బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు: 75 పేజీల చార్జిషీట్ సిద్ధం  | Bowenpally Kidnap Case-Police Submit The Chargesheet Against B​huma akhila priya | Sakshi
Sakshi News home page

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు: 75 పేజీల చార్జిషీట్ సిద్ధం 

Published Tue, Oct 19 2021 11:04 AM | Last Updated on Tue, Oct 19 2021 3:36 PM

Bowenpally Kidnap Case: Police Submit The Chargesheet Against B​huma akhila priya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో 75 పేజీల చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 5న భూమా అఖిల ప్రియ, భార్గవ్‌ రామ్‌, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి అనుచరులతో కలిసి ఐటీ అధికారులమని చెప్పి ప్రవీణ్‌రావు ఇంట్లో ప్రవేశించారు.  

ఆ తర్వాత ప్రవీణ్‌రావు సోదరులను సినిఫక్కీలో కిడ్నాప్‌ చేసిన సంఘటన తెలిసిందే. కాగా, సంచలనంగా మారిన ఈ  కేసులో.. అఖిల ప్రియ దంపతులతోపాటు, మరో 30 మందిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ క్రమంలో .. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్‌ సమయంలో ఒక్కొక్కరి పాత్రను  వివరించారు.  

చదవండి: Bhuma Akhila Priya: బోయిన్‌పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement