వైఎస్సార్ సీపీలో అందరికీ ప్రాధాన్యం | ysrcp give equal priority to all category peoples | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో అందరికీ ప్రాధాన్యం

Published Sat, May 3 2014 1:14 AM | Last Updated on Thu, Apr 4 2019 3:02 PM

వైఎస్సార్ సీపీలో అందరికీ ప్రాధాన్యం - Sakshi

వైఎస్సార్ సీపీలో అందరికీ ప్రాధాన్యం

 పి.గన్నవరం, న్యూస్‌లైన్ :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచితస్థానం ఉందని, ముఖ్యంగా జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో టికెట్లు ఇచ్చి కాపులకు ప్రాధాన్యం ఇచ్చిందని ఆ పార్టీ పి.గన్నవరం మండల కన్వీనర్ అడ్డగళ్ల వెంకట సాయిరామ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కాపు సామాజిక వర్గానికి ఆయన విజ్ఞప్తి చేశా రు. పి.గన్నవరం పార్టీ కార్యాలయంలో వెంకట సాయిరామ్ అధ్యక్షతన శుక్రవారం కాపు నాయకులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా కాపులకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యమిచ్చారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు వర్థినీడి మునీశ్వరరావు, బొరుసు సూరి బాబు, తోలేటి బంగారునాయుడు, అడ్డగళ్ల శ్రీను, నిమ్మగడ్డ బాబ్జీ, సత్తింశెట్టి రాము, అన్నాబత్తుల మునిశేఖర్, అడ్డగళ్ల పుల్లారావు, సురేష్ నాయు డు, రాంబాబు, కొర్లపాటి చిట్టిబాబు, చిట్టాల శ్రీను, తోలేటి త్రిమూర్తులు, కుంపట్ల సోమన్న, ఆకుల రంగారావు, ఆది మూలం రాంబాబు, రఘుబాబు, ఎమ్.మణికంఠ, కోటిపల్లి నానా జీ, పి.ముసలయ్య పాల్గొన్నారు.
 
 మాట తప్పిన చంద్రబాబు
 కోటగుమ్మం(రాజమండ్రి) : సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తానని వాగ్దానం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ హామీని నిల బెట్టుకోకుండా బీసీలకు అన్యాయం చేశారని బీసీ పోరాట సమితి జిల్లా కన్వీనర్ రేలంగి శేఖర్ విమర్శించారు. శుక్రవారం రాజమండ్రి సూర్యా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు 43 సీట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా బీసీని కాదని స్థానికేతరుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ ఇచ్చారన్నారు. కో కన్వీనర్ డేవిడ్ రాజు యాదవ్ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఓడిస్తామన్నారు. సమావేశంలో బత్తుల వెంకటేశ్వరరావు, మట్టా చంటి బాబు పాల్గొన్నారు.
 
బీసీలకు ఉన్నత స్థానం
కొత్తపేట : జిల్లాలో వెనుకబడిన వర్గాలు(బీసీ) లను ఉన్నత స్థానం కేటాయించింది వైఎస్సార్ సీపీయేనని ఆ పార్టీ బీసీ నాయకులు పేర్కొన్నారు. కొత్తపేటలోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రెడ్డి చంటి, ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణ మూర్తి, జిల్లా పార్టీ సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, దూనబోయిన సత్యనారాయణ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీసీ నాయకుడిని (శెట్టిబలిజ వర్గానికి చెందిన చిట్టబ్బాయి) జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ఘనత మొదటగా వైఎస్సార్ సీపీకే దక్కుతుందన్నారు. టీడీపీ తన 30 ఏళ్లలో ఏనాడూ బీసీని నియమించలేదన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను (రామచంద్రపురం, ముమ్మిడివరం, కాకినాడ రూర ల్, రాజమండ్రి సిటీ) బీసీలకు కట్టబెట్టిందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్‌‌సమెంట్ పథకంతో ఎందరో బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారన్నారు. జిల్లాలోని బీసీలందరూ వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలన్నారు. బీసీ నాయకులు మట్టపర్తి వెంకట్రావు, బొక్కా లోకేష్, పితాని రాంబాబు, కుడుపూడి సత్యనారాయణ, మట్టపర్తి జితేంద్ర, దంగేటి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
 
 జగన్‌కే దండోరా మద్దతు

 ఉప్పలగుప్తం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దండోరా మద్దతు ఉంటుందని రాష్ట్ర దగాపడ్డ చర్మకారుల సంఘ అధ్యక్షుడు ఈతకోట తుక్కేశ్వర్రావు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేయడానికి శుక్రవారం ఆయన ఉప్పలగుప్తం మండలానికి వచ్చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానా న్ని మాదిగలకు కేటాయిస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆ పార్టీకి మాదిగలు బుద్దిచెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమలాపురం ఎంపీ అభ్యర్థి విశ్వరూప్, ఎమ్మెల్యే అభ్యర్థి గొల్ల బాబూరావులను ఫ్యాన్‌గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సవరపు వెర్రియ్య, తొత్తరమూ డి నరసింహారావు, చేట్ల విద్యాసాగర్, ఈతకోట కృష్ణ, పెదపూడి నాగభూషణం, తవిటికి రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement