
ఆళ్లగడ్డ ఎన్నికల ఇన్‌చార్జిగా ఏవీ
ఆళ్లగడ్డ న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఏవీ సుబ్బారెడ్డి చేపట్టారు. ఈ నెల 24 వతేదీ రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించడంతో ఎన్నికల బాధ్యతలను ఏవీకి అప్పగిస్తున్నట్లు భూమా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం బాధ్యతలు చేపట్టి ఏవీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు.
ఎన్నికల సంఘం శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లుతుందని చెప్పడంతో గెలుపు నల్లేరుమీద నడకేనన్నారు. ఆళ్లగడ్డలో అత్యధిక మెజార్టీ సాధించి శోభానాగిరెడ్డికి అరుదైన గుర్తింపు తీసుకరావడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలదంరూ కలిసికట్టుగా పనిచేసి ప్రత్యర్థుల అటలు కట్టిస్తామన్నారు.