‘ఆ భయూనక పాలన మనకొద్దు’
‘విలువలు, విశ్వసనీయత ఒకవైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయి. చంద్రబాబులా విశ్వసనీయత లేని హామీలు ఇవ్వలేను. అలాంటి రాజకీయాలు చేయలేను. నేను మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాల్సి ఉంది. అందు కే చేసేదే చెబుతున్నా. మీ చల్లని దీవెనలు. ఆశీ ర్వాదాలు ఉంటే.. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాను. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలా చెప్పని వాటిని కూడా చేసి చూపిస్తాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
ఏలూరు సమీపంలోని వట్లూరులో ఆదివారం నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో ఆయన మాట్లాడారు. వెల్లువలా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ‘చంద్రబాబు హయూంలో భయానక పాలన చూశాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని చూశాం. ఏ నాయకుడిని ఎన్నుకోవాలి. ఎవరు ముఖ్యమంత్రి అయితే పేదవారి జీవితాలు బాగుపడతాయో ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు.
- పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తాం
- చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం
- కొల్లేరు సమస్య పరిష్కారానికి కృషి
- ‘జనభేరి’ సభలోవైఎస్ జగన్ భరోసా
కాపులు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సార్ సీపీయే : తోట
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : ‘టీడీపీ హయాంలో చంద్రబాబు భయానక పాలనను చూశాం. దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని చూశాం. ఒక్కమాట చెబుతున్నా. సార్వత్రిక ఎన్నికలు మరో మూడు రోజుల్లో రాబోతున్నాయి. మీరంతా ఒక్కసారి ఆలోచించి ఏ నాయకుడిని ఎన్నుకోవాలి.. ఎవ రు ముఖ్యమంత్రి అయితే పేదవాడి జీవితాలు బాగుపడతాయో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తు న్నా’ అని దెందులూరు నియోజకవర్గ పరిధిలోని వట్లూరులో ఆదివారం నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’లో సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విలువలు, విశ్వసనీ యత ఒకవైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని పేర్కొన్నారు. తాను చంద్రబాబులా విశ్వసనీయత లేని హామీలు ఇవ్వలేనని.. అలాంటి రాజకీయాలు చేయలేనని స్పష్టం చేశారు. తాను మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాల్సి ఉందని.. అందుకే చేసేదే చెబుతానని అన్నారు. ‘మీ చల్లని దీవెనలు.. ఆశీర్వాదాలు ఉంటే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాను. చెప్పని వాటిని కూడా మహానేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డిగారిలా చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు.
పోటెత్తిన జనాభిమానం
జనభేరి సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. ఏలూరు నగరంతోపాటు, సత్రంపాడు, వట్లూ రు పరిసర ప్రాంతాలన్నీ వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెపలాడాయి. మహిళలు, వృద్దులు, యువత పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జగన్ మాట్లాడుతున్నంతసేపూ ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ప్రాంతమంతా జై జగన్ నినాదాలతో మార్మోగిపోయింది. కాబోయే సీఎం జగన్ అంటూ జనమంతా నినాదించారు.
కాపులకు ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీయే : తోట చంద్రశేఖర్
మోడీ, పవన్ కల్యాణ్ అనే రెండు ఊతకర్రలు లేకుంటే చంద్రబాబు నడవలేని స్థితిలో ఉన్నాడని ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. కాపులు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నాడని, చట్టసభల్లోకి వెళ్లేందుకు ఆయా కులాలకు సీట్లు ఇవ్వకుండా ఇప్పుడు పదవులు ఇస్తానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీలకు ఇన్ని సీట్లు ఇస్తామని, కాపులకు ఇన్ని సీట్లు ఇస్తామని వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. కానీ.. కాపులు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు వైఎస్ జగన్ 106సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం చేశారని చంద్రశేఖర్ చెప్పారు.
కాపులకు టీడీపీ 16 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకుం టే జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 25 ఎమ్మెల్యే, 5ఎంపీ సీట్లు ఇచ్చారని వివరించారు. చంద్రబాబు హామీలు ఆచరణ సాధ్యం కాదని విమర్శించారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాభి వృద్ధి జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని, దెందులూరు నియోజకవర్గ నాయకులు సీహెచ్. అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, గ్రంథాలయ చైర్మన్ బీవీ నాగచంద్రారెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఆళ్ల సతీష్‌చౌదరి, అప్పన ప్రసాద్ పాల్గొన్నారు.
‘పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తాం’
విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, బీజేపీ ఆనాడు అధికారంలో ఉండగా.. పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేకపోయిందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని నిర్మిస్తామని, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.400 కోట్ల నిధులు మంజూరైనా అయినా ఆయన అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కొల్లేరు సమస్యను కూడా పరిష్కరిస్తానని, కాంటూర్‌ను ఐదు నుంచి మూడుకు కుదించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని జగన్ చెప్పారు.