అఖిల ప్రియVs ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత | Bhuma Akhila Priya Followers Attacked Av Subba Reddy Complex In Allagadda, More Details Inside | Sakshi
Sakshi News home page

అఖిల ప్రియVs ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత

Published Tue, Jun 18 2024 10:04 PM | Last Updated on Wed, Jun 19 2024 11:10 AM

Bhuma Akhila Priya Followers Attacked Av Subba Reddy Complex

సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్‌పై అఖిల ప్రియ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కాంప్లెక్స్‌ అద్దాలు పగిలిపోయాయి. భూమా ఘాట్ నుంచి ఎమ్మెల్యే అఖిల ప్రియ ర్యాలీగా బయలుదేరగా, ర్యాలీలో వెళ్తుండగా ఏవీ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్, రిలయన్స్ మార్ట్ పై అఖిల ప్రియ అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాల విషయం తెలిసిందే. గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇటీవల ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన అనంతరం అర్ధరాత్రి  ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డుపై దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement