -
అఖిల ప్రియVs ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్‌పై అఖిల ప్రియ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. భూమా ఘాట్ నుంచి ఎమ్మెల్యే అఖిల ప్రియ ర్యాలీగా బయలుదేరగా, ర్యాలీలో వెళ్తుండగా ఏవీ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్, రిలయన్స్ మార్ట్ పై అఖిల ప్రియ అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాల విషయం తెలిసిందే. గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇటీవల ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డుపై దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. -
అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య ముదిరిన వర్గపోరు
-
అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు ముదిరింది. ఈ క్రమంలో అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అఖిలప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసేక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. మరోవైపు, అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం జరిగిన ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్ -
ఏవీ సుబ్బారెడ్డి సభ వద్దకు రావద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
-
టీడీపీలో అరాచక నేతలు
‘‘నాపై హత్యకు సుపారీ ఇచ్చింది. ఇప్పుడు దాడి చేసింది. ఇన్ని రోజులు పిల్లోళ్లు ఎత్తుకుని పెంచాం ఎందుకులే అనుకున్నా. ఇంత వరకూ వచ్చిన తర్వాత ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.’’ ఏవీ సుబ్బారెడ్డి యువగళం పాదయాత్రలో మే 16న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల, తన అనుచరవర్గం భౌతికదాడి చేశారు. అఖిల దగ్గరుండి కొట్టండి.. తన్నండి అని రెచ్చగొడుతూ దాడికి పురిగొల్పారు. దాడిలో ఏవీకి రక్తగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి అఖిలపై కేసు నమోదైంది. రిమాండ్‌కు వెళ్లొచ్చారు. ఈ ఘటన నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ టీడీపీలో కలకలం రేపింది. ‘‘కొడకల్లారా దాక్కోండి. గుళ్లోకెళ్లి మొక్కోండి. మీ ఖర్మకాలి టీడీపీ అధికారంలోకి వస్తే ఏ మూలన దాక్కున్నా వెంటపడి వస్తాం. వెతుక్కుంటూ వస్తాం. శోభానాగిరెడ్డి రాజకీయం చూపిద్దామనుకున్నా. వీళ్లకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాల. కచ్చితంగా నాగిరెడ్డి రాజకీయమే చూపిస్తా!’’ – ఆళ్లగడ్డ యువగళం సభలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సాక్షి ప్రతినిధి కర్నూలు: వ్యక్తిగతమైన ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలు తమ వర్గాలకు రుద్ది, ఇది వ్యక్తిగతంగా తమ మధ్య ఉన్న విభేదాలుగా కాకుండా, వర్గాల మధ్య విభేదాలుగా చూపి రాజకీయం చేయడం టీడీపీ నేతలకే చెల్లింది. పొరపాటున టీడీపీకి అధికారం ఇస్తే ‘ఫ్యాక్షన్’ రాజకీయాలు చేస్తామని భూమా నాగిరెడ్డి వారసుడు విఖ్యాత్‌రెడ్డి.. లోకేశ్ సమక్షంలోనే తెగేసి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఇలాంటివి తప్పని కూడా వారించే ప్రయత్నం లోకేశ్ చేయకపోవడం ఆయన రాజకీయ పరిణతి ఏపాటిదో తెలియజేస్తోంది. దీంతో నిజంగానే వీరికి అధికారం ఇస్తే మళ్లీ ఫ్యాక్షన్ తగాదాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో రక్తం పారే ప్రమాదం లేకపోలేదని ప్రజల్లో భయాందోళన నెలకొంది. వైఎస్సార్సీపీ కండువాతో గెలిచిన అఖిల, నాగిరెడ్డి ‘పచ్చ’కండువాలేసుకుని ‘సైకిల్’ జర్నీ చేశారు. 2019 ఎన్నికలకు ముందే నాగిరెడ్డి చనిపోయారు. ఈ ఎన్నికల్లో అఖిల ఓడిపోయారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలుగా కొత్తతరం రాజకీయనేతలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఎన్నికయ్యారు. నాలుగేళ్లలో అభివృద్ధి మినహా వీరికి మరో ఆలోచన లేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా రెండు నియోజకవర్గాల్లో మళ్లీ అరాచక పాలన మొదలవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అఖిల వ్యవహారంతో కుటుంబ సభ్యులు దూరం నాగిరెడ్డి మృతి తర్వాత విభేదాల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యాడు. చివరకు తనను చంపించేందుకు అఖిల సుఫారీ ఇచ్చినట్లు ఏవీ ఆరోపించారు. చింతకుంట, గోవిందపల్లికి చెందిన కొంతమందిని కడప పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఏవీని దూరం చేసుకోవడం అఖిలకు దెబ్బే! ‘భూమా’కు అత్యంత సన్నిహితుడైన శివరామిరెడ్డిని క్రషర్ విషయంలో దూరం చేసుకున్నారు. నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఆయన కూడా దూరమయ్యారు. ఆపై అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు పెంచుకున్నారు. దీంతో అతను బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు మహేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషోర్ పార్టీలో చేరిన తర్వాత తన ఇంటికి వెళ్లకుండా కిషోర్ నివాసానికి అఖిల తాళాలు వేయించారు. చివరకు బ్రహ్మానందరెడ్డికి, అఖిలకు కూడా మాటల్లేవు. ఇలా ఒక్కొక్కరుగా ‘భూమా’ బంధువులు పూర్తిగా అఖిలకు దూరమయ్యారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా కనీసం పదిమంది ఇంటికి రాని పరిస్థితి. ఈ కారణంగానే ఆమె జిల్లాకు రావడం వదిలేసి ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటోందనే చర్చ ఉంది. అయితే అక్కడ కూడా వివాదాల్లో తలదూర్చారు. శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో అఖిల 14రోజుల రిమాండ్‌లో ఉన్నారు. చంచల్‌గూడకు ‘సీమ’లో బహుశా, రాష్ట్ర రాజకీయాల్లో కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లడం ఇదే ప్రథమం. ‘ఫ్యాక్షన్’ భూమిలో అభివృద్ధి వెలుగులు ఆళ్లగడ్డ మూడు దశాబ్దాలపాటు ‘భూమా’ ఏలుబడిలోనే ఉంది. ఇన్నేళ్లలో సాధించిందేమిటని ఆరాతీస్తే హత్యలు, కేసులు, వారిని నమ్మకున్న కుటుంబాలు ఫ్యాక్షన్‌లో రాలిపోవడం మాత్రమే. నాగిరెడ్డి వల్ల నాపై 24కేసులు ఉన్నాయని, ఫ్యాక్షన్ నడిపానని ఏవీ సుబ్బారెడ్డే స్వయంగా చెబుతున్నారు. ఇదేదో వారు సాధించిన ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. గంగుల బిజేంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ సాధించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. 30 పడకల ఆస్పత్రి 50 పడకలకు పెంచి పేదల ఆరోగ్యానికి దన్నుగా నిలిచారు. చాగలమర్రి మండలం వనిపెంట చెంచుగూడెం లాంటి చీకటి తండాలకు వంతెనలను నిర్మించి బయటి ప్రపంచానికి వారిని తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఆలోచనలో అభివృద్ధి మినహా మరో ఆలోచన లేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అలాగే శిల్పా రవి హయాంలో నంద్యాల జిల్లా కేంద్రమైంది. మెడికల్ కాలేజి సాధించారు. ‘అమృత్’ ద్వారా రూ.9కోట్లతో వెలుగోడు నుంచి తాగునీటిని నంద్యాలకు రప్పించి దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారు. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మూడు వంతెనలు నిర్మించారు. ఇలా వీరు అభివృద్ధి వైపు వెళుతున్నారు. కానీ టీడీపీ నేతలు గెలిస్తే చంపుతాం, నరుకుతాం అంటూ రక్తచరిత్రను గుర్తు చేస్తూ ప్రశాంత గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు. -
కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో తెలుగుదేశం పరువు బజారున పడింది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్‌కు తరలించారు. దాడి గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారాని, దీనిపై నిలదీస్తే ఏవీ సుబ్బారెడ్డి తనను దూషించారని అఖిలప్రియ ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డి పై దాడిచేశారని తెలిపారు. తన కోసం భర్త భార్గవ్ రామ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని అఖిలప్రియ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఖండించారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, నంద్యాల ఘటనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపట్టుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసలే అంతంత మాత్రంగా నడుస్తోన్న లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఇవేమీ ఇబ్బందులంటూ చంద్రబాబు వాపోయినట్టు తెలిసింది. ఘటనపై పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సీనియర్లతో త్రిసభ్య కమిటీ వేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. పాదయాత్ర పూర్తయ్యేవరకు పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చదవండి: లేఖను ఎందుకు దాచారు? -
మా అక్కకు జైల్లో భోజనం పెట్టడం లేదు: భూమా మౌనిక
సాక్షి, హైదరాబాద్: ‘టెర్రరిస్టులను కూడా బాగా చూసుకునే దేశం మనది. జైల్లో మా అక్కకు కనీసం భోజనం పెట్టడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మా అక్క జైలు నుంచి ప్రాణాలతోనే వస్తుందా అని భయం వేస్తుంది’ అంటూ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మౌనిక మాట్లాడుతూ.. ‘జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పొలిటికల్ గేమ్ నడుస్తోంది అనిపిస్తోంది. అఖిలప్రియ ఆధారాలు ట్యాంపరింగ్ చేశారు అని పోలీసులు ఆధారాలు కోర్టుకు ఇవ్వకుండా రిమాండ్ రిపోర్టులో చెప్పారు. అఖిలప్రియ హెల్త్ కండిషన్ సరిగ్గా లేకున్నా అంతా బాగుంది అని పోలీసులు చెప్తున్నారు. టెర్రరిస్టులను అయినా సరిగ్గా చూసుకుంటారు. అంతకంటే దారుణమా. ఏ-1 ఏవీ సుబ్బారెడ్డిని పట్టుకొని వదిలేశారు. ప్రవీణ్ రావును కొట్టారు, తిట్టారు అన్నారు.. మరి కోర్టుకు ఎందుకు ఆధారాలు చూపించలేదు. గాంధీ హాస్పిటల్ నుంచి మీడియా, కరెంట్ తీసివేసి ఎందుకు తీసుకెళ్లారు’ అంటూ మౌనిక పలు ప్రశ్నలు సంధించారు. వేరే రాష్ట్రం నుంచి వస్తే.. ఇక్కడ ఉండనివ్వరా? ఇక ‘ల్యాండ్ సమస్య మా నాన్న ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది. వాళ్ళ మరణం తరువాత మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. భూమా కుటుంబం ఏపీకే కాదు ఇరు ప్రాంతాలకు సేవలు చేశారు. ఆళ్లగడ్డ నుంచి వస్తే సంస్కారం లేని వ్యక్తులా. సెటిలర్లు ఓట్లు వేస్తేనే కదా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి. ఆ విషయం మర్చిపోయారా. పోలీసుల స్టేట్మెంట్ సరిగ్గా లేదు. ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేసే విధానం ఇదేనా. అఖిల-సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అని పోలీసులు చెప్పి.. రాత్రికి రాత్రి పూర్తిగా మార్చేశారు. గాంధీ హాస్పిటల్ సీసీటీవీ ఫూటేజ్ బయటపెట్టాలి. పోలీసులు జడ్జీలు అన్నట్లు చెప్తున్నారు. అఖిలప్రియ నేరం చేసినట్లు కోర్టుకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉంటే ఇంత ఇబ్బంది పడాలా. వైద్యుల డ్యూటీ కూడా పోలీసులే చేస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉంది అని అనుమానం కలుగుతోంది. వేరే రాష్ట్రం నుంచి వస్తే రాష్ట్రంలో ఉండనివ్వరా. అఖిలప్రియపై పోలీసులు రోజుకో కొత్త కేసు పెడుతున్నారు’ అని మౌనిక ఆరోపించారు. (చదవండి: ఎందుకు చంపాలనుకున్నారు?) ఇక భార్గవ్ రామ్ వస్తే ఏం చేస్తారో ‘ఆ ల్యాండ్ మా నాన్నది... అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మేము పుట్టింది ఆళ్లగడ్డలో అయినా పెరిగింది సిటీలోనే. మేము హైదరాబాద్‌లో ఉన్నామా.. పాకిస్తాన్లో ఉన్నామా అని అనిపిస్తోంది. మా జీవితాలు సినిమా చూసినట్లు ఉంది. మేము సీఎం కేసీఆర్‌ని రిక్వస్ట్ చేస్తున్నాం.. మధ్య వర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించండి. పోలీసులు కనీసం ప్రోటోకాల్ ఫాలో కాకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ల్యాండ్ ధర పెరిగింది అని పోలీసులు అంటున్నారు.. ధర పెరిగినట్లు వాళ్లకు ఎలా తెలుసు. భూమా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ కుళ్లు రాజకీయాలు మాకు వద్దు.. మా కుటుంబ పరంగా వస్తున్న రాజకీయ సేవలు మేము చేస్తున్నాము. 70 ఎకరాల ల్యాండ్ సమస్య ఉంది. మా కుటుంబానికి కావాల్సింది ల్యాండ్ కాదు.. మా అక్క కావాలి. మమ్మల్ని సెటిలర్లుగా.. ఔట్ సైడర్స్గా, ఫ్యాక్షనిస్టులుగా చూపిస్తున్నారు. మా అక్కను ఇలా ట్రీట్ చేస్తున్నారు.. ఇక భార్గవ్ రామ్ వస్తే ఏం చేస్తారో. ప్రవీణ్ రావు హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో చూపించలేదు. సూపరింటెండెంట్ నాకు కాల్ చేసి హెల్త్ రిపోర్ట్స్ కావాలని అడిగారు’ అని తెలిపారు. (చదవండి: అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు..) కేసీఆర్ పెద్ద మనసు చేసుకోని సమస్యను పరిష్కరించాలి. 2006 లేదా 2007లో చాలా మంది పై అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఏవీ సుబ్బారెడ్డి, మేము కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కానీ సీన్ మారింది. ఏవీ సుబ్బారెడ్డి ఆధారాలు ట్యాంపర్ చేయడని పోలీసులకు ఏంటి నమ్మకం. ఏ-1కి నోటీసులు ఇచ్చి... ఏ-2ని పిక్ చేసి అరెస్ట్ చేస్తారా. మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ల్యాండ్ ఒక్కరి పేరుమీద లేదు. చాలా కంపెనీలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిడి లేకపోతే ఇంత హడావుడి జరుగదు అనిపిస్తుంది. నేను కేసీఆర్ ఫ్యామిలీని విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి సమస్యను పరిష్కారించండి’ అని మౌనిక అభ్యర్థించారు. -
కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసులో ఏ1 గా ఆరోపణలు ఎందుర్కొంటున్న ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని మాదాపూర్‌లోని అతని నివాసంలో హైదరాబాద్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసులో అరెస్టయినవారి సంఖ్య మూడుకు చేరింది. ఏ2 అఖిలప్రియ, భార్గవ్‌రామ్ సోదరుడు చంద్రబోసును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నాడు. ఏ1 గా ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదు అంతకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఏవీ సుబ్బారెడ్డి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎందుకు ఏ1గా చేర్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ‘కిడ్నాప్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రవీణ్‌రావుతో విభేదాలు ఉన్నది వాస్తవమే. హఫీజ్‌పేట్ భూ వివాదంపై ఇప్పుడు నేను మాట్లాడలేను. అఖిలప్రియ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని గతంలో కేసు పెట్టా. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్ చేయిస్తా. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను. ఈ కేసు తో సంబంధం ఉంటే ఇప్పటికే నన్ను పోలీసులు అరెస్ట్ చేసే వారు కదా?’అని ఏబీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. (చదవండి: కిడ్నాప్ కేసు: ఏ1 గా ఏవీ సుబ్బారెడ్డి) -
ఎస్పీని కలిసిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె జస్వంతి గురువారం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తనను హత్యచేసేందుకు కుట్ర పన్నిన భూమా అఖిల ప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్పీకి ఏవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఏ4 అయిన భూమా అఖిల ప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు. ఏ1 నుండి ఏ6 వరకు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు ఏ4ను ఎందుకు వదిలేశారు. నన్ను హత్య చేసేందుకు భూమా కుటుంబం సఫారీ ఇచ్చిన మాట వాస్తవం కాదా’’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చినా అఖిల ప్రియ, ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. నిర్భయంగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికే పరిస్థితి లేదని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే తనపై మళ్లీ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూమా అఖిలప్రియ మహిళ ముసుగులో హత్యా రాజకీయాలు చేస్తోందని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి మండిపడ్డారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో రాజకీయంగా తమను ఎదుర్కోలేక అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. -
నా హత్యకు అఖిలప్రియ దంపతుల కుట్ర
-
ఎందుకు చంపాలనుకున్నారు?
సాక్షి, కర్నూలు: తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలీసులు చెబితేనే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు చెప్పిన విషయాలు తెలుసుకుని షాక్ తిన్నానని పేర్కొన్నారు. ‘‘నేను అఖిలప్రియపై ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆళ్లగడ్డ రమ్మని అఖిలప్రియ అంటోంది. ఆమె నాకు రాజకీయ నేర్పుతుందా. నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నా.. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న అని’’ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు) కార్యకర్తలను కాపాడుకున్న చరిత్ర తనదని తెలిపారు. భూమా నాగిరెడ్డి నామినేషన్‌కు వెళ్తుంటే.. దాడులు చేస్తుంటే.. భూజాలపై ఎత్తుకునిపోయి కాపాడానని తెలిపారు. అలాంటి తనను ఎందుకు చంపాలనుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు భూమా కుటుంబానికి,తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. నాగిరెడ్డి కోసం నంద్యాల సీటు వదులుకున్నానని చెప్పారు. ‘‘అఖిలప్రియ ఇంఛార్జ్‌గా ఉంటే.. ఆళ్లగడ్డలో ఎంతమందిని చంపిస్తారో. ఆమెకు తప్పా మరెవ్వరికి అక్కడ అవకాశం ఇచ్చినా మద్దతు ఇస్తా. టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాను. అఖిల ప్రజల్లోకి వెళ్లి గెలవలేదని’’ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అఖిలప్రియ భర్తకు పోలీసుల నోటీసులు కడప అర్బన్: కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు విచారణకు హాజరుకావాలని కడప పోలీసులు నోటీసులిచ్చారు. సుబ్బారెడ్డి హత్యకు కడపకు చెందిన వారితో కుట్ర పన్నినట్లుగా భార్గవ్‌పై ఆరోపణలున్నాయి. -
హత్యకు కుట్ర: అఖిలప్రియపై సంచలన ఆరోపణలు
-
నామినేటెడ్ పదవిస్తా.. సర్దుకుపో!
సాక్షి, అమరావతి: మంత్రి భూమా అఖిలప్రియతో సర్దుకుపోవాలని ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు సూచించారు. నామినేటెడ్ పదవి ఇస్తానని, గొడవలు లేకుండా ఆమెతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన ఇరువురితో సమావేశమై చర్చించారు. మంత్రి అఖిలప్రియతోపాటు ఆమె సోదరి మౌనికారెడ్డి, సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ సైకిల్ యాత్రలో తనపై దాడి చేయించింది అఖిలప్రియేనని, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు. అఖిలప్రియ కూడా అక్కడ జరిగిన ఘటన గురించి వివరించినట్లు తెలిసింది. ఇద్దరి మాటలు విన్న తర్వాత.. గొడవలు పెట్టుకోవద్దని, పార్టీ కోసం కలిసి పనిచేయాలని చంద్రబాబు ఇరువురికీ సర్దిచెప్పారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే సుబ్బారెడ్డి డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోలేదని సమాచారం. జరిగిందేదో జరిగింది, ఆ విషయం మరచిపోవాలని, పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. అయినా సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కానీ, బయటకు వచ్చిన తర్వాత అఖిలప్రియతో కలిసి పనిచేస్తానని మీడియాకు చెప్పడం గమనార్హం. -
కొలిక్కివచ్చిన ఆళ్లగడ్డ పంచాయితి
-
ముగిసిన పంచాయితీ.. సుబ్బారెడ్డి అసంతృప్తి
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయితీపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీడియా సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించారు. తనపై రాళ్ల దాడి చేయించిన రాష్ట్ర మంత్రి అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు తన డిమాండ్‌ను పట్టించుకోలేదని, తన ఆవేదనను అర్థం చేసుకోలేదంటూ సుబ్బారెడ్డి అసహనంతో ఉన్నారు. తన మాట చంద్రబాబు పట్టించుకోకపోవడంపై కినుక వహించిన సుబ్బారెడ్డి మీడియా సమావేశం జరుగుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పార్టీ అభివృద్ధికి తాను ఎప్పటిలాగే కృషి చేస్తానని సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, ఆళ్లగడ్డ విభేదాలపై సీఎం చర్చించారని, ఈ వివాదం టీ కప్పులో తుపాన్ వంటిదని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ.. వివాదాలు వద్దని, అభివృద్ధిపై దృష్టి సారించమని చెప్పినట్లు తెలిపారు. చిన్న చిన్న విభేదాలు సహజమేనని, వాటిని సర్దుకుని పోవాలని చంద్రబాబు సూచించారు. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పిచేసేందుకు అభ్యంతరం లేదన్నారు. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా ఉంటామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఓవైపు సుబ్బారెడ్డి బాధగా కనిపించగా.. మరోవైపు అఖిలప్రియ మాత్రం తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివాదం ఏంటంటే.. సైకిల్ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తన సమక్షంలో పంచాయితీకి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన పంచాయితీకి అఖిలప్రియ గైర్హాజరు కాగా, శుక్రవారం రావాలని ఆదేశించారు. చంద్రబాబు సమక్షంలో అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య రాజీయత్నం జరిగింది. -
‘ఆళ్లగడ్డ పంచాయితీ’ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య కర్నూలు జిల్లాలో సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగాల్సిన సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. సైకిల్ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పంచాయితీకి పిలిచిన విషయం తెలిసిందే. మంత్రి అఖిలప్రియ రెండు రోజులపాటు రకరకాల కారణాలతో సమావేశానికి గైర్హాజరయ్యారు. అఖిలప్రియ గురువారం రాత్రి తన సోదరి మౌనిక, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డితో పాటు సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా అదే సమయానికి వెళ్లటంతో మీ పద్ధతి బాగోలేదంటూ ఇద్దరిపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సమయం లేనందున శుక్రవారం రావాలని వారిని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కూడా వచ్చారు. గొడవలు పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి వారిని హెచ్చరిస్తూ శుక్రవారం తనను కలవాలని చెప్పి పంపించేశారు. -
ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో మా బంధం అప్పుడే తెగిపోయింది
-
'మమ్మల్ని వేలెత్తి చూపితే ఊరుకోం'
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికరెడ్డి నిప్పులు చెరిగారు. ఆళ్లగడ్డ రాళ్ల పంచాయితీ వ్యవహారానికి సంబంధించి మంత్రి అఖిలప్రియ గురువారం తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతి చేరుకున్నారు. ఈ సందర్భంగా మౌనికా రెడ్డి మాట్లాడుతూ...‘ ఈ పంచాయితీ తేల్చాలని అధిష్టానాన్నే అడుగుతాం. మా అక్క మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేయడం ఎంతవరకూ సబబు. గుంటనక్క అని ఏవీ సుబ్బారెడ్డిని మా అక్క ఏనాడు అనలేదు. అఖిలప్రియ ధర్నా చేసినప్పుడు ఏవీ వర్గీయులు వచ్చి ఈలలు వేస్తూ వెటకారంగా కామెంట్లు చేశారు. అందుకే రాళ్ల దాడి జరిగి ఉండవచ్చు. అక్క వెంట భూమా, ఎస్వీ కుటుంబాలు అండగా ఉన్నాయి. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శిస్తే, ఆళ్లగడ్డ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. నాన్న చనిపోయిన రెండోరోజు నుంచే ఏవీ సుబ్బారెడ్డి పద్ధతిలో మార్పు వచ్చింది. రాజకీయంగా ఎదగడం కోసం సుబ్బారెడ్డి మా అక్కపై విమర్శలు చేస్తున్నారు. భూమా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. సుబ్బారెడ్డి కూతుళ్లు నాన్న సమాధి వద్దకు రానప్పుడే మా మధ్య బంధం తెగిపోయింది. నాన్న వాళ్ల పిల్లలను ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసు. నాన్న చనిపోయాక మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎంతోమంది విమర్శలు చేసినా సహనంతో ఉన్నాం. ఏవీ సుబ్బారెడ్డి వైఖరిని అంతా చూశారు. ఆయనను మామా అనే హక్కు ఉందో లేదో. అఖిలప్రియ ముందు భూమా అఖిలప్రియ అనే విషయం మరిచారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే మా సహకారం ఉంటుంది. కానీ తన రాజకీయ ఎదుగుదలకు మాపై వేలెత్తి చూపితే చూస్తూ ఊరుకోం. పబ్లిక్‌లో మా కుటుంబంపై వేలెత్తి చూపిస్తే సహించేది లేదు. సుబ్బారెడ్డి కూతురు మాపై విమర్శలు చేసినా మాతో కలిసి పెరిగారని ఓపికతో ఉన్నాం. ఇంకా విమర్శలు చేస్తూ ఆళ్లగడ్డ ప్రజలు సహించరు. అఖిలను తాకాలంటే భూమా కేడర్ ఉందనే విషయాన్ని ఏవీ సుబ్బారెడ్డి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రిపై మాకు నమ్మకం ఉంది. భూమా కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఇక రాళ్లదాడి మా అనుచరులే చేశారా? లేదా అనేది విచారణలో తేలుతుంది.’ అని అన్నారు. -
అఖిలప్రియ, సుబ్బారెడ్డికి అధిష్టానం పిలుపు
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. మంత్రి అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు వెలువడ్డాయి. గత కొంతకాలంగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. వీరిరువురి మధ్య ఎన్నిసార్లు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీని చేపట్టారు. ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని ఏవీ సుబ్బారెడ్డి హుటాహుటీన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సైకిల్ ర్యాలీ కార్యక్రమం చేపడుతున్న సుబ్బారెడ్డిపై దాడులు చేయడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిని రేపు అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. -
మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు
సాక్షి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ సుబ్బారెడ్డి ఫిర్యాదుచేయగా.. పోలీసులు మాత్రం అనూహ్యంగా మంత్రి పేరును తొలగించారు. బాధితుడి ఫిర్యాదును పక్కనపారేసి, పోలీసులనే సాక్ష్యులుగా పేర్కొంటూ మరో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేప్రయత్నం చేస్తున్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సుబ్బారెడ్డి సోమవారం కూడా తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. ఏం జరిగింది?: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకే చెందిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీని చేపట్టారు. ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. మంత్రి పేరును తొలగించి, పోలీసులే సాక్ష్యులుగా మరో కేసు నమోదుచేసి, దానిపై దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సిఉంది. రాళ్లదాడి అనంతరం ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. (చదవండి: ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి; ఆళ్లగడ్డలో ఉద్రిక్తత) -
ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి
-
సుబ్బారెడ్డిపై దాడి; అఖిలప్రియపై అనుమానం
సాక్షి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సర్వత్రా భయాందోళనలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు సాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఒక్కసారే దాడి చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మంత్రి ఫొటో స్టిక్కర్లు అంటించిన వాహనంపై వచ్చిన దుండగులు.. ఏవీ సుబ్బారెడ్డి లక్ష్యంగా దాళ్లు విసరడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగి ఉంటుందని ఏవీ సుబ్బారెడ్డి అనుమానించారు. ఈ మేరకు ఫిర్యాదులోనూ మంత్రి పేరును ప్రస్తావించారు. -
అఖిలప్రియకు ఇగో సమస్యే..!