కిడ్నాప్‌ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు | Bowenpally Kidnap Case: AV Subba Reddy Arrested | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు

Published Wed, Jan 6 2021 7:08 PM | Last Updated on Wed, Jan 6 2021 7:51 PM

Bowenpally Kidnap Case: AV Subba Reddy Arrested - Sakshi

ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని మాదాపూర్‌లోని అతని నివాసంలో హైదరాబాద్‌ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: హాకీ మాజీ‌ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, అతని సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏ1 గా ఆరోపణలు ఎందుర్కొంటున్న ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని మాదాపూర్‌లోని అతని నివాసంలో హైదరాబాద్‌ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ప్రవీణ్‌రావు కిడ్నాప్‌ కేసులో అరెస్టయినవారి సంఖ్య మూడుకు చేరింది. ఏ2 అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్రబోసును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పరారీలో ఉన్నాడు.

ఏ1 గా ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదు
అంతకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఏవీ సుబ్బారెడ్డి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎందుకు ఏ1గా చేర్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ‘కిడ్నాప్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రవీణ్‌రావుతో విభేదాలు ఉన్నది వాస్తవమే. హఫీజ్‌పేట్‌ భూ వివాదంపై ఇప్పుడు నేను మాట్లాడలేను. అఖిలప్రియ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని గతంలో కేసు పెట్టా. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్‌ చేయిస్తా. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను. ఈ కేసు తో సంబంధం ఉంటే ఇప్పటికే నన్ను పోలీసులు అరెస్ట్ చేసే వారు కదా?’అని ఏబీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
(చదవండి: కిడ్నాప్‌ కేసు: ఏ1 గా ఏవీ సుబ్బారెడ్డి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement